రాష్ట్రంలో చెఱకు క్రషింగ్ నవంబర్ నెలా చివరి వారంలో ప్రారంభిస్తారు. మార్చి 15 వరకు క్రషింగ్ జరుగుతుంది. అప్పుడే ఫ్యాక్టరీలు ఏకపక్షంగా చెఱకు ధరను నిర్ణయించి ప్రకటించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఖమ్మంలో ఒక ఫ్యాక్టరీ 2,460 రూపాయలు టన్నుకు నిర్ణయించింది. ఇది గత సంవత్సరం చెల్లించిన ధరే. ఏదో రూపంలో ఫ్యాక్టరీ యజమానుడు తక్కువ రేట్లకు చెఱకుకు ధర చెల్లించి కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తున్నారు. రాష్ట్రంలో 40 చెఱకు మిల్లులు పని చేస్తున్నాయి. దేశవ్యాపితంగా చూసినప్పుడు 660 చెఱకు ఫ్యాక్టరీలకు గాను, 529 ఫ్యాక్టరీలు క్రషింగ్ గత సంవత్సరం చేసాయి. ఇవి 1,26,000 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అయినా 3,610 లక్షల టన్నులు క్రషింగ్ చేశాయి. దాదాపుగా 266 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఎకరాకు సగటున 50 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ రాష్ట్రంలో గత సంవత్సరం 78 టన్నులు దిగుబడి వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒక ఎకరా కౌలు 15`20 టన్నుల చెఱకు ఉంటుంది. పెట్టుబడి 50`60 వేలకు పైగా ఉంటుంది. కౌలుదారుకు ప్రస్తుత ధర ప్రకారం పరిశీలిస్తే కౌలుపోగా, రైతుకు మిగిలేదేమీ ఉండదు. పోనీ ఫ్యాక్టరీల వారు తమ కనీస లాభాన్ని చూసుకుని ధరలు శాస్త్రీయంగా నిర్ణయించే విధానం లేదు. ప్రపంచంలో 18 కోట్ల ఎకరాలు సాగు చేస్తుండగా 16.5 కోట్ల టన్నులు ఉత్పత్తి అగుచున్నది. ఉత్పత్తిలో బ్రెజిల్ 3.9 కోట్ల టన్నులతో మొదటి ర్యాంకులో ఉంది. భారత్2.7 కోట్ల టన్నులతో రెండవ ర్యాంకులో ఉంది.
గతంనుండి కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర నిర్ణయిస్తుంది. దానికి తోడు రాష్ట్రం ఎస్‌ఎపీ (స్టాట్యూటరీ అడ్వయిజరీ ప్రైస్) నిర్ణయించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఎస్‌ఎపీ నిర్ణయించడం లేదు. ఫ్యాక్టరీ వాళ్ల ఒత్తిడికి లొంగి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎస్‌ఎపీని నిర్ణయాన్ని రద్దు పరచింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌ఎపీ నిర్ణయించవచ్చని తీర్పునిచ్చాయి. అన్ని రాష్ట్రాలు ఆ తీర్పును అమలు జరుపుతునప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం నేటికీ ఆ తీర్పును అమలు జరపడం లేదు. కేంద్రం నిర్ణయించిన ఎస్‌ఎంపీ (కనీస మద్ధతు ధర)లు ఈ విధంగా ఉన్నాయి.
పై ధరలు ఏ ఆధారంగా నిర్ణయించారు? వీటి నిర్ణయానికి శాస్త్రీయత లేదు. ఎకరా పెట్టుబడిని లెక్కలోకి తీసుకోలేదు. ఈ ధరపై కొన్ని రాష్ట్రాల్లో కటింగ్, ట్రాన్స్‌పోర్టు, సీడ్ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలు కలిపి టన్నుకు 2,100 నుండి 2,500 వరకు ఇస్తున్నారు. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కో ధర అమలు జరుగుతున్నది. వాస్తవానికి ఏ ధర చెల్లించాలి?

బగాస్‌తో ఆయా ఫ్యాక్టరీలు కో`జరేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాయి. బగాస్‌ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌కు యూనిట్ రు.1.46 పైసలు వ్యయం అవుతుంది. ఇది చాలా లాభదాయకమైనది. ఫ్యాక్టరీలు వొలాసిస్ మరియు ఫిల్టర్‌కేక్‌కు వచ్చిన ఆదాయం మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు. ఒకటన్ను పంచదార క్రషింగ్ చేయడానికి 300 రూపాయలు వ్యయం అవుతుంది. బగాస్ ఆదాయాన్ని క్రషింగ్‌కు చెల్లించినా ఆ విధంగా పంచదార ధరను పూర్తిగా ఫ్యాక్టరీలే కొట్టేస్తున్నాయి. కానీ, ఫ్యాక్టరీల వారు పంచదార నిల్వలు పెరిగాపోయాయని, మార్కెట్‌లో పంచదార ధర తగ్గిపోయిందని ప్రచారం చేసి రైతాంగానికి వీలైనంత తక్కువ ధరకు చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పై వాస్తవాలు గమనిస్తే ఫ్యాక్టరీల వాదనలలోని పస తెలుస్తుంది. ఫ్యాక్టరీలకు కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. వీరికి మరిన్ని లాభాలు కట్టబెట్టడానికి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రంగరాజన్ కమిటీని వేసింది. ఆ కమిటీ ఫ్యాక్టరీల వారికి లాభాలు కలిగించే విధంగా ఏడు సూచనలు చేసింది.
కమిటీ సూచనలు :
1) రాష్ట్ర ప్రభుత్వాలు సలహా ధర విధానాన్ని రద్దుచేయాలి. కేంద్రం ప్రకటిస్తున్న ఎఫ్‌ఆర్‌పి ధరను అమలు చేయాలి.
2) లెవీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన చక్కెరను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాలి. దానికి అవసరమైన సబ్సిడీ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి.
3) చక్కెర అమ్ముకోవడానికి ఎప్పటికప్పుడు పర్మిట్ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి. ఫ్రీగా ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఇవ్వాలి.
4) చక్కెర ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేయాలి. ఎగుమతి, దిగుమతి సుంకాలను 5శాతం నుండి 10 శాతం మధ్య పరిమితం చేయాలి.
5) చెఱకు కొనుగోలుకు ఫ్యాక్టరీల మధ్య ఉన్న జోన్‌ల విధానాన్ని రద్దు చేయాలి. ఫ్యాక్టరీకి అవసరమైన చెరకు ఎక్కడనుండైనా కొనుగోలు చేసుకొననివ్వాలి.
6) జనపనార సంచులు వాడాలనే నిబంధనలు, మొలాసిస్ తదితర ఉప ఉత్పత్తుల అమ్మకంపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
7) పంచదార, ఉప ఉత్పత్తులపై పెట్టుబడులు, ఖర్చులు పోను వచ్చే నిఖర ఆదాయంలో 70శాతం రైతుకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి.
ఈ సూచనల వల్ల ఫ్యాక్టరీలకు విఫరీతమైన లాభాలు వస్తాయి. పంచదార వినియోగాన్ని పెంచడానికి గతంలో లెవీ విధానం ప్రభుత్వాలు తెచ్చాయి. 50శాతం నుండి నేడు 10శాతానికి లెవీని తగ్గించారు. లెవీ పంచదారకు ప్రస్తుతం కిలో రు.18.50 పైసలకు అమ్ముతున్నారు. లెవీ పంచదార 1972 డిశంబర్‌లో ప్రారంభించినప్పుడు కిలో రు.2.15 పైసలు ఉండగా, 2002లో రు.13.50 పైసలకు పెంచారు. లెవీ పంచదార ఎత్తివేతతో మన వినియోగం క్రమంగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో 263 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, 220 లక్షల టన్నులు వినియోగిస్తున్నాం. ఆ విధంగా 40 లక్షల టన్నులు మనం ఎగుమతిచేయాలి. అంతవరకు స్థానిక వినియోగాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కంట్రోల్ ఎత్తివేయడం ద్వారా వినియోగం తగ్గింది. ప్రపంచంలో సంవత్సరానికి తలసరి వినియోగం ఈ విధంగా ఉంది.
భారత్ 18.9 కిలోలు
అమెరికా 33.1 కిలోలు
క్యూబా 58.7 కిలోలు
బ్రిజిల్ 69.7 కిలోలు
ఆస్ట్రేలియా 48.4 కిలోలు
ప్రపంచంలో బ్రిజిల్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్పత్తిలోను బ్రిజిల్ ప్రథమ స్థానమే. చెఱకు ఉత్పత్తి మరియు ఉత్పాదక పెంచడానికి ప్రభుత్వం వైపునుండి ఎలాంటి పరిశోధనలు లేవు. ప్రయివేటు ఫ్యాక్టరీల వారు ఇచ్చిన టెక్నాలజీ ఆధారంగానే రైతులు చెఱకు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ యజమానులు అవలంభిస్తున్న చెఱకు ధర తగ్గింపు విధానాల ఫలితంగా చెఱకు విస్తీర్ణం నిలకడగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తగ్గింది. పంచదార దేశీయ ఉత్పత్తిలో మహారాష్ట్ర 34.09శాతం, ఉత్తరప్రదేశ్ 26.47శాతం, కర్నాటక 14.70శాతం, తమిళనాడు 9.03శాతం ఉండగా ` ఆంధ్రప్రదేశ్ 4.31శాతం వద్దనే ఉంది. చివరకు గుజరాత్ 3.8శాతం ఉత్పత్తి చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో 2000`01వ సంవత్సరం 2.17 లక్షల హెక్టార్లు కాగా, 2011`12లో 1.80 లక్షల హెక్టార్లకు తగ్గింది. అదే విధంగా ఉత్పత్తి 17,690 వేల టన్నుల నుండి 14,040 వేల టన్నులకు చెఱకు ఉత్పత్తి కూడా తగ్గింది. 2001లో హెక్టారుకు 81.4 టన్నులు ఉత్పత్తి కాగా, నేడు అది 2011`12 నాటికి 78 కిలోలకు తగ్గింది. మూడు అంశాల్లో(ఉత్పత్తి, ఉత్పాదకత, విస్తీర్ణం) ఆంధ్రప్రదేశ్ తగ్గుదలను సూచిస్తున్నది. చెరుకు పంటవల్ల రైతాంగానికి ఆదాయమేకాక ఎక్కువ పనిదినాలతోపాటు ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం వస్తుంది. గత 4`5 సంవత్సరాలుగా బేవరీస్ ఉత్పత్తి స్థానికంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు రు.20వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెడుతున్నది.(సెల్స్‌టాక్స్, దుకాణపు పన్నుద్వారా) ఇంతటి లాభదాయకమైన పంటను రైతులు పండిరచడానికి, నిరాశక్తత చూపడానికి ప్రభుత్వ విధానాలే కారణం.
దేశంలో విస్తీర్ణం, ఉత్పుత్తి, మొలాసిస్, ఉత్పాదకత, ఎగుమతి ` దిగుమతులు ఈ విధంగా ఉన్నాయి.
(విస్తీర్ణం లక్షల హెక్టార్లలో, పంచదార : కోట్ల టన్నులలో, మొలాసిస్ లక్షల టన్నులలో, ఉత్పాదకత : హెక్టారుకు చెరుకు కిలోలు, ఎగుమతులు, దిగుమతులు : లక్షల టన్నులలో)
పై గంణాంకాలను పరిశీలించినపుడు విస్తీర్ణం, పంచదార ఉత్పత్తి, ఉత్పాదకత ఏమాత్రం పెరగినట్లులేదు. చెరుకుపై పరిశోధనలు చేసి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వ పరంగా పరిశోధనలు జరుగుటలేదనడానికి ఈ అంకెలే నిదర్శనం. బ్రెజిల్ దేశంలో 25శాతం చెరుకు నుండి వచ్చిన విత్తనాలను పెట్రోల్‌లో కలిపి ఇంధనంగా వాడుకుంటూ పంచదార పరిశ్రమకు లాభం చేకూర్చుతూ దేశ ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు. అధిక దిగుబడినిచ్చు మేలైన చెరుకు వంగడాల కొరకు వివిధ ప్రాంతాలలో పరిశోధనా స్థానాల నుండి 75 రకాలను సేకరించి ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చెరుకు ఉత్పత్తిని పెంచడానికి కొత్త పరిశోధనలు చేపట్టాలి.
సబ్సిడీలు :
దూరపు సాళ్ళలో నాటిన మొక్కలకు, మొక్కతోట నాటిన వారికి, వేడినీటిలో శుద్ధి చేసి విత్తన తొటలకు సరఫరా, మొదటి పిలక వేసినవారికి, రెండవ పిలక వేసినవారికి, బోరు మరియు పైపులకు, పంపుసెట్లకు, ఆయిల్ ఇంజన్ల కొనుగోలుకు, జనరేటర్ల కొనుగోలుకు, కలుపు మరియు పురుగు మందులకు, సన్న చిన్నకారు రైతులకు వ్యవసాయ ఖర్చులకు, చెరుకు రైతు ముఠాకూలీల కొరకు ఖర్చులకు, లంక భూముల నుండి చెరుకు రవాణా నిమిత్తం, గ్రైనేజీ వ్యవస్థా మెరుగుపర్చులకు మరియు ఫ్యాక్టరీకి ట్రాన్స్‌పోర్టుకు, స్ప్రేయర్లకు, టైరు బండ్లకు, రబ్బరు ట్యూబులు మరియు లైనింగ్ పైపులకు, క్రష్షింగ్ జరుగుతున్న సమయంలో ప్రథమ చికిత్సకు మందుల పంపిణీకి సబ్సిడీలు ఇవ్వాలి. ఇవన్నీ లెక్కవేసినా టన్ను చెరుకుపై రు.300`400లకు మించదు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయిస్తున్న ధరలు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల వరకే ఉన్నాయి. మిగితా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌ఇపి పేర టన్ను చెరుకుకు రు.600`800లు ధర నిర్ణయిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన ఎస్‌ఎంపి మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్‌ఎపి కలిపి ఇతర రాష్ట్రాలలో రైతులకు ధర చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏమిటోకాని ఇక్కడి ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులపై ఏనాడూ బోనస్‌గాని, మద్దతు ధరగాని ఇచ్చిన పాపాన పోలేదు. అందువల్ల గిట్టుబాటుకాక క్రమంగా విస్తీర్ణం తగ్గిస్తున్నారు.
చెరుకు ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పరిశోధనలు చేపట్టాలి. ఫ్యాక్టరీల అక్రమ లాభాలకు అడ్డుకట్ట వేయడానికి భార్గవ ఫార్ములా, సిస్మా ఫార్ములను అమలు జరపాలి(ఫ్యాక్టరీలకు వచ్చిన 70శాతం లాభాలలో కంపెనీలు, రైతులు పంపిణీ చేసుకోవాలి. ప్రతి ఫ్యాక్టరీ యేటా ‘‘ఎల్’’ ప్రకటించాలి. అనగా లాభ నష్టం ప్రకటించాలి). రైతులకు కావలసిన విత్తనం, ఎరువులు, క్రిమిసంహారక మందులు, నీటిపారుదల సౌకర్యం బాధ్యతను కంపెలే తీసుకోవాలి. కటింగ్ మరియు ఫ్యాక్టరీకి ట్రాన్స్‌పోర్టు బాధ్యత కూడా కంపెనీదే. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఎంపి మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎపి ధరలను శాస్త్రీయంగా ప్రకటించాలి. వీటి అమలుకు రైతులతో ఫ్యాక్టరీ స్థాయిలో కమిటీలు వేయాలి. ఆ విధంగా చెరుకు ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టడంతో పాటు చెరుకు రైతులకు గిట్టుబాటు ఉండేవిధంగా విధానాలు రూపొందించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
14.11.2013

No comments:
Post a Comment