ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు గోదాములు ఖాళీ లేవని, లెవీ విధానం సవరించాలని అంతవరకు ధాన్యం కొనుగోలు నిలిపివేస్తున్నామని మిల్లర్లు ప్రకటించారు.
రాష్ట్ర దిగుబడుల పరిస్థితి:
ఈ సంవత్సరం ఖరీఫ్ అంచనాగా 83.86 లక్షల టన్నులు దిగుబడి వస్తుందన్న లక్ష్యం నిర్ణయించారు. ఇందులో 40శాతం వరకు రైతుల వినియోగం లోకి వెళుతుంది. మిగిలిన 60శాతం మాత్రమే మార్కెట్‌కు వస్తుంది. అనగా ఖరీఫ్‌లో సుమారు 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సిఐ సేకరించాల్సి వస్తుంది.
` ఇందిరా క్రాంతి పథకం మరియు ఎఫ్‌సిఐ ద్వారా ఏటా 4,5 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంతవరకు ఇందిరా క్రాంతి పథం వాళ్లు రైతులకు డబ్బులు చెల్లించలేదు. ఆ భయంతో ఐకెపి వారు కొనడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు.
రాష్ట్రంలో ఏటా 25 లక్షల టన్నుల బియ్యం చౌక డిపోల ద్వారా, హాస్టల్స్, అన్నపూర్ణ పథకాల ద్వారా సబ్సిడీపై ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వినియోగమవుతున్నాయి. ఎపియల్ వారికి కిలో రూ.9 చొప్పున ప్రతినెల 1.70 లక్షల టన్నులు కేంద్రం మంజూరు చేస్తున్నది. కాని ఇక్కడ వారికి పంపిణీ జరగటం లేదు.
ఈ వినియోగానికి కావల్సిన బియ్యానికి తగిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయి సంస్థ ద్వారా సేకరించడం వలన అటు రైతులకు కనీస మద్దతు ధరలు లభిస్తాయి.
ప్రస్తుతం మిల్లర్లు కోరుతున్నదేమిటంటే ప్రభుత్వం మద్ధతు ధరలకు కొనుగోలు చేసి మిల్లర్లకు కష్టంమిల్లింగ్‌కు ఇచ్చినచో బియ్యం తయారు చేసి ఇస్తామంటున్నారు. పంజాబ్‌లో ఇదే విధానం కొనసాగుతున్నది. మిల్లర్ల నుండి వచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సిఐ ప్రొక్యూర్ చేస్తుంది.
అందువల్ల ధాన్యం కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం
ఎఫ్.సి.ఐ. సొంత గోదాములు 12.73 లక్షల టన్నులు.
సెంట్రల్ వేర్ హౌసింగ్ 1.36 లక్షల టన్నులు
స్టేట్ వేర్ హసింగ్ 17.60 లక్షల టన్నులు
మొత్తం 31.69
ఇవి గాక మరో 20లక్షల టన్నుల గోదాములు వున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల వద్ద గత ఖరీఫ్ బిపిటి ధాన్యం 15 లక్షల టన్నులు నిల్వలున్నట్లు అంచనా. రాష్ట్రంలోని గోదాములలో 7 లక్షల టన్నులు పంజాబ్, హర్యానా మరియు ఇతర రాష్ట్రాల నిల్వలున్నట్లు అంచనా.
అలాగే 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం ఎగుమతి కావల్సిన నిల్వలున్నాయి.
ఇతర రాష్ట్రాల నిల్వలు ఉప్పుడు బియ్యం ఎగుమతి చేసినచో గోదాములలో ఖాళీ ఏర్పడే అవకాశముంది.
రాష్ట్ర ప్రభుత్వ అలక్ష్యం, కేంద్రం రైల్వేలు సమకూర్చకపోవడం ఫలితంగా నిల్వలు పేరుకుపోయాయి.
ప్రస్తుతం మార్కెట్ యార్డులోని గోదాములను ధాన్యం నిల్వలకు వినియోగించవచ్చు. వ్యాపారులకు లెవీ సేకరణ సమస్యను ముందుకు తెస్తున్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. గత లెవీ సేకరణ ఈ విధంగా వుంది.
సంవత్సరం లెవీసేకరణ
2001`02 63.96
2002`03 26.14
2003`04 42.45
2004`05 38.90
2005`06 46.56
2006`07 60.00
రబీ వ్యవసాయ ప్రణాళిక
రబీలో కోటి ఎకరాలు సాగవుతుందని రు. 8788 కోట్లు ఇవ్వబడతాయని 34.85 లక్షల టన్నుల ఎరువులు మరియు 12 లక్షల టన్నుల క్వింటాళ్ళ విత్తనాలను రాయితీపై అందచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ 2.10.2010న ప్రకటించింది.
ఈ సంవత్సరం వర్షాలు సక్రమంగా కురవడం ఫలితంగా సకాలంలో పంటలు వేయడానికి అవకాశమున్నది.
విత్తనాలు : రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం కావల్సిన విత్తనాలు 18.77 లక్షల క్వింటాళ్లు ఇందులో వరివిత్తనాలు 7.80 లక్షల క్వింటాళ్లు. శనగలు 4.23,000 క్వింటాళ్లు. వేరుశనగ 4,50,000 క్వింటాళ్లు అవసరం. పై విత్తనాలను మండల స్థాయిలో అవసరం మేరకు నిల్వలుంచాలి.
నాణ్యత గల విత్తనాలను నిర్ణయించిన ధరలకు మార్కెట్ కమిటీల ద్వారా అందించాలి. గతంలో శనగ, వేరుశనగ విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
ఎరువులు: గత ఖరీఫ్‌లో ఎరువుల కొరతను గమనించాము. డిఏపి, యూరియాతోపాటు 10 లక్షల టన్నుల కాంప్లెక్స్ కలిపి మొత్తం ఎరువులు 34.85 లక్షల టన్నులు. మార్కెట్ కమిటీల ద్వారా, సహకార సంఘాల ద్వారా అమ్మించాలి.
కాంప్లెక్స్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వకుండా నేరుగా రైతులకు సరఫరా జరుగునట్లు చూడాలి.
రుణాలు: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రబీ పంట రుణాల క్రింద 10,600 కోట్లతో ప్రణాళిక ప్రకటించారు. కాని రాష్ట్ర వ్యవసాయ శాఖ 8788 కోట్లకు తగ్గించింది. ఖరీఫ్‌లోనే రుణాలు అందకు రైతులు ప్రైవేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా గత ఖరీఫ్ రుణాలను రీషెడ్యూల్డ్ చేయడానికి బ్యాంకులు అంగీకరించలేదు. 30శాతం మాత్రమే రీషెడ్యూల్డ్ చేశారు. మిగతా రుణాలను ‘‘పుస్తకఅడ్జెస్టెమెంట్’’ చేశారు. గత అనుభవం రైతులను ఇబ్బందులకు గురిచేసింది.
64 వేల జెఎల్‌జి గ్రూపులకు (కౌలుదార్లకు) 760 కోట్లు రుణ ప్రణాళిక ప్రకటించారు. ఇంతవరకు 10శాతం కూడా రుణాలివ్వలేదు.
ప్రతి బ్రాంచ్ క్రొత్త రుణ గ్రహీతలకు 300 మందికి రుణాలివ్వాలని ఆవిధంగా మొత్తం రాష్ట్రంలో 23.47 లక్షల మందికి అర్హతగల క్రొత్తవారికి రుణాలివ్వాలని ప్రణాళిక 2010`11 రూపొందించారు. ఇంతవరకు క్రొత్తవారికి రుణాలివ్వడం లేదు. పైగా కేంద్రం రుణ మాఫీ పథకం పొందిన రైతులకు రుణాలివ్వడం లేదు.
కౌలుదార్లకు అర్హతగల చిన్నసన్నకారు రైతులకు (క్రొత్తవారు) నవంబరు ఆఖరు నాటికి రుణం అందునట్లు పంపిణీ జరుగునట్లు రాష్ట్రం చర్యలు చేపట్టాలి.
పంటల భీమా: పంటల భీమా పథకం రైతులకు ఉపయోగపడుట లేదు. ఒక్కో జిల్లాకు కొన్ని పంటలనే ఈ పథకం క్రింద గుర్తించారు. ప్రీమియం పెంచారు. 2సం॥ మినహా మిగతా సంవత్సరాలలో రైతులే ప్రీమియం ఎక్కువ చెల్లించారు. క్లయిమ్‌లు పరిష్కరించడంలో జాప్యం జరుగుతున్నాయి. సన్నచిన్నకారు రైతుల ప్రీమియం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరించాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పంట నూర్చిన తర్వాత జరుగు నష్టానికి భీమా వర్తించదు. ఈ నిబంధన తొలగించాలి. బ్యాంకు రుణం పొందని వారికి ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలి.
పంటల పరిహారం: ఈ సంవత్సరం ఖరీఫ్‌లో అధిక వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లినది. తిరిగి వారు పంటలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.
తేది: 18.10.2010
```

No comments:
Post a Comment