సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర గవర్నర్ జూన్ 8న ఉభయ సభల సమావేశాలలో '' ప్రభుత్వ, వాణిజ్య బ్యాంకుల క్రియాశీల మద్దతుతో స్వచ్ఛంద సహకార ప్రాతిపదికన సేద్యం చేయడానికి ఒక సమీకృత విధానం కోసం ప్రతి జిల్లాకు ఒకటి లేదా రెండు గ్రామాలను ప్రయోగాత్మక ప్రాతిపదికన ఎంపిక చేయాలని ప్రతిపాదించడమైంది. ఇందులో పాల్గొనాల్సిందిగా ఏ గ్రామానికీ నిర్బంధం వుండదు. ప్రభుత్వం అట్టి సహకార సేద్యం ద్వారా పొందగల్గే ప్రయోజనాలను అధ్యయనం చేయాలని ఆశిస్తున్నది. ఇందులో పశుగణ సంపద, మత్స్య సంపద కూడా చేరివున్నాయి'' అని ప్రసంగిస్తూ తెలిపారు. వ్యవసాయోత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలన్న లక్ష్యంతో సహకార వ్యవసాయ క్షేత్రాల ప్రయోగాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వం ముసాయిదాలో తెలిపింది.
రాష్ట్రంలో 120.44 లక్షల కమతాలు వుండగా, అందులో 83.5 శాతం ఐదెకరాల లోపు కల్గిన సన్న,చిన్నకారు రైతులు వున్నారు. వీరివద్ద 70.17 లక్షల హెక్టార్ల భూమి వుంది. వ్యవసాయంలో వీరు బాగా నష్టపోతున్నారని, తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తి పెంచి లాభించేవిధంగా యీ విధానం ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి ఇజ్రాయిల్ పర్యటన తర్వాత యీ విధానాన్ని సీఘ్రతరం చేశారు.
దీనిని అమలులోకి తేవడానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటుచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి డా|| రాజశేఖరరెడ్డి బలవంతంగా ఎవరి భూములూ సహకార సేద్యానికి తీసుకోమని, గ్రామంలోని మొత్తం రైతులు అంగీకరిస్తేనే సహకార సేద్యం ప్రయోగాత్మకంగా చేపడ్తామని చెప్పారు. కానీ, అందుకు భిన్నంగా కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. రానున్న శాసనసభలో బిల్లు పెట్టడానికి అంగీకారం తెలిపారు. ప్రయోగం అన్న ప్రక్రియ వెంటనే క్రియారూపం ధరిస్తున్నది. ఈ ప్రభుత్వం సాగునీటి మీటర్ల ఏర్పాటు చేశారు. నీటి రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుకు జీవో విడుదల చేశారు. ప్రయోగాలంటూనే ఆచరణలోకి తెచ్చే యీ ప్రభుత్వం సహకార క్షేత్రాలను కూడా అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నది. సహకార క్షేత్రాల ఏర్పాటుకు విడుదల చేసిన ముసాయిదాలో '' సహకార క్షేత్రాల ఏర్పాటు నిర్వహణను సొసైటీ/ కంపెనీ చేస్తుంది. రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక సహకార క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ గ్రామాలలోని రైతులు తమ భూములను ఆ సొసైటీ / కంపెనీకి అన్ని అధికారాలతో దఖలు పర్చాలి. అట్టి భూములకు ధర నిర్ణయించబడుతుంది. ఆ ధరను వాటాలుగా పరిగణిస్తారు. సహకార క్షేత్రం నుండి వెళ్ళిపోదల్చుకొన్న రైతు తన వాటాలను మరొకరికి అమ్ముకోవాలి. సభ్యులలో ఎవరూ కొనుగోలు చేయనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సొసైటీ / కంపెనీ వ్యవసాయోత్పత్తులను నూతన టెక్నాలజీ ద్వారా యంత్రాలను వినియోగించి ఉత్పత్తిచేస్తారు. అధునాతన టెక్నాలజీని వినియోగిస్తారు. నాణ్యతగల విత్తనాలు, మార్కెట్ సౌకర్యం మరియు గోదాం నిల్వ సౌకర్యాలు కల్పిస్తారు. ప్రభుత్వం కొన్ని సొసైటీలకు మొదట మార్జిన్ మనీ యిస్తుంది'' అని తెలిపారు. ఈ పథకం మంచి ఫలితాలు యిస్తే కొనసాగుతుందని లేనిచో మూసివేస్తామని కూడా ముసాయిదాలో చెప్పారు.
ఈ ముసాయిదా ప్రకారం రైతులు తమ భూములను కంపెనీకి అప్పగించాలి. కంపెనీకి లాభాలు వస్తేనే వాటాల ప్రకారం రైతులకు డివిడెంట్ యిస్తారు. నష్టాల్లోకి వెళితే తమ వాటాలు కోల్పోవాల్సి వస్తుంది. అనగా, భూములు కంపెనీకి అప్పగించి తప్పుకోవాలి. పరోక్షంగా రైతుల భూములను కంపెనీలకు అప్పగించడానికి యీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో విత్తనరంగం పూర్తిగా బహుళజాతి సంస్థలపరమైంది.ఉపకరణాలు, మార్కెటింగ్ రంగాలపై బహుళజాతి సంస్థల ఆధిపత్యం కొనసాగుతున్నది. మరోవైపున వ్యవసాయ విస్తరణ రైతులకు అందుబాటులో లేకుండా చేశారు. ఆదర్శ రైతులంటూ అనుభవంలేని వారితో వ్యవసాయశాఖను నింపారు. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వ్యవసాయ రంగం నుండి సన్న, చిన్నకారు రైతులను తప్పించడానికి ప్రభుత్వం యీ ప్రయోగాలు చేపడుతున్నట్లు విధితమవుతున్నది.
ములకనూరు, అంకాపూర్ సహకార సంఘాల అభివృద్ధిని ముసాయిదాలో ఉదాహరణగా చూపారు. ఈ సంఘాలు సేవా సహకార సంఘాలుగా మాత్రమే పనిచేస్తున్నాయి. గతంలో ''రైతు కేంద్రంగా'' ఏర్పాటు చేసిన ''సహకార వ్యవసాయ క్షేత్రాలు''కు బదులుగా నేడు ఏర్పాటుచేయబోయే వ్యవసాయ సహకార క్షేత్రాలు ''కంపెనీ కేంద్రంగా'' వున్నాయి.
గత అనుభవం :
1964 సహకార చట్టం ప్రకారం 22 జిల్లాల్లో 2451 సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1.93 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నారు. 2.72 లక్షల ఎకరాలను యిందుకు కేటాయించారు. ఈ క్షేత్రాలలో సభ్యులుగా దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలేగాక ఆర్థికంగా వెనకబడినవారికి కూడా సభ్యత్వాలు యిచ్చారు. ప్రభుత్వం భూములలో యీ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ సహకార జాయింట్ ఫార్మింగ్ సొసైటీల ఫెడరేషన్ 30శాతం (రుణంగా) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ 50శాతం సబ్సిడీ, జిల్లా దళిత, గిరిజన కార్పొరేషన్‌లు 20శాతం (మార్జిన్‌మనీ) యిచ్చి క్షేత్రాలనేర్పాటు చేశాయి. దీని బాధ్యత నిర్వహణ తాలూక సహకార శాఖాధికారికి కేటాయించారు. పెట్టుబడిపోగా మిగిలిన ఆదాయాన్ని వాటాలుగా అందులోని సభ్యులందరికీ పంపిణీ చేశారు. రైతు జీవనాదాయాన్ని కేంద్రంగా చేసుకొని గతంలో సహకార క్షేత్రాలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంది. ''రైతు కేంద్రంగా'' సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలి.
ఇజ్రాయిల్ తరహా సహకార సేద్యం అనుభవం కూడా ప్రస్తుతం చెబుతున్న సహకార సేద్య విధానానికి భిన్నమైనదే. ఇజ్రాయిల్‌లో రెండు తరహాల విధానం కొనసాగుతున్నది. అవి 1. కింబుట్స్ 2. మోషవ్ పద్ధతులు.
కింబుట్స్ పద్ధతి మన రాష్ట్రంలో కుప్పం తరహా విధానాన్ని పోలివుంటుంది. రైతుల భూములను ఏకఖండంగా చేసి కంపెనీ వ్యవసాయం చేస్తుంది. రైతులకు కౌలు చెల్లిస్తారు. రెండో తరహా మోషవ్ పద్ధతిలో ఎవరి భూములు వారికే వుంటాయి. ఉపకరణాల సరఫరా మరియు మార్కెటింగ్ మాత్రమే సహకార పద్ధతిలో కొనసాగుతాయి. ఈ విధానం గతంలో మన సహకార సంఘాలను పోలినవే. చిన్న కమతాల వల్ల ఎక్కువ ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని జపాన్ అనుభవం తెలియజేస్తున్నది. చైనా కూడా చిన్నకమతాల వల్లనే ప్రపంచంలోనే ఉత్పాదకతలో మొదటిస్థానంలో వుంది. అలాంటిది యిక్కడ ఏకీకృత భారీ కమతాలు లాభిస్తాయని చెప్పడమంటే భారీ యంత్రాలతో వ్యవసాయం సాగించాలి. భారీ యంత్రాలను కంపెనీలు మాత్రమే వినియోగిస్తాయి. కానీ, చిన్న కమతాల సేద్యానికి కూడా వరికోత, దున్నకం, వేరుశనగ, మొక్కజొన్న, నూర్పిడ్లకు మరియు మందులు స్ప్రే చేయడానికి చిన్న యంత్రాలు వచ్చాయి. ఆ యంత్రాలను వినియోగించి రెండుమూడు ఎకరాలు కల్గిన కమతాలలో అధికోత్పత్తి రాబెట్టడానికి అవకాశాలు వున్నాయి.
ప్రభుత్వ లక్ష్యం ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం కాదు. ప్రపంచంలో నేడు వస్తున్న మార్పులకనుగుణంగా బడా కంపెనీలకు భూములను అప్పగించడమే లక్ష్యంగా వుంది. ఇంతకుముందు ఎస్.ఇ.జడ్‌ల పేరుతో భూ సేకరణ కొనసాగించారు. అనేకచోట్ల యీ సేకరణకు వ్యతిరేకంగా రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీని నుండి తప్పుకోవడానికి సహకార సేద్యం అంటూ కంపెనీలను రంగంలోకి తెస్తున్నది. వ్యవసాయాధారిత పరిశ్రల ఏర్పాటుతో ఒక్కో కంపెనీకి వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టడానికే యీ సహకార సేద్య విధానం. మరో ముఖ్యమైన అంశమేమిటంటే నేటికీ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 40 లక్షల ఎకరాలకు పైగా వున్నాయి. ఈ భూములను సహకార క్షేత్రాల పేరుతో కంపెనీలకు అప్పజెప్పడం ఖాయంగా కన్పిస్తున్నది. ఏదేమైనా బహుళజాతి సంస్థలకు లాభం కల్గేవిధంగా వ్యవసాయరంగంలో మార్పులు తేవాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా వుంది. విత్తనరంగం చూస్తుండగానే బహుళజాతి సంస్థల పరమైన తర్వాత నాణ్యతలేని, కల్తీవిత్తనాలతో యేటా రైతులు రాష్ట్రంలో 4,5 లక్షల ఎకరాలలో పంటలు నష్టపోతున్నారు.వీరికి రక్షణ కల్పించడానికి విత్తన చట్టంలేదు. విత్తన చట్టం -2004 నేటికీ కేంద్రం వద్ద పెండింగ్‌లో వుంది.
రాజ్యాంగం ప్రకారం వ్యవసాయరంగం రాష్ట్ర జాబితాలో వున్నప్పటికీ విత్తన, మార్కెటింగ్ చట్టాలను కేంద్రం ఆదేశాల మేరకు చేశారు. ఇవి రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. రానున్న కాలంలో కనీస మద్దతు ధరల విధానాన్ని కూడా తొలగించే ప్రయత్నం కొనసాగుతున్నది. మద్దతు ధరలు ప్రకటించినా యిప్పటికే అవి అమలుజరగడంలేదు.
ప్రభుత్వ ముసాయిదాలోనే సహకార వ్యవస్థలో ఏర్పాటుచేసిన సహకార వ్యవసాయ క్షేత్రాల నిర్వహణ విఫలమైందని ముసాయిదా (పేజీ 13)లో అంగీకరించారు. ఒకవైపు విఫలమైందంటూనే మరోవైపు సహకారం అన్న పదాన్ని వినియోగించడం ఎవరిని మభ్యపుచ్చడానికి ? సహకార పదం బదులు నేరుగా కంపెనీ పదమే వాడటం న్యాయంగా వుంటుంది. గతంలో సహకారరంగంలో అనేక మార్పులు, విధానాలు రూపొందించారు. ప్రభుత్వాలు ఏఒక్కదానినీ చివరికంటా కొనసాగించలేదు. 1. ప్రాథమిక సేవా సహకార సంఘాలు 2. రైతు సేవా సహకార సంఘాలు 3. జాయింట్ ఫార్మింగ్ సొసైటీలు (ప్రభుత్వ భూములలో), 4. కౌలుదార్ల వ్యవసాయ సహకార సంఘాలు 5. బహుళార్థ సహకార సంఘాలు ఏర్పాటుచేశారు. ఒక్కోమంత్రి ఒక్కో ప్రయోగాన్ని చేస్తూవచ్చారు. అయినప్పటికీ సహకార రంగం బాగా విస్తరించింది. ఈ రంగంలో చెరకు ఫ్యాక్టరీలు, ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీలు, పాల సొసైటీలు, వృత్తిసంఘాల సొసైటీలు లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలు వృద్ధి చెందాయి. పాలకవర్గాల అక్రమజోక్యం, అవినీతి వలన యీ సంఘాలన్నీ పనిచేయని స్థితికి చేరుకున్నాయి. 1995 సహకార చట్టంప్రకారం పాల సొసైటీలను మార్చారు. చెరకు ఫ్యాక్టరీలను ప్రయివేటుపరం చేశారు. ఒకవిధంగా మొత్తం సహకార రంగాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. ఈ స్థితిలో సహకార వ్యవసాయమంటూ ఈ ప్రభుత్వం కొత్త నినాదాన్ని రూపొందించింది. ఈ విధానంలో కంపెనీలకే పూర్తి బాధ్యత, హక్కు కల్పించబడుతుందని ముసాయిదాలో చెప్పబడింది. అనేక సందర్భాలలో ప్రస్తుతం వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి సంఖ్యని సగానిక సగం తగ్గించాలని ముఖ్యమంత్రి పదేపదే చెప్పారు. ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడిన వారికి చదువు లేదు. అందుకనుగుణంగానే యీ విధానం రూపొందించబడింది. కంపెనీకి భూములిచ్చినవారికి వ్యవసాయానుబంధ వృత్తులలో పని కల్పిస్తామంటూ మరో ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయానుబంధ వృత్తులైన గొర్రెల, మేకల పెంపకం, ఆక్వా, ఇతర చేతివృత్తులు ఆదరణలేక దివాళా తీశాయి. వారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌లేదు. అలాంటి వృత్తులనే తిరిగి భూములు కోల్పోయిన వారికి కల్పిస్తామనడం హాస్యాస్పదంగా వుంటుంది.
ఇప్పటికే వ్యవసాయరంగంలోని అన్ని విభాగాలను ప్రయివేటీకరిస్తున్నారు. బహుళజాతి సంస్థలకు లాభాలు కట్టబెట్టే యీ విధానాన్ని నిరాకరించాలి. స్వంత ఉపాధి కల్పించుకున్న రైతులను ఉపాధికి దూరంచేసే విధానం సరియైందికాదు. ఏ కోణం నుండి చూసినా ప్రభుత్వ ప్రకటిత సహకార సేద్యం రైతాంగానికి నష్టంకల్గించేదే తప్ప లాభించేది కాదు.
---

No comments:
Post a Comment