2012`13లో వ్యవసాయరంగంలో 4శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 2.5శాతం మాత్రమే సాధించబడినట్లు, ఇందుకు ప్రకృతి వైపరీత్యాలు కారణమైనట్లు ప్రభుత్వం తన బడ్జెన్ నివేధికలో తెలిపింది. 2012`13సంవత్సరానికి 228.15లక్షల టన్నులు లక్ష్యంగా నిర్ణయించారు. లక్షాయాలు ఎప్పుడూ సాధించిన దాఖలాలుగాలేవు. వ్యవసాయశాఖ ప్రణాళికాబద్దమైన ఉత్పత్తికి తగు పత్రాలు ప్రకటించటమే తప్పా అవి అమలు జరుగుతున్నవి లేనిది పరిశీలించలేదు. ప్రస్తుత సంవత్సరం ఆహార ద్యాన్యాల ఉత్పత్తి ముందస్తుగా 170.78లక్షల టన్నులుగా ఆర్థిక గణాంకశాఖ అంచనా వేయగా వ్యవసాయ శాఖ 178.27లక్షల టన్నులుగా అంచనా వేసింది. ఈ ఉత్పత్తి తగ్గటానికీ 234మండలాలు కరవుకు గురికావడం 2012`13లో రబీ పంటకు బదులు మొక్కజొన్న, పొద్దితిరుగుడు, మినుము పంటలు సాగుచేయమని సలహాలివ్వడం కారణంగా ప్రభుత్వం చెప్పుకుంది. 2009`10లో 1105మండలాల్లో 1068మండలాలు కరువుకు గురయ్యినప్పటికీ ఆహారదాన్యాల ఉత్పత్తి 155.96లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. ఇదేలా సాధ్యమైంది.? 234మండలాలు కరువుకు గురైతేనే 50లక్షల టన్నుల ఆహార దాన్యాల ఉత్పత్తి తగ్గినప్పుడు 1068మండలాలు కరువుకు గురయ్యినప్పుడు దాదాపు 60శాతం ఉత్పత్తి తగ్గాలి. దీనిని బట్టీ విష్లేశిస్తే వ్యవసాయశాఖకు ఈ రంగంపై స్పష్టమైన అంచనాతో పనిచేసినట్టు కనబడదు.
రాష్ట్రంలో 3.55కోట్ల ఎకరాల సాగుభూమిలో 2.01కోట్ల ఎకరాలు మాత్రమే ఆహార ధాన్యాలు సాగవుతున్నాయి. మరో 50లక్షల ఎకరాలలో ఆర్టీ కల్చర్, నూనెగింజలు ఇతర వ్యాపార పంటలు సాగవుతున్నాయి. ఇప్పటికీ రైతులకు ఏ భూమిలో ఏపంట వేయాలో తెలియని పరిస్థితే కొనసాగుతున్నది.
పత్తివిస్తీర్ణం గమనిస్తే పెరుగుదల అపరిమితంగా పెరుగుతున్నది. 2010లో 17.76లక్షల హెక్టారు ్లకాగా 2011లో 20.54లక్షళ హెక్టార్లకు పెరిగింది. 2012 కరీఫ్‌లో 22.69లక్షల హెక్టార్లకు పెరిగింది. అనగా 56లక్షల ఎకరాలకు పెరిగింది. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 38.70లక్షల ఎకరాలు కాగా ఈ రోజు రెట్టింపు విస్తీర్ణం పెరిగింది. 2013కరీఫ్‌లో 60లక్షలకు పెరుగుతుందని వ్యవసాయ శాఖా అధికారులు అంచనాలు వేస్తున్నారు. ముతక ధ్యాన్యాలైనా జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి తదితర పంటల వస్తీర్ణం సాధారణ విస్తీర్ణమైన 7.47లక్షల హెక్టార్లకు మించటంలేదు. పప్పుధాన్యాల సాధారణ విస్తీర్ణం 8.10లక్షల హెక్టార్లుకాగా 2012సంవత్సరంలో 6.83లక్షల హెక్టార్లకు తగ్గింది. మొత్తం ఆహార ధాన్యాల విస్తీర్ణమే సాధారణ విస్తీర్ణం కన్నా 4లక్షల హెక్టార్లు అనగా 9.88లక్షల ఎకరాలకు తగ్గినట్లు రాష్ట్ర నివేదికలు తెలుపుతున్నాయి. మిరప, చెరుకు,ఉళ్ళి, పసుపు పంటల విస్తీర్ణాలు కూడా తగ్గాయి. అదే సంధర్బాలలో హార్టి కల్చర్ విస్తీర్ణం పెరిగింది. తగ్గుదలకు పెరుగుదలకు కారణాలు వ్యవసాయ శాఖ ప్రణీళికా బద్దమైన లక్ష్యాలు కావు. రైతులు మార్కేట్‌లో ఏ పంట లాభంగా వుంటే ఆ పంట వేస్తున్నారు. ఆ పంటలు తమ భూమికి సరితూగుతాయా లేవా అన్నది పరిశీలించకుండానే మూక ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు. అందువల్ల గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం నిర్ణయించిన వృద్ధిరేటు లక్ష్యాన్ని చేరలేక పోతున్నాం. ఒకోసారి పంటలు అధికంగా రావడం మరుసటి సంవత్సరమే తగ్గిపోవడం, తగ్గుదలకు ప్రకృతి వైపరీత్యాలను సాగుగా చూపటం జరుగుతున్నది. బియ్యం ఉత్పత్తి పరిశీలిస్తే ఆశ్యర్యం కలుగుతుంది.
సంవత్సరం లక్షల టన్నులు
2007`08 133.24
2008`09 142.41
2009`10 108.38
2011`12 144.20
2011`12 128.91
2012`13 111.74
దాదాపు అన్ని పంటల పరిస్థితి ఇదేవిధంగా వున్నది. వ్యవసాయ ఉపకరణాలు వాటి సరఫరా పరిస్తితిని పరిశీలిస్తే వ్యవసాయశాఖ ఈరంగంపై కనపరుస్తున్న శ్రద్ధ కనబడుతుంది.
విత్తనాలు: రాష్ట్రంలో విత్తనాభివృద్ది పెద్దఎత్తున సాగుతున్నది. భారత దేశం వినియోగించే విత్తనాలలో 60శాతం విత్తనాలు మన రాష్ట్రంనుండే సరఫరా అవుతున్నది. కానీ ఇక్కడి రైతులకు మాత్రం విత్తనాలు సరఫరా సక్రమంగా జరగడం లేదు. అన్ని విత్తనాలు కలిపి కరీఫ్‌లో 45లక్షల క్వింటాల్లు రబీలో 20లక్షల క్వింటాలు అవసరమవుతాయి. ఇందులో వ్యవసాయశాఖ కరీఫ్‌లో 10లక్షలు, రబీలో 13లక్షల క్వింటాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిగిలిన విత్తనాలు ప్రైవేటు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఇందులో పత్తివిత్తనాలు 24వేల క్వింటాలు పూర్తిగా ప్రైవేటు వారే సరఫరా చేస్తున్నారు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర చట్టం పేరుతో విత్తనాల ధరలను పెంపుదలచేసి నిర్ణయిస్తున్నది. గతంలో వ్యాపారులు నిర్ణయించే ధరలను నేడు ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. ఒక వైపున ధరలను పెంచి మరొకవైపున ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మధ్యకాంట్రాక్టర్లకే ఇస్తున్నది. రైతులు చెల్లించే ధరలకు మార్కేట్‌లోనే విత్తనాలు లభ్యమవుతున్నాయి. దీనికితోడూ నాన్యత లేని విత్తనాల సరఫరావల్ల ఏటా 4,5లక్షల ఎకరాల పంటలకు కాతా, పూతా లేకుండా నష్టం వాటిల్లుతున్నది. నష్టపోయిన రైతులకు కంపెనీల నుండి గానీ ప్రభత్వంనుండి గానీ పరిహారం చెల్లించే చట్టాలు లేవు.
సాగునీరు: కనీసం ఒక పంటకు గ్యారెంటీగా సాగునీరు లభ్యమయ్యే పరిస్థితి లేదు. కరువులు రాని సంవత్సరం లేదు. ప్రతీఏటా కరువులు వాటిల్లుతున్నా కృష్నా గోదావరి,పెన్నాజెలాలు దాదాపు 5వేల టి.ఎంసీలపైన సముద్రపాలవుతున్నాయి. ఈ నీటిని వినియోగించటానికి ప్రభుత్వం వద్ద ‘‘జలవిధానం’’ లేదు. ఫలితంగా రాష్ట్రంలో గల 72వేల చెరువులు నీరులేక వాటివెనక పంటలు పండటంలేదు. జపాన్ కొఆపరేటీవ్ బ్యాంక్ మరియు ప్రపంచబ్యాంచు 2,300కోట్లు మైనర్ ఇరిగేషన్ రిపేర్లకు ఇస్తూ, 3,300చెరువులను బాగుచేయాలని ఆర్థిక సాహాయం చేసారు. ఇది 2007నుండి 5సంవత్సరాలలో పూర్తికావాలి. ఆ పుణ్యకాలం ముగిసింది. రాష్ట్రంలో ఐ.డి.సికింద గల 1850లిఫ్టు పథకాలక్రింద 13.5లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఐ.డి.సి భాద్యతలు రైతులకు అప్పగించడంతో ఆ ఎత్తిపోతల పథకాలలో సగం పనిచేయడంలేదు. 29లక్షల పంపుసెట్ల క్రింద దాదపు 40లక్షల ఎకరాలు సాగు కావడానికి రైతులు స్వయంగా 12వేల కోట్లు వ్యయం చేసారు. విద్యుత్ సరఫరా పంప్‌సెట్లకు, లిఫ్టు పథకాలకు కోతపెట్టడంతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. మేజరు మధ్యతరహా ప్రాజెక్టులు గత సంవత్సరం నీరు రాక వట్టిపోయాయి. ఇలాంటి దస్థితికి కారణం ప్రభుత్వ విధానమే ప్రాజెక్టులలోకి (భారీ, మధ్యతరహా) 80శాతం నీరురాగానే కాల్వలద్వారా రాష్ట్రంలోని 35లక్షల మైనర్‌ఇరిగేషన్ చెరువులను నింపడానికి అవకాశం వుంది. కానీ మేజర్‌ఇరిగేషన్ శాఖ పనిభారం వస్తుందని ఈ విధానాన్ని ఆటంకాలు చెపుతున్నాయి. కోట్లరూపాయలు విలువైన నీరు సముద్రపాలవుతున్నాయి. జల విధానం అనుసరిస్తే పాల ఉత్పత్తి (డైరీ డెవలప్‌మెంట్) కూరగాయలు, త్రాగునీటి సమస్య పరిష్కారం కావడమే గాక గాలిలో తేమ శాతం పెరుగుతుంది. వర్షాలు పడే అవకాశాలు మెరుగవుతాయి.
ఋణాలు: సంస్థాగత ఋణాలు రైతులకివ్వడం దాదాపు తగ్గించివేశారు. భూములున్న వారికి పట్టణాలలో వ్యాపారం చేయడానికిచ్చిన ఋణాలు, బంగారం తాక్కట్టుపెట్టిన వారికిచ్చిన ఋణాలు మైక్రోఫైనాన్స్‌కిచ్చిన ఋణాలు (వీరు రైతులకు అధిక వడ్డీకి ఇస్తున్నారు) కోల్డ్‌స్టోరేజీలకు, భారీ యంత్రాలకోనుగోలుకిస్తున్న ఋణాలన్నీ వ్యవసాయరంగానికిచ్చిన ఋణాలలో చూపి 2012`13లో 40వేల కోట్లు ఋణాలు రైతులకిచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. రాష్ట్రంలో 25లక్షల కౌలుదారులుండగా 2012`13లో నమోదైన వారు 3,95,769గుర్తింపు కార్డులు పొందగా, 1,04,331మందికి రూ. 221.37కోట్లు మాత్రమే ఋణసౌకర్యం కల్పించారు. అర్హత కలిగిన కొత్తవారికీ 3.93లక్షల మందికి ఋణమిచ్చినట్టు సమీక్షలో బ్యాంకర్స్ తెలిపారు. అయినప్పటికీ నేటికీ ఋణార్హత కలిగిన వారు 50లక్షల మంది వరకు వుంటారు.(కౌలుదారులు సహా) ఋణాలందనివారంతా ప్రైవేటువ్యక్తులపై ఆధారపడి వ్యవసాయాలు చేస్తున్నారు.
వ్యవసాయశాఖ: కుదింపు, రైతులకు నేటికీ ఎరువుల కంపెనీల వారే సలహాలు ఇవ్వడం జరుగుతున్నది. మార్కెట్‌లలో నిర్ణయించిన కనీస మద్దతుధరల లభ్యత లేదు. ఏ మార్కేట్‌లోనూ సరుకుల నాణ్యత ప్రమాణాలు ప్రకటించటంలేదు. నేటికీ సరుకుల నాణ్యతా ప్రమానాలు మార్కేట్‌కమిటీ సిబ్బందికే తెలియదు అనడంలో ఆశ్చర్యంలేదు. ప్రతి మార్కేట్ నాణ్యతా ప్రమానాలను కరపత్రాలలో వేసి విస్తృత ప్రచారం చేయాలి. అలాగే తేమ కొలిచే యంత్రాలు ప్రతి మార్కేట్‌లో సరిపడినన్ని వుండాలి. మార్కేట్ యాడ్‌లోకి వచ్చిన సరుకు ఏకారణంగానైన దెబ్బతింటే పూర్తి నష్టాన్ని మార్కేట్‌కమిటీ భరించాలి. చట్టాలలో వున్న ఇవేవి అమలు జరపక పోగా రైతులు బాగా నష్టపోతున్నారు. ఋణగ్రస్తులవుతున్నారు.
వ్యవసాయ బడ్జెట్: అనేక ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభత్వం వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టింది. 15శాఖల బడ్జెట్‌లను కలిపి (వ్యవసాయం, హార్టీకల్చర్, పశుసంక్షేమం, చేపలు, అడవి, సహాకారం, సెరీకల్చర్, మార్కెటింగ్, చెరుకు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు`2, ఆహార ప్రాసెస్, ఆర్టీకల్చర్ యూనివర్సిటీ, వర్షాభావ ప్రాంతాలు, ప్రకృతీ వైపరీత్యాలు) కలిపి రూ.6938.985కోట్లు కేటాయించారు. ఇరిగేషన్ 14679కోట్లు, ఉచిత విద్యుత్ సబ్సిడీ 3622కోట్లు కలిపి బడ్జెట్‌ను 25962కోట్లకు పెంచారు. మరింత ఆశ్చర్యం ఏమిటంటే? 72450కోట్ల వ్యవసాయ ఋణాలను కలిపి 98,940కోట్లకు పెంచారు. కానీ వాస్తవంగా వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర రూ.1072.15కోట్లు ప్రణాళికా బడ్జెట్ 3092,45కోట్లు మొత్తం 4164.60కోట్లు కేటాయింపు చేసారు. వాస్తవానికి 14100కోట్లు కేటాయించాలని రైతులు, రైతు సంఘాలు కోరాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ శాఖను ప్రణాళిక బద్దంగా అమలుచేయటం ద్వారా అభివృద్దిని తేవడానికి గల అవకాశాలను పరిశీలించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది. 26.04.2013

No comments:
Post a Comment