2011`12 రాష్ట్ర రుణ ప్రణాళికను మే 27న ఆలస్యంగానైనా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వేస్తున్నామంటూ మొత్తం రుణ ప్రణాళిక 1.04 లక్షల కోట్లలో 48 వేల కోట్లు కేటాయించామని రుణ వితరణకు చెందిన సమావేశంలో ప్రకటించారు. ప్రతి బ్రాంచి 100 మంది కొత్త వారికి లేదా కౌలుదారులకు విధిగా రుణాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. వాణిజ్యబ్యాంకులు వడ్డీ మాఫీ రికార్డుల తయారీలో నిర్లక్ష్యం చేసాయని నిరసన తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఏటా మార్చి, ఏప్రిల్‌లో రుణ ప్రణాళిక విడుదల చేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి అందుకు భిన్నంగా మే చివరిన రుణ ప్రణాళికను విడుదల చేసారు. రాష్ట్ర ప్రభుత్వం 2011`12 సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ ప్రణాళికను నేటికీ విడుదల చేయలేదు. ముసాయిదాను విడుదల చేసారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖా ఇన్‌చార్జీ మంత్రిగా దామోదరం రాజనర్సింహ చూస్తున్నారు. వీరికి కీలకమైన విద్యాశాఖ ప్రధాన బాధ్యత కావడంతో వ్యవసాయ శాఖకు సమయం కేటాయించలేకపోతున్నారు. మరో 10 రోజులు గడిస్తే తొలకరి ప్రారంభమవుతుంది. రైతులు విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ ఉపకరణాలు కొనుగోలు చేసి సిద్దంగా ఉండాలి. కానీ ఇంత వరకు రానున్న ఖరీఫ్ ప్రణాళిక నేటికీ సిద్దం కాకపోవడంతో ప్రభుత్వం నుండి సహకారం అందదన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. గత సంవత్సరం 275 కోట్లు విత్తన సబ్సిడీ ఇవ్వగా ఈ సంవత్సరం దానిని 400 కోట్లకు పెంచారు. అదే సందర్భంలో విత్తనాల ధరలను పెంచడంతో ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీ మొత్తం మధ్య దళారీలకు, విత్తనాలు సరఫరా చేసే ఏజెంట్లకు చేరుతుంది. గత ఆరు మాసాల్లో ఎరువుల ధరలు 25శాతం పెరిగాయి. విత్తనాల ధరలను 25 శాతానికి పైగా పెంచుకోవడానికి ప్రభుత్వం వ్యాపారులకు అనుమతినిచ్చింది. ఈ విధంగా ఉపకరణాల ధరలు 25 నుండి 30 శాతం పెరిగాయి. వీటి సేకరణకు రైతులకు తక్షణం రుణ సౌకర్యం కావాలి. గత సంవత్సరం వరదల వల్ల 669 మండలాలలో (15 జిల్లాల్లో)27 లక్షల ఎకరాలలో పంటలు నష్టం జరగగా వారికి వడ్డీ మాఫీ చేసి రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ఆదేశాలిచ్చింది. కానీ ఇంతవరకు రుణాల రీ షెడ్యూల్ జరగక పోగా, అవే రుణాలు తిరిగి రైతులకిచ్చినట్లు బుక్ అడ్జస్ట్ మెంట్ చేశారు. వారికి పావలా వడ్డీ వర్తించడం లేదు. వారందరూ కొత్త రుణాలు పొందడానికి అనర్హులౌతారు. నష్ట పోయిన మండలాలలోని 23 లక్షల మందికి రు.546 కోట్లు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీగా రైతు చైతన్యయాత్రలో పంపిణీ చేస్తామని ప్రకటించారే తప్ప అమలు కాలేదు.
రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం మొత్తం బ్యాంకుల వ్యాపారంలో 40 శాతం ప్రాధాన్యతా రంగానికి (వ్యవసాయం దాని అనుబంధ రంగాలు) కేటాయించాలి. ఇందులో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలకు 18 శాతం నిధులు కేటాయించాలి. 2011 మార్చి 31 నాటికి అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు 2,83,600 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. 40 శాతం అనగా రు.1,13,440 కోట్లు ప్రాధాన్యతా రంగానికి కేటాయించాలి. 18 శాతం వ్యవసాయ రంగానికి అనగా రు.51,048 కోట్లు కేటాయించాలి. కానీ పంట రుణాలుగా రు.30,985 కోట్లు,అనగా 10.92 శాతం కేటాయించారు.ధీర్ఘ కాలిక రుణాలకు 1.84 శాతం కేటాయించారు. మొత్తంగానూ చూసినా పంటరుణాలు, మరియుధీర్ఘకాలిక రుణాలకు కలిపి 12.76 శాతం మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపులతో ప్రాధాన్యతా రంగం అభివృద్ది చెందుతుందా? మొత్తం ప్రాధాన్యతా రంగం(వ్యవసాయం,వ్యవసాయేతరమరియు ఇతర రంగాలు) కేటాయింపులు 1,03,915 కోట్లు (36.64 శాతం) కేటాయించారు.ఇప్పటికే వ్యవసాయ రంగానికి తగినంత రుణం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో 1.24 కోట్ల కమతాలుండగా 64 లక్షల కమతాలకు మాత్రమే రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు బ్యాంకుల నివేదికలు తెలుపుతున్నాయి. రుణార్హత కలిగిన సన్న,చిన్నకారు రైతులు మరియు జాయింట్ లయబిలిటీ గ్రూపులలోని కౌలు రైతులు రుణాల కొరకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు, మైక్రోఫైనాన్స్ సంస్థల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఒకవైపున పంటలు దెబ్బతినడం, మరోవైపున వడ్డీభారం పెరగడం తట్టుకోలేక వేల సంఖ్యల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి రుణ విధానాన్ని మెరుగుపర్చాలన్న ఆలోచన గానీ, వాస్తవసాగుదారులకు రుణసౌకర్యం కల్పించాలన్న ఆలోచన గానీ లేకపోవడం గమనించాలి.
2010`11లో ప్రాధాన్యతా రంగానికీ రు.61,685 కోట్లు కేటాయించగా బ్యాంకులు రు.72,878 కోట్లు (118.14 శాతం) పంపిణీ చేసినట్లు గొప్పగా చెప్పారు. ఆ సంవత్సరం డిపాజిట్లు రు.2,45,686 కోట్లు కాగా వీరు లక్ష్యాని మించి కల్పించిన రుణ సౌకర్యం లెక్కవేసినా 29 శాతం దాటడం లేదు.అందులో పంటరుణాలకు 12.30 శాతం మాత్రమే రుణ పంపిణీ చేశారు. ఈ వాస్తవాలను వక్రీకరించి కేటాయింపులకన్నా ఎక్కువ రుణాలిస్తున్నామని ఏటా రుణ ప్రణాళికలలో ప్రకటిస్తున్నారు. వాస్తవానికి బ్యాంకు డిపాజిట్లను గమనంలోకి తీసుకుంటే పంటరుణాలు ఏనాడూ 12 శాతం దాటలేదు. నేటికీ 40 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు రుణార్హత కలిగినవాళ్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నేడు బ్యాంకులలో పైరవీకారులూ, దళారీలు రుణపంపిణీలో కీలక పాత్రవహిస్తున్నారు.
669 మండలాల్లో వడ్డీలు మాఫీ చేయాలనీ ప్రభుత్వం ప్రకటించింది. మాఫీ కావలసిన వడ్డీ జాబితాలను పంపించాలనీ బ్యాంకులను రిజర్వుబ్యాంకు కూడా ఆదేశించింది.జూన్ ఆఖరు వరకు పొడిగించింది. సహకారబ్యాంకు మినహా వాణిజ్యబ్యాంకులు వడ్డీ మాఫీ చేసిన దాఖలాలు అతి తక్కువ, ఈ మండలాల్లో రుణాలను రీ`షెడ్యూల్ చేయాలని ఇచ్చిన ఆదేశాలు కాగితాలకే పరిమితం అయినాయి. సహకార బ్యాంకులు కూడా పాత రుణాలనే తిరిగి ఇచ్చినట్లు వ్రాసుకొని చేతులు దులుపుకున్నారు.
రుణపంపిణీలో అవకతవకలు
వాస్తవ సాగుదారుకూ, సన్న చిన్నకారు రైతులకు మరియు దళిత,గిరిజన,కౌలు రైతులకు రుణసౌకర్యం కల్పించాలన్న లక్ష్యానికి విరుధ్ధంగా వ్యవసాయ రుణాలను వ్యవసాయంలో భాగస్వామ్యంలేని వారు పెద్దమొత్తాలు కాజేస్తున్నారు. వీరు తిరిగి చెల్లింపుకు బ్యాంకు ముఖం చూడరు. పెద్ద భూస్వాములు తమ కుటుంబ సభ్యుల పేర్లతో పంట రుణాలు,దీర్ఘకాలిక రుణాలను తీసుకుంటున్నారు. వీరు తక్కువ భూకమతాన్ని చూపడం ద్వారా ప్రభుత్వ మాఫీ పథకాలు వీరికే వర్తిస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం మాఫీ చేసిన రుణాలలో సింహ భాగం భూస్వాములదే. పంటరుణాలిచ్చే సందర్భంగా ‘‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’’ ప్రకారం రుణాలిస్తామంటారు. కానీ ఏ జిల్లాలోనూ ఏ రైతుకూ ఆ విధానం అమలు జరుపుట లేదు. గత సంవత్సరం ప్రతి బ్రాంచి 330 మంది కొత్తవారికి రుణాలివ్వాలన్న లక్ష్యంలో 10 శాతం కూడా నెరవేరలేదు. తిరిగి 2011`12లో ప్రతి బ్రాంచి 200 మందికి ఇవ్వాలని నివేదికలో వ్రాసినప్పటికీ, రుణప్రణాళిక విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి ఈ సంఖ్యను 100 మందికి తగ్గించారు. ఈ లెక్కన చూసినా రాష్ట్రంలో 8211 బ్రాంచీలలో 2997 బ్రాంచీలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. కనీసం 3 లక్షల కొత్తవారికి రుణసౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.కౌలుదారులకు రుణగుర్తింపు కార్డులిస్తామంటూ శాసనసభలో ప్రకటించారు. జిఓ విడుదల చేశారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తెస్తామంటున్నారు. ఆర్డినెన్స్ తెచ్చేదెప్పుడు? గుర్తింపుకార్డులిచ్చేదెప్పుడు? ఈ రోజు 40 శాతం సాగు భూమి కౌలు రైతులే చేస్తున్నారు. వీరికి రుణసౌకర్యం అందుబాటులో లేదు.
దీర్ఘకాలిక రుణాలు
2004 నుండి నేటి వరకు పరిశీలిస్తే దీర్ఘకాలిక రుణాలు కేటాయింపులకు మించి ఇస్తున్నట్లు కనబడుతుంది. వాస్తవానికీ కేటాయింపులలో 60శాతం ఏనాడూ మించలేదు. పాత పంటరుణాలనూ మధ్యకాలిక రుణాలుగా మార్చడం వలన ఆ రుణాలను దీర్ఘకాలిక రుణాల పద్దులో చేర్చి చూపుతున్నారు. ఉదాహరణకు.2010`11లో దీర్ఘకాలిక రుణాల కింద రు.4,460 కోట్లు కేటాయించగా ఆపద్దు కింద రు.17,701 కోట్లు ఇచ్చినట్లు ఈ రుణప్రణాళిక సందర్భంగా తెలిపారు. పాత పంటరుణాలను మధ్యకాలిక రుణాలుగా మార్చి ఇందులో చూపడం జరిగింది. వాస్తవానికీ కేటాయించిన దానిలో 60 శాతం మాత్రమే దీర్ఘకాలిక రుణాలు ఇచ్చారు. రైతులకు దీర్ఘకాలిక రుణాలే వ్యవసాయంపై ఆదాయం పెంచడానికి కీలకం.
పాతరుణాలను తిరగ రాయడం, పంపిణీ మొత్తాలను పెంచి చూపడం వలన లక్ష్యాలు నెరవేర్చినట్లు బ్యాంకులు చెప్పుచున్నాయి. ప్రతి జిల్లాలో బ్యాంకు ప్రతినిధులతో అఖిలపక్ష, నాయకుల సమావేశాలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. రుణం పొందిన వారి జాబితా, బకాయి పడినవారి జాబితా ఆ గ్రామ సభ్యులకు అందుబాటులో ఉంచాలన్న నిబంధన కొనసాగడంలేదు. దళిత,గిరిజనులకు మొత్తం రుణాలలో 15 శాతం ఇవ్వాలన్న రిజర్వుబ్యాంకు నిబంధన కాగితాలకే పరిమితం. బ్యాంకుల రుణప్రణాళికను అఖిలపక్షాల ఆమోదంతో మార్చిలోనే రూపొందించాలి. వాస్తవ సాగుదారుకు రుణం సకాలంలో అందించాలి. వాణిజ్యబ్యాంకుల, సహకారశాఖ రుణాలపైన సమీక్షలు సొసైటీ స్థాయిలో జరపాలి. అర్హులందరికీ ‘‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’’ ప్రకారం రుణసౌకర్యం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలి. ఆ విధంగా రుణ ప్రణాళికను సంస్కరించాలి.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment