‘‘2జి స్పేక్ట్రం(ధ్వని తరంగాలవేలం) సంబంధించి 1.70 లక్షల కోట్ల కుంభకోణం పార్లమెంట్‌ను స్థంబింపచేసింది. విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని మొత్తం పార్లమెంట్ శీతకాలపు సమావేశాలను పాలక పక్షం మినహా మిగతా పక్షాలన్ని ఏకతాటిపై నిలిచి స్థంబింప చేశాయి. తిరిగి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి అంగీకరించింది ప్రభుత్వం.’’ సంస్కరణల అనంతరం భారతదేశంలో జరిగిన కుంభకోణాలు లక్షల కోట్లలో జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల్లో కుంభకోణాలపై క్రమంగా చర్చ ప్రారంభమవుతున్నది. పాలక వర్గాలు కుంభకోణాలు విచారణకు రాకుండా వక్రమార్గం పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కామన్‌వెల్త్ ఆటల సందర్భంగానూ, కార్గిల్ మృత వీరుల కుటుంబాల కొరకు చేపట్టిన ఆదర్శ్ విల్లాల నిర్మాణంలోనూ, ఎస్ బాండ్(ధ్వని తరంగాలవేలం) వేెలం పాటల సందర్భంగా కుంభకోణాలు జరిగినట్లు దేశ వ్యాపితంగా చర్చ సాగుతున్నది. చివరకు ఐపిఎల్ క్రికెట్ పోటీల్లో కూడా కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఒకటేమిటీ వామపక్షేతర పాలన మినహా మిగిలిన రాష్ట్రాల్లో వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచుస్తున్నాయి. జార్కండ్ మంత్రి మధుకోడా గనుల కుంభకోణంలో ప్రస్తుతం జెళ్ళో విచారణ ఎదుర్కుంటున్నాడు. మధుకోడా లాంటీ వారు ప్రతి రాష్ట్రంలో పాలక వర్గంలో కొనసాగుతున్నారు.ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తాజ్‌కారిడార్ కుంభకోణంలో ఆరోపణలు వచ్చాయి.
కుంభకోణాలు చోటుచేసుకోడానికి గల ఆర్థిక, రాజకీయ పరిస్థితులు పెట్టుబడి వ్యవస్థలో అంతర్ భాగమై ఉన్నాయి. అందులో సంస్కరణలు వచ్చిన తరువాత కుంభకోణాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.ఉపాధి హామీపథకం,ఆరోగ్యశ్రీ,ఇర్రిగేషన్‌ప్రాజెక్టులనిర్మాణాలు,రహదారుల నిర్మాణం,ఔటర్ రింగురోడ్డునిర్మాణం,ఇందిరమ్మ ఇళ్ళనిర్మాణం,భూసేకరణ సందర్భంగా కుంభకోణాలు,రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ప్రముఖుల పాత్ర,సహకార బ్యాంకులలో వందలకోట్ల డిపాజిఉట్లు కాజేయడం, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు క్రటించిన రాయితీ పథకాలలో నగ్నంగా సాగుతున్న కుంభకోణాలు రుజువులున్నప్పటికి బాధ్యులు పాలక పక్షంలోనే కొనసాగుతున్నారు.ఏ ఆర్థిక రంగంలో ,చూసినా కుంభకోణాలు నిత్యకృత్యమైనాయి. వేలకోట్లు అర్జించి వ్యాపారాలు వెలగబెట్టడంతో బాటు రాజకీయ రంగంలో కూడా ఎన్నికవుతున్నారు. ఎలాంటి అనర్హత వీరిపై పడలేదు. మనదేశంలో కుంభకోణాలు ఎప్పటి నుండి కొనసాగుతున్నాయి? ఆంగ్లేయుల కాలంలో జరిగిన అవినీతి కార్యక్రమాలకు బ్రిటీష్ పార్లమెంటు చర్చించి బాధ్యులను శిక్షించిన ఘటనలు చరిత్రలో చూశాం. కాని 1947 స్వాతంత్య్రానంతరం జరిగిన కుంభకోణాలు పాలక వర్గాల కనుసన్నలలో జరిగినవే.నేడు క్రోనీ క్యాపిటలిజం కొనసాగుతున్నది.
1957లో ‘‘ముంద్రా’’ కుంభకోణం నెహ్రూ హయాంలోనే బయట పడిరది. ముంద్రా అన్న పెద్ద మనిషి విద్యుత్ పరికరాల వ్యాపారీ. ఇతని ఆస్తి 1 కోటీ 50 లక్షలు కాగా అప్పులు 5 కోట్ల25 లక్షలు. ఇతను తన అప్పులు తీర్చుకోడానికి తన కంపెనీలో వాటా షేర్లను జీవిత భీమాసంస్థ కోనుగోలు చేసేట్లు మరియు కోటీ రూపాయలు అప్పు ఇచ్చేట్లు జిఆర్ కామత్ నాటి జీవిత భీమా సంస్థ చైర్మెన్ మరియు ఆర్థిక మంత్రి టి.టి.కృష్టమాచార్యులుతో కుమ్మకై కుంభకోణానికి పాల్పడ్డారు. ఫీరోజ్‌గాంధీ ఈ కుంభకోణాన్ని బయటకు లాగి పార్లమెంట్‌ను ఆశ్చర్యం ` ఆందోళనలో ముంచెత్తారు. ఈ అవకతవకలను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ వారికి విరాళం ఇచ్చినట్లు చెప్పుకున్నారు. అప్పుడు ప్రారంభమైన ఈ కుంభకోణంతో నేటి వరకు కుంభకోణాల పర్వం సాగుతునే ఉంది. 1971 మే 24 తేదీన నగర్వాల ఉదంతం (కుంభకోణం) పెద్ద సంచలనం రేపింది. ఇందిరగాంధీ హయాంలో ఢీల్లిలో పార్లమెంట్ వీధిలోని స్టేట్‌బ్యాంకు బ్రాంచీలో పని చేస్తున్న క్యాషియరు ప్రకాష్ మల్హోత్రాకు పరిచయమైన ప్రధాని ఇందిరాగాంధీ గొంతులాగా రూ.60 లక్షలు కోరినట్లు ఫోన్ వచ్చింది. కొరియరు వచ్చి డబ్బు తీసుకొని, ప్రధాని ఇంటికి వెళ్ళి రశీదు తీసుకొమ్మనాడు. మల్హోత్రా ప్రధాని ఇంటికి వెళ్ళితే ఆమె పార్లమెంట్‌కి వెళ్ళిందన్నారు. ప్రధాని, కార్యదర్శి మేము ఫోన్ చేయలేదని రశీదు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నగర్వాలాను అరెస్టు చేసారు. 6వేలు తప్ప మిగతా పైకం అంతా స్వాధీనం చేసుకున్నారు. కేసు అంగీకరించిన నగర్వాలాకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడిరది. కేసు పునర్వి విచారణ జరుగుతుండగా నగర్వాలా గుండె జబ్బుతో మరణించారు. దీనిపై పార్లమెంట్‌లో ఒక క్యాషియర్ గతంలో ఎలాంటి సంబంధం లేకుండా ఇంత డబ్బు ఏలా ఇవ్వగలిగాడు అన్న విషయం పార్లమెంటులో చర్చకు వచ్చింది. కాని తరువాత కేసు ముసివేయబడిరది.
జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసును తిరిగి విచారించడానికి జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డిని నియమించారు. ఫోన్ కాల్ మీద 60 లక్షలు ఒక సామాన్య క్యాషియర్ ఇస్తారా? అలా ఇచ్చాడు అంటే గతంలో ఈ విధంగా ఎన్ని సార్లు ఇచ్చాడు. నగర్వాలా మరణం సహజమైనదా? ఈ విషయాలన్ని పరిశీలన లేకుండానే కేసు ముగిసింది.
ఆ తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి అబ్దుల్ రహమాన్ అంతూలే ‘ఇందిరా గాంధీ ప్రతిభా ప్రతిష్టాను’ ట్రస్టును ఏర్పరచిన కుంభకోణం వెలుగుచూసింది. 1980లో జపాన్‌కు చెందిన ‘‘కువో’’ అయిల్ కంపెనీ భారత్‌కు పెట్రోల్, డిజీల్ టెండర్లపై 9కోట్ల కుంభకోణానికి పాల్పడిరది. వీటన్నింటిని మించినది బోఫోర్స్ కుంభకోణం స్వీిడన్ నుండి 1,700 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వందల హెవిట్జర్ శతఘ్నులు కొనుగోలు సందర్భంగా కుంభకోణం జరిగింది. 1986 ఏఫ్రిల్ 16న స్వీిడన్ రెేడియో ఈ ముడుపుల వార్తను ప్రకటించింది. ఇందులో రాజీవ్‌గాంధీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 2010 వరకు విచారణ సాగింది. ఇందులో బోఫోర్స్ మాజీ అధ్యక్షుడు, విన్ చద్దా, జెడి హిందూజాతో సహా 14 మందిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ చేసింది. 64కోట్ల కమిషన్ ఏజెంట్లకు ముట్టే అవకాశం ఉన్నట్లు విచారణ అంశాలలో ఉంది.ఈ కేసులో ప్రధాన మద్దాయిగా ఇటలీ ఆయుధ వ్యాపారి అట్టావోఖత్రోకి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.అతనిని భారత దేశం తీసుకు రావడానికి నేటికి ప్రభుత్వం రు.250 కోట్లు వ్యయం చేసింది.అయినా అంతర్జాతీయ చట్టాలు అతనికి రక్షణ కల్పిస్తున్నాయి.విసిగిపోయిన భారతీయ అధికారులు అతనిని భారత్ రప్పించడం కష్ట సాధ్యమని 2011 మార్చి 5న కేసును మూసి వేశారు. ఇటలీ బహుళజాతి సంస్థలు రాజీవ్ గాంధీ హయాంలో తమ అక్రమ వ్యాపారాలను విస్తరించుకొని లాభాలార్జించాయి. నేటికీ ఇటలీ వ్యాపార సంబందాలు కొనసాగుతూనే ఉన్నాయి.
1992 మార్చిలో సెక్యురిటీ కూపన్ ధరలు పెరిగిన సందర్భంలో హర్షద్‌మెహత కుంభకోణం బయటపడిరది. 649 కోట్ల సెక్యురిటీల బకాయి పడ్డారు. 1992 ఏప్రిల్ 13`24 మధ్య 620 కోట్లు బ్యాంకులకు చెల్లించారు. ఇంత మొత్తాన్ని ఒకే సారి ఎలా చెల్లించగలిగాడు అన్నది చర్చనీయాంశం అయింది. అ సందర్భంగా కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసిన అనేక మంది దివాలా తీసారు. 3,000కోట్ల అవకతవకలకు సంబంధించిన పత్రాలతో నరొత్తం, హితేన్‌దళాలకు ప్రధాన పాత్ర ఉన్నట్లు సిబిఐ విచారణలో తెలింది. 1992 జూన్‌లో పార్లమెంట్ సభ్యులు రాం నివాస్ మీర్ధా నాయకత్వాన సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. కొందరికి చిన్న, చిన్న శిక్షలు పడ్డా వేలాది మంది వాటాలు కొని దివాళా తీసారు.
రైల్వే శాఖా మంత్రి జాఫర్ షరీప్ కాలంలో (1991) స్వీజర్లాండ్ నుండి 6,000 హెచ్‌పి సామర్థ్యం గల 30 రైల్ ఇంజన్లు కొనుగోలు కుంభకోణం చోటు చేసుకుంది.
‘ఇస్కో’ను (ఇండియన్ ఐరన్ అండ్ స్టీిల్ కంపెనీ) ప్రైవేటీకరించేందుకు 1992 జూలై 11న కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ప్రపంచ వ్యాపిత టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఎంపికలో కుంభకోణం జరిగింది.
సంస్కరణల పేర ప్రభుత్వ రంగ సంస్థలోని వాటాల విక్రయాలకు డిజ్ ఇన్‌వెస్ట్‌మెంట్ (ఉపసంహరణ) మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మరియు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తమ నివేదికలలో ఈ వాటాల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్షించారు. రూ.3,442కోట్ల నష్టం జరిగినట్లు 1993 జూలై 18న పీపుల్స్ డెమోక్రసీ వెల్లడిరచింది. కొచ్చిన్ రిఫ్తెనరీస్ లిమిటెడ్, అలహదాబాద్ బ్యాంకుతో పాటు మరొక్క 8 సంస్థలు ఇందులో ఉన్నాయి. లాబాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ వాటాలను అప్పనంగా అతి తక్కువ ధరలకు ప్రైవేటు కంపెనీల పరంచేస్తున్నారు. నాల్‌కొ, బాల్‌కొ లాంటి అల్యూమినియం సంస్థలు కూడా చేరి ఉన్నాయి.
దేశంలో నవరత్నలుగా పేరుపొందిన ప్రభుత్వ రంగ సంస్థలు:
భారత్ హెవి ఎలక్ట్రీకల్స్ , భారత్ పెట్రోలియం కార్పొరేషన్
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ , మహానగర్ టెలికం
ఇండియన్ పెంట్రోలియం కార్పొరేషన్ . (ఇందులో రియలన్స్ కంపెనీకి ఎక్కువ వాటాలు అమ్మారు.)
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ . ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా
విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (సంస్థలలోని వాటాలను టాటా వారికి అతి తక్కువ రేట్లకు అమ్మకాలు చేశారు.)
వీటన్నింటిని మించినది హవాలా కుంభకోణం. విదేశీ మారకం కావల్సిన వారు చట్ట బద్దంగా కాకుండా బ్లాక్ మార్కెట్లలో రూపాయాలను విదేశీ దనంలోకి మార్చడానికి సంబంధించిన హవాలా కుంభకోణంలో అనేక మంది కేంద్ర మంత్రులకు సంబంధం ఉన్నట్లు విచారణలో తెలింది.1991 మార్చి 25వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈకుంబకోణంలో జైన్ సోదరులు ప్రథాన పాత్ర వహించగా భారత మాజీ ప్రధాని పి.వి నరసింహారావుతో పాటు రాజీవ్ గాంధీ,బజన్‌లాల్,ఎల్‌కె అధ్వానీ మదన్‌లాల్‌ఖురానా ఆర్‌కె ధావన్‌లతో పాటు మెజారిటీ కేంద్ర మంత్రులకు ఈ కుంభకోణంలో ముడుపులు ముట్టినట్లు వెల్లడైంది. ఈశాన్య భారతదేశంలో చేప్పట్టిన అభివృద్ధి కార్యక్రమంలో 63 వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్లు బిజెపి అధ్యక్షులు నితిన్ గడ్కరీ సాక్ష్యాలతో సహ ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు. ఆరుణాచల్ ప్రదేశ్‌లో 4లక్షల కోట్లు విలువైన పేరులేని జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిచ్చి అక్కడి కాంగ్రెస్ నేతలు లభ్ధిపొందారు.
ఆదర్శ కుంభకోణం :
కార్గిల్ యుద్దం తరువాత 1999లో ఆదర్శ హౌసింగ్ సొసైటీని మహరాష్ట్రలో స్థాపించారు. ఆదర్శ్ కుంభకోణంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు మరియు ఉన్నతాధికారుల చేతులున్నట్లు రుజువులు దొరికాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రులైన అశోకు చావన్‌తో పాటు విలాస్‌రావు దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే, ఉప ముఖ్యమంత్రి నారాయనా రాణే భాగస్వాములుగా ఉన్నారు. కార్గిల్ యుద్దంలో మరణించిన అమర వీరులకు కొరకు నిర్మాణం గావించిన 31 అంతస్తుల భవనంలో ఫ్లాట్ల కేటాయింపులలో ఈ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. 10 కోట్లు విలువగల విల్లాలను 60`70 లక్షలకులోపు విలువలకు అక్రమార్కులకు కట్టాబెట్టారు. ఆదర్శ సొసైటీ సభ్యులకు విక్రయించిన ఫ్లాట్లలో ఒకటి కూడా యుద్ద వీరుల భార్యలకు గాని, వారి కుటుంబ సభ్యులకు గాని కేటాయించలేదు. విచారణ కొనసాగుతూనే ఉంది.
ఐపిఎల్ కుంభకోణం :
క్రికెట్ ఆటలకోసం ఏర్పాటు చేసిన ఐపిఎల్ సంస్థలో కుంభకోణం చోటు చేసుకున్నది. దీనిపై వచ్చిన ఆరోపణలకు కేంద్ర మంత్రి శశీధరూ రాజీనామ చేశారు. ఆటల టీంలను వేలానికి పెట్టారు. ఒక్కొక్క టీం 1,500 కోట్ల ధర పలికింది. ఈ వేలంలో చాల మంది భినామీ పేర్లతో పాల్గొని వందల కోట్లు సంపాధించారు.
చక్కెర కుంభకోణాలు :
1993లో భారత ఆహార సంస్థ కోర్కె మేరకు 6 లక్షల టన్నుల చక్కెర దిగుమతి కై 300 కోట్ల విలువగల గ్లోబల్ టెండర్‌లను పిలిచాడు. నాటి ఆహార శాఖా మంత్రి కల్పనాథ్ రాయ్ చక్కెర మిల్లు యజమానుల ప్రయోజనాలను కాపాడడానికి టెండర్లు పిలిచినా ఆహార శాఖ కార్యదర్శి అశోక్ చంద్రసేన్‌ను మందలించి దిగుమతులు జరుగకుండా అడ్డు పడ్డాడు.దిగుమతును అడ్డు కోవడం ద్వారా మంత్రి మిల్లు యజమానులతో కుమ్మక్కయ్యాడు.స్థానికంగా చక్కెర ధర కెజి రు.1.75 పెంచడం వల్లప్రజలపై రు. 230 కోట్ల భారం పడిరది.తిరిగి 2010లో కేంద్ర వ్యవసాయశాఖా మాత్యులు శరద్‌పవార్ నేతృత్వంలో దేశీయ పంచదారను కిలో రు. 14 చొప్పున ఎగుమతి చేసి, రు.28ల చొప్పున దిగుమతులు చేసుకున్నారు. ప్రతి ఎగుమతి` దిగుమతుల సందర్భంగా కుంభకోణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
బిజెపి నేతృత్వంలో జరిగిన కుంభకోణాలు :
కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.
ఆమరావతి లేఅవుట్‌లో ముఖ్యమంత్రి కుమారులు, అల్లుళ్లకు 15కోట్ల విలువైన భూమిని కేవలం రు.1 కోటి రూపాయలకే కట్టాబెట్టారు. బాణశంకరిలో రు.175 కోట్ల విలువైన భూమిని తన కుమారులు భాగస్వాములుగా ఉన్న సంస్థకు డినోటిఫై చేశారు. ఒక పారిశ్రామిక లే అవుట్ లో తన కుమారులు, అల్లుళ్ళు డైరెక్టరుగా ఉన్న ఫ్లూయిడ్ పవర్ టెక్నాలజీస్ అనే సంస్థకు, అది ఏర్పడిన కేవలం 15 రోజులకు 2 ఎకరాలు భూమిని కేటాయించాడు. దాని విలువ రు.8.5 కోట్లు, కాని వారు చెల్లించింది. రు.84 లక్షలు . బెంగుళూరుకు 55కిమీ దూరంలో ఒక బిపిఓ స్థాపించడానికి తన కుమారైకు2 ఎకరాలు కేటాయించాడు. దానికి చెల్లించింది రు.40 లక్షలు. కాని దాని విలువ రు. 2కోట్లు. ఆమెకే బెంగుళూరులో నిబంధనలకు విరుద్దంగా ఒక నివాస స్థలాన్ని కూడా కేటాయించారు. . ఆయన తన చెల్లెలుకు, మేనల్లునికి రు.5 కోట్ల విలువైన స్థలాలను కట్టబెట్డాడు. మరొక వ్యవహారంలో రు.181 కోట్ల విలువైన 11.25 ఎకరాల భూమిని డీనోటిఫై చేసి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు నామమాత్రపు ధరకు విక్రయించారు.దానిలో రు.39 కోట్ల విలువైన భూమిని ఆయన కుమారుడు నిర్వహిస్తున్న కంపెనీలో భాగస్వాములుగా ఉన్న వారికి కేవలం రు.3 కోట్లకు అమ్మారు. రు.13 కోట్ల విలువైన 2.05 ఎకరాల మరొక ప్లాటును కేవలం రు.2.20 కోట్లకు విక్రయించారు.
ఇన్ని కుంభకోణాలు బయటపడ్డ తర్వాత సైతం కర్ణాటక ముఖ్యమంత్రిగా తనకు అధిష్టానం ‘ఆశీస్సులు’ ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటున్నాడు.
దేశ స్థాయిలో టెలికంలో 2జి స్పెక్ట్రం 1లక్షా 70వేల కుంభకోణం, కామన్‌వెల్త్ ఆటల నిర్వహణకు భవన నిర్మాణంలో జరిగిన కుంభకోణం ఎస్.బాండ్ వెలంలో జరిగిన 1.5లక్షల కోట్లా కుంభకోణాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో కుంభకోణాలు :
1998 నుండి 2004 వరకు జరిగిన కుంభకోణాలు :
1. నకీలీ స్టాంపుల కుంభకోణం 5వేల కోటు
2. అర్ధంతరంగా మూసివేసిన అర్భన్ బ్యాంకుల డిపాజిట్ల్ 2వేల కోట్లు
3. నీరు ` మీరు పథకంలో 1,600 కోట్లు
4. వాటర్ షెడ్ పథకంలో 2,000 కోట్లు
5. పనికి ఆహారం పథకంలో 560 కోట్లు
6. ప్రభుత్వ సంస్థల అమ్మకం 400కోట్లు
7. మద్యం అక్రమాలు 600 కోట్లు
8. సోమశీల భూముల కుంభకోణం 112కోట్లు
9. స్కాలర్ షిప్ అవినీతి 100కోట్లు
10. ముఖ్యమంత్రి సహయ నిధి 10 కోట్లు
11. విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీ స్థలం 50 కోట్లు
12. టూరిజం స్థలాలకు 350 కోట్లు
13. మదాపూరు రహెజా భూముల సమస్య 50 కోట్లు
14. ఏలేరు భూములు కుంబకోణం 100 కోట్లు
15. టైమర్ల కుంబకోణం 30 కోట్లు
16. సింహచలం భూములు 144 ఏకరాలు.
మొత్తం రూ.12,367 కోట్లు కుంబకోణాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి ఏకంగా చందారెడ్డిగా ప్రసిద్ది కెక్కాడు.మరో మాజీ ముఖ్యమంత్రి జనార్దన్‌రెడ్డి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని లక్ష్మీ పురం గ్రామం రాజుపాలెంలో విలువైన గ్రానైట్ నిక్షేపాలు కలిగిన 60 ఎకరాల మిగులు భూమిని తమ కుమారుడు రాం కుమార్ రెడ్డికి చెందిన ఆక్రోఫోలాన్,రీటా ఇండస్ట్రియల్ కార్పోరేషన్,ఉపేంద్ర గ్రానైట్స్, పల్లరా గ్రానైట్స్ సంస్థలకు నామమాత్రపు కౌలుకు కట్టబెట్టారు. 1990 అక్టోబర్ 10వ తేదిన కడపజిల్లా మంగం పేట బైరైటీస్ గనుల తవ్వకానికి నెలకు 34000 టన్నుల ముడి ముగ్గురాయి తవ్వకానికి ప్రయాక్స్ కంపెనీ ఇండియన్ బైరైటీస్ కంపెనీలతో ఆంద్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో వైఎస్ కుటుంబం కీలకంగా ఉంది. రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రీ కుంభకోణాలకు దూరంగా లేరు.
2004 మేలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ హయాంలో వేలాది కోట్ల కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని డెరెక్టర్ ధనుంజయ ‘రాజీవ్ ఉద్యోగ శ్రీ’ పేర ముడుపులు వసులు చేశారు. సత్యం కంపూటర్స్ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిరది. అనంతపురంలో వేరుశనగల విత్తనాల పంపిణిలో కుంభకోణం, మిక్కింగ్ ప్లాంట్లకు సబ్సిడీ ఏరువులను సరఫరా సంఘటన, ఎంఆర్ ప్రాపటిస్ భూముల కుంభకోణాలు చొటు చేసుకున్నాయి. ఓబుళాపురం మైన్స్, బయ్యారం మైన్స్ (1.40 లక్షల ఏకరాలు) నుండి వేల కోట్ల ఖనిజ సంపద విదేశాలకు తరలిపోయింది. గాలి జనర్థన్ రెడ్డి సోదరులు (కర్ణాటక బిజెపి ప్రభుత్వంలో మంత్రులు) ముఖ్యమంత్రి బంధువు పేరుతో వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఇందిరమ్మ ఇళ్ళలోనూ, ఉపాధి హామీ పథకంలోనూ, ఆరోగ్య శ్రీ అమల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. సహకార సంస్థల్లో వేల కోట్లు పాలక వర్గాలు కాజేసాయి. చివరకు సర్వశిక్షా అభియాన్ (అందరికి విద్య)లో మాజీ ముఖ్యమంత్రిని నిరంతరం వెన్నంటి ఉండే వ్యక్తి కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాడు. మత్స్య శాఖలో ఇంజనీరు ఎలుగుబంటి సూర్యనారాయణ పాల్పడి కుంభకోణం నేటికి పరిష్కరించబడలేదు. నెల్లూరు జిల్లాలోని కిసాన్ సెజ్‌కు సంబంధించి 2,776 ఎకరాల భూముల సేకరణలో రైతుకు 40 వేలు ఇచ్చి ఎకరాకు 40 లక్షలు యాజమాన్యం కోరుతున్నది. వాస్తవానికి ఇప్పుడు ఎకరాకు 20లక్షల ధర పలుకుతున్నది. 1993లో ఈ భూముల సేకరణ జరిగింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు, అల్లూరు, దగదర్తి మండలలో భూ సేకరణ జరిగింది.
ఎపిఐఐసి కొనుగొలు చేసిన భూములను నామమత్రం ధరలకు కంపెనీలకు కట్టబెట్టటంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది.
అవినీతి`కుంభకోణాల పై విచారించి చర్యలు తీసుకోవడానికి సిబిఐ,స్పెషల్ బ్రాంచ్,అవినీతి నిరోధక శాఖమరియు ప్రతీ ప్రభుత్వ శాఖలో గల విజిలన్స్ వ్యవస్థలు ఉన్నప్పటికి కుంభకోణాలు జరిగిపోతూనే ఉన్నాయి.ముఖ్యంగా సంస్కరణల అనంతరం భూకుంబకోణాలు వేల కోట్లలో సాగుతున్నాయి,రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు పేదరైతులనుండి సేకరిస్తున్నది. ఇందులో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. చివరికి ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణములో కూడా ‘‘గ్రీస్ ఆన్ వీల్స్’’ మరియు ‘‘కిక్`బ్యాక్స్’’ పేర అవినీతిని పాలక వర్గాలలోనే ప్రోత్సహిస్తున్నారు.
దేశంలో నేడు జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాల పై జరుపుతున్న విచారణలన్నీ ఫలితాన్ని సాధించ లేనివే. ప్రజలు చైతన్య వంతులై ఎదిరించనంత కాలం అవినీతి ` కుంభకోణాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇందుకు బలమైన ఉద్యమాన్ని నిర్మించడమే మన కర్తవ్యం.

తేది: 13.03.2011
సారంపల్లి మల్లారెడ్డి
No comments:
Post a Comment