కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై 55 అక్రమ కట్టడాల ద్వారా నీటిని నిల్వచేయడానికి చేస్తున్న నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చర్యలుతీసుకొనేలా చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర శాసనసభాపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
అక్రమకట్టడాల నిర్మాణం జరుగుతున్నట్లు ప్రభుత్వానికి ముందే తెలుసని భారీ నీటిపారుదలశాఖామాత్యులు పొన్నాల లక్ష్మయ్య చెప్పడం విచిత్రంగా వుంది. అక్రమ కట్టడాల నిర్మాణం వలన ఆంధ్రప్రదేశ్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసికూడా వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలూ చేపట్టక ప్రభుత్వం నిర్లిప్తంగా వుంది. ఇప్పటికే పెన్నా నదిపైన దిగువకు నీరు రాకుండా 11 కట్టడాలను నిర్మించిన కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం కృష్ణా నది బేసిన్‌లోని మలప్రభ, ఘట ప్రభ మరియు భీమ నదులపైన 55 వరకు బ్రిడ్జ్ కం డ్యాంలు నిర్మిస్తున్నట్లు తెలిసినప్పటికీ ప్రభుత్వం మిన్నకుంటున్నది.
మాసం రోజులపాటు వర్షాలు లేక కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పంటలు వేయక రైతాంగం ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న వర్షపునీరు దిగువకు రాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తున్నది. ఫలితంగా రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఇంత జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లు లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిపై జూరాల నుండి ప్రకాశం బ్యారేజీ వరకు (జూరాల 19 టియంసీ, నాగార్జునసాగర్ 280 టియంసీ, కృష్ణా డెల్టా 181, ఎస్‌ఎల్‌బిసి 26, ఎస్‌ఆర్‌బిసి 19 టియంసీ) 524 టియంసీల నికర జలాలను చట్టబద్ధంగా వినియోగించుకొని 40 లక్షల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పించాలి. అలాగే మిగులు జలాల ఆధారంగా ఆరు ప్రాజెక్టుల (భీమ 25 టియంసీ, గాలేరు-నగరి 38, హంద్రీనీవా 40, తెలుగుగంగ 45, కల్వకుర్తి 25, నెట్టెంపాడు 13 టియంసీలు) నిర్మాణం సాగుతున్నది. వీటికింద 18లక్షల ఎకరాలు సాగవుతున్నది. వీటికి సుమారు 180 టియంసీల నీరు కావాలి. నికర జలాలు రావడానికే ప్రమాదం ఏర్పడింది. కేంద్రంపై ఒత్తిడితెచ్చి అక్రమ కట్టడాలను నివారించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నది?
ఇంతకుముందే మహారాష్ట్ర గోదావరిపై అక్రమ కట్టడాల నిర్మాణం ద్వారా శ్రీరాంసాగర్‌కు నీరు రాకుండా చేసింది. నేడు శ్రీరాంసాగర్‌లో చుక్కనీరు లేదు. ఎనిమిది జిల్లాలకు సంబంధించి 25 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి దెబ్బతింటున్నది. ఎగువ రాష్ట్రాలు తమ హక్కుమేరకు కాకుండా అక్రమంగా నీటిని వినియోగిస్తున్నప్పుడు దానిని నిలువరించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమవుతున్నట్లు? రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. అయినా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాల్ని నివారించలేకపోతున్నారు. ఒకవైపు కృష్ణా జలాలపై రెండవ ట్రిబ్యునల్ పనిచేస్తుండగానే పరిష్కారాలు రాకముందే నీటి వినియోగానికి కర్ణాటక, మహారాష్ట్రలు చేస్తున్న నిర్మాణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం కల్గుతున్నది.
ఈ కట్టడాలు మాకు ముందే తెలుసని వీటిపై లేఖలు వ్రాశామని నీటిపారుదల శాఖ మరియు ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ చెబుతున్నది. వీరు వ్రాసిన లేఖలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సహా అటు కేంద్రం కనీసం పట్టించుకొన్న దాఖలాల్లేవు. చివరకు ట్రిబ్యునల్‌లో కూడా మన వాదన పటిష్టంగా విన్పించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడంలేదు. అఖిలపక్ష కమిటీవేసి అందరి అభిప్రాయాలను సేకరించి తదనుగుణంగా చర్యలు చేపట్టడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడంలేదు. జలయజ్ఞంపై చేసిన రు. 50వేల కోట్ల వ్యయం వృధా అవుతున్న విషయం తెలిసికూడా ప్రభుత్వం కదలడంలేదు. కర్ణాటకలో అత్యధిక వర్షపాతంవుంది. వారి కేటాయింపులు పోగా, మిగిలిన నీరు దిగువకు వదిలినచో కొంతప్రాంతమైనా రాష్ట్రంలో సాగులోనికి వస్తుంది. ఎగువ రాష్ట్రాలు వందల టియంసీలను అక్రమంగా వినియోగించుకోవడాన్ని నిరోధించుటకు కేంద్ర ప్రభుత్వంపైన, కేంద్ర జలవనరుల సంఘంపైన ఒత్తిడితెచ్చి అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయించాలి. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాం.
అభివందనములతో,
( సారంపల్లి మల్లారెడ్డి ) ( జూలకంటి రంగారెడ్డి )
ఎఐకెయస్ ఉపాధ్యకక్షులు సిపిఐ(ఎం) శాసన సభ్యులు

No comments:
Post a Comment