రాష్ట్రప్రభుత్వ విధానాల ఫలితంగా నేడు రైతులు నల్ల బజారుల వ్యాపారుల కబంద హస్తాలలో నలిగిపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, రుణాల సాధనకు మధ్యదళారీలు, బహుళజాతి సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రభుత్వం 2011`12 వ్యవసాయ ప్రణాళికా లక్ష్యంగా ఆహారధాన్యాలు ఉత్పత్తి 228 లక్షల టన్నులుగా నిర్ణయించారు. ఈ సంవత్సరం రైతులకు ఖరీఫ్ విత్తనాలు 29.56 లక్షల క్వింటాళ్ళు, రబ్బీలో 16.83 లక్షల క్వింటాళ్ళు అవసరం కాగా ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ పై 26.28 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరాకు రు.400 కోట్లు సబ్సిడీగా కేటాయించింది. ఏడాదికి 79.05 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో పెడతానని వార్షిక ప్రణాళికలో ప్రకటించింది. అదేవిధంగా పంటరుణాలు, దీర్ఘకాలిక రుణాల కింద రు.48వేల కోట్లు పంపిణీ చేస్తానని చెప్పింది. దీన్ని సాధించడానికి తగిన వనరులను రైతులకు కల్పించడంలో ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా ఉన్నాయి.
విత్తనాలు :
నేడు వ్యవసాయ తరుణం ప్రారంభమైంది. కానీ ఇంతవరకూ విత్తనాల కొరకు రైతులు నల్లబజారు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో రాష్ట్ర విత్తనాభివృద్ది, జాతీయ విత్తనాభివృద్ది సంస్థల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేశారు. విత్తనాల వలన ఎక్కడా ఎకరం పంట దెబ్బతిన్నట్టు సమాచారంలేదు. 2002`03 నుండి విత్తనరంగంలోకి కార్పోరేట్ సంస్థలు ప్రవేశించాయి. క్రమక్రమంగా అన్నిరకాల విత్తనాలపై గుత్తాధిపత్యం సాధించాయి. మోన్‌శాంటో, కార్గిల్,డుపాయింట్, ఐటిసి లాంటి సంస్థల చేతుల్లోకి విత్తనాలు వెళ్ళిపోయాయి. వీటి ప్రవేశంతో విత్తనాల ధరలు 10 రెట్ల వరకు పెరిగాయి. పైగా నాణ్యతలేని విత్తనాల వల్ల ఏటా రాష్ట్రంలో 4,5 లక్షల ఎరకాల పంటలు కాత,పూతలేకుండా పోతున్నాయి. దీనికి రైతునే బాధ్యునిగా చేసి సాగు సక్రమంగా చేయలేదని ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉండి దేశంలో 60 శాతం విత్తనాలను సరఫరా చేస్తున్నా, మన రాష్ట్రప్రభుత్వం, విత్తన చట్టం రూపొందించలేదు. రాజ్యాంగం రిత్యా విత్తన చట్టం రూపొందించడంతోపాటు, ధరల నిర్ణయం, సరఫరా బాధ్యతలు రాష్ట్రప్రభుత్వమే చూడాలి.కానీ కేంద్రంపైకి తోసివేసి రాష్ట్రం తప్పుకున్నది. నిత్యావసర వస్తువుల చట్టం కిందికి తెచ్చిన విత్తనాలకు ప్రభుత్వమే ధరలు పెంచి రైతులకు భారం కలిగిస్తున్నది. 2002లో 9300 పాకెట్లు(450గ్రాములు) బిటి పత్తి అమ్మిన సంస్థ నేడు కోటి పాకెట్ల అమ్మకానికి చేరుకుంది. గతంలో ఒక పాకెట్ ఎకరాకు నేడు 2 పాకెట్లు అవసరమౌతున్నాయి. ఆ విధంగా ప్రభుత్వం కేటాయించిన దానికి భిన్నంగా 2 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరం. బిజి`2 రు.750/`లు ఉన్న పాకెట్ ధరను రు.930/` కి పెంచారు. కృత్రిమ కొరత సృష్టించి పాకెట్‌కు రు.1,500 నుండి రు. 2,000 వరకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. అదేవిధంగా వేరుశనగ కాయ విత్తనాలను క్వింటాలుకు రు.5,200/`కు పెంచి ప్రభుత్వం 30శాతం సబ్సిడీ ఇస్తున్నది. రైతు క్వింట కాయకు రు3500/` చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రు.400 కోట్ల సబ్సిడీతో 16 లక్షల క్వింటాళ్ళ సబ్సిడీ కాంట్రాక్టర్లకు చెందుతుందేతప్ప రైతులకు ఉపయోగంగాలేదు. అనంతపురంలో ఇప్పటికే సరఫరా చేసిన వేరుశనగా కాయ విత్తనంలో 25 శాతం విత్తనాలులేని కాయలున్నాయి. నాణ్యతగల విత్తనాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రైతులకు అందుబాటులో లేవు. విత్తనాల కొరకు నల్లబజారువ్యాపారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
పంటరుణాలు` బ్యాంకుల పరిస్థితి :
2011`12లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) పంటరుణాల కొరకు రు. 30,985 కోట్లు కేటాయింపు చూపగా, వ్యవసాయశాఖ మంత్రి రు.27,500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించడం పరస్పర విరుధ్ధంగా ఉంది. కేటాయించిన రుణాలు పంపిణీ కావడంలేదు. రుణార్హత గల్గిన వారు 40 లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రతిబ్యాంకుబ్రాంచి కనీసం 330 మంది కొత్తవారికి/ కౌలుదారులకు రుణాలిస్తామని 2010`11లో ప్రకటించారు. అది అమలుకు నోచలేదు. తిరిగి 2011`12లో ప్రతిబ్యాంకుబ్రాంచి 200 మందికి ఇవ్వాలని ఎస్‌ఎల్‌బిసి నిర్ణయించగా, 100 మందికి ఇస్తామని మంత్రిగారు ప్రకటించారు. ఈ రోజు రాష్ట్రంలో 40 లక్షల మంది కౌలుదారులున్నట్లు బ్యాంకులు అంచనా వేశాయి. వీరికి రుణగుర్తింపుకార్డులిస్తామని ప్రభుత్వం జిఓ విడుదల చేసింది. గత సంవత్సరం పంటలు నష్టపోయిన 669 మండాలలోని రైతుల పంటరుణాలు రు.11,500 కోట్లు రీషెడ్యూల్ చేయాలని బ్యాంకులను రాష్ట్రప్రభుత్వం మరియు రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఆ ఆదేశాన్ని తుంగలో తొక్కి రుణాన్ని బుక్ అడ్జెస్ట్‌మెంట్ ద్వారా కొత్తరుణాలుగా మార్చారు. అనగా 2011`12కు 30 శాతం రుణాలు పంపిణీ చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 18 శాతం వ్యవసాయరుణాలివ్వాలన్న రిజర్వుబ్యాంకు నిబంధనను అమలు చేయుటలేదు. బ్యాంకు డిపాజిట్లలో డిపాజిట్ల ప్రకారం రుణపంపిణీ ఏనాడూ 12 శాతానికి మించలేదు. బ్యాంకులు రుణాలివ్వకపోవడం ఫలితంగా సన్న, చిన్నకారు రైతులు మైక్రోఫైనాన్స్ సంస్థల నుండి రుణాలు తెస్తున్నారు. బ్యాంకులు మైక్రోఫైనాన్స్ సంస్థలకు 5`7 శాతంవడ్డీకి రుణాలివ్వగా వారు, రైతులకు 27`30 శాతం వడ్డీకి రుణాలిచ్చి రుణభారం పెంచుతున్నారు.ఇక్కడా మధ్య దళారీల పాత్ర రైతులను వెన్నాడుతూనే ఉంది దీనికి తోడు చాలా బ్యాంకులలో పైరివీకారులు రైతులకు రుణాలిప్పిస్తామని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. రుణలభ్యత అందరానిదిగా ఉంది.
అర్హత గల వారికి కౌలుదార్లకు, వాస్తవ సాగదార్లకు స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రకారం రుణ పంపిణీ జూన్‌లోనే చేయాలి. రైతులు వ్యవసాయ ఉపకరణాలు కొనుగోలు చేయడానికి వీలుగా రుణాలివ్వాలి. బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించకుండా అఖిలపక్ష సమావేశాలు జరిపి సమీక్షలు ప్రతినెలా చేయాలి.
ఎరువులు` పంపిణీ విధానం :
ఖరీఫ్‌లో 39.55 మెట్రిక్ టన్నుల ఎరువులు నిలువ ఉన్నట్లు మంత్రి ప్రణాళికలో చెప్పారు.పెంచిన ధలకు కూడా ఎరువులు లభ్యం కావడంలేదు. బ్లాక్ మార్కెట్ బహిరంగంగానే సాగుతున్నది. ఉపయోగం లేని ఎరువుల బస్తాను పోటీపెట్టి రైతుకు అంటగడుతున్నారు. వ్యాపారులు చేస్తున్న అక్రమ వ్యాపారం వ్యవసాయాధికారులకు తెలియనిదేమీకాదు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ విధానాన్ని మార్చడంతో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 50 కిలోల బస్తా ధరలు ఈ విథంగా ఉన్నాయి.
గత అనుభవాలు పరిశీలిస్తే రాష్ట్రంలో 15 మిక్సింగ్ ప్లాంట్‌లకు రైతుల సబ్సిడీ ఎరువులను మళ్ళించి, రైతులకు ఎరువులు దొరకకుండా చేశారు. ఖరీఫ్`రబీలో కలిసి 75 లక్షల టన్నుల ఎరువులు అవసరం. ఖరీఫ్‌లో యూరియా`14 , డిఎపి`5,పొటాష్`3.50, కాంప్లెక్స్`11.50, సూపర్`1.50 మొత్తం 35 లక్షల టన్నులు అవసరం.దాదాపు రబ్బీకి అంతే మొత్తంలో అవసరం. ఎరువులకోరకు జరిగిన తొక్కిసలాటలో గతంలో ఆరుగురు రైతులు మరణించారు. ఎరువుల దొరకక కౌెలు రైతు బత్తు సైదులు( ఖమ్మంజిల్లా, ఇల్లందు) గతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డబ్బులు పెట్టి కొందామన్నా ఎరువులు తగినన్ని అందుబాటులో లేవు.
రాష్ట్రంలో రామగుండం , తాల్చేరు యూరియా ఉత్పత్తి ఫ్యాక్టరీ లను 1.04.1999న మూసివేశారు. ఒక్కొక్కదాని ఉత్పత్తి సామర్థ్యం 4.95 లక్షల టన్నులుగా ఉంది. గత శాసన సభలో ఈ ఫ్యాక్టరీలను నాలుగు మాసాలలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటుందని నాటి వ్యవసాయశాఖా మాత్యులు ప్రకటించారు. నేటికీ ఆ వైపు రాష్ట్రప్రభుత్వం ఆలోచన లేదు. ఈ రాష్ట్రంలో గ్యాస్ లభ్యత ఉన్నప్పటికీ ఎరువుల ఉత్పత్తి గురించి ప్రభుత్వం ఆలోచించడంలేదు.
ఎరువుల వినియోగం తగ్గించడానికే ఎరువుల సబ్సిడీ విధానాన్ని (మూలకాల ఆధారితంగా)మార్చామని చెప్పుచున్నది. సబ్సిడీ విధానం మార్చడంతో ఎరువుల ధరలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి.భూసార పరీక్షలు జరిపి ఎరువులు ఏమోతాదులో వేయాలో రైతులకు తెలియజేసే విధానం అమలు జరగక పోవడం వలన విచక్షణా రహితంగా రైతులు ఎరువుల వినియోగం చేస్తున్నారు.
నేటికీ రైతులు కనీస మద్దతు ధరలకు దాన్యం అమ్ముకోలేక పోతున్నారు. ఒక రబీలోనే కోటి టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా రాష్ట్ర, కేంద్ర కొనుగోలు సంస్థలు 16 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు సివిల్‌సప్లై మాత్యులు ప్రకటించారు. కనీసం తమ ధాన్యమైనా అమ్ముకొని వ్యవసాయ ఉపకరణాలు కొనుగోలు చేసే అవకాశం లేకుండా ఉంది. పై ప్రభుత్వ విధానాల దృష్ట్యా నిరాశా, నిస్పృహలకు గురైన రైతులు ‘‘క్రాప్‌హాలిడే’’ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ధోరణి రైతుల్లో రావడానికి ఎవరు కారణం? 2000 ల సంవత్సరంలో పొగాకు క్రాప్ హాలిడే రైతులు ఐక్యంగా అమలు జరిపారు. ఆ ఘటన నుండి ప్రభుత్వాలు గుణపాఠం తీసుకున్నట్లు కనపడదు. వ్యవసాయ రంగంలోకి బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్న ప్రభుత్వాలు క్రాప్‌హాలిడేను ఆహ్వానిస్తాయా? ధనిక దేశాలనుండి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవాలని ఆ దేశాలు తెస్తున్న ఒత్తిడికి లొంగి ప్రభుత్వం వ్యవసాయరంగం బాధ్యతలనుండి తప్పుకుంటున్నది. పరోక్షంగా రైతులే పంటలు పండిరచకుండా ఉండే విధంగా మానసికంగా తయారు చేస్తున్నది. ‘‘రోగి కోరిందీ అదే, డాక్టర్ ఇచ్చిందీ అదే’’ అన్నట్లు దిగుమతులకు అనుకూలంగా వ్యవసాయ ఉత్పత్తులకు పరోక్షంగా ఆటంకం కల్పిస్తూనే నైపుణ్యంగా, తమది రైతు ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్నారు. అమలు కాని ప్రణాళికలు ప్రకటిస్తున్నారు. కీలకమైన వ్యవసాయశాఖకు పూర్తిస్థాయి బాధ్యత గల మంత్రిని నియమించలేని స్థితిలో నేటి ప్రభుత్వం కొనసాగుతున్నది. రాజ్యంగం రీత్యా వ్యవసాయశాఖ రాష్ట్ర ఆధీనంలో ఉన్నప్పటికీ, కేంద్రంపైకి తోసి రాష్ట్రప్రభుత్వం తప్పుకుంటున్నది. విత్తన చట్టం కేంద్రం బాధ్యతగా తోసివేశారు. కోట్లాది విలువగల పంటలకు నాణ్యతలేని విత్తనాల వల్ల నష్టపోతున్న రైతులు, రుణాలు, ఎరువులు అందని రైతుల సమస్యలను పరిష్కరించేదెవరు? బ్లాక్ మార్కెట్ వ్యాపారానికి స్వస్తి చెప్పేదెవరు? అన్నీ తెలిసిన ప్రభుత్వం తెలియనట్లు నటిస్తున్నది. గత అనుభవాన్ని బట్టి క్రాప్‌హాలిడే సమస్యలకు పరిష్కారంకాదు. రైతాంగం ఐక్యతగా ఉద్యమించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప మరొక మార్గంలేదు.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment