కరీంనగర్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 1970లో శంకుస్థాపన చేసి, 1977లో ఉత్పత్తి ప్రారంభించి స్థానిక రైతాంగానికి కావాల్సిన యూరియాను ఉత్పత్తిచేసిన పరిశ్రమలో 1998 మార్చి 31న ఉత్పత్తి నిలిపివేశారు. 21 సంవత్సరాలు రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలా అందుబాటులో వుండి ఎరువులు సరఫరాచేసింది. 2003లో ఉద్యోగులకు పూర్తిగా విఆర్‌ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీం) యిచ్చి మూసివేశారు. 1200 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. విశాలమైన భూ భాగం, దగ్గరలోనే గోదావరి నది, ఎరువుల ఫ్యాక్టరీని ఆనుకొని బొగ్గు బావులు వుండటం వలన బొగ్గు ఆధారిత పరిశ్రమగా దీనిని స్థాపించారు. భూమి విలువ కాకుండానే రు. 250కోట్ల పెట్టుబడిని దీనిపై కేంద్రం వెచ్చించింది. మొదట దీనిని 1500 టన్నులు (రోజుకు) ఉత్పత్తి లక్ష్యంగా సంవత్సరానికి 300 రోజులు ఉత్పత్తిచేయుట ద్వారా 4.50 లక్షల టన్నులు వార్షిక ఉత్పత్తి లక్ష్యంగా ఈ పరిశ్రమను స్థాపించారు.
ఇందులో 1100 మంది శాశ్విత ఉద్యోగులు, 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులు మరియు 500 మంది పరోక్షంగా ఆధారపడిన వారు (ట్రాన్స్‌పోర్ట్, వగైరా) వున్నారు.
కానీ, ఆచరణలో డిజైన్‌చేసిన దానికి భిన్నంగా ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించారు. గ్యాస్ ఫైర్ సిస్టమ్ లేదు. తక్కువ అమ్మోనియా ఉత్పత్తి జరిగింది. డిజైన్ లక్ష్యం నెరవేరాలంటే రోజుకు 900 టన్నుల అమ్మోనియా ఉత్పత్తి కావాలి. కానీ, 600 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఆ విధంగా నిర్ణయించిన లక్ష్యానికన్నా తక్కువ ఉత్పత్తి జరుగుతూ వచ్చింది. సగటున రోజుకు 750 టన్నుల చొప్పున 300 రోజులకు 2.25 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన నాటికి బొగ్గు ఆధారితంగానే రామగుండం మరియు తాల్చేరు ఎరువుల కర్మాగారాలను స్థాపించారు.
కానీ, తర్వాత టెక్నాలజీ అభివృద్ధి జరిగి గ్యాస్ మరియు నాఫ్తా ఆధారంగా ఉత్పత్తిని ప్రారంభించారు. గ్యాస్ ఆధారితంగా టన్ను యూరియా ఉత్పత్తికి 8000 కిలో క్యాలరీల ఎనర్జీ అవసరంకాగా బొగ్గు ఆధారితంగా టన్ను యూరియా ఉత్పత్తికి 27000 కిలో క్యాలరీల ఎనర్జీ అవసరమవుతుంది. ఆ విధంగా ఎక్కువ ఎనర్జీని ఉపయోగించడం వలన ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. బొగ్గు ఆధారితంగా ఉత్పత్తి చేయడం వలన యూరియా ఉత్పత్తి వ్యయం పెరుగుతూ వచ్చింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం యిచ్చే సబ్సిడీ కూడా పెంచాల్సివచ్చింది. తర్వాత జరిగిన టెక్నాలజీ అభివృద్ధితో దేశంలో అనేక ఎరువుల కర్మాగారాలు గ్యాస్ ఆధారితంగా ఉత్పత్తి ప్రారంభించారు. వారి ఉత్పత్తి వ్యయం తగ్గడంతో కేంద్రప్రభుత్వానికి ఎరువుల సబ్సిడీ తగ్గింది. ప్రభుత్వ రంగంలో బొగ్గు ఆధారితంగా వున్న ఫ్యాక్టరీల ద్వారా వస్తున్న అదనపు భారాన్ని తగ్గించడానికి యీ ప్రాజెక్టులను గ్యాస్ ఆధారితంగా మార్చాలి. కానీ, అందుకు అంగీకరించని కేంద్రం కర్మాగారం మూసివేతకు నిర్ణయించింది. ప్రభుత్వ రంగంలోఅత్యంత నాణ్యమైన యూరియాను తయారుచేస్తున్న కర్మాగారాన్ని మూసివేయకుండా నూతన టెక్నాలజీని వినియోగంచడంతో పాటు ప్రారంభంలో డిజైన్‌చేసిన 1500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల్గించినచో రాష్ట్రంలోని రైతాంగానికి రవాణా ఛార్జీలు లేకుండా యూరియాను సరఫరా చేయడమే కాకుండా కేంద్రప్రభుత్వానికి దిగుమతి సబ్సిడీలు చెల్లించే భారం తగ్గేది. కానీ, నూతన ఆర్థిక పరిస్థితుల ప్రాబల్యంతోను, ప్రయివేటు కర్మాగారాల వత్తిడితోను మరియు ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అనుసరించి ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేయడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది.
కార్మికుల నుండి భారత ప్రధాని వద్దకు, ఆర్థిక మంత్రివద్దకు వెళ్ళి మెమోరాండాలు సమర్పిస్తూ కర్మాగారాన్ని ఆధునీకరించాలని కోరారు. వారి కోర్కెలను మన్నిస్తున్నట్లు చెబుతూనే కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం 31 మార్చి, 1998 అర్థరాత్రి మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. దీని నిర్మాణానికి పెట్టిన పెట్టుబడి ఎందుకూ పనికిరాకుండా వుంది.
ఇతర కర్మాగారాల్లో యూరియా ఉత్పత్తి ధర తగ్గడం, రామగుండం కర్మాగారంలో బొగ్గు ధర పెరగడంతో పాటు మెయింటీనెన్స్ కూడా పెరిగింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం సబ్సిడీని పెంచలేదు. మరోవైపున నిర్ణయించిన ఉత్పత్తి లక్ష్యానికి తగు విధంగా ఏనాడూ ప్రభుత్వం స్పందించలేదు. ఈ కారణాల వల్ల నష్టాలను కొనితెచ్చుకొన్నట్లు అయింది. నష్టాలను నివారించి లాభాల బాటలో వేయడానికి రామగుండం, తాల్చేరు కర్మాగారాలకు మంచి అనుకూల అవకాశాలు వున్నాయి. ప్రక్కనే గోదావరి నది, విద్యుత్ సరఫరాకు ఎన్టీపీసీ, అరకిలో మీటరు దూరంలో సింగరేణి బొగ్గు గనులతో పాటు ఫ్యాక్టరీని ఆనుకొని రైల్వేట్రాక్ ఏర్పాటు వుంది. ఇన్ని ప్రాథమిక వనరులు కల్గిన పరిస్థితి మరే కర్మాగారానికీ లేదు.
ఫ్యాక్టరీ ఆవరణలో సౌకర్యాలు :
నాలుగు పాఠశాలలు వున్నాయి. 1. కేంద్రీయ విద్యాలయం, 2. చిన్మయ విద్యాలయం (తెలుగు-ఇంగ్లీష్ మీడియం) 3. తెలుగు మీడియం ఉన్నత పాఠశాల 4. ప్రైమరీ పాఠశాల (1 నుండి 5 తరగతుల వరకు) వున్నాయి. ఈ పాఠశాలలు అత్యంత విశాలంగాను, విద్యార్థులకు అన్ని అవసరాలు తీర్చేవిధంగా నిర్మాణాలు చేశారు. నేడు ఈ పాఠశాల భవనాలు తలుపులు, కిటికీలు దోపిడీకి గురవుతున్నాయి.
100 పడకల ఆస్పత్రి వుంది. రెండు రిక్రియేషన్ క్లబ్‌లు నిర్మించారు. ఒకటి ఆఫీసర్స్‌కు, మరొకటి కార్మికులకు. అలాగే మూడు గెస్ట్ హౌస్‌లు వున్నాయి. 1. విఐపిలకు 2. ఇంటర్నేషనల్ గెస్ట్‌హౌస్ 3. సాధారణ గెస్ట్‌హౌస్.
ట్రైనింగ్ హాస్టల్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచి, పోస్టు ఆఫీసు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసులకు శాశ్విత భవనాల నిర్మాణం చేశారు. కేంద్ర పారిశ్రామిక రక్షణ సిబ్బందికి కూడా శాశ్విత భవనాలను ఏర్పాటుచేశారు. పై అనుకూల భవనాలను, పరిస్థితులను ఏర్పరచిన తర్వాత ప్రాజెక్టును మూసివేయడం అత్యంత విచారకరం.
రాష్ట్రంలో ఎరువుల కొరత :
2007 రబీలోను, 2008 ఖరీఫ్‌లోను రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఎరువుల కొరకు వెళ్ళిన రైతులు క్యూ లో నిలబడటం కానీ లేదా తొక్కిసలాటలో గానీ ఆరుగురు రైతులు మరణించారు. రాష్ట్రానికి ఖరీఫ్‌లోను, రబీలోను కలిపి 32 లక్షల టన్నుల యూరియా అవసరం. కాగా, స్థానిక ఉత్పత్తిని దెబ్బతీసేవిధంగా కర్మాగారాలను మూసివేయడంతో సకాలంలో దిగుమతులు రాక పంటల దిగుబడులకు నష్టం వాటిల్లింది. ఈ కొరత పరిస్థితిని సద్వినియోగం చేసుకొన్న వ్యాపారస్తులు అత్యధిక లాభాలకు తమ ఎరువులను అమ్ముకున్నారు. వ్యవసాయ శాఖ తన బాధ్యతను పూర్తిగా విస్మరించడంతో రాష్ట్ర వ్యాపితంగా ఎరువుల కొరత రావడంతో పెద్దయెత్తున ఆందోళనలు సాగాయి. పంటలు పండించాల్సిన రైతులు ఆందోళనలకు వెళ్ళాల్సి వచ్చింది. చివరకు శాసనసభలో ఈ అంశంపై తీవ్ర చర్చ సాగింది. ఆ సందర్భంగా వ్యవసాయశాఖా మాత్యులు ఎన్. రఘువీరారెడ్డి గారు '' మూసివేసిన నాలుగు ఎరువుల కర్మాగారాలను నాలుగు మాసాల్లో తెరిపిస్తామంటూ'' శాసనసభలో ప్రకటించారు. నేటికీ ప్రకటన ప్రకటన గానేవుంది. అందుకు తగిన ప్రయత్నాలేమీ జరుగుతున్న దాఖలాల్లేవు.
రామగుండం కర్మాగారం - ప్రస్తుత స్థితి :
కర్మాగారం చుట్టూగల 1000 ఎకరాల భూమిలో అడవి పెరిగింది. కొండచిలువల విహారం సాగుతున్నది. ప్రాజెక్టు ఆవరణంలో నిర్మాణం చేసిన భవనాలు కూలిపోతున్నాయి. కొన్నింటి కిటికీలు, తలుపులు, తదితర పరికరాలన్నీ దోపిడీకి గురవుతున్నాయి. ప్రస్తుతం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే వున్నారు. వీరు మొత్తం కర్మాగార రక్షణను చూడగల్గిన స్థితిలో లేరు. కూలింగ్ టవర్స్ కూలిపోతున్నాయి. వాటిని రిపేర్లు చేయడం సాధ్యంకాదు. తిరిగి కొత్తగా నిర్మించుకోవాల్సిందే. అందులో వున్న భారీ పైపులైన్లు, డ్రమ్స్, పోల్స్ తదితర మిషనరీ త్రుప్పుపడుతున్నది. ఎప్పటికప్పుడు వేయాల్సిన రంగుల నిలుపుదల వలన త్రుప్పు అత్యంతవేగంగా వ్యాపిస్తున్నది. ఇప్పుడు బాగుచేయాలన్నా మొత్తం పాత యంత్రాలతో సహా ''తుక్కు (స్క్రాప్) క్రింద అమ్ముకోవాల్సిందే. నాడు రు. 250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీ నేటికీ పనిచేస్తున్న విధంగా కాపాడగల్గినచో అది రు. 1500 కోట్ల విలువను పెంచుకొనే అవకాశం వుండేది.
ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి :
రామగుండం, తాల్చేరు ఎరువుల ఫ్యాక్టరీలను వెంటనే ప్రారంభించుటకు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా బొగ్గు ఆధారిత ఉత్పత్తి కాకుండా గ్యాస్ ఆధారితంగా మార్చాలి. ప్రస్తుతం గోదావరి బేసిన్‌లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి జరుగుతున్నది. దానినుండి గ్యాస్‌ను సేకరించి కర్మాగారాన్ని పునఃనిర్మాణం చేయాలి. రోజుకు 3000 టన్నుల ఉత్పత్తి వచ్చేవిధంగా డిజైన్‌చేయాలి. తక్కువ దిగుబడి ఉత్పత్తి గావించినచో మరలా నష్టాల్లోకే వెళ్ళాల్సి వస్తోంది.కేంద్రప్రభుత్వం ఇందుకు తగిన నిధులను వెంటనే విడుదలచేయాలి. లేదా సింగరేణి కోల్ మైన్స్ సంస్థకు గానీ లేదా ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కి గానీ సబ్సిడరీగా మార్చి ఉత్పత్తిని ప్రారంభించాలి. ఇన్ని అవకాశాలను మరోచోట కల్పించడం సాధ్యంకాదు. పైగా, రాష్ట్ర ప్రజలకు రవాణా ఛార్జీలు లేకుండానే యూరియాను అందించే అవకాశం వుంటుంది. కేంద్రం ఎరువులపై చెల్లించే సబ్సిడీ కూడా తగ్గుతుంది.
ఇన్ని అవకాశాలు కల్గిన వనరును నిర్లక్ష్యం చేయడం క్షంతవ్యంకాదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిశీలించి వెంటనే కర్మాగారాలను పునఃప్రారంభించడానికి చర్యలు చేపట్టాలి. రాష్ట్ర రైతాంగాన్ని రక్షించాలి. దాదాపు 6వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశాన్ని జారవిడుచుకోరాదు. బహుముఖంగా ఉపయోగపడే ఈ ప్రాజెక్టును సత్వరమే ప్రారంభించాలి. శాసనసభలో మంత్రిచేసిన ప్రకటనను నెరవేర్చాలి.
---
యూరియా ఉత్పత్తి చేసేవిధం :
గాలిని సేకరించి అందులోనుండి నైట్రోజన్ విడదీయాలి. మరోవైపున బొగ్గును కాల్చి దానికి ఆవిరిని తోడుచేయడం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్‌ను గాలి నుండి తీసిన నైట్రోజన్‌ను కలపడం ద్వారా అమ్మోనియా ఉత్పత్తి అవుతుంది. అమ్మోనియాకు కార్బన్ డై ఆక్సైడ్‌ను కలపడం ద్వారా యూరియా ఉత్పత్తవుతుంది.
ఇందులో బొగ్గునుకాల్చి దానికి స్టీమ్ (ఆవిరి)ను కలిపిన సందర్భంగా కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయి. ఇందులో బొగ్గుకు బదులుగా గ్యాస్‌ను చేర్చడం ద్వారా బొగ్గు వ్యయం తగ్గుతుంది.
- సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment