21-02-2009న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 37లో రాష్ట్ర జలవిధానాన్ని ప్రకటించింది. జీవో విడుదల చేయడానికి ముందు సెప్టెంబర్ 2008లో ముసాయిదాను చర్చకొరకు ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఏ స్థాయిలోనూ, ఏ రంగంలోనూ చర్చ జరగడానికి వీలుగా ముసాయిదాను అందరికీ అందుబాటులో వుంచలేదు. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జలవిధానాన్ని ప్రకటించడం జరిగింది. ఈ జలవిధానాన్ని చివరి శాసనసభ సమావేశాల్లోగానీ, చివరకు కేబినెట్ సమావేశాల్లో గానీ చర్చకు తేకుండానే ఆమోదించారు.
ఈ జీవో ప్రకారం ప్రస్తుత నీటి విధానంలో యీ దిగువ మార్పులు తెస్తున్నారు.
1. వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు
2. నీటి యాజమాన్యపు కమిటీ ఏర్పాటు
3. నీటి సంఘాల ద్వారా నీటి నిర్వహణ
4. సరఫరా విలువను బట్టి నీటిపన్ను విధింపు
1. వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయడంతో ఆ కమిషన్ నీటికి పన్ను ఎంత వుండాలనేది నిర్ణయిస్తుంది. నీటి యాజమాన్యపు సంస్థ నీటి పన్నును విధిస్తూ రెగ్యులేటరీ కమిషన్‌కు పన్ను ప్రతిపాదనలు యిస్తుంది. ఈ ప్రతిపాదనలను బహిరంగపరుస్తూ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దీనిపై వినియోగదారులు బహిరంగ విచారణలో పాల్గని పన్నులు ఎంత వుండాలో తమ అభ్యంతరాలను తెలియజేస్తారు. అటు యాజమాన్య సంస్థ, యిటు వినియోగదారులనుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి రెగ్యులేటరీ కమిషన్ నీటి పన్నును నిర్ణయిస్తుంది. ఆ పన్ను చెల్లించిన వారే నీటిని వినియోగించుకోవడానికి అర్హత కల్గివుంటారు. ఆ విధంగా స్వతంత్రత కల్గిన రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించిన పన్నును చెల్లించలేనివారు నీటి వినియోగానికి అనర్హులు అవుతారు.
ఎ) సాగునీటి వినియోగం బి) త్రాగునీటికి సి) పరిశ్రమలు డి) విద్యుత్ ఉత్పత్తి ఇ) పారిశుద్ధ్యానికి
పై అవసరాలకు వినియోగించువారు ఎవరు ఎక్కువ రేటు చెల్లిస్తే వారికే నీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి ప్రాజెక్టుల దిగువన ఎకరా ఆయకట్టులోని ఒక పంటకు రు. 200 పన్ను చెల్లిస్తున్నారు. ప్రస్తుతం వున్న ప్లాట్ రేట్‌ను మూడు రెట్లు పెంచే అవకాశం వున్నది. గత ప్రభుత్వం సాగునీటి మీటర్లు పెట్టిన సందర్భంగా ప్రజల నుండి పెద్దయెత్తున నిరసన రావడంతో మీటర్ల ఏర్పాటును విరమించుకొంది. నాడు యీ మీటర్ల ఏర్పాటుకు బడ్జెట్‌నుండి రు. 8 కోట్లు కేటాయించారు. అప్పుడు ఉపసంహరించుకున్న మీటర్ల ఏర్పాటు విధానాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టుల క్రింద చాపక్రింద నీరులా మీటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్లాట్‌రేటుకు బదులుగా మీటర్ల ఏర్పాటు వలన పన్ను చెల్లించేంతవరకే నీటిని సాగుకు సరఫరా చేస్తారు. పంట మధ్యలో పన్ను చెల్లించలేని వారికి నీటి సరఫరాను నిలిపివేస్తారు. దీనివల్ల సాగుదార్లు నీటిని వినియోగించడం జరగదు. ఎక్కువరేటు చెల్లించే మంచినీటి వ్యాపారస్తులు, పారిశ్రామికరంగం మాత్రమే నీటిని వినియోగించుకొనే హక్కును కల్గివుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం.
2. నీటి యాజమాన్యపు కమిటీ ఏర్పాటుతో ప్రస్తుతం వున్న ఇరిగేషన్ శాఖను తొలగించాల్సి వస్తుంది. ఇరిగేషన్ శాఖ పనులను నీటి యాజమాన్యపు కమిటీ నిర్వహిస్తుంది. దీనివలన ఆ కమిటీ యూజర్ ఛార్జీలను వసూలు చేస్తున్నది. యూజర్ ఛార్జీలు యివ్వలేని వారికి సలహాలను కానీ, సహకారాన్ని గానీ యివ్వదు. ఒకవిధంగా ప్రభుత్వం యీ రంగంనుండి పూర్తిగా తప్పుకొంటుంది.
3. నీటి సంఘాలకు నిర్వహణ బాధ్యత అప్పగించడం వలన రాజకీయ ప్రాభల్యం పెరుగుతుంది. నీటి సంఘాలకు ఎన్నికైన వారు తమ అనుయాయులకే నీటి సరఫరాకు సుముఖత చూపుతారు. నీటి నిర్వహణ బాధ్యత అనగా కాల్వలు బాగుచేసి పొలాలవరకు నీటిని చేరవేసే విధంగా యీ నీటిసంఘాలు చర్యలు తీసుకోవాలి. ఇంతకముందు రాష్ట్ర ప్రభుత్వం కాల్వల నిర్వహణకు కావాల్సిన నిధులను విడుదల చేసింది. ప్రస్తుత జలవిధానం ప్రకారం ప్రభుత్వం నీటి నిర్వహణ బాధ్యత నీటి సంఘాలకు అప్పగించడంతో రిపేర్లకు కావాల్సిన నిధులను నీటి సంఘాలే భరించాలి. నీటి యాజమాన్య కమిటీ వసూలుచేసే పన్నునుండి కొంత భాగాన్ని మాత్రమే నీటి సంఘాలకు యిస్తారు. ఆ నిధులు సరిపోనప్పుడు వినియోగదార్లనుండి అదనంగా పన్నును వసూలు చేయాలి. ఆ విధంగా నీటి నిర్వహణను నీటి సంఘాలు చేయాలి.
4. సరఫరా విలువను బట్టి నీటిపన్ను విధింపు ప్రాజెక్టుల నుండి పొలం వరకు నీరు వచ్చుటకు పెట్టిన పెట్టుబడిని నిర్ణీతకాలంలో రాబట్టేవిధంగా లెక్కగట్టి పన్నును నిర్ణయిస్తారు. అనగా పూర్తి విలువను రాబట్టుకుంటారు. ఇంతవరకు నీటి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే భరించింది. సాగునీటికల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది. ప్రస్తుత విధానం ప్రకారం వినియోగదారులు నీటి నిల్వను పూర్తిగా చెల్లించాల్సి వుంటుంది.
పంటల మార్పిడి విధానం
రాష్ట్ర ప్రభుత్వం తక్కువనీటితో పండే పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తూ ఆహార ధాన్యాల ఉత్పత్తిని నిరుత్సాహపరుస్తున్నది. పంప్‌సెట్లకు విద్యుత్ సరఫరా నిబంధనలలో డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ పేరుతో ‘‘పంప్‌సెట్ల క్రింద రెండో పంట వరి వేసినచో ఉచిత విద్యుత్‌నుండి మినహాయించబడుతుంది’’. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ మరియు కొత్తగా ఆధునీకరించే కాల్వల క్రింద పంటల విధానాన్ని మార్పు చేయాలన్న నిబంధనను పెట్టారు. ఎగుమతి ఆధారిత వాణిజ్య పంటలు మాత్రమే పండిరచాలి. ఆ పంటలకు మార్కెట్‌లో ధర రాక అనేకమంది రైతులు దివాళా తీశారు. ముఖ్యంగా సుబాబుల్, జామాయిల్, పండ్ల తోటలు, పూల తోటలు, కూరగాయలు, ఔషద మొక్కలు, సుగంధ ద్రవ్యాలతో పాటు ప్లాంటేషన్ పంటలను పండిరచాలి. ఇవి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాల్సినవే తప్ప దేశీయ వినియోగానికి సంబంధించినవి కాదు. అంటే జలవిధానంలో పంటల మార్పిడి కూడా ఒక ముఖ్యమైన అంశంగా వుంది.
ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానం
నాగార్జున సాగర్ కాల్వల ఆధునీకరణ మైనర్ ఇరిగేషన్ రిపేర్లు మరియు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ సంస్థాగత మార్పులకు ప్రపంచ బ్యాంకు నుండి రు. 4వేల కోట్లు రుణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. ఈ రుణం ఐదు సంవత్సరాల్లో వ్యయం చేయాలి. సాగర్ కాల్వల ఆధునీకరణకు 2009-10లో రు. 300 కోట్ల నిధులను కేటాయించారు. ఈ రుణం పొందడానికి రాష్ట్రంలో జలవిధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రపంచబ్యాంకు ఆదేశించింది. ఆ ఆదేశం మేరకే జీవో 37 ప్రకారం రాష్ట్ర జలవిధానాన్ని ప్రకటించారు. ఒకవైపు పేద రైతులకు మేలు చేస్తున్నామంటూనే ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానాలతో, మరోవైపు వారిని సాగునీటికి దూరం చేస్తున్నారు. పంప్ సెట్లకు ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలంటే అందుకు ఆహారోత్పత్తులను పండిరచరాదని నిబంధనలు పెడుతున్నారు. అదేవిధంగా ఐఎస్‌ఐ పంప్ సెట్లు పెట్టాలని నిబంధన పెట్టారు. మైనర్ ఇరిగేషన్ చెరువుల రిపేర్లకు రు. 1000 కోట్లు రుణం యిచ్చినందుకు పంటల విధానంలో మార్పు తేవాలంటున్నారు.
ఈ విధంగా జలవిధానం పేరుతో నీటిని త్రాగునీటిపై వ్యాపారస్తులకు, పరిశ్రామాధిపతులకు గుత్తాధిపత్యం కల్గేవిధంగా విధాన రూపకల్పన చేశారు. ప్రమాదకరమైన జలవిధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
- సారంపల్లి మల్లారెడ్డి
తేది: 22-03-2009

No comments:
Post a Comment