యేటా వ్యవసాయశాఖ వ్యవసాయ ప్రణాళికను ఖరీఫ్ సీజన్‌కు ముందు విడుదల చేసి అమలు చేస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. 2012 ప్రణాళిక విడుదలలో జాప్యం జరుగుతున్నది. 2011`12 ప్రణాళికలో 81.55 లక్షల హెక్టార్లలో 228.15 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తికి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ 173 లక్షల టన్నులు మాత్రమే దిగుబడులు వస్తున్నాయని ప్రభుత్వం తేల్చింది. దిగుబడులు తగ్గడానికి కరువు పరిస్థితులను కారణంగా చూపుతున్నారు. 876 మండలాల్లో వర్షాభావం వల్ల 85 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లినట్లు, రైతులు 5750 కోట్లుకు పెట్టుబడులకు నష్టపోయినట్లు మొత్తం పంటల దిగుబడులు 17వేల కోట్లకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వేసింది. ఈ అంచనాలకు మించే నష్టం వాటిల్లింది. క్రమానుగతంగా వ్యవసాయరంగ ఉత్పత్తిశాతం తగ్గిపోతున్నది. 2004`05 నుండి 20011`12 వరకు ఏ సంవత్సరం నిర్ధేశిత 4 శాతం ఉత్పత్తి పెరుగుదల రేటు నమోదు కాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27 శాతం ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాటా అత్యంత ధారుణంగా 14 శాతానికి పడిపోయింద. ప్రణాళికలు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. వ్యవసాయాన్ని ప్రకృతికి అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. ‘‘ రైతు ప్రభుత్వం ` రైతు పక్షపాత ప్రభుత్వం ` రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నాం.’’ అంటూ రైతు చైతన్య యాత్రలు, సదస్సులు 2005 నుండి ప్రతియేటా మార్చి నుండి జూన్ వరకు బీరుపోకుండా నిర్వహిస్తున్నారు. ఆ సదస్సులలో రైతులు లేవనెత్తిన ఏ ఒక్క అంశం పరిష్కరించబడలేదు.
2012`17, 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం, దిగుబడుల లక్ష్యం విపరీతంగా పెంచారు. పెంపుదల సాధనకు పథకాలు మాత్రం రూపొందించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 75లక్షల హెక్టార్లు సాగుచేస్తున్నాం. అలాంటిది 2012।13లో 83లక్షల హెక్టార్లు సాగుచేసి 241లక్షల టన్నుల దిగుబడులు సంపాదిస్తామని, అదేవిధంగా ప్రతియేటా విస్తీర్ణం, దిగుబడి పెంచుతూ 2016`17లో 94లక్షల హెక్టార్లు సాగు చేసి 300 లక్షల టన్నులు దిగుబడులు సాధిస్తామని కేంద్ర ప్రణాళిక సంఘానికి ముఖ్యమంత్రి సమర్పించిన పత్రంలో తెలిపారు. 2011`12లో 228లక్షల టన్నులు లక్ష్యం కాగా 173లక్షల టన్నులకు తగ్గింది. లక్ష్యలు భిన్నంగా ఉన్నా, ఆచరణ దిగదుడుపుగా ఉంటున్నది. వ్యవసాయరంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలే ఈ పరిస్థితిని కల్పిస్తున్నాయి.
రైతులకు పాసుపుస్తకాలు, నాణ్యమైన అవసరమైన విత్తనాలు, సకాలంలో రుణాలు, సాగునీటి వనరులు, నాణ్యమైన ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యతతో పాటు వ్యవసాయ శాఖ సహాయ సహకారాలు, సలహాలు అందక రైతులు ప్రకృతిపై ఆధారపడి వ్యవసాయాలు చేస్తున్నారు. ప్రకృతివైపరీత్యాలను ఎదిరించి వ్యవసాయోత్పత్తులు చేస్తున్నప్పటికీ మార్కెట్లో గిట్టుబాటుధరలు కాదుకదా కనీసం మద్దతు ధరలు కూడా లభ్యం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎగుమతులు`దిగుమతుల విధానాన్ని రైతు వ్యతిరేకంగా అమలుజరుపుతూ వ్యాపారులకు వ్యవసాయోత్పత్తులపై వేలకోట్ల రూపాయల లబ్ధిని కలిగిస్తున్నారు. వ్యవసాయరంగంలోని ప్రతిఅంశంలో మధ్యదళారీల పాత్రను ప్రోత్సహించి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందా? రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించిన లక్ష్యాలు ఉత్పత్తి రంగంలో సాధ్యమా? వ్యవసాయప్రణాళికా విధానం పూర్తిగా మారాలి. బడ్జెట్ కేటాయింపులలో ప్రస్తుతం చూపుతున్న అలక్ష్యం పోవాలి. గత కేటాయింపును పరిశీలిస్తే ఉత్పత్తి పెరుగుదల సాధ్యమా?
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్( కోట్లలో)
వ్యవసాయరంగానికి మొత్తం బడ్జెట్‌లో కేటాయింపు ఏనాడూ మూడు శాతం మించలేదు. మరొకవైపున ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతూ ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి.బహుళ జాతి సంస్థలు, విత్తన, క్రిమిసంహారక మందులు, నీటివ్యాపారం మార్కెట్లలోకి రావడంతో ఆ పెట్టుబడులకు లాభాల రూపంలో మన ఉత్పత్తులు తరలిపోతున్నాయి. నేడు దేశంలో వ్యవయసాయరంగంలోకి 1.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రావడానికి ప్రభుత్వం పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా రంగమైన వ్యవసాయానికి ద్వితీయ రంగమైన పరిశ్రమలకు పెట్టుబడులు కేటాయించకపోవడంతో ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతున్నది. చివరకు వ్యవసాయ రంగపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోతున్నారు. ఈ విధంగా బడ్జెట్ కోతల వల్ల ఉపాధి రంగం పూర్తిగా దెబ్బతింటున్నది.
రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యం (లక్షల టన్నులలో)
సంవత్సరం లక్ష్యం సాధించింది
2007`08 118.56 133.24
2008`09 128.82 142.07
2009`10 133.00 106.5
2010`11 143.28 139.22
2011`12 158.69 `
ప్రజలపై వేల కోట్ల భారాలు వేసినా అభివృద్ధి మాత్రం ‘‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’’ అన్న చందంగా ఉంది. కారణం ప్రణాళికా బడ్జెట్‌లో కోతలు విధించడమే. ఈ దిగువ పట్టికను గమనిస్తే బడ్జెట్ కేటాయింపులు ఎంత భారీగా చేసి తీరా వాస్తవ వ్యయం ఎలా తగ్గిందో తెలుసుకోవచ్చు. (మొత్తం రాష్ట్ర బడ్జెట్ కోట్లలో)
ఈ దిగువ పట్టికను గమనిస్తే బడ్జెట్ కేటాయింపులు ఎంత భారీగా చేసి తీరా వాస్తవ వ్యయం ఎలా తగ్గిందో తెలుసుకోవచ్చు. (మొత్తం రాష్ట్ర బడ్జెట్ కోట్లలో)
ఈ బడ్జెట్‌లతో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం సాధ్యం కాదు. కనీసం బడ్జెట్‌లో 10 శాతం నిధులు వ్యవసాయరంగానికి కేటాయించాలి. ప్రైవేటు రంగంలో కొనసాగుతున్న విత్తన రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తేవాలి. అప్పుడే నాణ్యత గల విత్తనాలు సరసమైన ధరలకు రైతులకు లభిస్తాయి. యేటా రాష్ట్రంలో 4,5 లక్షల ఎకరాలలో నాణ్యత లేని విత్తనాల వల్ల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. పైగా బహుళజాతి సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా విత్తనాలను నిత్యావసర సరుకుల చట్టంలోకి తెచ్చి ప్రభుత్వమే ధరలు పెరుగుదల చేస్తున్నది. మరోవైపున కేంద్ర ప్రభుత్వం మూలకాల ఆధారిత సబ్సిడీ పేరుతో ఎరువుల ధరలు 80శాతం ఒక్క సంవత్సరంలోనే పెంపుదల చేశారు. విత్తనాలు ఎరువుల ధరలను పెంచిన ప్రభుత్వం వ్యవసాయోత్పత్తుల ధరలను మాత్రం 8శాతం పెంచింది. గిట్టుబాటు కాక అనేక మంది రైతులు వ్యవసాయాన్ని వదిలివేసే దిశగా ఆలోచిస్తున్నారు.
రాష్ట్రంలో పంటల విధానంలో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. స్థిర ఆదాయం లభించే ఆహారపంటల బదులు వాణిజ్య పంటలకు మరియు ఎగుమతి ఆధారిపంటలకు ప్రభుత్వమే ప్రోత్సాహం కల్పిస్తున్నది. సుబాబుల్, జామాయిల్, పండ్లతోటలు, పూలతోటలు, కూరగాయల పంటలను ప్రోత్సహిస్తున్నది. మరోవైపున వేలాది ఎకరాల సాగుభూమి రియల్‌ఎస్టేట్ పేరుతో బీళ్ళుగా పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కోటి ఎకరాలు బీళ్ళుగా పెట్టారు. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ రాళ్ళు దర్శనమిస్తున్నాయి. సన్న, చిన్నకారు రైతుల వ్యవసాయం, గిరిజన రైతుల వ్యవసాయం మూలపడుతున్నాయి. ఈవర్గాలకు వ్యవసాయ ఉపకరణాలు, రుణాలు అందుబాటులో లేవు. వ్యవసాయశాఖ ప్రకటించిన జింక్‌సల్ఫేట్ విత్తనా సబ్సిడీ వ్యవసాయంలో యాంత్రీకరణ, బిందుసేద్యం, తుంపరసేద్యం, ముతకధాన్యాల అభివృద్ధి పతకాలు, పత్తి, నూనెగింజల అభివృద్థి పథకాలు, విత్తన గ్రామపథకం లాంటివన్నీ సన్న, చిన్న రైతులకు, దళిత, గిరిజన రైతులకు అందనివిగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టెక్నాలజీ యాంత్రీకరణ(ఆత్మ)పథకానికి కేంద్రం 90 శాతం రాయితీ, రాష్ట్రం 10 శాతం రాయితీ ఇస్తున్నది. చివరికి ఈ పథకాలు కూడా ధనికులకే చెందుతున్నాయి. వ్యవసాయశాఖ పూర్తిగా రైతుల ఎడల నిర్లక్ష్యం వహిస్తున్నది. ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయ రంగంలోకి కార్పోరేటు రంగం ప్రవేశానికి ద్వారాలు తెరిచారు. రాజ్యాంగం రిత్యా వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ కేంద్రంపైకి తోసి రాస్త్రం తప్పుకుంటున్నది.
రాష్ట్ర వ్యవసాయ ప్రణాళికను రూపొందించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అనేక సందర్భాలలో రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఏ భూమిలో ఏ పంటలు వేయాలో ఏ సమయంలో ఏ పనులు చేయాలో తెలియజెప్పే యంత్రాంతం క్రమంగా హరించిపోయింద. భూసార పరీక్షలు జరిపి అందుకనుగుణమైన విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. యేటా తగినన్ని వ్యవసాయరుణాలిస్తామని చెప్పుచున్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2012`13 రు. 40 వేల కోట్లు వ్యవసాయ రుణాలిస్తామని ఈ మధ్యనే ప్రకటించింది. కానీ అందులో 40 లక్షల మంది కౌలురైతులకు సంబంధించి, వారికిచ్చే రుణాల గురించిన ప్రస్తావన నామమాత్రంగా ఉంది. అన్ని జిల్లాలలో కౌలు విధానం బాగా విస్తరించింది. వారికి గుర్తింపుకర్డులు ఇస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు 7 లక్షల మందికి మాత్రమే ఇచ్చింది. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. పత్తి విస్తీర్ణం అనూహ్యంగా పెరుగుతున్నది. ఎకరా పెట్టుబడి 25వేల నుండి 35 వేలకు పెరిగింది. పై అంశాలను గమనించి రైతాంగ ప్రయోజనాలు రక్షించే విధంగా వ్యవసాయ ప్రణాళికను తయారు చేయాలి.
ప్రణాళికకు చర్యలు
1) వాతావరణం, భూసార పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలలో పంటల విధానాన్ని రూపొందించాలి.
2) విత్తనాలు నాణ్యమైనవి మార్కెట్ కమిటీల ద్వారా అందించాలి.
3) అర్హత గల రైతులందరికీ ముఖ్యంగా కౌలుదారులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణాలివ్వాలి.
3) ఎరువులు, క్రమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలి. పెరిగిన ఎరువుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా సన్న, చిన్నకారు రైతులకు తగ్గింపు ధరలకు ఎరువులివ్వాలి.
4) 2.5 ఎకరాలలోపు రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి.( కొన్ని రాష్ట్రాలలో ఈ విధానం ఉంది.)
5) పంటలు వేసేనాడే మద్దతు ధరలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి.
6) రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ప్రకటించిన ధరకు కొనుగోలు చేయాలి.
7) బయోపర్టిలైజర్స్, జిప్పం, జింక్, బిందు, తుంపరసేద్య పరికరాలు చిన్న యంత్రాలు సన్న, చిన్నకారు రైతులకు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
8) మండల కేంద్రాలలో కొనుగోలు చేయడానికి అద్దె కొనుగోలు పద్దతిపై యంత్రాలు అందుబాటులో పెట్టాలి.
9) ప్రకృతివైపరీత్యాల సందర్భంగా నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వాలి. ఒక పంటకు గ్యారింటీ ఉండే విధంగా రాష్ట్ర జలవిధానాన్ని రూపొందించి ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపే పథకాన్ని రూపొందించి అమలు చేయాలి.
పై ప్రణాళికను అమలు జరపడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అఖిలపక్ష సమావేశాలు జరిపి ప్రణాళికలు తయారు చేయాలి. అప్పుడే రైతుల ఉత్సాహంగా వ్యవసాయ కార్యక్రమాలలో పాల్గొంటారు.
సారంపెల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment