2012`13 సంవత్సర బడ్జెట్ 1,46,854 కోట్లతో ఘనంగా రూపొందించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి నేడు శాసనసభలో ప్రకటించారు. గత సంవత్సరంపై అదనంగా 17వేల కోట్లు పెంపుదల చేస్తూ ప్రకటించారు. అందులో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని, రానున్న కాలంలో వ్యవసాయోత్పత్తులు బాగా పెరుగుతాయని, ఉత్పత్తి రేటు 4శాతం సాధిస్తామని ఆర్థిక నివేదికలో చెప్పారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.
2012`13 వ్యవసాయ బడ్జెట్ రు.2572 కోట్లుగా చూపారు. గత సంవత్సరం 2662 రూపాయలుగా ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ రూపొందించారు. గత బడ్జెట్‌పై కోత విధించినట్టు స్పష్టమవుతున్నది. దీనికి తోడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి క్రింద రు.560 కోట్లు కేటాయించారు. జాతీయ విపత్తు నిధి క్రింద రు.246 కోట్లు చూపారు. కానీ గత సంవత్సరం ఖరీఫ్‌లో 879 మండలాల్లో పంటలు వర్షాభావం వల్ల నష్టపోయినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. రైతులు 5700 కోట్ల పెట్టుబడికి నష్టపోయారు. మొత్తంగాను 12వేల కోట్ల పంటల రాబడికి నష్టం వాటిల్లింది. దీనికి తోడు థాణే అకాల వర్షాల్లో 50వేల ఎకరాలలో పొగాకు, శనగ, మిరప, మొక్కజొన్న పంటలు నష్టపోయాయి. ఈ నష్టానికి కేంద్ర ప్రభుత్వాన్ని 3500 కోట్లు అర్థించినట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. కేంద్రాన్ని సహాయం అడగడం బడ్జెట్ క్రిందకు వస్తుందా? గత 7 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 43523 కోట్లు కోరగా, కేంద్రం రు.1925కోట్లు మాత్రమే విదిల్చింది. చివరకు ప్రధాని గత సంవత్సరం వచ్చినప్పుడు రు.1000కోట్లు సహాయం పంపిస్తామని చేసిన ప్రకటనలో రు.650కోట్లు మాత్రమే రాష్ట్రానికి చేరాయి. ప్రకృతి వైఫరిత్యాల పరిహారాన్ని కేంద్రంపైకి తోసివేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పంటల నష్టం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ నష్టపోయిన ప్రతి ఎకరాకు రు.10వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరిన విషయం ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ మొత్తం నష్టాన్ని లెక్కకట్టి బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉండగా ఆ వైపు ఆర్థిక మంత్రి దృష్టి సారించలేదు.
ఇరిగేషన్ క్రింద జలయజ్ఞం పనులకు రు.15010 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కూడా ఇంతే మొత్తం కేటాయించారు. డిశంబర్ 2011 నాటికి రు.8459 కోట్లు వ్యవయం చేసారు. కేటాయించిన బడ్జెట్‌లో దాదాపు 7వేల కోట్లు ఈనాటికి వ్యయం జరగలేదు. ఈ సంవత్సరం కేటాయింపులు కూడా అదే విధంగా ఉంటాయనడంలో సందేహం లేదు. 2004 నుండి జలయజ్ఞంలో రు.71900 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటనలో 13 ప్రాజెక్టులు పూర్తిగానూ. 21 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తిచేసి 23 లక్షల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పించినట్లు ప్రకటించింది. వాస్తవానికి 2.5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వనరులు కల్పించబడినాయి. చాలా ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ పంటకాలువలు, ప్రధాన కాలువలు లేక విడుదల చేసిన నీరు ప్రాజెక్టు తూములోనుండి బయటకు రాలేదు. కానీ ప్రభుత్వం 23 లక్షల ఎకరాలకు కల్పించామని హాస్యాస్పదమైన ప్రకటన చేసింది. మైనర్ ఇరిగేషన్‌కు 2012`13లో రు.2995కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో గల చెరువులలో ఐదవ వంతు చెరువులను ప్రతిఏటా రిపేర్లు చేయాలి. 64వేల చెరువులు ఉండగా అందులో 5వ వంతు చెరువులకు పై కేటాయింపులు ఏ మూలకు సరిపోతాయి. జపాన్‌బ్యాంకు, ప్రపంచబ్యాంకు సహాయంతో మైనర్ ఇరిగేషన్ రిపేర్లు చేస్తున్నామని గత 4 సంవత్సరాలుగా ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ రెండు సంస్థలు 2300 కోట్ల రూపాయల సహాయం ప్రకటించాయి. అదే విధంగా నాగార్జున సాగర్ ఆయకట్టు నవీనీకరణ కొరకు ప్రపంచబ్యాంకు 2200కోట్లు, మ్యాచింగ్‌గ్రాంట్స్‌గా రాష్ట్ర ప్రభుత్వం 2200 కోట్లు వ్యయం చేయాలి. ఒక విడత నిధులు విడుదల చేసిన ప్రపంచబ్యాంకు తాను నిర్ణయించిన షరతులు అమలు చేయలేదని రుణ విడుదలను నిలుపుదల చేసింది. సాగునీటి రెగ్యులేటరీ కమిషన్ ద్వారా నీటిపన్ను పెంచడం, సాగునీటి మీటర్లు ఏర్పాటు చేయడం, సాగునీటి సంఘాల ద్వారా మాత్రమే రిపేర్లు చేయడం మరియు ప్రజల వ్యయ భాగస్వామ్యం కల్పించడం లేదని ప్రపంచబ్యాంకు రుణ విడుదలను నిలుపుదల చేసింది. పై విధానాలన్నీ ఆయకట్టుదారులను సాగునీటి నుండి దూరం చేయడానికి నిర్ణయించినవే.
4శాతం వృద్దిరేటు వ్యవసాయ రంగంలో సాధిస్తానన్న ప్రభుత్వం అంచనాలను ప్రకృతి వైఫరిత్యాలు తలక్రిందుల చేస్తున్నాయి. 2008`09లో 142లక్షల టన్నులు, 2009`10లో 106లక్షల టన్నులు, 2010`11లో 139లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగినట్టు రికార్డులు తెలుపుతున్నాయి. 2011`12లో మొత్తం ఆహార ధాన్యాల లక్ష్యం (బియ్యం, నూనెలు, పప్పులు) 228లక్షల టన్నులు కాగా దిగుబడి 173 లక్షల టన్నులే వస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో రెండు రోజుల క్రితం తెలిపారు. దీనిని బట్టి ప్రకృతి అనుకూల, అననుకూల పరిస్థితులను బట్టి పంటల దిగుబడులు వస్తాయని అర్థమవుతున్నది. ఈ ప్రకృతి వైఫరిత్యాల తాకిడిని అదిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘‘ప్రాజెక్టులతో మైనర్ ఇరిగేషన్ లింక్ చేసే జలవిధానాన్ని’’ రూపొందించాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత కరువు సంవత్సరంలో కూడా దాదాపు 2వేల టిఎంసీ నీరు కృష్ణా, గోదావరి నదుల ద్వారా సముద్రంపాలయ్యింది. ప్రాజెక్టుల్లోకి 80శాతం నీరు రాగానే తూముల ద్వారా చెరువులు నింపడం వలన వర్షాభావ ప్రాంతాల్లో 70శాతం కరువును నివారించవచ్చు. అదే విధంగా శాశ్వత మురుగునీటి వ్యవస్థను చూడడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినచో వరదల నష్టం 60నుండి 70 శాతం తగ్గుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనం కొరకు జల విధానాన్ని రూపొందించాలన్న లక్ష్యశుద్ది లేదు. కారణం రైతులను భూముల నుండి వెల్లగొట్టి వ్యవసాయ రంగంలో భారీ యంత్రాలతో చేయడానికి కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించడానికే బడ్జెట్ కేటాయింపులు లేని ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తున్నాయి.
రైతుల స్వయం సహాయక గ్రూపులకు రు.1075 కోట్లు కేటాయిస్తున్నట్లు, మరియు ఇందిర జలప్రభ క్రింద లక్ష బోర్లు వేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం చూస్తుంటే పై ప్రకటన అమలు జరుగుతుందన్న వాస్తవం కనపడదు. ప్రస్తుతం రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఐడిసి) ద్వారా 13.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి 25వేల బావులు మరియు 545 లిప్టు పథకాలను ఈ సంస్థ నిర్వహిస్తున్నది. ఈ సంస్థ నిర్వహిచే ప్రాజెక్టులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అప్పజెప్పడం మూలంగా ప్రస్తుతం 50శాతం పథకాలు మూలపడినాయి. ఒకవైపున ఐడిసి డిపార్ట్‌మెంట్‌ను మూసివేస్తే మరోవైపు ఇందిర జల ప్రభ క్రింద లక్ష బోర్లు వేసి సాగుకు తోడ్పడుతుందని చెప్పడం అర్థరహితం.
విద్యుత్ బడ్జెట్‌కు రు.5937 కోట్లు కేటాయింపు చూపారు. ఇందులో సింహభాగం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు కేటాయించారు. విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గత బకాయీలతో సహా 18వేల కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం చెల్లించకపోవడంతే ఆ భారాన్ని డిస్కాంలు వినియోగదారులపై వేస్తున్నాయి. మరోవైపున ఉచిత విద్యుత్ ద్వారా రైతులకు లాభం కలగజేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. తాను నిర్ణయించిన 7గంటల విద్యుత్ సరఫరా కాక లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతున్నది.
వ్యవసాయానికి పెద్ద పీఠ వేస్తున్నామంటూ ఏటా బడ్జెట్ సందర్భంగా ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. రైతుల ఉన్నపీఠను లాక్కుంటూ వారిని వీధులపాలు చేయడమే కాక, ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పురికొల్పుతున్నాయి. ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ వీటి సంఖ్య దినదినం పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కౌలుదార్లు 40 లక్షల మంది ఉన్నారు. కనీసం వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి చట్టం చేసినా, ఆ చట్టాన్ని అమలు చేయని ప్రభుత్వం రైతులను భ్రమల్లో పెట్టే పదజాలాన్ని బడ్జెట్ సందర్భంగా ప్రయోగించింది. చట్టాలను ప్రభుత్వమే ఘోరంగా వుల్లంగిస్తున్నది. కనీస మద్దతు ధరలు నిర్ణయించి అమలుజరపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను కేంద్రం మీదకు తోచివేస్తున్నది. రాజ్యాంగం రీత్యా వ్యవసాయం రాష్ట్ర పరిధిలో ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో కేంద్రంపైకి తోసివేసి తప్పుకో చూస్తున్నది. చివరకు వ్యవసాయ సబ్సిడీలను కోత పెడుతున్నది. ఇప్పటికే మాన్‌సోంటో, డూపాయింట్, కార్గిల్, సింజంటా కంపెనీలు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించాయి. విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వాటి ఇష్ట రాజ్యంగా సాగుతున్నది. కనీసం ప్రభుత్వ నియంత్రణ లేదు. వీటిని నియంత్రించడానికి బడ్జెట్‌పరంగా ఈ రంగాల్లో ప్రభుత్వ జోక్యం పెరగాలి. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ రూపొందించాలని, మొత్తం వ్యవసాయాభివృద్దికి భీమాతో సహా రు.16800 కోట్లు కేటాయించాలని, ప్రాథమికంగా ఒక వెయ్యి ఉత్పత్తిదారుల సంఘాలు (ఒకొక్కటి 2500 ఎకరాల పరిధిలో) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. కానీ, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టకపోగా ఉన్న బడ్జెట్‌లో కోతలు పెట్టారు. ఈ కోతల బడ్జెట్ వ్యవసాయ అభివృద్దికి తోడ్పడుతుందా? ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రకటించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
17.02.2012

No comments:
Post a Comment