Tuesday, 12 August 2014

కృష్ణాజలాల తీర్పుతో ఆందోళనలో ఆంధ్రప్రదేశ్‌


కృష్ణాజలాల రెండవట్రిబ్యునల్‌ 2010, డిసెంబర్‌30న తీర్పును ప్రకటించింది.తీర్పుపై అభ్యంతరాలు తెల్పడానికి 90రోజుల గడువు ఇచ్చింది. 90రోజుల అనంతరం తీర్పును అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్‌ 6 క్రింద గెజిట్‌లో ప్రకటించడంతో తీర్పు అమలులోకి వస్తుంది. ఈతీర్పును సుప్రీంకోర్టులో కూడా ప్రశ్నించడానికి వీలుండదు. ముసాయిదా తీర్పులో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.
1. నికరజలాలను 47 సంవత్సరాలలో 65 శాతంగా 2293 టియంసీలగా నిర్ణయించింది ( గత ట్రిబ్యునల్‌ 75శాతం నికరజలాలను 2060 టియంసీలుగా నిర్ణయించింది).  మిగులుజలాలను 285 టిఎంసీలుగా గుర్తించింది (గతంలో 330 టియంసీలుగా గుర్తించారు). పంపిణీ వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి (టియంసీలలో)
వివరాలు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్‌
65శాతం నికరజలాలు 43 65           39
        మిగులుజలాలు 35 105         145
65 శాతంలో రీచార్జ్‌ అయ్యే నీరు 03           07                   06
మొత్తం 81  177          190
2. నికరజలాలు నుండి మహారాష్ట్రలోని కోయినా హైడల్‌ప్రాజెక్ట్‌కు 25 టిఎంసీలు, కర్ణాటకలోని అప్పర్‌తుంగ ప్రాజెక్ట్‌కు, సింగటలూరు ప్రాజెక్ట్‌లకు 40 టిఎంసీలు, మరియు అప్పర్‌కృష్ణాలో  ఆల్‌మట్టిప్రాజెక్ట్‌ను 519.6 మీటర్ల నుండి 524.256 మీటర్లకు పెంపుదల చేస్తూ అదనంగా 130 టిఎంసీలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని జూరాల ప్రాజెక్ట్‌కు 9 టిఎంసీలు, తెలుగుగంగకు 25 టిఎంసీలు, శ్రీశైలం, నాగార్జునాసాగర్‌ ప్రాజెక్ట్‌లకు క్యారీఓవర్‌ స్టోరేజ్‌ (రాబోయే సంవత్సరానికి నిల్వ) 150 టిఎంసీలు కేటాయింపు చూపారు. అదే విధంగా ఆల్‌మట్టి నుండి జూన్‌, జులై మాసాలలో ఆంధ్రప్రదేశ్‌కు 8 నుండి 10 టిఎంసీలు ఇవ్వాలి. పర్యావరణ పరిరక్షణకు మూడు రాష్ట్రాలు నదిలో 16 టిఎంసీల వరకు కనీస ప్రవాహాన్ని ఉంచాలి. పైతీర్పులో దామాషాపద్ధతిన నీరుదిగువకు విడుదల చేయాలన్న నిబంధన లేదు. గత తీర్పులో 80 టిఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు మళ్ళించినపుడు కర్ణాటక, మహారాష్ట్రలకు 34 టిఎంసీలు కేటాయించాలన్న నిబంధనను తొలగించలేదు. ఆల్‌మట్టి ఎత్తును 4.65 మీటర్లు పెంచడం వలన ఎగువన 130 టిఎంసీల అధనపు నీటి నిల్వను కర్ణాటక వినియోగించుకుంటుంది. పై తీర్పు వలన ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన నీరు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయించిన నీటి నిల్వల తరువాతనే ఆంధ్రప్రదేశ్‌కు వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఖరీఫ్‌ పంటను ఆగష్టు, సెప్టెంబర్‌లో సాగు చేస్తున్నారు. ఈ తీర్పు ఆమలుతో ఖరీఫ్‌ పంటల కాలం పూర్తిగా మారిపోతుంది. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులు నిండిన తరువాత వచ్చు వరదల వల్ల రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతుంది. (ఉదా: 2009లో వచ్చిన వరదలు).
మొదటి బచావత్‌ తీర్పును కొనసాగిస్తూ మిగులు జలాల పంపిణీకి నియమించిన బ్రిజేష్‌ కుమార్‌ (రెండో ట్రిబునల్‌)ను తీర్పు చెప్పాల్సిందిగా కోరారు. కాని రెండో ట్రిబునల్‌ నికర జలాలు, మరియు మిగులు జలాలను తిరిగి పున:గుర్తించింది. గత తీర్పులో 78 సంవత్సరాలలో 75 శాతం నికర జలాలు కాగా, ప్రస్తుత కమిటీ 47 సంవత్సరాలలో 65 శాతం నికర జలాలను తీసుకుంది. ఈ విధానంతో 163 టిఎంసీ నికర జలాలు పెరిగాయి.
నికర జలాలను ఎలా నిర్ణయిస్తారు ? 
నికర జలాలను గుర్తించడానికి ఈ దిగువ సూత్రాన్ని అమలు చేస్తారు.
డేటాకు తీసుకున్న సంవత్సరాల సంఖ్య I శాతంగా తీసుకున్న సంవత్సరాల సంఖ్యను గుణించగా వచ్చు సంఖ్యను 100తో భాగించగా వచ్చిన సంవత్సరాలలో ఎంత నీటిలభ్యత ఉంటే దానిని నికర జలాలుగా గుర్తిస్తారు. పూర్ణసంఖ్య రానిచో రెండు సంవత్సరాల లభ్యత జలాలను తీసుకొని దానిని రెండుచే భాగించగా వచ్చిన సంఖ్యను నికర జలాలుగా గుర్తిస్తారు. డేటా తీసుకున్న సంవత్సరాలలో గల నీటి లభ్యత ప్రకారం  డిసెండిరగ్‌ ఆర్డర్‌లో (ఉదా:1956`57లో 4166 టిఎంసీలు 1961`62లో (3160 టిఎంసీలు), 1916`17లో (3721 టిఎంసీలు), 1959`60లో (3482 టిఎంసీలు), 1964`65లో (3397 టిఎంసీలు) లభ్యత వరుస క్రమంలో) టెబుల్‌ తయారు చేస్తారు. నిర్ణయించిన శాతంకు చెందిన సంవత్సరాలలో నీటిని మాత్రమే నికర జలాలుగా గుర్తిస్తారు.
         బచావత్‌ ట్రిబునల్‌ 1894 నుండి 1972 వరకు గల 78 సంవత్సరాలలో 75 శాతం సంవత్సరాలను గుర్తించింది.
పై సూత్రాన్ని వర్తింప చేసినప్పుడు 78I75 ª 100 R 58.50 వస్తుంది. అనగా 1894 నుండి 57 సంవత్సరాల అనంతరం వచ్చు 2 సంవత్సరాలలోని నీటి లభ్యతను తీసుకున్నారు. (58వ మరియు 59వ సంవత్సరాలు)  ఆ విధంగా 1951`52లో 2063 టిఎంసీలు, 1952`53లో 2057 టిఎంసీల నీటి లభ్యత ఉన్నది. ఈ రెండు సంవత్సరాలను సగటు చేయగా (2063G2057 ª 2 R 2060) చేయగా 2060 టిఎంసీలు వచ్చాయి. వీటిని నికర జలాలుగా గుర్తించారు. నీటి సంవత్సరం అనగా జూన్‌ 1 నుండి మే 31వరకు ఉంటుంది. ఈ కాలంలో గల నీటి లభ్యతని కేటాయించిన ప్రకారం వాడుకోవాలి.
బ్రిజేష్‌ కుమార్‌ కమిటీ నికర జలాల గుర్తింపుకు 1961 నుండి 2008 సంవత్సరానికి గల 47 సంవత్సరాల డేటాను తీసుకుంది. ఇందులో 65 శాతం అనగా 30వ సంవత్సరం మరియు 31వ సంవత్సరం వస్తాయి. (1991`92 మరియు 1992`93 సంవత్సరాలు). ఈ సంవత్సరాలలో మాత్రమే లభ్యత గల నీటిని (2 సంవత్సరాల నీటిని కలిపి 2చే భాగించగా వచ్చినది.) ఈ రెండు సంవత్సరాల నీటిని సగటు చేయగా వచ్చిన 2293 టిఎంసీలు నికర జలాలుగా గుర్తించారు. ఆ రెండు సంవత్సరాలలో లభ్యత గల నీటిని మాత్రమే తీసుకున్నారు.  డిసెండిరగ్‌ ఆర్డర్‌ ప్రకారం తయారు చేసిన నీటి లభ్యత పట్టికను బట్టి శాతం తగ్గిన కొద్ది నికర జలాల లభ్యత పెరుగుతుంది.
మిగులు జలాల నిర్ణయం :
    డేటాకు తీసుకున్న మొత్తం సంవత్సరాలలోని నీటి లభ్యతను సగటు చేసి అందులోనుండి నికర జలాలను  తగ్గించడం ద్వారా వచ్చేవి మిగులు జలాలు. బచావత్‌ తీర్పు ప్రకారం 78 సంవత్సరాల సగటు నీటి లభ్యత సంవత్సరానికి 2390 టిఎంసీలు కాగా నికర జలాలు 2060 పోగా మిగులు జలాలు 330 టిఎంసీలుగా నిర్ణయించారు. బ్రిజేష్‌ కుమారు 47 సంవత్సరాల సగటు సంవత్సరానికి 2578 టిఎంసీలు కాగా నికర జలాలు 2293 తీసివేయాగా 285 టిఎంసీలు మిగులు జలాలుగా తేల్చింది.
నికర జలాలు, మిగులు జలాల గణంకాల సేకరణలలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబునల్‌ డేటా సంవత్సరాలను తగ్గించడమే కాక   నికర జలాల శాతాన్ని కూడా తగ్గించడం ద్వారా నీటి లభ్యత పెరిగింది. ఈ పెరుగుదలలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు 39 టిఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాలను 145 టిఎంసీలు కేటాయించారు. ఎగువ నుండి నీరు దిగువ రాష్ట్రానికి వస్తేకదా! గత ట్రిబునల్‌ మిగులు జలాల వినియోగ స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్‌కు కల్పిండం వలన జలయజ్ఞంలో భీమా ఎత్తిపోతల (25 టిఎంసీలు) కల్వకుర్తి ఎత్తిపోతల (25 టిఎంసీలు), నెట్టెంపోడ్‌ ఎత్తిపోతల (20 టిఎంసీలు), హంద్రి`నీవా (40 టిఎంసీలు), గాలేరు ` నగరి (35 టిఎంసీలు), వెలుగొండ ఎత్తిపోతల (43 టిఎంసీలు) ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నది. అంతేకాక శ్రీశైలం ఎడమ కాలువ 20 టిఎంసీల నుండి 30 టిఎంసీలకు పెంపుదల (ఉదయ సముద్రం ద్వారా ఆదనంగా లక్ష ఎకరాలు,) శ్రీశైలం కుడి కాలువ (19 టిఎంసీలు), తెలుగుగంగ (29.50 టిఎంసీలు), జూరాల (17.84 టిఎంసీలు), నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువలకు (280 టిఎంసీలు), కృష్ణా డెల్టాలకు (181 టిఎంసీలు) బచావత్‌ అవార్డులో కేటాయించారు. ప్రస్తుతం పై ప్రాజెక్టులన్నీ నీటి కొరతకు గురవుతాయి. పరీవాహక జిల్లాలోని గ్రామాలకు ప్రస్తుతం వున్న త్రాగునీటి సరఫరా పథకాలు పని చేయవు. ముఖ్యంగా కష్ణా జలాల ఆధారంగా హైదరాబాద్‌ పట్టణంలోని కోటి జనాభాకు నిర్దేశించిన త్రాగునీటి పథకం నీటి కొరతను ఎదుర్కొంటుంది.  ఏ విధంగా చూసిన ఈ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరంగా వుంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రిబునల్‌ ముందు వాదనలు సరిగా వినిపించక పోవడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిరదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతరాష్ట్ర జల వివాదాల చట్టం 1956, ప్రకారం ట్రిబునల్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ గడువు ముగిసాక పార్లమెంట్‌ ఆమోదంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే చట్టం శిలాశాసనం అవుతుంది. అప్పుడు ఏ చట్టం దీనిని మార్చలేదు. ట్రిబునల్‌ నిర్ణయించిన గడువు 2050 సంవత్సరం తరువాతనే సమీక్షకు అవకాశం ఉంటుంది. అంటే 40 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కృష్ణా జలాల కొరకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల దయా, దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. నోటిఫికేషన్‌ గడువు ముగియక ముందే ప్రభుత్వం తేరుకొని దామాషా పద్దతి నీటి విడుదల, ఆల్‌మట్టి ఎత్తు యధాతథంగా కొనసాగింపుతో పాటు గోదావరి జలాల మళ్లింపులో పూర్తి వాటా ఆంధ్రప్రదేశ్‌కే ఉంటునట్లు, మరియు స్వతంత్ర ప్రతిపత్తి గల కృష్ణా రివర్‌ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలి. అప్పడే కృష్ణానది నీటి లభ్యతపై ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమైన హక్కు ఏర్పడుతుంది.
సారంపల్లి మల్లారెడ్డి 

No comments:

Post a Comment