రాష్ట్రంలో ఆయిల్‌పాం తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేకమైన కృషి సాగిస్తున్నది. 31 మార్చి 2008 నాటికి రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 77,328 హెక్టార్లలో యీ తోటలు వేశారు. మొత్తం 322 మండలాలను యీ తోటల పెంపకానికి అనువైనవిగా గుర్తించారు. 4.10 లక్షల హెక్టార్లలో యీ పంటలకు అనువైన భూములు వున్నట్లు తేల్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు మరియు ఖమ్మం జిల్లాల్లో యీ భూములను అనువైనవిగా ధృవీకరించారు. 12 కంపెనీలు ఆయిల్ పాంను ప్రోసెసింగ్ చేసి నూనె ఉత్పత్తిచేస్తున్నాయి. ఈ 12 కంపెనీల దయాదాక్షిణ్యాలపై రైతాంగం ఆధారపడి వున్నారు.
ఆయిల్ పాం తోటలు 25 నుండి 40 సంవత్సరాల వరకు కాపు కాస్తాయి. నాటిన మూడు సంవత్సరాల తర్వాత కాపు వస్తుంది. అంతవరకు ప్రభుత్వం ఎరువులను సబ్సిడీగా యిస్తుంది. మూడు సంవత్సరాల వరకు రైతు ఎకరానికి రు. 10,000 చొప్పున పెట్టుబడిగా పెట్టాలి. ఎకరానికి సుమారు 55 చెట్లు నాటుతారు. ఆయిల్ పాం పండ్లనుండి 15 నుండి 20శాతం పామాయిల్ క్రూడ్ వస్తుంది. దీనిని రిఫైన్డ్ చేసి మంచినూనెగా వంటలకు వినియోగిస్తున్నారు. గింజ ద్వారా కెర్నెల్ నూనెను తీస్తారు. దీనిని కొబ్బరి నూనెలో కల్తీకి వినియోగిస్తున్నారు. ఆయిల్ తీయగా వచ్చిన పిప్పి చేపల మేతకు వినియోగిస్తున్నారు. ఒక టన్ను పిప్పి రు. 3500లు వుంటుంది. పండ్లలో గల పెంకును టన్నుకు రు. 300 చొప్పున విద్యుత్ ఉత్పత్తిదారులకు అమ్ముతున్నారు. గెలల వృధాను టన్నుకు రు. 140-150ల వరకు విద్యుత్ ఉత్పత్తి బాయిలర్ల కొరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా చెట్టునుండి వచ్చిన ప్రతి ముడి సరుకు వినియోగంలోకి వస్తుంది. చివరకు క్రూడ్ ఆయిల్ నుండి వచ్చిన ''మడ్డి''ని కూడా ఎరువుగా వినియోగిస్తారు. దిగుబడి ఎకరానికి ప్రతి వారం 8-14 టన్నుల వరకు కోతకు వస్తుంది.
ఒక్కోసారి యీ ధరలను పూర్తిగా దిగ్గోస్తున్నారు. మొదట్లో వంట నూనెల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం పెద్దయెత్తున ప్రోత్సాహం కల్పించింది. రెండుమూడు సంవత్సరాల క్రితం టన్నుకు రు. 2000 నుండి 2500ల వరకు మాత్రమే కంపెనీలు కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళనకు గురై కొన్నితోటలను తీసివేశారు. ఆ తర్వాత క్రమంగా ధర పెరగడంతో తిరిగి తోటలను పెంచాలన్న ఉత్సాహంతో రైతులు వున్నారు. కానీ, ప్రభుత్వం తగినంత ప్రోత్సాహాన్ని యివ్వడంలేదు. ధరల నిర్ణయానికి ఆయిల్‌పాం కార్పొరేషన్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవసాయ మరియు సహకార శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ పామాయిల్ పండ్ల ధరలను నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ ధరలను పరిశీలించి ప్రతి మూడు మాసాలకొకసారి యీ కమిటీ ధరలను నిర్ణయిస్తుంది. 12శాతం క్రూడ్ పామాయిల్ రికవరీ వున్నటువంటి సందర్భాలలో టన్నుకు రు. 5801 ధరను నిర్ణయించారు. ( 01-05-2008 నుండి 31-07-2008 వరకు). ఆయిల్‌ఫెడ్ యీ ధరల నిర్ణయాన్ని పరిశీలన చేస్తుంది.
ప్రొసెసింగ్ కంపెనీలు :
1. శ్రీనివాస ఎంటర్ ప్రైజస్ (2005): లింగాలవలస (శ్రీకాకుళం)
2. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ (1996) - గరివిడి (విజయనగరం జిల్లా)
3. ఆగ్రో కోఆపరేటివ్ కార్పొరేషన్ (2008)- వడ్డాడి (విశాఖపట్నం)
4. పాం టెక్ ఇండియా లిమిటెడ్ (1999) - పెద్దాపురం ( తూర్పుగోదావరి )
5. ఫుడ్ ఫాట్స్ & ఫెర్టిలైజర్స్ (1996) - తాడేపల్లి గూడెం- యర్నగూడెం (పశ్చిమగోదావరి)
6. ఎ.పి ఆయిల్‌ఫెడ్ (1995)- పెద్దవేగి (పశ్చిమగోదావరి)- అశ్వారావుపేట (ఖమ్మం)
7. గోద్రేజ్ ఆగ్రో రెట్ లిమిటెడ్ (2007) - సిహెచ్. పోతిపల్లి (పశ్చిమగోదావరి)
8. నవభారత్ ఆగ్రో ప్రొడక్ట్స్ (2002) - జంగారెడ్డి గూడెం (పశ్చిమగోదావరి)
9. మాక్ ఆయిల్‌పాం (2001) - అంపపురం (కృష్ణా జిల్లా)
10. సింహపురి ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ (1997) - మనుబోలు (నెల్లూరు)
11. రుచి సోయా ఇండస్ట్రీస్ (2009-10) - ఏర్పాటు చేయాలి.
12. శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్స్ - ఏర్పాటుచేయాలి.
పై కంపెనీలు 8 జిల్లాల్లో తమకు కేటాయించిన 227 మండలాల్లోని ఉత్పత్తులను ఖరీదుచేయాలి. వీరి మధ్య ఎలాంటి పోటీ వ్యాపారం వుండదు. ఒక్కో కంపెనీకి కేటాయించబడ్డ మండలంలో ఆ కంపెనీయే కొనుగోలు చేయాలి. మరో కంపెనీ కొనుగోలు చేయడానికి వీలులేదు.
డా|| కె.ఎల్.చందా కమిటీ కొత్తగా 53 మండలాలను గుర్తించి ఆ మండలాల్లో ఆయిల్ పాం తోటలు వేయడానికి రికమెండ్ చేసినారు. (విజయనగరం -8, విశాఖపట్నం -4, తూర్పుగోదావరి -4, పశ్చిమగోదావరి -9, ఖమ్మం -6, నల్గొండ-15, కృష్ణా -1, అనంతపురం - 5)
2007-08లో పంట విస్తీర్ణం - దిగుబడి యీ క్రిందివిధంగా వుంది.
జిల్లాపేరు విస్తీర్ణం దిగుబడి
- (హెక్టార్లలో) (టన్నులలో)
శ్రీకాకుళం 1848 11088
విజయనగరం 5473 32838
విశాఖపట్నం 2729 16374
తూర్పుగోదావరి 15246 91476
పశ్చిమగోదావరి 34594 207564
కృష్ణా 6128 36768
గుంటూరు 1323 7938
ప్రకాశం 1114 6684
నెల్లూరు 3432 20592
ఖమ్మం 5442 32692
మొత్తం 77329 463974
ప్రభుత్వం ఆయిల్‌పాం తోటల పెంపకంలో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందించలేదు. ప్రధానంగా పామాయిల్ దిగుమతులపై ఆధారపడి వుంటున్నారు. మనకన్నా చాలా చిన్న దేశాలైన మలేషియా, సింగపూర్‌ల నుండి దాదాపుగా యేటా 40 లక్షల టన్నుల నూనెలు దిగుమతిచేసుకుంటున్నారు. ఈ దిగుమతుల వలన స్థానిక ఉత్పత్తిదారులకు న్యాయమైన ధరలు లభించడంలేదు. స్థానిక ఉత్పత్తిని పెంచడానికి తగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు. వంట నూనెల అవసరాల మేరకు దేశీయంగా ఉత్పత్తి పెంచాలన్న లక్ష్యం ప్రభుత్వానికి లేదు. నేటి సరళీకరణ విధానాల ఫలితంగా భారత ప్రభుత్వం దిగుమతులపైననే ప్రధానంగా ఆధారపడి వుంటున్నది.
దేశీయంగా ఆయిల్‌పాం ఉత్పత్తి పెంచడానికి 280 మండలాలను గుర్తించినప్పటికీ ( రెండు థలుగా) యింకా ప్రాథమిక థలోనే 110 మండలాలు వున్నాయి. భూసార పరీక్షలు జరిపి ప్రణాళికలు రూపొందించి గత మూడు సంవత్సరాలనుండి తోటలను విస్తరింపజేసినచో నేడు పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వుండేదికాదు. మరోవైపున సోయా నూనె, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, రైస్ ఆయిల్, ఆవాల నూనె, తౌడునుండి తీసిన నూనెల వినియోగం జరుగుతున్నది. అయినా దేశాల అవసరాల మేరకు వంట నూనెల ఉత్పత్తిలో విజయం సాధించలేకపోతున్నాం. పామాయిల్ పంటల విస్తీర్ణాన్ని, ఉత్పాదకతను పెంచడంలో ఉద్యానవన శాఖ, వ్యవసాయశాఖలు నేడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో విఫలమవుతున్నాయి. అందువలన నూనెల దిగుమతులు అనివార్యమయ్యాయి.
ఆయిల్‌పాం తోటల పెంపకానికి సముద్రతీరం వెంబడి కాకుండా ఖమ్మం, నల్గొండ, అనంతపురం జిల్లాల్లో కూడా యీ పంటకు తగిన భూములు వున్నాయి. తగినన్ని బడ్జెట్ కేటాయింపులు చేసి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి. రైతులకు యిస్తున్న ధరలు స్థిరంగా టన్నుకు రు. 6000 వుండునట్లుగా చూడాలి. ఆయిల్‌ఫెడ్ ఈ రంగంపై ప్రత్యేక కృషి కొనసాగించాలి. దిగుమతులను పూర్తిగా నివారించే దిశగా కార్యక్రమాలు రూపొందించి దేశీయంగా తగినంత ఉత్పత్తిని పెంచాలి.
---

No comments:
Post a Comment