దేశ ఆర్థిక జీవనానికి అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక సంస్కరణలను లోక్ సభలో డిసెంబర్5న జరిగిన ఓటింగ్‌లో ఎప్‌డిఐకి అనుకూలంగా 253 ఓట్లురాగా 218 ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. 50 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో ప్రభుత్వానికి అనుకూలంగా 123 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు రాగా 19 ఓట్ల మెజారీటీలో ప్రభుత్వం నెగ్గింది. తీవ్రంగా వ్యతిరేకించిన ముగ్గురు తెలుగుదేశం సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఈవిధంగా లోక్‌సభలోనూ, రాజ్యసభలోను ఎఫ్‌డిఐలకు అనుమతి లభించింది. కానీ వారం తిరగకముందే అమెరికన్ సెనెట్‌లో వాల్‌మార్ట్ ప్రకటిస్తూ భారత్‌లో లాభియింగ్‌లో రు.125 కోట్లు వ్యయం చేయడంద్వారా ప్రభుత్వం నెగ్గిందని ప్రకటించారు. దీనిని బట్టి బహుళజాతి సంస్థల లాభీయింగ్ పార్లమెంటులో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు ప్రభావితం చేసిందని పెద్దఎత్తున ఆరోపణ రాగా దీనిపై సమగ్ర విచారణకు పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించడం గమనించాలి. పార్లమెంటులో వ్యతిరేకించినవారు ఓటింగులో పాల్గొనకపోవడం జరిగింది. కొన్ని పార్టీలు ద్వంద్వ విధానాలు అవలంభించడం ద్వారా ప్రమాదకరమైన ఈ చర్యకు విజయం లభ్యమైంది.
భారతదేశ సముద్ర తీరం 7 వేల కిలోమిటర్లు 32,87,590 చదరపు కిలోమీలర్ల విస్తీర్ణం గల దేశం. దేశం చుట్లూ 6 దేశాలున్నాయి.1.పాకిస్తాన్, 2.నేపాల్, 3.బూటాన్, 4.బంగ్లాదేశ్, 5.శ్రీలంక, 6.మయన్మార్ ఈ దేశాలు సార్క్ దేశాలుగా పిలువబడుతున్నాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. 6 సంవత్సరాల క్రితం మెకెన్సీ విదేశీ చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐకి సూచనలు చేశారు. 1997లో సంస్కరణలు ప్రవేశపెట్టడంతో ఇతర దేశాల నుండి నిధులు రావడం మొదలైంది. ఈ నిధులు లాభాలను తరలించుకుపోయే లక్ష్యంతో వస్తున్నాయి. 2006`07లో 322బిలియన్ డాలర్లు రాగా, 2011`12 నాటికి 590 బిలియన్ డాలర్లకు పెరిగింది. మార్చి 2012 నాటికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 7,74,473 కోట్లు భారత మార్కెట్‌కు చేరాయి. మారిషస్ రు.2,98,470 కోట్లు, సింగాపూర్ రు.75,587 కోట్లు, ఇంగ్లాండ్ రు.74,661 కోట్లు, జపాన్ రు.57,851 కోట్లు, అమెరికా 47,881 నెదర్లాండ్ రు.32,324 కోట్లు, సైప్రస్ రు.29,670 కోట్లు, జర్మనీ రు.20,827 కోట్లు, ఫ్రాన్స్ రు.13,377 కోట్లు, అరబ్ ఎమిరేట్స్ రు.10,320 కోట్లు మొదటి 10 దేశాలు తమ పెట్టుబడులను భారతదేశం తరలించగా మొత్తం 133 దేశాల నుండి ఎన్.ఆర్.ఐల నుండి 7.75 లక్షల కోట్లు ప్రత్యక్ష పెట్టుబడితో భారతదేశం చేరాయి.
వాల్‌మార్ట్‌కు అమెరికాలో లాభం 3.6శాతం(2009), ఇంగ్లాండులో టెస్కోకు 4.1శాతం, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాలలో 1శాతంవరకు లాభాలు తగ్గాయి. ఈ లాభాలను పెంచుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి వ్యాపార నిమిత్తం వస్తున్నాయి.
1) స్వర్ణకారుల వృత్తి దెబ్బతిన్నది, చేతి వృత్తులు దెబ్బతినడం, ` పట్టణ గ్రామీణ పేదలు ఉపాధి కోల్పోవడం జరిగింది. 2) 2011లో 41,128 కోట్ల డాలర్లుగా ఉన్న వ్యాపారం 2015నాటికి 80,406 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. (ప్రైస్‌కూపర్ అంచనా) ఇప్పటి వరకు హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాలకు పరిమితమైన దుకాణాలు చిన్న పట్టణాలకు విస్తరిస్తాయి. కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు.(మూడు సంవత్సరాలలో 40 లక్షల ఉద్యోగాలు కల్పించాలి) ప్రస్తుతం హైపర్, సూపర్‌మార్కెట్, క్యాష్ Ê క్యారీ, గ్రోమోర్ సెంటర్, క్రోమా పేర్లతో దేశీయ కంపెనీలు వెలిశాయి.
కంపెనీ పేరు ప్రపంచంలోదుకాణాలు మొత్తం ఉద్యోగులు సగటున ఉద్యోగులు
వాల్‌మార్ట్ 9826 21,00,000 214
కార్‌ఫోర్ 15,937 4,71,755 30
మెట్రో 2131 2,83,280 133
టెస్కో 5380 4,92,714 92
వాల్‌మార్ట్ కంపెనీకి 28 దేశాలలో 21 లక్షల మంది ఉద్యోగులతో 9826 షాపులుండగా ఒక్కో షాపులో 214 మంది మాత్రమే పని చేస్తున్నారు. దుకాణం విస్తీర్ణం 1,08,000 చదరపు ఫీట్లలో ఉంది. ఏటా 405 బిలియన్ డాలర్ల వ్యాపారం సాగుతున్నది. వ్యవసాయ రంగంలో కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్, ప్యాకేజీ సౌకర్యాల వల్ల ఉత్పత్తిలో ప్రస్తుతం జరుగుతున్న 30శాతం నష్టం తగ్గించవచ్చు. వీరికి అనుకూలంగా కార్పోరేట్ చట్టాలను కంపెనీల బిల్లులో ఏర్పరచాలి.
14.9.2012న ఎఫ్‌డిఐ రాకపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
ఎఫ్‌డిఐ ప్రవేశాన్ని రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి(కేంద్రంపై ఆందోళనలు రాకుండా ఈ పరిమితి పెట్టారు) 10 లక్షల జనాభా కలిగిన 51 పట్టణాలలోని దుకాణాలకే ఇది పరిమితం 30శాతం దేశీయ ఉత్పత్తుల సమీకరణ, 70శాతం విదేశీ ఎగుమతులు
1) బహుళబ్రాండ్ల రిటేయిల్ వర్తకంలో 51శాతం
2) బ్రాడ్‌కాస్టింగ్‌లో 74శాతం
3) విమానయాన రంగంలో 49శాతం
4) ప్రభుత్వ కంపెనీల విక్రయం
5) విద్యుత్ పవర్ ట్రేడిరగ్ ఎక్స్‌చేంజీలలో 49శాతం(26శాతం ఎఫ్‌డిఐ, 23శాతం ఎఫ్‌ఐఐ, వాటాల రూపంలో)
6) అంతకు ముందు సింగిల్ బ్రాండ్‌లో 51శాతం ఉండగా దానిని 100శాతానికి పెంచారు.
7) 25 మహా నవరత్నాల కంపెనీల నిల్వలు కేంద్ర బడ్జెట్‌కు బదలాయించాలని ప్రధాని మన్మోహన్ సూచన చేశారు.

దేశీయ రిటేయిల్ వ్యాపారం 500బిలియన్ డాలర్లు కొనసాగుతున్నది. 1.20 కోట్లు దుకాణాలు ఉన్నాయి. ఇందులో 2 కోట్ల కుటుంబాలు వ్యాపారం చేస్తున్నాయి. 8 కోట్ల మందికి ఉపాధి ఉండగా 6 లక్షల కోట్ల వ్యాపారం సాగుతున్నది. ప్రధానంగా ఈ దిగువ రంగాలకు మార్చి 2012 నాటికి వచ్చిన పెట్టుబడులు.
విద్యుత్‌ఛ్చక్తిలో రు.33,214 కోట్లు
వ్యవసాయ సేవలు రు.6921 కోట్లు
ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ రు.6487
వెజిటెబుల్ ఆయిల్స్ రు.1300కోట్లు
ఎరువులు రు.1196 కోట్లు
` 2000 ఏప్రిల్ నుండి 2012 మార్చి నాటికి రు. 7,74,473 కోట్లు వచ్చాయి.
2) బ్రాడ్‌కాస్టింగ్‌లో 74శాతం
ఇందులో రెండు రంగాలున్నాయి.
1) ప్రసార రంగం ` (డిటిహెచ్, కేబుల్ టివి, ఎంఎస్‌ఓ, హెడ్ Ê ఇన్‌దస్కై) ప్రసార రంగంలో ప్రస్తుతం 26శాతం విదేశీ పెట్టుబడి పరిమితి కొనసాగుతున్నది. దీనిని 74శాతానికి పెంచాలన్న నిర్ణయం జరిగింది.
2) ప్రసార భారతి ` ఆర్థిక పునర్వవస్థీకరణ, వేతనాలు, వేతన సంబంధ వ్యయాలకు ప్రభుత్వం ప్రణాళికేతర మద్దతు ఇస్తుంది. మిగిలిన అన్ని నిర్వహణ వ్యయాలను సంస్థే భరించాల్సి ఉంటుంది. స్పెక్ట్రం ఛార్జీలు తదితరాలకు సంబంధించి 31 మార్చి 2011 నాటికి బాకీ పడిన రు.1349.54 కోట్లు ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఈ రంగంలోకి ఎఫ్‌డిఐ 74శాతం ఆమోదించాలి.
3) విమానయాన రంగంలో 49శాతం
దేశీయ విమానయాన సంస్థల్లో 49శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చారు. రు.7వేల కోట్ల రుణభారం కలిగిన కింగ్‌ఫిషర్ సంస్థ ఎఫ్‌డిఐ కింద నిధులు సేకరించవచ్చు. స్పైస్‌జెట్, గో`ఏయిర్ సంస్థలకు ప్రయోజనం అని చెప్పిన్పటికీ ఏయిర్‌ఇండియా మరియు ఇండియన్ ఏయిర్‌లైన్స్ వాటాలను 49శాతం విక్రయించే ఆలోచనకే ఈ అవకాశం కల్పించారు.
4) నాలుగు ప్రభుత్వ కంపెనీల విక్రయం
ప్రభుత్వ రంగంలోని నాలుగు సంస్థలను ఎఫ్‌డిఐల అనుమతి పేరుతో విక్రయానికి పెట్టారు. 1) ఆయిల్ ఇండియా 10శాతం అమ్మకంతో రు. 15000 కోట్లు, 2) హందుస్థాన్ కాపర్‌లో 9.59శాతం అమ్మకం, 3) నాల్కోలో 12.15శాతం అమ్మకం, 4) ఎంఎంటిసిలో 9.33శాతం అమ్మకం
5) విద్యుత్ పవర్ ట్రేడిరగ్ ఎక్స్‌చేంజీలలో 49శాతం
విద్యుత్ పవర్ ట్రేడిరగ్ రంగంలో 49శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చారు. ఇందులో 26శాతానికి ఎఫ్‌డిఐ మించకూడదని మిగతా 23శాతం విదేశీ సంస్థగత మదుపరులు పెట్టుబడికి చెల్లించిన మూలధనంతో సేకరించాలి. 1.ప్రస్తుతం దేశంలో పవర్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇండియా, 2. ఇండియన్ ఎనర్జీఎక్స్‌ఛేంజ్‌లు ఉన్నాయి.
ఎఫ్‌ఐఐ కొనుగోళ్ళను సెకండరీ మార్కెట్‌కు పరిమితం చేస్తారు. దీనివలన విద్యుత్ స్రారం మెరుగుపడుతుందని అంచనా వేశారు.
ప్రశంసలు
కోటి ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని కేంద్ర మంత్రి ఆనందశర్మ ప్రకటించారు.దేశ ప్రజలకు జీవనాదాయం పెరుగుతుందని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్యూరి సుబ్బారావు, సంస్కరణలు అమలు చేయడానికి ఇది మంచి తరుణమని సిసిఐ అధ్యక్షుడు ఆది గోద్రేజ్, ఎఫ్‌డిఐలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం మంచి వార్త అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్, విదేశీ పెట్టుబడుల రాకతో దేశాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఫిక్కి ప్రసిడెంట్ ఆర్.వి.కనోరియా హర్షం వెలిబచ్చారు. వీరే కాక భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ఛైర్మన్ ఎండి. రాజన్,భారతీ మిట్టల్, ప్రభుత్వ చర్యకు ఆహ్వానం పలికారు. ఫ్యూచర్, ఫార్వర్డ్ ట్రేడిరడ్ అభివృద్ధి జరుగుతుందని ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థపకులు, సిఇవో కిషోర్ బియాని, నిధులు బాగా వస్తాయని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య జనరల్ సెక్రటరీ ప్రవీణ్‌ఖండేల్వాల్ స్వాగతించారు. వీరితోపాటు ఏంజెల్ బ్రోకింగ్ విమానయాన రంగ విశ్లేషకులు శారన్‌లిల్లాలె ఎఫ్‌డిఐ లను స్వాగతించారు.
వ్యవసాయ రంగానికి ప్రమాదం
ఎఫ్‌డిఐ పెట్టుబడి చిల్లర వ్యాపారంలోకి రావడానికి ఆయా దేశాలు కొన్ని షరతులు విధించాయి. తాము వ్యాపారం చేసే సరుకులలో 30శాతం మాత్రమే స్థానిక, చిన్న ఎంటర్‌ప్రైసెస్ నుండి సేకరిస్తామని మిగిలిన 70శాతం సరుకులు ప్రపంచంలో ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడి నుండి దిగుమతులు చేసుకుంటామని నిబంధనలో ఉంది. దీని వలన దేశీయ సరుకులు కొనుగోలు నిలిచిపోతుంది. ఇప్పటికే ధనిక దేశాలు తమ దేశాల ఎగుమతులకు విపరీతమైన సబ్సిడీలివ్వడం ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు దిగుమతులు చేసుకుంటున్న దేశాలలోని వ్యసాయోత్పత్తులతోపాటు పారిశ్రామికోత్పత్తులకు ప్రమాదం ఏర్పడిరది. ఎఫ్‌డిఐలు రావడానికి రాష్ట్రాల ఇష్టాఇష్టాలకు కేంద్రం వదిలివేసింది. ఇప్పటికే విత్తన రంగం బహుళజాతి సంస్థల పరమైంది. మైక్రో ఇరిగేషన్, విత్తనాలు, ప్రాసెసింగ్ యూనిట్, ఫ్యూచర్ మార్కెట్(ఫార్వర్డ్ ట్రేడిరగ్`15ల.కోట్ల వ్యాపారం), ఫామ్‌హౌస్‌ల ఏర్పాటు, డైౖరీ పరిశ్రమల్లో పెట్టుబడులు(95.69 లక్షల మెట్రిక్‌టన్నుల ఉత్పత్తి),
భూముల కొనుగోల్లు, చేపలవ్యాపారం(9.62ల.ట ఇన్‌లాండ్`2.92 ల.ట సముద్రం ), ఫౌల్ట్రీలో పెట్టుబడులు(సుగుణ, వెంకోబ్ 1835కోట్ల గుడ్లు` 6.04ల.ట మాంసం) రంగాలలోకి పెట్టుబడులు వచ్చిచేరాయి. వీటిఫలితంగా దేశంలో ఇప్పటికే 3`4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. చిల్లర వర్తకులు దుకాణాలు మూసివేసి వలసలు వెళుతున్నారు. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం 9శాతం దాటింది. రానున్న కొద్దిరోజులలో ఇది మరింత పెరుగుతుంది. ఈ పెట్టుబడుల రాకతో 1) భూముల నుండి తోలగించబడడం, 2) పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం, 3) వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గడం` నిర్మాణ, రావాణా రంగాలకు వెళ్ళడం, 4) స్థిరాస్తులు, కోల్పోవడం ` ఆదాయాలు తగ్గిపోవడం, 5) ఆహార పంటలు తగ్గి ఎగుమతి ఆధారిత పంటలు పెరగడం( మొక్కజొన్న, పత్తి,మిరప, చెరుకు,పొగాకు, పండ్లతోటలు వగైరా), 6) దేశీయ స్వాతంత్య్రానికి ప్రమాదం ఏర్పడుతుంది.
2012`13 నాటికి భారతదేశ విదేశీ అప్పు రు.15,97,752 కోట్లకు చేరుకుంది. దేశ స్థూల ఉత్పత్తిలో 19.49 శాతానికి అప్పు పెరిగింది. దీనికి వడ్డీల కింద 2012`13 బడ్జెట్‌లో రు.3,19,750 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్ రు.14,90,925 కోట్లు. ఇందులో మార్చి 2011 నాటికి మైక్రోఫైనాన్స్ రుణం రు.31,221 కోట్లు ఉంది. ఎఫ్‌డిఐ రాకతో దేశీయ ఎరువుల ఉత్పత్తి తగ్గడమేకాక ఎరువుల సబ్సిడీ కూడా తగ్గుతుంది. ఆహార సబ్సిడీ, ఆరోగ్యం, పెట్రోల్, గ్యాస్ సబ్సిడీలు కోతపడతాయి. ప్రస్తుతం ఆహార సబ్సిడీకి 76 వేల కోట్లు కేటాయించారు. దీనిపై ఆ ప్రభావం ఉంటుంది.
సారంపెల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment