Tuesday, 12 August 2014

రాష్ట్రవ్యవసాయ ప్రణాళిక`ఒక పరిశీలన

2011`12 రాష్ట్ర వ్యవసాయ ప్రణాళికను జూన్‌ 2వ తేదీన వ్యవసాయ శాఖ ఇంచార్జీ మంత్రి దామోదరం రాజనర్సింహగారు 370 పేజీల నివేదికను విడుదల చేశారు.  ప్రస్తుత ప్రణాళికలో ఆహారధాన్యాల ఉత్పత్తి 228 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం వ్యవసాయ బడ్జెట్‌ ప్రణాళిక కింద రు.2,148.65కోట్లు, ప్రణాళికేతర బడ్జెట్‌ రు. 557.98కోట్లు వెరసి రు. 2,706.63 కోట్లు కేటాయించారు. 89.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఉత్పత్తిని సాధించాలి. ప్రభుత్వం రు.400 కోట్లు విత్తన సబ్సిడీకి కేటాయించి ఆ నిధుల ద్వారా 10లక్షల క్వింటాళ్ళ విత్తనాలను 30 శాతం సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తారు. 39.55లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో పెడతారు. పంటరుణాలు 27500కోట్లు పంపిణీ చేస్తారు.(రాష్ట్రస్థాయి బ్యాంకర్లకమిటీ 2011`12 సంవత్సరానికి పంటరుణాల కింద రు. 30,985 కోట్లు కేటాయించింది) 15 లక్షల టన్నుల గోదాముల నిర్మాణం చేపడతారని మంత్రి ప్రణాళిక విడుదల సందర్భంగా ప్రకటించారు. గత సంవత్సరంపై 5,10 శాతం అదనంగా అంకెలు చేర్చి ప్రకటించారు. సేంద్రీయ ఎరువులు(వర్మీకంపోస్టు) 50 శాతం నుండి 100 శాతం రాయితీపై రు. 30 కోట్లు కేటాయింపు చూపారు. అయినప్పటికీ ఈ లక్ష్యాలు పూర్తి చేయడానికీ ఈ ప్రభుత్వం ఏ మేరకు కట్టుబడి ఉంటుంది అన్నది సందేహాస్పదమే.
    కర్నాటక ప్రభుత్వం రు.17 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా పెట్టారు. మొత్తం బడ్జెట్‌లో 15 శాతం వ్యవసాయానికి కేటాయించారు. కేరళ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ధాన్యం మద్దతు ధరలపై క్వింటాలుకు రు.140 అదనంగా ఇచ్చి అక్కడి రైతులకు రక్షణ కల్పిస్తున్నాయి. మన ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగానికి రాయితీలివ్వడానికి నిరాకరిస్తున్నది.
    సహజంగా వ్యవసాయ ప్రణాళికను ఏప్రిల్‌లో విడుదల చేసి జూన్‌ మాసంలో దాని అమలుకు ప్రభుత్వ యంత్రాగాన్ని సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలస్యంగానైనా ప్రకటించిన ప్రణాళికను పరిశీలిస్తే నేడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఏమేరకు చూపుతుందనేది విధీతమౌతుంది. ముఖ్యంగా ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, రుణాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలి. ఇందుకు తగిన బడ్జెట్‌లు కేటాయించాలి. గత బడ్జెట్‌లను పరిశీలిస్తే కేటాయింపుల ప్రకారం వ్యయం జరగలేదు. కేటాయింపులు ఘనంగా చూపి ఆ తరువాత తగ్గించడం జరుగుతున్నది. కేంద్రప్రభుత్వం నుండి ఏటా సగటున రు.500కోట్లు గ్రాంటుగా వస్తున్నాయి. వ్యవసాయ పరిశోధనలకు, టెక్నాలజీ అభివృద్దికి, లేబొరేటరీల నిర్వహానకు కేంద్రం నిధులు సమకూరుస్తున్నది. అనగా రాష్ట్రం చూపిన బడ్జెట్‌లో కేంద్రపథకాలు 20,25 శాతం వరకు ఉంటాయి. ఈ సంవత్సరం రాష్ట్రబడ్జెట్‌ రు.1.28లక్షల కోట్లు కాగా వ్యవసాయరంగ కేటాయింపులు 2.10 శాతం మాత్రమే. రాష్ట్ర సమగ్ర ఉత్పత్తి(జిఎస్‌డిపి) కి వ్యవసాయరంగం నుండి 25 శాతం కంట్రిబ్యూషన్‌ ఉంది. రాష్ట్రంలో ఈ రంగంపై 63 శాతం ప్రజలు ఆధారపడి ఉంటున్నారు. కానీ వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల మాత్రం స్థిరంగానే ఉంటున్నది. వాతావరణం అనుకూలించినపుడు మంచిపంటలు రావడం, అననకూల వాతావరణంలో పంటలు ఘననీయంగా తగ్గడం జరుగుతున్నది. గత సంవత్సరం 669 మండలాల్లో(15 జిల్లాల్లో) 27 లక్షల ఎకరాలలోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రు. 2400 పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు పరిహారం చెల్లించలేదు. గత మాసంలో చెపట్టబడిన రైతు చైతన్య యాత్రలలో పంపిణీ చేస్తామని రు.640 కోట్లు జిల్లాల్లోని బ్యాంకు ట్రెజరీల్లో నిలువ పెట్టారు. చెల్లింపులు జరగకుండా నిలుపుదల చేయాలని ట్రెజరీలకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంటలు దెబ్బతిన్న రైతులు తిరిగి పెట్టుబడులు పెట్టగలిగిన స్థితిలో లేరు.
బడ్జెట్‌` వ్యయం
    బడ్జెట్‌లు(ఓట్లలో),  ఆహారధాన్యాల విస్తీర్ణం(లక్షలహెక్టార్లు),  ఉత్పత్తి(లక్షల టన్నులలో)  ఈ విధంగా ఉంది.
            బడ్జెట్‌                   ఆహారధాన్యాల ఉత్పత్తులు
సం॥        ప్రణాళిక        ప్రణాళికేతర             విస్తీర్ణం        ఉత్పత్తులు
2007`08    909.53        358.76            73.87        198.17
2008`09    2560.31        235.34            74.30        204.04
2009`10    1409.91        278.89            65.90        152.90
2010`11    1513.74        391.88            79.32        195.03
2011`12    2148.65        557.98            89.80        228.00
    2010`11 రివైజ్డ్‌ బడ్జెట్‌ కాగా 2011`12 బడ్జెట్‌గా చూపించారు. ఆహార ఉత్పత్తులు 228 లక్షల టన్నులు లక్ష్యంగా నిర్ణయించారు. పైపట్టికను పరిశీలిస్తే ఎగుడు,దిగుడులు కనబడతాయి. క్రమానుగతంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు లేదు. కనీసం బడ్జెట్‌లో 8నుండి 10 శాతం నిధులు కేటాయించాలి. ప్రకృతి వైపరిత్యాల నష్టాన్ని తగ్గించడానికి ధీర్ఘకాలిక చైర్యలు చేపట్టాలి.డేల్టా ప్రాంతాలలో డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర్చడం ద్వారాను, మెట్టప్రాంతాలలో ఒక పంటకు సాగు నీటి వసతి కల్పించడం ద్వారా నష్టాన్ని చాలావరకు తగ్గించే అవకాశాలున్నాయి.
విత్తనాలు
    గతంలో రాష్ట్ర విత్తనాభివృద్ది, జాతీయ విత్తనాభివృద్ది సంస్థల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేశారు. విత్తనాల వలన ఎక్కడా ఎకరం పంట దెబ్బతిన్నట్టు సమాచారంలేదు. 2002`03 నుండి విత్తనరంగంలోకి కార్పోరేట్‌ సంస్థలు ప్రవేశించాయి. క్రమక్రమంగా అన్నిరకాల విత్తనాలపై గుత్తాధిపత్యం సాధించాయి. మోన్‌శాంటో, కార్గిల్‌,డుపాయింట్‌, ఐటిసి లాంటి సంస్థల చేతుల్లోకి విత్తనాలు వెళ్ళిపోయాయి. వీటి ప్రవేశంతో విత్తనాల ధరలు 10 రెట్ల వరకు పెరిగాయి. పైగా నాణ్యతలేని విత్తనాల వల్ల ఏటా రాష్ట్రంలో 4,5 లక్షల ఎరకాల పంటలు కాత,పూతలేకుండా పోతున్నాయి. దీనికి రైతునే బాధ్యునిగా చేసి సాగు సక్రమంగా చేయలేదని ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉండి దేశంలో 60 శాతం విత్తనాలను సరఫరా చేస్తున్నా, మన రాష్ట్రప్రభుత్వం, విత్తన చట్టం రూపొందించలేదు. రాజ్యాంగం రిత్యా విత్తన చట్టం రూపొందించడంతోపాటు, ధరల నిర్ణయం, సరఫరా బాధ్యతలు రాష్ట్రప్రభుత్వమే చూడాలి.కానీ కేంద్రంపైకి తోసివేసి రాష్ట్రం తప్పుకున్నది. నిత్యావసర వస్తువుల చట్టం కిందికి తెచ్చిన విత్తనాలకు ప్రభుత్వమే ధరలు పెంచి రైతులకు భారం కలిగిస్తున్నది. 2002లో 9300 పాకెట్లు(450గ్రాములు) బిటి పత్తి అమ్మిన సంస్థ నేడు కోటి పాకెట్ల అమ్మకానికి చేరుకుంది. గతంలో ఒక పాకెట్‌ ఎకరాకు నేడు 2 పాకెట్లు అవసరమౌతున్నాయి. బిజి`2 రు.750/`లు ఉన్న పాకెట్‌ ధరను రు.930/` కి పెంచారు. అదేవిధంగా వేరుశనగ కాయ విత్తనాలను క్వింటాలుకు రు.5,200/`కు పెంచి ప్రభుత్వం 30శాతం సబ్సిడీ ఇస్తున్నది. రైతు క్వింట కాయకు రు3500/` చెల్లించాలి. మొత్తం విత్తనాలు 50 లక్షల క్వింటాళ్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రు.400 కోట్ల సబ్సిడీతో 16 లక్షల క్వింటాళ్ళను ధరలు పెంచి 30 శాతం సబ్సిడీతో పంపిణీకి ప్రణాళిక రూపొందించారు. ఈ సబ్సిడీ కాంట్రాక్టర్లకు చెందుతుందేతప్ప రైతులకు అంతగా ఉపయోగంలేదు. పైగా అనంతపురంలో ఇప్పటికే సరఫరా చేసిన వేరుశనగా కాయ విత్తనంలో 25 శాతం విత్తనాలలేని కాయలున్నాయి. ఆ విత్తనం గ్రామం పథకం కింద కోట్లు వ్యయం చేసినా దాని వల్ల రైతులు లబ్ది పొందలేక పోతున్నారు. విత్తన మార్పిడి పథకం వలన రైతులకు ఉపయోగం కలుగుటలేదు. ‘‘పంట విత్తనంలోనే ఉంది’’ అన్న సూక్తి ఎగతాళి చేయబడుతున్నది. విత్తన ధరలను తగ్గించి, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడానికి తగు ప్రణాళిక రూపొందించాలి.
పంటరుణాలు` బ్యాంకుల పరిస్థితి
    2011`12లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) పంటరుణాల కొరకు రు. 30,985 కోట్లు కేటాయింపు చూపగా, వ్యవసాయశాఖ మంత్రి రు.27,500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించడం పరస్పర విరుధ్ధంగా ఉంది. కేటాయించిన రుణాలు పంపిణీ కావడంలేదు. రుణార్హత గల్గిన వారు 40 లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రతిబ్యాంకుబ్రాంచి కనీసం 330 మంది కొత్తవారికి/ కౌలుదారులకు రుణాలిస్తామని 2010`11లో ప్రకటించారు. అది అమలుకు నోచలేదు. తిరిగి 2011`12లో ప్రతిబ్యాంకుబ్రాంచి 200 మందికి ఇవ్వాలని ఎస్‌ఎల్‌బిసి నిర్ణయించగా, 100 మందికి ఇస్తామని మంత్రిగారు ప్రకటించారు. ఈ రోజు రాష్ట్రంలో 40 లక్షల మంది కౌలుదారులున్నట్లు బ్యాంకులు అంచనా వేశాయి. వీరికి రుణగుర్తింపుకార్డులిస్తామని ప్రభుత్వం జిఓ విడుదల చేసింది. శాసనసభలో చట్టం తెస్తానని పెండిరగులో పెట్టింది. ఆర్డినెన్స్‌ తేవడానికి శాసనసభ ప్రోరోగ్‌ కాలేదని ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది.పైగా గత సంవత్సరం పంటలు నష్టపోయిన 669 మండాలలోని రైతుల పంటరుణాలు రు.11,500 కోట్లు రీషెడ్యూల్‌ చేయాలని బ్యాంకులను రాష్ట్రప్రభుత్వం మరియు రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఆ ఆదేశాన్ని తుంగలో తొక్కి రుణాన్ని బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ద్వారా కొత్తరుణాలుగా మార్చారు. అనగా 2011`12కు 30 శాతం రుణాలు పంపిణీ చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 18 శాతం వ్యవసాయరుణాలివ్వాలన్న రిజర్వుబ్యాంకు నిబంధనను అమలు చేయుటలేదు. బ్యాంకుల రుణపంపిణీ ఈ విధంగా ఉంది. రుణ లక్షాలు ` వాస్తవాలు (కోట్లల్లో)
        పంట రుణాలు                      దీర్ఘకాలిక రుణాలు
సం॥రం    లక్ష్యం    సాధించినది     లక్ష్యం    సాధించినది   
2004`05    11205    10286    `    788   
2005`06    13300    13305    1925    1498   
2006`07    15700    15718    2265    1680   
2007`08    17300    17598    2600    2373   
2008`09    20000    16469    2500    2869   
2009`10    23500    24844    4000    5922   
2010`11    26261    30229    4460    `   
2011`12    30985    `    17015    `   

బ్యాంకు డిపాజిట్లలో డిపాజిట్ల ప్రకారం రుణపంపిణీ ఏనాడూ 12 శాతానికి మించలేదు. అర్హత గల వారికి కౌలుదార్లకు, వాస్తవ సాగదార్లకు స్కేల్‌ ఆప్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణ పంపిణీ జూన్‌లోనే చేయాలి. రైతులు వ్యవసాయ ఉపకరణాలు కొనుగోలు చేయడానికి వీలుగా రుణాలివ్వాలి. బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించకుండా అఖిలపక్ష సమావేశాలు జరిపి సమీక్షలు ప్రతినెలా చేయాలి.
   బ్యాంకు డిపాజిట్లలో డిపాజిట్ల ప్రకారం రుణపంపిణీ ఏనాడూ 12 శాతానికి మించలేదు. అర్హత గల వారికి కౌలుదార్లకు, వాస్తవ సాగదార్లకు స్కేల్‌ ఆప్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణ పంపిణీ జూన్‌లోనే చేయాలి. రైతులు వ్యవసాయ ఉపకరణాలు కొనుగోలు చేయడానికి వీలుగా రుణాలివ్వాలి. బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించకుండా అఖిలపక్ష సమావేశాలు జరిపి సమీక్షలు ప్రతినెలా చేయాలి.
ఎరువులు` పంపిణీ విధానం
    రాష్ట్రంలో ఖరీఫ్‌లో 39.55 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిలువ ఉన్నట్లు మంత్రి ప్రణాళికలో చెప్పారు గత అనుభవాలు పరిశీలిస్తే రాష్ట్రంలో 15 మిక్సింగ్‌ ప్లాంట్‌లకు రైతుల సబ్సిడీ ఎరువులను మళ్ళించి, రైతులకు ఎరువులు దొరకకుండా చేశారు. ఖరీఫ్‌ రబ్బిలో కలిసి 70 లక్షల టన్నుల ఎరువులు అవసరం. కేంద్రప్రభుత్వం ఎరువుల సబ్సిడీ విధానాన్ని మార్చింది. ఇంతకు ముందు ఎరువుల బస్తాకు ధర నిర్ణయించే వారు. ఇపుడు కేంద్రం చెల్లించే సబ్సిడీని నిర్ణయించారు. స్థానికంగా ఎరువుల ప్యాక్టరీల మూసివేతతో కాంప్లెక్స్‌ ఎరువులతో సహా అన్ని రకాల ఎరువులను దిగమతి చేసుకోవల్సి వస్తున్నది. దిగుమతులు సకాలంలో రానితీరుకు పంటలకు నష్టపోతున్నారు. గత ఆరు మాసాలలో ఎరువుల ధరలు 25 శాతం పెంచారు. అయినా కనీస చిల్లర ధర నిర్ణయించిన దానికి భిన్నంగా అదనంగా ధర నిర్ణయిస్తున్నారు. పైగా ఉపయోగం లేని ఎరువుల బస్తాను పోటీపెట్టి రైతుకు అంటగడుతున్నారు.ఖరీఫ్‌లో యూరియా`14 , డిఎపి`5,పొటాష్‌`3.50, కాంప్లెక్స్‌`11.50, సూపర్‌`1.50 మొత్తం 35 లక్షల టన్నులు అవసరం.దాదాపు రబ్బీకి అంతే మొత్తంలో అవసరం.
    ఎరువులకోరకు జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు రైతులు మరణించారు. అనేక మంది రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. డబ్బులు పెట్టి కొందామన్నా ఎరువులు గతినన్ని మండల స్ధాయిలో లేవు. క్రిమిసంహారక మందుపై ధరల నిర్ణయం ప్రభుత్వం చేతిలో లేదు.రు. 300/`లకు అమ్మిన మందు ఒత్తిడి పెరగడంతో రు.2000 /`లకు అమ్మిన ఘటనలున్నాయి. నాణ్యతలేని క్రిమిసంహారక మందులు రైతులకు అంటగడుతున్నారు. వ్యవసాయశాఖ అజమాయిషీ లోపం భరించరానిదిగా మారింది. తగినన్ని ఎరువులు క్రిమిసంహారక మందులు రైతులకు అందుబాటులో ఉంచాలి. ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. నాణ్యతలేని సరకులు అమ్మిన వ్యాపారులపై చర్యలు చేపట్టడమే కాక రైతులకు పంటదిగబడి స్థాయిలో పరిహారం ఇప్పించాలి.
హార్టీకల్చర్‌ పంటలు
    రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలలో హార్టీకల్చర్‌ పంటలు వేస్తున్నారు. 2 కోట్ల టన్నుల దిగుబడి వస్తున్నది. ప్రత్యేక శాఖ ద్వారా రైతులకు ప్రోత్సాహాలు కల్పించడానికి బడ్జెట్‌లు కేటాయిస్తున్నారు. ఉచిత మొక్కల సరఫరా, బిందుసేద్యం, తుంపరసేద్యం పరికరాల సబ్సిడీ, ఇరిగేషన్‌ వనరుల నిర్మాణానికి ఏటా దాదాపు రు.500 కోట్ల రాయితీలిస్తున్నారు. ఈ రాయితీలు పేదలకు కేటాయిచినా వారి పేర్లతో ధనికరైతులు కాజేస్తున్నారు. ముఖ్యంగా దళిత, గిరిజనులకు కేటాయించిన స్కీములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లుతున్నాయి. ఈ శాఖ ద్వారా సరఫరా అవుతున్న ఎరువులు తదితర ఉపకరణాలలో నాణ్యతలేనివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పట్టించుకునే వారేలేరు. పెద్దపెద్ద ఫాం హౌజ్‌లకు పెద్దమొత్తాలు సబ్సిడీలు తరలిపోతున్నాయి.
    వాస్తవంగా సన్న`చిన్నకారు రైతులను గుర్తించి వారికి మాత్రమే రాయితీలను అందించడంతోపాటు వారి పంటల అభివృద్ధికి నిరంతర సలహాలు అందించాలి.వారికి మార్కెట్టు వనరుల కల్పన బాధ్యత రాష్ట్రప్రభుత్వం తీసుకోవాలి. హార్టీకల్చర్‌ పంటలు వేసినవారు ధరలు తగ్గడంతో తోటలు తీసివేస్తున్నారు. దీన్ని నివారించాలి.
వ్యవసాయ ప్రణాళికలో అమలు జరపాల్సిన మరికొన్ని అంశాలు
    భూసార పరీక్షలు జరిపి ఏఏ ఎరువులు ఏ మోతాదుల్లో వేయాలో రైతులకు తెలియజేయాలి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల శాంపిల్స్‌ను సేకరించి కల్తీని నిరోధించాలి(ప్రస్తుతం ప్రణాళికలో చూపినా అమలు కావడంలేదు. ఎన్‌జిరంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం ఆధీనంలోని పరిశోధనా కేంద్రాలలో కొత్తవిత్తనాల ఆవిష్కరణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. పంటల భీమా, వాతావరణభీమాలను ఒకటిగా చేసి ఒకే సమగ్రమైన భీమా చట్టాన్ని రూపొందించాలి. సన్న`చిన్నకారు రైతుల ప్రీమియం పూర్తిగా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు 50 శాతం చొప్పున భరించాలి. పత్తి,నూనేగింజలు, ముతక ధాన్యాల(మక్క,జొన్న, రాగులు, సజ్జలు) అభివృద్ధికి ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలి. వ్యవసాయ టెక్నాటజీ మిషన్‌(ఆత్మ) లో రైతులకు ప్రాధాన్యత ఇవ్యాలి.పై సమస్యలతో వ్యవసాయ ప్రణాళికను రూపొందించి అమలు జరపాలి.అపుడే ఉత్పాదకత`ఉత్పత్తి పెరుగుతుంది.
  ప్రభుత్వం ప్రకటించిన 2011`12 వ్యవసాయ ప్రణాళికలోని ప్రధాన అంశాలు :
    ` ఆహారధాన్యాల ఉత్పత్తి 228.15 లక్షల టన్నులు సాధించాలి.
    ` 26.28 లక్షల క్వింటాళ్ళ విత్తనాల 30 శాతం సబ్సిడీ రు.400.10 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది.
    ` 2010`11లో 71.04 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వినియోగించగా ప్రస్తుతం 79.05 లక్షల మెట్రిక్‌            టన్నులు సరిఫరా చేస్తారు.
    ` 16,323 మెట్రిక్‌ టన్నులు జింక్‌ సల్ఫేట్‌ను 50 శాతం సబ్సిడీ పై 3.26 లక్షల హెక్టార్లకు, 1.75 లక్షల రైతులకు            27.75 కోట్ల రూపాయలు మంజూరి
    ` 30 వేల మెట్రిక్‌ టన్నుల జిప్సం 50 శాతం సబ్సిడీపై 6 వేల హెక్టార్లకు, 10వేల మంది రైతులకు, 3.60 కోట్లు            మంజూరి.
    ` 50 వర్మీ కంపోస్టు యూనిట్లకు 10 లక్షల సబ్సిడీ కేటాయింపు.
    ` పొలంబడి కార్యక్రమం కింద 12.12 కోట్లతో 5004 కార్యక్రమాల అమలు
    ` వ్యవసాయ యాంత్రీకరణ కింద 1,60, 688 యూనిట్లకు రు.81.50 కోట్ల కేటాయింపు.
    ` పంటరుణాల కింద 48 వేల కోట్ల పంపిణీ
    ` పావలా వడ్డీ కింద 75 కోట్ల కేటాయింపు
    ` వడ్డీ మాఫీ కింద 200 కోట్ల కేటాయింపు
    ` 200`250 రైతు కుటుంబాలకు ఒకరి చొప్పున 41,062 మంది ఆదర్శరైతులనియామకం దీనికి 50 లక్షల            గౌరవ వేతనం కేటాయింపు.
    ` లక్ష ‘‘ పాడిపంటల మాస పత్రిక’’ ను రు. 10 చొప్పున అమ్మకం.
    ` కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు మిలహా మిగిలిన అన్ని జిల్లాలలో  గ్రామం యూనిట్‌గా పంటల భీమా            పథకం అమలు
    ` వాతావరణ భీమా పథకం కింద రాయలసీమ జిల్లాలలో  వేరుశనగ పంటకు వర్తింపు
    ` ఆహార భద్రత పథకం కింద ధాన్యం 11 జిల్లాలలో, పప్పుధాన్యాలు అన్ని జిల్లాలలో రు.80.48 కోట్ల కేటాయింపు
    ` రాష్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద రు. 293.28 కోట్లు కేటాయింపు
    ` వ్యవసాయ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఎజెన్సీ పథకం 22 జిల్లాలలో అమలు కేటాయించిన రు.57.17 కోట్లలో            కేంద్రం, రాష్ట్రం 90:10 చొప్పున భరిస్తారు.
     విత్తన సబ్సిడీ 2011`12
పంట           విత్తనాలు (క్వింటాళ్ళలో)           సబ్సిడి(కోట్లలో)
వరి    5,77,300    29.00
మొక్కజొన్న    121140    30.28
జొన్న    5,000    1.25
పెసర    29,000    10.15
మినుములు    60700    21.24
కందులు    33,000    11.55
శనగలు    3,50,000    66.50
వేరుశనగ    13,00,000    195.00
పొద్దుతిరుగుడు    10,000    10.50
సోయాబీన్‌    1,30,000    22.54
 సారంపల్లి మల్లారెడ్డి
ఎ.ఐ.కె.ఎస్‌. ఉపాధ్యక్షలు


No comments:

Post a Comment