కేంద్ర ధరల నిర్ణాయక సంఘం ప్రతియేటా వ్యవసాయ పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు న్యాయ సమ్మతంగా లేవని, గిట్టుబాటు కావని, శాస్త్రీయ దృక్పథంతో గుణించి ధరలను నిర్ణయించాలని రైతులు, రైతుసంఘాలు కేంద్రప్రభుత్వానికి ఏటా వినతిపత్రాలు ఇవ్వడం, ఆందోళనలు చేపట్టడం జరుగుతున్నది. అయినప్పటికీ కేంద్రం గత సంవత్సరం ధరలపైన క్వింటాలుకు కొద్దిగొప్ప ప్రకటించడం చూస్తున్నాం. మద్దతు ధరలు ఏ ప్రాతిపదికపై నిర్ణయించాలి? దీనికి పాటించాల్సిన విధివిధానాలు ఏమైనా ూన్నాయా? కేంద్ర వ్యవసాయశాఖ దయాదాక్షిణ్యాలపై ప్రస్తుతం నిర్ణయిస్తున్న ధరల విధానానికి ప్రత్యామ్నాయాలు ూన్నాయా? వీటిని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించినప్పుడు మద్దతు ధరల నిర్ణయంలోని మర్మం బట్టబయలవుతుంది.
ప్రస్తుతం అమలవుతున్న విధానం
ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని కొన్ని వ్యవసాయ పంటలకు మాత్రమే ధరలు నిర్ణయించి కేంద్ర ధరల నిర్ణాయక సంఘానికి రికమెండ్ చేస్తాయి. రాష్ట్రాలు ధరలు నిర్ణయించేటప్పుడు ూత్పత్తి వ్యయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొని, ూత్పత్తి వ్యయానికి కొంత కలిపి రికమెండ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలనుండి వచ్చిన రికమెండేషన్స్‌ను క్రోడీకరించి ధరల నిర్ణాయక సంఘం తాను ఒక ధరను సూచిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖకు రికమెండ్ చేస్తుంది. దిగువనుండి ధరల ప్రాసెస్‌చేసి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించకుండానే చెత్తబుట్టకు అంకితంచేసి గత ధరలపై 20 నుంచి 100 రూపాయల వరకు క్వింటాలుకు ధరలను పెంచి ప్రకటిస్తున్నారు. ధరల నిర్ణాయక సంఘం నామకః ూందే తప్ప దాని రికమెండేషన్స్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరం. రాష్ట్రాలనుండి వచ్చిన రికమెండేషన్స్ కేంద్ర వ్యవసాయశాఖ ఎందుకు పరిగణనలోనికి తీసుకోవడం లేదు? ఆంధ్రప్రదేశ్‌నుండి ధాన్యానికి క్వింటాలుకు రూ.2,030/` ూండాలని ప్రభుత్వం రికమెండ్ చేయగా, గత సంవత్సరం రూ.1,110/`లకు నిర్ణయించారు. 2012`13లో దీనిని రూ.1,250/`లకు పెంచారు. గత సంవత్సరంపై 170 రూపాయలు పెంపుదల చూపారు. అదేవిధంగా పత్తికి 600ల నుండి 800లు, మినుములులను వెయ్యి రూపాయలకు గత సంవత్సరంపై ధరలు పెంచారు. కానీ ఈ ధరలు గిట్టుబాటుగా ూన్నాయా అని పరిశీలించినప్పుడు పెట్టుబడి పెట్టిన వ్యయం కన్నా ఈ ధరలు తక్కువగా ూన్నాయనేది స్పష్టమవుతుంది. 2012 జూన్ 28న కేంద్ర ప్రభుత్వం వరి సాగుకు అవుతున్న వ్యయాన్ని (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)ను పెంచుతూ ఎకరాకు రూ.14,300/`ల నుండి రూ.27000లు రుణాలివ్వాలని నిర్ణయించారు. అనగా క్వింటాలుకు రూ.1,250/`ల పెట్టుబడి వ్యయం అవుతుంది. గిట్టుబాటు కావడానికి డా॥ ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన ప్రకారం ూత్పత్తికి 50% కలిపినచో రూ.1,870/`లు క్వింటాలుకు కనీసంగా నిర్ణయించాలి. ఇది కూడా గిట్టుబాటు ధర కాదు. కేంద్ర ధరల నిర్ణాయక సంఘంగానీ, కేంద్ర వ్యవసాయశాఖకుగాని ధరలను నిర్ణయించే అధికారం రాజ్యాంగంరీత్యా లేదు. రాష్ట్రాలు వ్యవసాయ ూత్పత్తి ధరలను నిర్ణయించడం, వాటిని అమలుచేయడం రాజ్యాంగంరీత్యా బాధ్యతగా ూంది. కానీ రాష్ట్రాలు నిర్లక్ష్యం చేయడంతో కేంద్రం బాధ్యత తీసుకొని కనీస ధరలను 1982 నుండి నిర్ణయిస్తున్నది. తన సంస్థలద్వారా (ఎఫ్‌సిఐ, సిసిఐ, నాఫెడ్, ఆయిల్‌ఫెడ్, టుబాకో ఫెడరేషన్) ద్వారా కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ కొనుగోళ్లు చేయడంద్వారా రైతుకు కనీస పెట్టుబడినైనా గ్యారంటీగా ఇవ్వాలన్న లక్ష్యమే తప్ప గిట్టుబాటుధర కాదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. రాష్ట్రాలు, రాజ్యాంగాన్ని అమలు జరపకపోవడం ఫలితంగా నేడు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గడం, ఉపకరణాల ధరలుపెరగడం వలన రైతులకు గిట్టుబాటు కాకుండా ూన్నాయి. రాష్ట్రాలు ఎందుకు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయి.
ూదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోనే పరిశీలనచేస్తే రాష్ట్రంలో 150 లక్షల టన్నుల బియ్యం ూత్పత్తి అవుతున్నది. మరో 23 లక్షల టన్నులు కేంద్రంనుండి చౌక డిపోలద్వారా సరఫరా చేయడానికి సబ్సిడీ ధరలపై వస్తున్నాయి. మొత్తంగాను 173 లక్షల టన్నులు కాగా, ఇందులో 73 లక్షల టన్నులు రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తున్నారు. మరో 90 లక్షల టన్నులు ఎఫ్‌సిఐకు మిల్లర్లద్వారా ఇస్తున్నాం. మిగిలిన 10 లక్షల టన్నులు రాబోవు సంవత్సరానికి క్యారీ ఓవర్‌గా పెడుతున్నాము. ఎఫ్‌సిఐకు పెట్టే 90 లక్షల టన్నులలో 20, 30 లక్షల టన్నులు తగ్గించి వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు ఎగుమతిచేసి ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నారు. రాష్ట్రం వినియోగం మేరకు అన్ని పంటలను (ఆహార ధాన్యాలు అనగా బియ్యం, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ముతకధాన్యాలు, చెరుకు) సేకరించి ప్రాసెస్‌చేసి వినియోగదారులకు పంపిణీ చేయడం వలన అటు ూత్పత్తిదారునికి ఎక్కువధర, ఇటు వినియోగదారునికి తక్కువ ధరకు సరఫరా చేసే అవకాశం ూంది. కనీసం రాష్ట్రాల అవసరాలమేరకైనా మధ్య దళారీల పాత్రను తొలగిస్తే వ్యవసాయ దారులకు ప్రస్తుతం ఇస్తున్న ధరలపై 30, 40 శాతం ధర అదనంగా చెల్లించవచ్చు. ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం 2012 ఖరీఫ్‌లో సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.1,500/`లు ఇస్తానని ప్రకటించింది. బియ్యాన్ని కిలో ధర పెంచింది. కాని ఖరీఫ్ పంట రాకముందే వ్యాపారులు ప్రభుత్వ ప్రకటనను ఆధారం చేసుకొని బియ్యం ధరను 30`33 రూపాయలకు కిలోకు పెంచారు. మధ్య దళారీలు ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా అత్యధిక లాభాలు ఆర్జిస్తున్నాయి. ఇది ఒకవైపు కాగా, మరొక ముఖ్య అంశం ధరల నిర్ణయంలో ఇమిడి ూంది. దీనిని బహిర్గత పర్చకుండా ప్రభుత్వం తొక్కిపడుతున్నది.
కనీస వేతనాల నిర్ణయం
రాష్ట్ర లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రతి పనికి కనీస వేతనం నిర్ణయిస్తుంది. ఈ వేతనాల నిర్ణయం నిత్యావసర సరకుల ధరలపై ఆధారపడి నిర్ణయిస్తారు. నలుగురుగల కుటుంబానికి అవసరమైన బియ్యం, పప్పులు, నూనెలు, బట్టలు, ఇతర గృహ అవసరాలన్నింటిని లెక్కగట్టి దినకూలి, నెల వేతనం నిర్ణయాలు చేస్తున్నారు. ూదాహరణకు బియ్యం ధర కిలో 15 రూపాయలు ూన్నప్పుడు ఇతర ఖర్చులన్నీ కలిపి దినకూలీ 100 రూపాయలుగా నిర్ణయించారనుకుందాం. అదే కిలో బియ్యం ధర 20 రూపాయలు అయినప్పుడు దినకూలి 130గా నిర్ణయించాల్సి వస్తుంది. దీనినిబట్టి నిత్యావసర సరకుల ధరలు పెరిగినప్పుడల్లా వేతనాలు పెంచడం అనివార్యంగా జరగాలి. ప్రస్తుతం ప్రభుత్వం 8 పాయింట్లు ధరలు పెరిగినప్పుడు ఒక కరువు భత్యాన్ని పెంచుతున్నది. 7 పాయింట్లు పెరిగేవరకు పెంచదు. 8వ పాయింట్ పెరగగానే అనివార్యంగా కరువు భత్యం పెంచాలి. సరళీకరణ విధానాల ఫలితంగా నేడు శాశ్వత ూద్యోగులకు బదులు కాంట్రాక్ట్ ూద్యోగులు కోట్ల సంఖ్యలో పనిచేస్తున్నారు. ప్రైటేటు పెట్టుబడిదారుల వద్ద కూడా కోట్ల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. వీరికిచ్చే వేతనాలు కూడా లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించాల్సి ూంది. పనినిబట్టి వేతనం నిర్ణయిస్తారు. ఏదేమైనా ఆహార ధాన్యాల ధరలను అనుసరించి వేతనాలు నిర్ణయించబడతాయనేది వాస్తవం. అందువల్ల కోటానుకోట్ల మందిని పనిలో పెట్టుకొన్న పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వం వేతనాలు పెరగకూడదని కోరుకుంటారు. వేతనాలు పెరగకూడదని అనుకుంటే ఆహార ధాన్యాల ధరలు పెరగకూడదు. అందువల్ల ఆహార ధాన్యాల ధరలు పెరగకుండా ూండడానికి ప్రభుత్వం కనీస మద్దతు ధరల విధానాన్ని ప్రవేశపెట్టింది. కనీస మద్దతు ధరలను పెరగకుండా నియంత్రించడానికి వీలుగా వ్యాపారులు, ప్రభుత్వం నిరంతరం అనుసరిస్తుంటాయి. చివరకు వ్యాపారులు సిండికేట్‌గా మారి వ్యవసాయోత్పత్తులను కనీస మద్దత్తు ధరలకన్నా తక్కువకు కొనుగోలు చేస్తారు. ఒకవేళ నిత్యావసర సరకుల ధరలు పెరగగానే పెద్దఎత్తున ఆందోళనలు రావడం చూస్తున్నాం. అయితే సాధారణ పౌరునికి ఆహార భద్రత కల్పించడానికి నిత్యావసర సరకుల ధరలు అందుబాటులో ూండాలి. అందుకు తక్కువ ధరలకు ప్రభుత్వం సరఫరా చేయాలి. నేడు ‘‘ ఆహార పంపిణీ సబ్సిడీ’’ కేంద్ర ప్రభుత్వం ఏటా 64 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నది. ప్రస్తుతం తెచ్చే ‘‘ఆహార భద్రతా చట్టం’’వల్ల ఈ బడ్జెట్ 80 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా, ప్రస్తుతం దేశంలోని చౌక డిపోల ద్వారా పంపిణీ చేస్తున్న 5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలకు బదులు 7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆహార భద్రత చట్టం తెచ్చి తన సబ్సిడీని తగ్గించుకోవాలనుకుంటే మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరలు పెంచకుండా చూడాలి. అప్పుడు రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్ళాల్సివస్తుంది. ఇప్పటికే గత 10 సంవత్సరాలలో 2.6 లక్షలమంది రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రెండు దేశాల మధ్యలో యుద్ధం వచ్చినా ఇంతమంది మరణించి ూండరు! ఇటు రైతులకు గిట్టుబాటు ధర, అటు వినియోగదారులకు సరసమైన ధరలు కల్పించడం ఏవిధంగా సాధ్యమవుతుంది.
ఇతర దేశాలలో జరుగుతున్నదేమిటి?
ప్రతి దేశంలో ఆహార ధాన్యాల ధరలు పెరగకుండా ఆయా ప్రభుత్వాలు కొన్ని విధానాలు అనుసరిస్తున్నాయి. ఆ విధానాల ఫలితంగా ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నాయి. అమెరికా తన రైతాంగానికి 53% నుండి 80% వరకు ూత్పత్తికి రాయితీలు ఇస్తున్నాయి. జపాన్, జర్మనీలాంటి అభివృద్ధి చెందిన దేశాలేగాక అత్యంత వెనుకబడిన పాకిస్తాన్ దేశం 25%, బంగ్లాదేశ్ 27% రాయితీలు ఇస్తున్నాయి. తమ దేశ మార్కెట్లలో ప్రజలకు ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందిస్తున్నాయి. చైనాలో కూడా సహకార వ్యవసాయ క్షేత్రాలకు, రైతులకు పెద్దఎత్తున రాయితీలు ఇస్తూ నిత్యావసర సరకుల ధరలు పెరగకుండా నియంత్రించాయి. చైనాలో 5 కిలోల బియ్యం ధర 22 యువాన్‌లుగా ూంది. 5 వేల యువాన్‌ల వేతనం కలిగిన వ్యక్తి ఆహారం కొరకు 20 శాతానికి మించకుండా వ్యయం చేస్తున్నాడు. ఆ విధంగా ఇతర అవసరాలకు ఇబ్బందిపడనవసరం లేదు.
చివరకు మనదేశంలో కేరళ ప్రభుత్వం 2.5 ఎకరాలు గలిగిన రైతుకు విత్తనాలు, ఎరువులు పూర్తి రాయితీపై ఇస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం గత సంవత్సరం కేంద్రం నిర్ణయించిన ధాన్యం ధర రూ.1,110/`కి తోడుగా, మరో రూ.250/`లు తన సొంత బడ్జెట్‌నుండి ఇచ్చింది.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, ఋణాలు, ఎరువుల సరఫరా, మార్కెట్ సౌకర్యం బాధ్యతలు చూడాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులు, ఎరువుల సబ్సిడీ మరియు ఎగుమతి, దిగుమతుల వ్యవహారం మాత్రమే చూడాలి. ఈ రెండు ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి గిట్టుబాటు అయ్యేవిధంగా రాయితీలను ఇవ్వాలి. కానీ మన దేశ ప్రభుత్వం నేడు రైతులకు జిడిపిలో 2% మాత్రమే రాయితీ ఇస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఈ రాయితీ ఒక లెక్కలోనిది కాదు. దీనిని 1.7 శాతానికి తగ్గిస్తామని ప్రధాని ఈమధ్య ప్రకటించడం మరింత విస్మయానికి గురిచేస్తున్నది. క్రమంగా వ్యవసాయ రాయితీలు ఎత్తివేయడం ద్వారా గిట్టుబాటుకాక రైతులు వ్యవసాయం వదిలి పారిపోక తప్పదు. ఆ విధంగా వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థలను ప్రవేశపెట్టడానికి ముందుగా కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతిని తెస్తున్నారు. అందులో భాగంగా కాంట్రాక్ట్ మార్కెటింగ్ పద్ధతికి, ఇప్పటికే ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. 30 రోజుల గడువుపెట్టి సలహాలను కోరింది. 30 జూలై 2012తో ఆ గడువుకాస్తా ముగిసింది. ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఇకనుండి రైతులు మార్కెట్లలో కాంట్రాక్ట్ వ్యాపారులతో వ్యవసాయ ూత్పత్తుల కొనుగోలుకు అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. ఆ అగ్రిమెంట్ ప్రకారం తమ సరుకులకు విధిగా ఆ కాంట్రాక్ట్ వ్యాపారికే అమ్మాలి. అగ్రిమెంట్‌లో కుదుర్చుకున్న ధర రావాలంటే అందులో నిర్ణయించుకున్న నాణ్యతా ప్రమాణాల ప్రకారం సరుకు ూండాలి. సాధారణంగా వ్యవసాయ ూత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు ఎగుడు దిగుడులుగా ూంటాయి. 100 గ్రాముల టమోటాలు 10 క్వింటాళ్లు సరఫరా చేస్తానని రైతు అంగీకరిస్తే ూత్పత్తి అయిన తర్వాత ఆ టమోటా బరువు 100 గ్రాములకు హెచ్చుగాను, తక్కువగాను ూండవచ్చు. అప్పుడు కొనుగోలు దారు అభ్యంతరం పెడతాడు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రంగుమారితే కొనుగోలుకు నిరాకరించవచ్చు. అదేవిధంగా నిర్ణయించిన 10 క్వింటాళ్లకు అదనపు ూత్పత్తిని కొనుగోలు చేయరు. తక్కువ ూత్పత్తివస్తే నష్టం ఇవ్వమంటారు. ఈ విధంగా కాంట్రాక్ట్ వ్యాపారస్తుడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం సరుకు లేకపోవడం ఫలితంగా రైతుకు అతి తక్కువ ధర ఇచ్చి అతని ూత్పత్తులు కొనుగోలు చేయడానికి ఆస్కారం ూంది. ఈ అగ్రిమెంట్‌లో ప్రభుత్వ జోక్యంగానీ, మార్కెట్ జోక్యంగానీ ూండవు. దీనిపై అపీల్ లేదు. అనివార్యంగా రైతు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. కనీస మద్దతు ధర అడిగే హక్కును కోల్పోతాడు.
మార్కెట్ సంస్కరణలు చేసి రైతుకు మరింత ధరను తగ్గించే విధానాలను ప్రభుత్వం అనుసరిస్తున్నది. అందువల్ల ప్రస్తుత విధానాలకు స్వస్తిపలకాలి.
ఆహార ధాన్యాల ధరలు పెరగకూడదని అనుకున్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ూపకరణాలను పూర్తి రాయితీపై రైతులకు సరఫరా చేయాలి. పెద్దఎత్తున క్రిమికీటకాల దాడి జరిగినప్పుడు ప్రభుత్వమే క్రిమి సంహారక మందులు ూచితంగా స్ప్రే చేయాలి. వ్యవసాయ ూత్పత్తి పెరుగుదలకు భూసార పరీక్షలు, సాగునీటి వనరులు, వ్యవసాయ యంత్రాల సరఫరా ూచితంగా చేయాలి. అప్పుడు రైతుపై పెట్టుబడిభారం తగ్గుతుంది. ూత్పత్తి వ్యయం తగ్గడంతో ధరలు పెంచాల్సిన అవసరం అంతగా ూండదు. కానీ ప్రస్తుతం ూపకరణాల ధరలు విపరీతంగా పెంచుతూ ఆ దామాషాలో వ్యవసాయ ూత్పత్తుల ధరలు పెంచకపోవడం గమనించాలి. గత పంటకాలంలో ఎరువుల ధరలు 120% ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా విత్తనాల ధరలు 50`60 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరకుల చట్టం క్రిందకు తెచ్చి పెంచింది. ఈ ప్రభుత్వాలే ఒకవైపున ూపకరణాల ధరలను పెంచి వ్యాపారస్తులకు లాభం కలిగిస్తూ... మరోవైపు వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పెంచకపోవడం గమనించాలి. శాస్త్రీయ పరిశీలనచేసి పెట్టుబడికి అదనంగా ధర వచ్చేటట్లు మద్దతు ధరల నిర్ణయం ూండాలి. ‘‘గిట్టుబాటు ధర అంటే 5 ఎకరాలలోని ఒక పంటకయ్యే వ్యయం మరియు నలుగురు కుటుంబ సభ్యుల వార్షిక వ్యయం కలిపివేసి, ఆ 5 ఎకరాలలోని సగటు దిగుబడి పంటతో బాగాహరించగా, వచ్చినది గిట్టుబాటుధర అవుతుంది.’’ అనగా నలుగురు కుటుంబ సభ్యులు 5 ఎకరాల భూమిపై వచ్చే ఆదాయంతో ఎలాంటి రుణం లేకుండా జీవించాలి. కానీ ఇందుకు భిన్నంగా మన దేశంలో జరుగుతున్నది.
ప్రస్తుతం వినియోగదారుడు చెల్లించే ధరలో ూత్పత్తిదారునికి 30% మాత్రమే గిట్టుబాటు అవుతున్నది. 70% మధ్య దళారీలు కాజేస్తున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం వ్యవసాయ ూత్పత్తుల వ్యాపారంద్వారా మధ్య దళారీలు ఏటా 50 వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇందులో పాలకులకు కొంత ముట్టచెప్తున్నారు.
కనీస మద్దతు ధరల నిర్ణయంలోని మర్మం శాస్త్రీయంగా పరిశీలిస్తే ప్రస్తుత విధానం అట్టి లోపభూయిష్టంగా ూంది. కనీసం వేతనాలను దృష్టిలో ూంచుకొని నిర్ణయించే మద్దతు ధరల విధానాన్ని ప్రభుత్వాలు విడనాడాలి. ూత్పత్తిదారునికి, వినియోగదారునికి ధరల వ్యత్యాసం తగ్గించాలి. మధ్య దళారీలను తొలగించాలి. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం రాయితీలు పెంచాలి. వ్యవసాయ ఉపకరణాల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అదేదామాషాలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పెంచాలి. ఆ విధంగా ధరల విధానాన్ని రూపొందించాలి, ధరల నిర్ణయంలో మరియు సేకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన బాధ్యత వహించాలి.
(30`07`2012)
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment