‘‘ రిటేయిల్‌లో నేరుగా విదేశీ పెట్టుబడి రాకతో పొలంలో పండిన ఉత్పత్తులు నేరుగా స్టోర్స్‌కు చేరుతాయి. వృధా గనణీయంగా తగ్గుతుంది. రైతులు మెరుగైన ప్రతిఫలాన్ని తగురీతిలో పొందుతారు.’’ భారత వాణిజ్య మరియు పరిశ్రమల మత్రిత్వ శాఖ పై నినాదంతో పూర్తిపేజీ ప్రకటన పత్రికలకు విడుదల చేసింది. ఈ నెల 27న విడుదల చేశారు. కోల్డ్‌స్టోరేజీల నిర్ణాం, వేర్‌హౌజింగ్‌ల నిర్మాణంతో నాణ్యత గల నిలువ సౌకర్యాన్ని పెంపుదల చేస్తామని అదే ప్రకటనలో భారత ప్రభుత్వం తెలిపింది.
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ నుండి నిధులు కేటాయించాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనలకు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల నిర్వహణకు నిధులు కేటాయించాలి. ఎగుమతి, దిగుమతుల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. పై నిబంధనలు రాజ్యంగంలో రచించబడినాయి. ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలోకి ‘‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను’’ ఆహ్వానిస్తున్నది. 1995నాటి నుండి అమలు జరుగుతున్న సంస్కరణల నేపథ్యంలో వ్యవసాయ రంగ పెట్టుబడుల నుండి క్రమంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. ముందు దేశీయ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రస్తుతం విదేశీ గుత్త సంస్థల పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయి. విత్తన రంగంలో 80శాతం పెట్టుబడులు మోన్‌శాంటో, సింజెంటా, డూపాయింట్, కార్గిల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా ప్రభుత్వం తన నియంత్రణను కోల్పోయి ఆ సంస్థల దయాదాక్షిణ్యాలకు రైతులను బలపశువులను చేసింది. ఈ గుత్త కంపెనీల ప్రవేశంతో విత్తన ధరలను 10 రెట్టకు పైగా పెంచడం, నాణ్యతలేని విత్తనాలు సరఫరా చేయడం, స్థానిక విత్తనాలను మార్కెట్‌లో లేకుండా చేసే చర్యలు కొనసాగాయి. క్రిమిసంహారక మందుల ఉత్పత్తులు వారి చేతుల్లోనే ఉన్నాయి. వీటికి కనీస రీటేయిల్(చిల్లర ధర) నిర్ణయం బాధ్యత కంపెనీలదే. ఒక్కో లీటర్‌కు రు.3000నుండి రు.4000 వరకు నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి అగుతున్న ఎరువుల సామర్థ్యాన్ని తగ్గించి దిగుమతులపై ఆధారపడుతున్నారు. 2006`07లో 28.76 లక్షల టన్నుల డిఎపి దిగుమితి చేసుకోగా 2010`11లో 68.12లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాం. దేశీయ ఉత్పత్తులు 2006`07లో 48.52లక్షల టన్నుల నుండి 2010`11లో 39.58 లక్షల టన్నులకు తగ్గించారు. ప్రభుత్వ రంగంలో సహకార రంగంలో గల ఎరువుల ఉత్పత్తి కేంద్రాలను మూసి వేశారు. మార్కెట్ల చట్టాలను సంస్కరణలకు అనుగుణంగా కాంట్రాక్టు ఫార్మింగు, డైరెక్టు మార్కెటింగ్‌కు మరియు ప్రైవేటు మారెటింగ్‌లకు అవకాశం కల్పిస్పూ చట్ట సవరణలు చేశారు. ప్రభుత్వ జోక్యం కానీ, నామినేట్ చేసిన మార్కెట్ కమిటీల జోక్యం కానీ ఉండదు.
ఈ విధంగా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ఉత్పత్తి, ధరల నిర్ణయం, పంపిణీ పూర్తిగా బహుళజాతి సంస్థల చేతుల్లోకి చేరిపోయింది. మార్కెట్లలో కేంద్రం నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధరల అమలుకు బాధ్యత లేకుండా ప్రభుత్వం మార్కెట్లను ప్రైవేటీకరించింది. గతంలో ‘‘ఫ్యూచర్ ట్రేడిరగ్, ఫార్వర్డ్ ట్రేడిరగ్ వ్యాపారం’’ ద్వారా రైతుల ఉత్పత్తులకు భారీగా ధరలు పెరుగుతాయని ఇదేమాదిరిగా ప్రచారం చేశారు. ఫార్వర్డ్ కాంట్రాక్టు అయితే నూర్పిడి తర్వాత మొత్తం సరుకు తన మిల్లుకే తోలాలని ఒప్పందం కుదుర్చు కోవడం, ఫ్యూచర్ ట్రేడిరగ్ అనగా సరుకు మారకం లేకుండానే నిర్ణయించుకున్న ధర చెల్లించడం జరుగుతుంది. ఈ రెండు విధానాల ఫలితంగా మధ్యదళారులైన వ్యాపారులే లబ్దిపొందారు తప్ప గత దశాబ్ద కాలంగా ఈ విధానం వల్ల ధరలు పెరిగింది లేదు. ఈ వ్యాపారం కింద 2010సంవత్సరంలో నవంబరు నాటికి 95 లక్షల కోట్ల వ్యాపారం సాగినట్లు 2010`11 ఎకనామిక్ సర్వే తెలిపింది. ఈ వ్యాపారంలో మధ్యదళారీలకు లబ్ది కలిగిందే తప్ప వ్యవసాయదారులకు కనీస మద్దతు ధరలు కూడా లభించలేదు.
2004`05 స్థిర ధరల ప్రకారం 2009`10లో దేశీయ వ్యవసాయరంగంలోకి పెట్టుబడులు రు.1.34 లక్షల కోట్లు రాగా ఉత్పత్తి 6.57 లక్షల కోట్ల విలువ గల ఉత్పత్తులు వచ్చాయి. క్రమంగా వ్యవసాయ ఉత్పత్తి రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగిన విధంగానే మార్కెట్ రంగంలో కూడా రావడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతున్నది. ఈ పెట్టుబడుల రాకతో ఆ సంస్థలు నిర్దేశించిన పంటలు మాత్రమే పండిచాల్సి వస్తుంది. ఆహారధాన్యాల ఉత్పత్తిని తగ్గిస్తూ ఎగుమతి ఆధారిత వ్యాపార పంటల ఉత్పత్తికి విదేశీ పెట్టుబడులు ప్రోత్సాహం కల్పిస్తాయి. అందుకనుగుణంగానే వ్యవసాయ పంటల ఉత్పత్తులలో ఇప్పటికే మార్పులు చోటుచేసుకున్నాయి. సబాబుల్, జామాయిల్, పండ్లతోటలు, పూలతోటలు, ఔషదమొక్కలు, ఆయిల్‌ఫాం, సోయా లాంటి ఆహారేతర పంటల విస్తీర్ణం పెరిగింది. ఇంకా పెంచడానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ పంటలు పండిరచే వారికి మార్కెట్ గ్యారింటీ సౌకర్యం లేక దివాళా తీశారు. 2006`07లో దేశీయంగా 217.30 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2009`10 లో 218.20 మి.టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినాయి. తలసరి వినియోగం రోజుకు ఇదే కాలంలో 412.8 గ్రా॥ నుండి 407 గ్రా॥కు తగ్గింది.(ఎకనామిక్ సర్వే2010`11) విదేశీ రుణ భారం వ్యవసాయరంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. కేంద్ర బడ్జెట్ రు.12.57 లక్షల కోట్లకు సమానంగా విదేశీ రుణ భారం పెరిగింది. ఫలితంగా వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గుతున్నాయి. 2010`11లో రు.10933కోట్లు కేటాయించగా, 2011`12 లో రు.9662 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎరువుల సబ్సిడీని గత మూడు సంవత్సరాలలో రు.74 వేల కోట్ల నుండి రు.54 వేల కోట్లకు తగ్గించారు. బహుళజాతి సంస్థల ఒత్తిడి వల్లనే ఎరువుల రంగంలో మూలకాల ఆధారిత సబ్సిడీ అను కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి రైతులపై మూడు సంవత్సరాలలో రు.20 వేల కోట్ల భారాన్ని పెంచారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు, ఆహారధాన్యాల ప్రాసెసింగ్ రంగం, మైక్రోఇరిగేషన్ రంగాలలోకి పెట్టుబడులు వచ్చాయి. భూముల కొనుగోలు, ఫార్మ్ హౌజ్‌ల ఏర్పాటు, డైరీ పరిశ్రమల్లోకి, చేపల వ్యాపారంలోకి, ఫౌల్ట్రీ రంగంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ రంగాలలోని ఉత్పత్తి దారులకు కనీస ఉత్పత్తి వ్యయం రాక దివాళా తీస్తున్నారు. పెట్టుబడి లాభాల కొరకు వస్తుందే తప్ప సేవా దృక్పథంతో కాదన్నది ఈ సమాజ లక్ష్యం. అందుకు భిన్నంగా ఉత్పత్తిదారులకు లాభాలు వస్తాయని మోసగించడం జరుగుతున్నది.పెట్టుబడిదారుల స్వంత ప్రచార, ప్రసార సాధనాలు కూడా ఉత్పత్తిదారులను భ్రమలు పుచ్చే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్, స్పెన్సర్, కాష్ అండ్ కారీ, మెట్రో, ఫుడ్‌వర్‌ల్డ్, హరియాలి లాంటి సంస్థలు రైతుల నుండి వారి ఉత్పత్తులను తక్కువ ధరలకు కొని విపరీతంగా లాభాలు గడిస్తున్న వాస్తవాన్ని చూస్తున్నాం. టమాటా కిలో రు.2`4కు కొనుగోలు చేసి, రు.20`40కి అమ్ముతున్నారు. బియ్యం, పప్పులు, నూనెలు లాంటి ఉత్పత్తులపై కోట్లాది రూపాయల లాభాలు సంపాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మల్టీ బ్రాండ్ వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో వస్తున్న బెస్ట్‌బై, వాల్‌మార్ట్, క్యారీఫోర్ మరియు టిస్కో లాంటి ప్రపంచ అంతర్జాతీయ దిగ్గజాలకు ఆహ్వానం పలికితే సాధారణ ఉత్పత్తిదారుడు జాడలేకుండా పోతాడు. ఎఫ్‌డిఐ నుండి సహాయం పొందిన చిల్లర వర్తకులు చిన్నతరహా ఉత్పత్తిదారుల నుండి అన్ని ఉత్పత్తులలో 30 శాతం ఉత్పత్తులు సేకరిస్తామని, తద్వారా వీరి ఉత్పత్తులకు ధరలు పెరుగుతాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. 70 శాతం ఉత్పత్తులు విదేశాల నుండి దిగుమతులు చేయవచ్చు. ఆ విధంగా దేశీయ వ్యాపారం దిగుమతులపై ఆధాపడాల్సి వస్తుంది. దేశీయ స్వయం సమృద్ధ ఉత్పత్తికి భంగం వాటిల్లుతుంది. దేశీయ ఉత్పత్తిని చిన్నాభిన్నం చేస్తుంది. నేడు 80 దేశాలలో ఈ గుత్త సంస్థలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. ఉత్పత్తిదారులకు ధరలు పెరిగితే ఆ దేశాలలో ఎందుకు ఆందోళనలు సాగుతున్నాయి. ఇటు ఉత్పత్తిదారుని నుండి అతితక్కువ ధరకు కొనుగోలు చేసి వినయోగదారులకు అతి ఎక్కువ ధరలకు (ప్రభుత్వ నియంత్రణ తొలగించడం ఫలితంగా) అమ్మి లాభాలు గడిస్తారు. వినియోగదారుడు చెల్లించే ధరలో ఉత్పత్తిదారుని వాటా కనీస స్థాయికి తగ్గిస్తారు. సమస్య ఇంత నగ్నంగా ఉన్నప్పటికీ పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులు లబ్దిపోందుతారని ప్రచారం చేయడంలో వాస్తవం ఉందా? దేశీయంగా ఇప్పటికే కోట్లాది మంది వీధి వ్యాపారులు, చిల్లర వ్యాపారులు వ్యాపారం విరమించుకొని ఉపాధి కోల్పోయారు. భూముల ధరలు పెంచి రైతులను భూముల నుండి దూరం చేస్తున్నారు. ఇప్పటికీ ఎవరైనా భూమిని అంటిపెట్టుకొని ఉంటే వారిని, వారి ఉత్పత్తులకు ధర రాకుండా చేసి భూముల నుండి దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బహుళజాతి గుత్త సంస్థలకు తలుపుల బార్లా తెరిచి ఆహ్వానిస్తున్నది. ఆత్మహత్యా సదృష్యమైన ఈ విధానాన్ని విరమించుకునే వరకు ఆందోళనలు సాగాలి.
సారంపల్లిమల్లారెడ్డి
తేది.27.11.2011

No comments:
Post a Comment