అవినీతి నిర్మూలనకు అనేక పథకాలు, సూచనలు చేస్తున్నారు. ఈ మధ్య ‘‘అర్థక్రాంతి’’ పేరుతో అవినీతి నిర్మూలనకు సూచనలు వచ్చాయి. వాటిలో ఈ దిగువ అంశాలతో అవినీతి నిర్మూలించబడుతుందన సూచించారు.
(1) కస్టమ్స్ సుంకాలు మినహా ప్రస్తుత పన్నుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం (2) ప్రతి లావాదేవీలు బ్యాంకు ద్వారానే జరపాలి. వాటిపై లావాదేవీలపై రెండు శాతం పన్ను విధించాలి. (3) అధిక విలువగల (రు.50నోటును మించిన) కరెన్సీని ఉపసంహరించుకోవాలి. (4) ఏ విధమైన ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఉండవు. (5) రు.2వేలకు మించిన నగదు లావాదేవీలను ప్రభుత్వం చట్టబద్దంగా నియంత్రించాలి.
పై పంచసూత్రాలు అమలు జరిపితే భారతదేశంలో అవినీతిరహిత సమాజం ఏర్పడుతుందని ‘‘అర్ధక్రాంతి’’ సూత్రదారి అనీల్‌బొకిల్ రామోజీ ఫిల్మ్‌సిటీలో మేదావుల సమక్ష్యంలో నూతన సిద్ధాంతీకరణ చేసారు. దీనికి రామోజీరావుతో పాటు, జస్టీస్ చలమయ్య లాంటి పెద్దలు పాల్గొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ చలమయ్యగారు ‘‘అవినీతి భారతీయుల రక్తంలో ఇంకిపోయింది. మానవాళికి మార్పులు అవసరం. అందుకు కొత్త మార్గాలను వెతకాలి. అర్థక్రాంతి ఒక సహోసోపేత ఆలోచన. ఇటవంటి ఆలోచనను అంకితభావంతో ప్రజల ముందుకు తెచ్చినందుకు రామోజీరావును అభినందిస్తున్నాను’’ అంటూ డిశంబర్ 2న సమావేశంలో వెలిబుచ్చారు.
బూర్జువా పాలకుల, పెట్టుబడిదారుల, భూస్వాముల రక్తంలో అవినీతి ఇంకిపోయిందే తప్ప భారతీయుల రక్తంలో కాదు. పైవర్గాలు తమ లాభాల కొరకు అవినీతిని కొనసాగిస్తున్నాయి. వారి అవినీతికి 90శాతం మంది భారతీయుల బలిపశువులవుతున్నారు. భారతీయుల రక్తంలోనే అవినీతి ఇంకిపోయిందని అనడం వాస్తవాన్ని మరుగుపర్చడమే. పెద్దనోట్లను రద్దు పర్చాలని గతంలో అనేక సలహాలు వచ్చినా పాలకవర్గాలు పాటించలేదు.
నేడు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి ప్రజలందరిలో చర్చనీయాంశమైంది. ప్రపంచంలో అవినీతి కొత్తకాదు. కానీ అవినీతి, కుంభకోణాలు గతంలో చాటుమాటుగా జరిగేవి. అవి నేడు నగ్నంగా పాలకవర్గాల అండదండలతో లక్షల కొట్లల్లో సాగుతున్నాయి. వాస్తవాలు వెలికిచూస్తున్నాయి. కొంత మందిపై అభియోగాలు మోపి కేసులు పెట్టడం , అభియోగాలు మోపబడినవారు జైళ్లకు వెళ్లడం చూస్తున్నాం. అయినా మరో రూపంలో అవినీతి కొనసాగుతూనే ఉంది. ప్రజలకు చెందిన ప్రకృతి సహజ సంపదను కొద్ది మంది వ్యక్తులు కాజేస్తున్నారు. అంతేకాదు, ప్రజల ఆస్థులను (భూములు) తక్కువ రేట్లకు కొనుగోలు చేయడం, లేదా బలవంతంగా లాక్కోని లక్షలాది ఎకరాలను కొద్దిమంది హస్తగతం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వేలకోట్లు ఘడిస్తున్నారు. అలాంటి వారు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులే కాక భారత ప్రధాని కార్యాలయంతో సంబంధాలు ఉన్నవారు ఉన్నారు. అవినీతి కుంభకోణాలు స్వాతంత్య్రానంతరం ప్రధాని నెహ్రూ హయాంలోనే ప్రారంభమైనాయి. 1957లో ‘‘ ముంద్రా’’ కుంభకోణం బయటపడిరది. ముంద్రా అన్న పెద్దమనిషి విద్యుత్ పరికరాల వ్యాపారి. ఇతనికున్న ఆస్థి 1.50 కోట్లు కాగా, అప్పులు 5.25 కోట్లకు ఉన్నాయి. అప్పులు తీర్చుకోవడానికి తన కంపెనీలోని వాటాలను జీవిత భీమాసంస్థ కొనుగోలు చేసేట్టు, మరియు అతనికి కోటి రూపాయల అప్పు ఇచ్చేట్టు నాటి జీవిత భీమాసంస్థ చైర్మన్ జిఆర్ కామత్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి చేతులు కలిపి కుంభకోణానికి పాల్పడ్డారు. పార్లమెంట్ సభ్యులు ఫిరోజ్‌గాంధీ ఈ కుంభకోణాన్ని బయటకు లాగి ఆశ్చర్య పరచారు. ఇందిరాగాంధీ పాలనలో 1971లో నగర్వాల కుంభకోణం, 1980లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అబ్దుల్ రహెమాన్ అంథూలే ‘‘ఇందిరా గాంధీ ప్రతిభ, ప్రతిష్టాన్’’ పేర కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. బోఫోర్స్ ఆయుధాల కుంభకోణం రాజీవ్ హయాంలో బయటకు వచ్చింది. 1991లో రైల్వే శాఖా మంత్రి జాఫర్ షరీఫ్ స్విర్జర్లాండ్ నుండి ఆరువేల హెచ్‌పి సామర్థ్యం గల 30 రైలు ఇంజన్ల కొనుగోలులో జరిగిన కుంభకోణాలు వెలుగుచూసాయి. నేటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో గల బొగ్గు కేటాయింపుల కుంభకోణం లక్షా 80వేల కోట్లకు చేరింది. చివరికి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌వాద్రా హర్యానాలో డిఎల్‌ఎఫ్ రియల్‌ఎస్టేట్‌తో కలిసి కుంభకోణానికి పాల్పడ్డాడు. 2జి కుంభకోణం, కెజిబేసిన్ రిలయన్స్ గ్యాస్ కుంభకోణాల్లో లక్షల కోట్లు ఇమిడి ఉన్నాయి.
పై కుంభకోణాలు వెలుగుచూసిన తర్వాత పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున ఆందోళన జరిపి హౌస్ కమిటీ వేయడం జరిగింది. దానితో సమస్య వీధుల్లో చర్చకు వచ్చింది. నేడు అందరూ అవినీతి గురించి, దాని నిర్మూలన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అన్నా హజారే సాగించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అవినీతి పరులు కూడా పాల్గొని నిర్మూలనకు సందేశాలిచ్చారు. చివరకు అవినీతి నిర్మూలన ప్రచారం హాస్యాస్పదంగా మారింది. దీనికి తోడు 74 లక్షల కోట్ల నల్లధనం స్వీడ్జర్లాండ్ తదితర దేశాల్లో ఉన్నదని అక్కడి ప్రభుత్వాలే ప్రకటించాయి. నల్లధనం వెలికితీతకు అధిక విలువగల (రు.100 నోటుకు పైబడినవి) నోట్లను రద్దు చేయాలని గత రెండు దశాబ్దాల క్రితమే అనేక మంది సూచనలు చేసారు. అవినీతిపరులను పెంచి పోషించే పాలకవర్గాలు ఈ సూచనను తృణీకరించాయి. నేటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. పెట్టుబడిదారీ సమాజంలోని బూర్జువా పార్టీలు అవినీతిని ప్రోత్సహించడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నాయి. నిజాయితీగా వ్యాపారం చేసి సంపాదించడం కన్నా అక్రమ మార్గాల ద్వారా, వీలయినంత తక్కువ కాలంలో లక్షల కోట్లకు అధిపతులు కావడానికి ఆశిస్తున్నవారు, వారికి వత్తాసుగా ఉన్న పాలకవర్గాల ప్రోత్సహాంతో కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయి. వీరు చట్టాలను ఘోరంగా ఉల్లంగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లోనే అవినీతిని అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ, చట్టాలకు తూట్లు పొడుస్తూ రూల్స్, జీవోలు వస్తున్నాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర క్యాబినెట్ విడుదల చేసిన 26 జీ.ఓలు అవినతిని ప్రోత్సహించినట్లు సిబిఐ చార్జీషీట్ కోర్టులో దాఖలు చేసింది. 26 జీ.ఓలను ఆరుగురు మంత్రులపై అవినీతి కేసులను పెట్టారు. ఒక్కరు జైలుపాలుకాగా మరొకరిపై చార్జీషీట్ దాఖలు చేశారు. మిగిలిన నలుగురు సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే మంత్రులపై విచారణ జరపకూడదని తీర్మానించడం చట్టం యెడల ప్రభుత్వానికున్న చిత్తశుద్దిని ప్రజలు శింకిస్తున్నారు. పెట్టుబడిదారీ సమాజంలోనే వేళ్ళూనుకుపోయిన అవినీతిని తొలగించడం అసాధ్యమవుతుంది. అవినీతిపరులకు పెద్దగా శిక్షలు లేవు.
పెట్టుబడిదారీ విధాన స్వభావం లేభాపేక్ష మాత్రమే. లాభాలు సంపాదించడం కొరకే పెట్టుబడి వినియోగించబడుతుంది. మొదట చిన్న వ్యాపారులుగా బయలుదేరి క్రమానుగతంగా సామ్రాజ్యవాద స్థాయికి చేరుతుంది. ఆ పరిణామక్రమంలోనే నేడు దేశంలో గుత్తసంస్థలు, ఇతర దేశాల బహుళజాతి సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకొని ప్రజలపై ఆర్థిక దోపిడీ కొనసాగిస్తున్నారు. పెట్టుబడిదారీ విధానంలో ఏ పరిణామక్రమం జరుగుతున్నా అది మరింత దోపిడీకి అనుకూలమైనదే తప్ప ప్రజల క్షేమం కోరేది కాదు. గత పెట్టుబడిదారీ సమాజాన్ని పరిశీలిస్తే ఈ దిగువ పరిణామక్రమాలు జరిగాయి. ఈ పరిణామ క్రమం చెందిన వ్యవస్థలలో విచ్ఛలవిడి అవినీతి చోటుచేసుకుంది. ఈ అవినీతికి పాలవర్గాల అండదండలు, ప్రోత్సాహం ఉంది. బూర్జువా పార్టీలలో ఏ పార్టీ అధికారానికొచ్చినా అంతర్గతంగా పెట్టుబడిదారీ సంబంధాలు కలుపుకుంటూ తమ ఆస్తులను పెంచుకోవడానికి వ్యాపార రంగానికన్నా అవినీతి మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ అవినీతి విధానం అనుసరిస్తున్న సంస్థలు, వ్యక్తులు అనతికాలంలోనే వేలకోట్లకు అధిపతులవుతున్నారు.
పెట్టుబడిదారీ పరిణామక్రమం ఈవిధంగా ఉంది
చిన్న సంస్థలు ఎక్కువ ధరకు ముడిసరుకు, తక్కువ ధరకు ఉత్పత్తి అమ్మకం వలన నశిస్తాయి.
కొద్ది సంస్థలు సులభంగా ఒప్పందానికి వస్తాయి.
కేంద్రీకరణ గుత్తాధిపత్యానికి దారి తీస్తుంది. పోటీ నుండి గుత్తాధిపత్యానికి జరిగే పరివర్తన పెట్టుబడిదారీ విధానపు ముఖ్యమైన ఘటనలలో ఒకటి.
ఉత్పత్తి సంయోజనం : చిన్న పరిశ్రమ శాఖలను ఒకే సంస్థలో జత చేయడం.
సిండికేట్లు : కొన్ని సంస్థలు ఏకమై అవికొనే ముడి సరుకులోను, తయారు చేసి అమ్మే సరుకులలోను జాయింటు వ్యాపారం చేస్తాయి. ఉత్పత్తి దేనిది దానిదే ` ఏ సంస్థ ఎంత ఉత్పత్తిగావించాలో సిండికేటు నిర్ణయిస్తుంది.
కార్టెల్స్ : ఒకే సరుకు ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు ధరలను తగ్గించకుండా ఓడంబడికకు వస్తాయి. సంస్థలు విడివిడిగానే ఉంటాయి. వేటి లాభాలు వాటివే. పోటీపడి ధరను తగ్గించవు. `ఉత్పిత్తిని నిర్ణయిస్తాయి. వివిధ సంస్థల మధ్య లాభాలు పంచుతాయి.
ట్రస్టులు : సంస్థలు కలిసిపోయి వాటాదారులుగా ఏర్పడతారు. జనరల్ మేనేజ్‌మెంట్ ద్వారా వ్యవహారాలు జరుగుతాయి.
మోనోపలి సంస్థలు : కొన్ని సరుకుల ఉత్పత్తిలో అత్యధికంగా హస్తగతం చేసుకున్న కొద్దిమంది కాపిటలిస్టులు ఏకం కావడం.
జాయింటు స్టాకు కంపెనీలు : చాలా మంది కాపిటలిస్ట్‌ల కాపిటల్ ఒకే మొత్తంగా చేర్చబడుతుంది.
కార్పోరేషన్లు : జాయింటు స్టాకు రూపం వచ్చాక పరిశ్రమల మధ్య దోస్తి పెరుగుతుంది. వివిధ పరిశ్రమల్లో లంకె ఏర్పడడమేకాక, బ్యాంకుల సంబంధం జోక్యం పెరుగుతుంది. 30%`40% వాటాలుంటే మొత్తం పరిశ్రమను ఆధీనంలో పెట్టుకోవద్దు.
సామ్రాజ్యవాదం : స్వేచ్ఛావ్యాపారం పోయి గుత్త సంస్థలుగా ఏర్పడతాయి. ఏర్పడినా, కాపిటలిస్టుల మధ్య పోటీ పెరుగుతుంది. గుత్తా వ్యాపారపు కాపిటలిజమే సామ్రాజ్యవాదం. బ్యాంకులతో మిలాఖతు బాగా ఉంటుంది.
ఫైనాన్స్ కాపిటల్ : కాపిటల్ పోగుపడడం. ఉపోగించని కాపిటల్‌ను కొందరు బ్యాంకులలో పెడ్తారు. పై డిపాజిట్‌తో పాటు మరిన్ని డిపాజిట్లు సేకరించి అవసరం ఉన్నవారికి ఇస్తారు. బ్యాంకులు పరిశ్రమతో ఎక్కువ సన్నిహితత్తాన్ని ఏర్పరచుకుంటాయి.
ఫైనాన్స్ కాపిటల్ ఎగుమతి : కాపిటల్ ఎగుమతి చేయడం సామ్రాజ్యవాదంలోని ఒక ప్రధాన గుణం. ఇతర ప్రదేశాలను వెదుక్కుంటూ కాపిటల్ వెళుతుంది. స్వదేశంలో గుత్త సంస్థల ఏర్పాటులో పెట్టుబడి పెట్టుటకు అవకాశాలుండవు. గుత్తా వ్యాపారం ఏర్పడిన కొద్ది కాపిటల్ ఎగుమతి అవుతుంది.
లాభాలు : 1.ఆటు`పోటును చదును చేస్తుంది. స్థిరమైన లాభం వస్తుంది. 2. వర్తకం తొలగింపు `ఫలితం. 3. సాంకేతిక మెరుగుదల ` అదనపు లాభాలు 4. సంస్థ పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.
(సిండికేటు బొగ్గు గనుల్లో లక్షలపైన ఉత్పత్తి పెరుగుదల, వారి స్వంత రైళ్ళ వినియోగం. కంపెని ఇండ్లలో కార్మికులు నివాసం, కేంద్రీకరణ పెరుగుతూనే ఉంటుంది. పెద్ద సంస్థలు రక్షణ సుంకాల చేత రక్షించబడుతూంటాయి.)
పై సంస్థలు బ్యాంకులతో మిలఖతు కాకుండా లాభాలు సంపాదించలేవు. అవినీతిలో బ్యాంకులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. బ్యాంకులలో పోగుపడిన డబ్బు ప్రజల పెట్టుబడి మాత్రమే. ప్రజల డిపాజిట్లపై పై ఆర్థిక సంస్థలు ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఈ ఆధిపత్య ధోరణితో బ్యాంకులలోని పెట్టుబడిని తమ స్వంత డబ్బులాగా వినియోగిస్తున్నారు. వాస్తవానికి బడాకంపెనీదారుల పెట్టుబడి తమ ఆస్తులలో 10శాతం మాత్రమే ఉంది. మిగిలిన 90% ప్రజాధనంపై బడాపెట్టుబడిదారులు పట్టుకలిగి ఉన్నారు. బ్యాంకులను ముందుపెట్టి బూర్జువావర్గం(బడాపెట్టుబడిదారులు) అవినీతి కుంభకోణాల ద్వారా వేల కోట్టు ప్రజాధనం లూఠీ చేస్తున్నారు. 2`జీ స్పెక్ట్రం, బొగ్గుగనుల కేటాయింపు, కేజిబేసిన్ గ్యాస్ కుంభకోణం, ఎస్ బాండ్ వేలం, గనులను సొంతం చేసుకొని ఇనుపఖనిజ రవాణా తదితర వ్యాపార సంబంధ వ్యవస్థలలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. అంతేకాకుండా ప్రజా సంక్షేమం పేరుతో చేపట్టిన కాంట్రాక్టు పనులు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ, రహదారుల కాంట్రాక్టులు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ఆదర్శ్ విల్లాల నిర్మాణ కుంభకోణం లాంటి వాటిల్లో కూడా పాలవర్గాల అండతో వేలకోట్ల కుంభకోణాలు సాగాయి. ఏ బూర్జువా పాలకవర్గమైనా అవినీతి లేకుండా పరిపాలించిన దాఖలాలు లేవు. బూర్జువా ప్రజాస్వామ్యంలో పేరుకే ప్రజాస్వామ్యం తప్ప బూర్జువా పాలకులచే ప్రజల ఆస్తులపైననేగాక, ప్రకృతి ప్రసాదించిన ఆస్తులపై కూడా హక్కును సాధించుకొని అవినీతికి పాల్పడుతున్నారు. ఈ అవినీతి నిర్మూలనకు ప్రజలను చైతన్యం చేయాలన్న పేరుతో కొన్ని సంస్థలు ఒకటి రెండు రోజులు ఆందోళనలు చేసి ఆ తర్వాత అయిపు లేకుండా పోతున్నారు. ప్రజలు అవినీతి వ్యతిరేక ఉద్యమాలకు ఆకర్షించబడుటలేదు. ఉద్యమాలు నిర్వహిస్తున్న వారిలో కూడా అవినీతిపరులు ఉండడం కూడా ఒక కారణం. అవినీతి నిర్మూలకు ప్రస్తుత సమాజంలోని లోపాలు సరిదిద్దబడాలి. చట్టాలు చేసినంత మాత్రాన అవినీతి నిర్మూలించబడదు. ప్రతి విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి. ప్రజల భాగస్వామ్యం కల్పించబడాలి. గ్రామ సభల ద్వారా పట్టణ ప్రాంత ప్రజల సమావేశాల ద్వారా ప్రతి అంశం బహిరంగంగా చర్చించబడాలి. పార్లమెంటులు, శాసనసభలు జవాబుదారీగా ఉండాలి. ప్రకృతి సహజ సంపదపై ప్రజలకే హక్కు ఉండాలి తప్ప పాలకవర్గాలకు కాదు. ప్రజామోదం లేకుండా ప్రకృతి సంపదను విక్రయించడంగానీ, ఆక్రమించడంగానీ చేయరాదు. దానిని ప్రజల అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ప్రజలు సృష్టించిన సంపదను వారికే పంపిణీ చేయాలి. అలాంటి ప్రభుత్వాలు ఉనికిలోకి రావాలి. అప్పుడు కొంతమేర అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుంది.

No comments:
Post a Comment