Tuesday, 12 August 2014

వరంగల్‌ జిల్లాలో భూపోరాటాలు-2

    వరంగల్‌ జిల్లా మానుకోట (మహబూబ్‌బాద్‌) పట్టణంలో100 ఎకరాల గేట్‌ నంబరు 60 పేద కుటుంబాలు సాధించుకున్నారు. జిన్నారెడ్డి దేశ్‌ముఖ్‌ల గుండాలు, మితవాదులు ఎన్ని ఆటంకాలు కల్పించినా సాగుదార్లు ఖబ్జాలోనే వున్నారు. వరంగల్‌ తాలూకా పెద్దాపురం, కొమ్మాల గ్రామాలలో 55 ఎకరాలు 100 కుటుంబాలు అక్రమించారు. ఈ తాలుకాలోనే కోగిల్‌వాయి గ్రామంలో 100 ఎకరాల బంజర్లను రాజకీయ బాధితులకు కట్టబెట్టాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలను ఎదిరించి దక్కించుకున్నారు.
    1969 జూన్‌లో వరంగల్‌ జిల్లా నర్సంపేటలో బంజర్ల పోరాటం ఉధృతంగా సాగింది. కమ్మెపల్లిలో 100 నాగళ్లతో 400 మంది వలంటీర్లు గ్రామంలో జంజరు భూమిని అక్రమించి దక్కించుకున్నారు. ఈ తాలూకాలో 14 గ్రామాలలో 258 ఎకరాలు 269 కుటుంబాలు దన్నుకున్నాయి. మరో 14 గిరిజన గ్రామాల్లో 1550 ఎకరాల మహసురా భూములను 1090 కుటుంబాలు పోడుగొట్టి కోయలు దక్కించుకున్నారు. అంతేగాక ఫారెస్ట్‌ విస్తరణ పథకం క్రింద మర్రిగూడెం, మహదేవునిగూడెం, కాట్నాగారం, ఎల్లాపురం, చింతగూడెం, బావురు గొండ, గంగారం, కామారం, పుట్టలభూపతి మొదలగు గ్రామాల్లో 1956లో కోయల కాస్తులోనున్న భూమిని ఫారెస్టులో కలుపుకున్నారు. దీనినంతటినీ తిరిగి స్వాధ్వీనం చేసుకున్నారు. 1970లో భూస్వాముల స్వాధీనంలో వున్న ప్రభుత్వ బంజరును పునరాక్రమణ చేసుకోవడం జరిగింది. తిమ్మంపేట కేంద్రంగా ఒక ఉద్మమంగా సాగింఇ. తిమ్మంపేట గ్రామంలో 110 ఎకరాల బంజరుభూములను ధనిక రైతుల స్వాధీనం నుండి బైటకు తీయడం జరిగింది. ధనిక వర్గమంతా ఏకమై పేరలపై నిర్భంధాలు చేసారు. ఈ ఆందోళన ప్రక్క గ్రామాలకు విస్తరించింది. నర్సంపేట కాంగ్రెస్‌ నాయకుల ప్రోత్సాహంతో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి సమీకరించి 1971 ఆగస్టు 6న తిమ్మపేట గ్రామంపై దాడి చేసారు. పేదలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, సిపియం పార్టీలు సమైఖ్యంగా ఆ దాడిని త్రిప్పికొట్టారు. దాడిచేసిన కాంగ్రెస్‌ వారికి అనుకూలంగా పేదలపైన 74 మందిపై హత్య ప్రయత్నం కేసుపెట్టారు. ఈ కేసులో రచయిత కూడా ఉన్నారు. అయినా పేదలు భూములు వదలకుండా స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయం చుట్టుప్రక్కల గ్రామాలకు ఉత్తేజాన్నిచ్చింది. 14 గ్రామాలలో 91 మంది భూస్వాముల ఆక్రమణలో వున్న 209 ఎకరాలను 640 కుటుంబాలు తిరిగి అక్రమించుకున్నాయి. మరో 7 గ్రామాలలో కొత్తగా 100 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం భూముల అక్రమణ సందర్భంగా  పోలీసుల నిర్భంధం ఎదుర్కోన వలసి వచ్చింది. మాదన్నపేటలో పోలీసుక్యాంపు పెట్టి ఘోరంగా హింసించారు. జిల్లాలో వివిధ రకాల భూములు 4,000ఎకరాల వరకు అక్రమించి సాగుకు పూనుకున్నారు. 1971 జూన్‌ 3వ తేదీన రెబల్లె గ్రామంలో కుసుంబ లింగంను భూస్వాములు హత్యచేసారు. అయినా సంఘం నాయకత్వాన భూమి దక్కించుకున్నారు.
    అశోక్‌నగరంలో బంజరు 600 ఎకరాల పోరాడి సాధించుకున్నారు. అక్కడ తీవ్ర నిర్భంధం సాగింది. 1971 ఆగస్టు 18న అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు, పార్లమెంట్‌ సభ్యులు శ్రీ ఎ.కె గోపాలన్‌ గారు తిమ్మంపేట, మాదన్నపేట, అశోక్‌నగరం గ్రామాలు తిరిగి అదే రోజున నర్సంపేట్‌లో బహిరంగ సభ జరిపారు. ఆ సభకు 20 వేల మంది పేదరైతులు, గిరిజనులు వచ్చారు.
    1968 జూలై 10 నుండి ప్రత్యేక తెలంగాణా వాదం ఒక సంవత్సరం పాటు ఉధృతంగా సాగింది. తెలుగు జాతి సమైక్యతను విఛ్చిన్నం చేయడానికి, ప్రజా ఉద్యమాలను చీల్చడానికి దోపిడి వర్గాల చేతుల్లో ఇది పాచికగా ఉపయోగపడిరది. దీనికి కాంగ్రెస్‌ నేత మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. 13 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌ను అవిచ్చన్నంగా పాలించిన కాంగ్రెస్‌ సమైక్యతను చేకూర్చక పోగా, విచ్చిన్నానికి ప్రాతిపదిక తయారు చేసింది. కాంగ్రెస్‌లో వున్న స్వార్ధపర ముఠాలు తమ పదవులు వేటలో పనిముట్టుగా  వాడుకున్నాయి. దీనికి పెట్టుబడిదారులు, వ్యాపారులు, భూస్వాముల మధ్యనున్న వైరుధ్యాలు తోడయ్యాయి. అసలు తెలుగువాళ్లే కాని వ్యాపరస్తులు ప్రధాన పాత్రదారులుగా, పోషకులుగా వుండటం గమానార్హం. స్థానిక తత్వాలను రెచ్చగొట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఎక్కువగా దీనికి బాసటగా నిల్చారు. హైద్రాబాద్‌, వరంగల్‌ పట్టణాలు ఇందుకు కేంద్రాలైనాయి. ఈ విచ్ఛిన్న ఉద్యమంలో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది హింసకు, అవమానాలకు గురయ్యారు. అధికారంలో వున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఉద్యమొ చేస్తున్నది. కాంగ్రెస్‌వాదులు. ఈ అల్లర్లలో 50 కోట్ల ఆస్థులకు నష్టం వాటిల్లింది. విద్యార్ధులకు ఒక సంవత్సరం చదువు నష్టపోయింది. విచ్ఛన్నవాదులు కాంగ్రెస్‌ నుండి విడిపడి ‘‘ తెలంగాణా ప్రజా సమితి’’ పార్టీగా ఏర్పడి పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసారు. 11 స్థానాలకు 10 స్థానాలు గెల్చుకున్నారు. ఆ బలాన్ని ఆధారం చేసుకొని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రజాసమితితో బేరసారాలు సాగించి, ప్రజా సమితి నాయకులకు పదవులు కట్టబెడ్డామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 1968 జనవరి 18,19 తేదీలలో ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి అభిల పక్షంతో సమావేశం జరిపారు. దాని ఫలితంగా ప్రధాని ఇందిరాగాంథీ 1969 ఏప్రిల్‌ 11న 8 సూత్రాల పథకం పార్లమెంట్‌లో ప్రకటించారు. దాంతో విచ్ఛిన్నవాదుల యాత్ర పరిసమాప్తమైంది.
    వరంగల్‌ జిల్లా నర్సంపేట తాలూకాలో వడ్డీ, నాగుల తగ్గింపు ఉద్యమం 1969 నవంబరులో ప్రారంభమై 1970 ఫిబ్రవరి వరకు సాగింది. సరిగ్గా 1969 అక్టోబర/ నెలలో ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ కల్లోలిత ప్రాంతంగా ప్రాకటించింది. (నగ్జలైటు ఉద్యమంవలన) అందువలన సభలకు, ప్రదర్శనలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినా గ్రూపు సమావేశాలు జరిపి పోరాటాలు సాగించారు. ఏజెన్సీ ప్రాంతాలైన సీతానగరం, వించగూడెం. మొండ్రాయిగూడెం, మొకాళ్లపల్లి, రాంపురం, ఎదుల్లపల్లి, రంగప్పగూడెం, ఎర్రారం గ్రామాలలో 370 కుటుంబాలు 241 పుట్ల ధాన్యం (పుట్టిR10 బస్తాలు) నాగుకు తీసుకున్నారు. బస్తాకు అదనంగా ఆరు మాసాలకే అరబస్తా ఇచ్చే నాగును, పోరాటం ద్వారా పావుబస్తాను తగ్గించుకున్నారు.
    వరంగల్‌ జిల్లా నర్సంపేట తాలూకాలో బందంపల్లెలో బుసారి శాంతమ్మను మరియు 1969లో బుదరావుపేటలో రైతు స్త్రీ పై ఎండ్రిన్‌ పొసి చంపారు. అనంతపురం జిల్లా కొండాపురంలో రైతుసంఘం కార్యకర్త పి.నాగిరెడ్డి లను భూస్వాములు హత్యలు చేసారు. ప్రభుత్వం, భూస్వాములు కలసి ఉద్యమాలను నెత్తుటిలో ముంచారు. అయినా తమ చట్టబద్ద, న్యాయమైన సమస్యలకు రైతులు, వ్యవసాయ కార్మికులు సంఘటితంగా ఉద్యమాలు నిర్వహించడం ప్రత్యేకంగా గమనించాల్సి వుంది. 5 వేల మంది కేసులలో ఇరికించబడి అనేక ఇబ్బందులకు గురైనారు.
    వరంగల్‌ జిల్లా పసర ఏరియాలోని లక్కావరం బంజర్ల నుండి సాగుదార్లను తొలగించే ప్రయత్నాన్ని నిరోధించడమే కాక 400 ఎకరాలు పట్టాలు సాధించారు.
ఉన్న పరిమితులలో ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా సోదర సంఘాలతో కలిసి పౌర హక్కుల పునరుద్ధరణకు సంఘం ఆందోళనలు చేసింది. 1973 ఫిబ్రవరి నుండి 1978 మార్చి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ఉన్నారు. కమ్యూనిస్టులంటెనే గిట్టని ముఖ్యమంత్రి  తన కాంగ్రెసు పార్టీ వారి ద్వారా ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలలో తీవ్రనిర్భంధకాండ, హత్య కాండ సాగించడం దేశంలో ఇందిరాగాంధీ ఏమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) ప్రకటించిన 26 జూన్‌ 1975 తర్వాత రాష్ట్రంలో ప్రజా ఉద్మమాలపై మరింత నిర్బంధం పెరిగింది. నగ్జలైట్ల ఉద్యమాన్ని అణచే పేరుతో గిరిజన ప్రాంతాలపై పోలీసుల ఉక్కుపాదం మోపి, వారిని స్థిరంగా నివాసముండ కుండా నిర్బంధం సాగించారు. 1977 మార్చిలో జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చింది. దాంతో ప్రజా ఉద్యమాలపూఐ కాస్తా నిర్బంధం సడలించబడిరది. మీసా, ఎస్మా, కల్లోలిత ప్రాంత చట్టం, ప్రివెంటిల్‌ డిటెన్షన్‌ చట్టం (పి.డి.ఆక్ట్‌) లాంటి నల్ల చట్టాలకు తిలోదకాలిచ్చారు.
    నిర్భంధం సాగిన కాలంలో వేలాది మందిపై కేసులు, ముఖ్యకార్యకర్తలు హత్యలకు గురైనారు. ఒక వరంగల్‌ జిల్లాలోనే 3000 మందికి పైన అక్రమ కేసులు, బనాయించడమేకాక, 45 మంది కార్యకర్తలను హత్యలు చేసి చంపారు. నల్లగొండలో చకిలం శ్రీనివాసరావు, ఖమ్మంలో సామినేని ఉపేంద్ర, వరంగల్‌లో మంత్రి టి. హయశ్రీవ చారి లాంటి వారు కాంగ్రెసు ముఠాలకు నాయకత్తం వహించి ప్రజా ఉద్యమాలపై  ప్రత్యక్ష, పరోక్ష దాడులు సాగించారు. భూసంస్కరణ మాటెఎత్తని పరిస్థితి కల్పించారు. చివరకు భూస్వాముల వద్ద అక్రమంగా నున్న బంజర్లు కూడా పోరాటాల ద్వారా సాధించాల్సి వచ్చింది. నగ్జలైట్ల పై జరిగిన హత్యాకాండను రైతు సంఘం ఖండిరచడమేకాక భార్గవా కమీషన్‌ ముందు సాక్ష్యాలు చెప్పించి, ప్రభుత్వ దమన కాండను బహిర్గతం చేసింది. విసృత ప్రచారం చేసింది. ఎన్ని నిర్భందాలు సాగించినా ప్రజలు, రైతు, కూలీలు సంఘటితంగా నిలిచి అనేక త్యాగాలు చేశారు.
    1978లో వరంగల్‌ జిల్లాలో నర్సంపేట, ములుగు, వరంగల్‌, జనగామ మానుకోట తాలుకాలో 8230 మంది పోరాటాలలో పాల్గొన్నారు. మిగులు భూములు 5428 ఎకరాలు, బంజరాయి 172 ఎకరాలు, సాగుకులాయకైన అడవి బంజరు 610 ఎకరాలు, ఇండ్ల స్థలాలు 93 ఎకరాలు మొత్తం 6103 ఎకరాలు అక్రమించబడిరది. 115 మందిని కేసుల్లో ఇరికించారు. జనగామ తాలుకా ఫతైపూర్‌ లో 12 ఎకరాలు, పడమటి కేశ్వాపురంలో 12 ఎకరాలు జీడికల్లు దేవస్థాన భూమి 500 ఎకరాలు పేదలు స్వాదీనం చేసుకున్నారు.
    బచావతు ట్రిబ్యునల్‌ ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన నీటిని వినియోగంలోకి తీసుక వచ్చే విధంగా పథకాలు తయారు చేయాలని, మెట్ట ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణంలోనున్న 5 ప్రాజెక్టులు 10 సంవత్సరాలలో పూర్తిచెయ్యాలని రాష్ట్ర మంతటా ఆందోళనలు సాగాయి.
     శ్రీరాంసాగరన రెండవ దశ నిర్మాణం పూర్తి చేయాలని, వరద కాలువ పని ప్రారంభించాలని వరంగల్‌ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. పై రెండు సమస్యలు వివరాస్తూ 4000 బుక్‌లెట్స్‌ వేసారు. 200 గ్రామాలలో ప్రచారం జరిపి, మండల, జిల్లా కేంద్రాలవద్ద ధర్నాలు జరిగాయి. ప్రజా ప్రతినిధులను ఘెరావ్‌ చేశారు. జిల్లా బంద్‌ ప్రకటించారు. పార్లమెంట్‌ సభ్యులు ధర్మబిక్షం, బి.ఎన్‌.రెడ్డి, జయపాల్‌రెడ్డిలచే జనగామలో బహిరంగ సభ జరిగింది. వరంగల్‌ జిల్లా వ్యాపితంగా ఉద్యమం సాగింది. మండలాల బందుజరిగింది. పోరాటం ఉధృతం కావటానికి అఖిల పక్ష కమిటీలు వేసారు. కాంగ్రెసు, తెలుగుదేశం, బి.జె.పి.రైతు సంఘాల వెనుక నున్న రైతులు కూడా పాల్గొని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చారు. వందలాది గ్రామాలలో బహిరంగ సభలు జరిగాయి. లక్షల కరపత్రాలు వేసారు. ఎక్కడకు వెళ్ళినా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నిర్మాణం పూర్తి చేయాలన్న చర్చలే సాగాయి. అందరిని కలుపుకరావడంలో సంఘం కృషి ఎంతో ఉంది. 1963లో ప్రధాని జవహర్‌లాల్‌  శంకుస్థాపన చేసిన మొదటి దశకు నిధులు కేటాయించడమేకాక, రెండవ దశకు ప్రధాని ఇందిరాగాంధీతో కల్సి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు 4మే 1984న శంకుస్థాపన చేశారు. వరద కాలువ పోరాటం కొనసాగింది. అఖిల పక్ష కమిటీ వేసి పోరాటాన్ని ఉధృతం చేయడం ఫలితంగా ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరి చేయించి పనులు ప్రారంభించింది. చివరకు వరద కాలువ ప్రాజెక్టు ప్రధాని పి.వి. నర్సింహారావు శ్రీరాంసాగర్‌ తీర ప్రాంతం ముపుకాల్‌ గ్రామంవద్ద 30 జూన్‌ 1993న శంకుస్థాపన చేశారు.
    వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో అసరవెల్లి ‘‘నిర్జన గ్రామం’’ 525 ఎకరాల భూమిని పేదలు అక్రమించినారు. ఈ భూమి రెవెన్యూ భూమిగా నమోదు ఉన్నా ఫారెస్టువారు తమ భూమియని యూక లిప్టస్‌ చెట్లు నాటారు. ఆ చెట్లను నరికివేసి 200 మంది భూ అక్రమణ ఉద్యమం చేసారు. 60 మందిపై కేసు పెట్టారు. 1986 సెప్టెంబరు 29న మరియు అక్టోబరు 4న సదస్సులు జరిపారు. 110 మంది 220 ఎకరాలు కాస్తు వ్రాయించారు. అటవీ శాఖ వారు హైకోర్టు వరకు కేసులు పెట్టారు. అయినా సంఘం నాయకత్వాన పట్టుదలతో మొత్తం 525 ఎకరాల భూమిని అక్రమించడమేకాక 150 ఇండ్లు నిర్మాణం చేసి గ్రామం ఏర్పాటు చేశారు. ఈ పోరాటాన్ని దెబ్బ కొట్టాలని పాలక వర్గాలు, వారతైనాతీలు తీవ్ర ప్రయత్నం చేసారు. నేడు ఆ గ్రామానికి సాగునీరు బావులు, విద్యుత్‌ ఏర్పాటు చేసుకొని పేదలు జీవిస్తున్నారు. గతంలో ఉద్యమం నుండి వెళ్ళిపోయిన ద్రోహులు కొందరు పాలక పక్షంలో చేరినా నేటికి ఆ భూమి పేదల సాగులోనే ఉంది. పోరాట నాయకులపై కేసులేకాక తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసారు. అశోకనగరంలో పాఖాల చెరువువెనక సంగెం కాలువను యున్న అడవి బంజరు 1100 ఎకరాలలో 500 ఎకరాలు అక్రమమించారు. పేదల మాగాణిగా చేసుకుంటున్నారు. మిగిలిన 600 ఎకరాలు కూడా 600 మంది అక్రమించి పేదలు దక్కించుకున్నారు. 1986 అక్టోబరు 22న పేదలతో సదస్సు జరిపారు. 150 మందిపై 8 కేసులు పెట్టారు. ఈ భూ పోరాటంను దెబ్బతీయాలని కాంగ్రెసు  వారు అరాచక శక్తులు కూడా దీసి, పోలీసు సహకారంతో అశోకనగరం గ్రామంపై దాడి చేసారు. 1980 నుండి ఈ భూమి పై పోరాటాలు సాగాయి. 1981 జనవరి 25న గ్రామాలపై 200 మంది సాయుధ గుండాలు దాడి చేసి, మన్నూరిచినస్వామి, వేల్పులకోటయ్యలను హత్యచేశారు. తిరిగి 1986లో దాడి చేసి పన్నీరు యాదగిరిని హత్య చేసారు. ఈ భూపోరాటంలో 6గురు ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఆ భూములను దక్కించుకున్నారు. ములుగు డివిజన్‌లో రంగాపురంలో ప్రాజెక్టు నిర్మిస్తున్న సందర్భంగా రంగాపురం గ్రామస్థులకు భూములిస్తామని అక్కడికి రమ్మని, ఇండ్లు కట్టించారు. కాని భూములు ఇవ్వలేదు. అక్కడి గిరిజనులు 200 ఎకరాలు సంఘ నాయకత్వాన అక్రమించకుని సాగు చేసారు. ఈ భూముల సాదనకు పోరాటాలు సాగాయి. సేద్య భూమిని అనుకుని ఉన్న అడవి బంజరు 600 ఎకరాలు పట్టాలివ్వాలని చేసిన పోరాటాల ఫలితంగా 400 ఎకరాలు తెలుగు  దేశం మంత్రి అజ్మీర చందులాల్‌చే పట్టా ప్రధానం జరిగింది. కాని భూములు చూపలేదు. భూ స్వాములు ఈ భూములు తామే దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసారు. చివరకు గ్రామాల మధ్య తగాదగా మారింది. ఈ భూములపైకి అతివాద కమ్యూనిస్టు పార్టీలు ఒక వైపు చేరి వాస్తవ సాగుదార్లపై కాల్పులు చేసారు. అయినా సాగుదార్లు గిరిజనులు భూములు సాధించుకున్నారు. ఈ పోరాటంకు జిల్లా అంతటా స్పందన వచ్చింది.
    జనగామ డివిజన్‌ చేర్యాల మండలంలో నాగపురి` గురవన్నపేటల మధ్య 2000 ఎకరాల ఫారెస్టు బంజరున్నది. ఇందులో 500 ఎకరాలలో తుప్పులు  తప్ప మిగిలిన భూమి సేద్య యోగ్యంగా ఉంది. ఈ భూమిని పేదలకు పంచాలని 24 గ్రామాల నుండి వచ్చిన వారితో సదస్సులు ఆందోళనలు సాగాయి. చెట్టుపట్టాలకైనా ఇవ్వాలని ప్రజలు కోరారు. నేటికి ఆ భూమిలో అడవి పెంచకుండా, ప్రజలకు సాగుక్వికుండా బీడుగానే వుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ప్రతీకగా ఉంది. పతషాపురంలో  చెరువు లోతట్టులో 12 ఎకరాల భూమిని హరిజనులు చాలాకాలం సాగు చేస్తున్న దానిని భూస్వాములు కుట్రలు చేసి వారిని బేదఖల్‌చేయ పూనుకున్నారు. పేదలు ఐక్యంగా  నిలబడి పోరాడుతున్నారు. మహబూబ్‌బాద్‌ డివిజన్‌లోని రాజోలు కో` ఆపరేటివ్‌ పార్మింగ్‌ సొపైటీలో యున్న 25 మంది హరిజనుల భూమిని డైరెక్టరు అక్రమంగా స్వాదీనం చేసుకున్నాడు. అట్టి భూమిని తిరిగి హరిజనులకు  సంఘం దక్కించటానికి కృషి చేసింది. జనగామ డివిజన్‌ ఎల్లంలలో 31 ఎకరాలు, పడమటికేశ్వాపురంలో 4 ఎకరాలు, జీడికల్లులో 8 ఎకరాలు మిగులు భూములు 64 కుటుంబాలకు దక్కించారు.ఇవి ఉద్యమం ద్వారానే సాధ్యమైంది.


    ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ` వేలమంది పై ఆక్రమ కేసులు బనాయించారు. ` సంవత్సరాంత కోర్టు చూట్టూ తిరిగారు` లాఠీ దెబ్బలు,

సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment