రాష్ట్ర రెవిన్యూ శాఖామాత్యులు 2009 ఆగష్టు 9న సహకార సేద్యానికి అంగీకరించే గ్రామాల నుండి దరఖాస్తులు సేకరించుటకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని రూపొందించారు. జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌లతో కమిటీని నిర్ణయించారు. ఈ కమిటీ ప్రతి జిల్లాలో రెండు గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామ ప్రజలను ప్రభుత్వం అమలు జరిపే సంయుక్త సేద్యానికి రైతాంగాన్ని ఒప్పించాలి. జూలై 26న కమీషనర్ Ê డైరెక్టర్ అగ్రికల్చర్ , గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక పూర్తి పేజీ ప్రకటను పత్రికలకు విడుదల చేస్తూ ‘‘సంయుక్త వ్యవసాయనికి రైతులు సిద్దమేనని గ్రామసభ ద్వారా తీర్మానంచేసి ఆ తీర్మానాన్ని తమకు పంపాలని ప్రకటించారు’’
వరంగల్ జిల్లా రఘునాధపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో గ్రామ రైతులను ముఖ్యమంత్రి వద్దకు రప్పించుకొని తమ గ్రామంలోని 1600 ఎకరాల భూమిలో ‘‘సంయుక్త వ్యవసాయ క్షేత్రం’’ ఏర్పాటు చేయుటకు అంగీకరిస్తున్నామన్నట్లు రాయించుకున్నారు. రైతులకు ఈ విధానంలోని వాస్తవాలు చెప్పకుండానే సంతకాలు పెట్టించుకున్నారు. తిరిగి వారు గ్రామానికి వెళ్ళగానే గ్రామంలోని ప్రజలు, మహిళలు తమ భూములను సహకార క్షేత్రానికి ఇవ్వలేమని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అదేవిధంగా మెదక్‌జిల్లాలోని సిరిసినగండ్లలో 2000 ఎకరాలు, గిరాయిపల్లిలో 200 ఎకరాల భూములను సంయుక్త సేద్యానికి ఇస్తామన్నట్లు రైతులచే సంతకాలు చేయించుకున్నారు. ఇబ్రహీంపూర్ లాగే వీరు కూడా వాస్తవాలు తెలసుకొనిఈ విధానానికి వ్యతిరేకంగా తమ భూములు ఇవ్వమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుజరపడానికి పెద్దఎత్తున గ్రామాలపై వత్తిడి చేస్తున్నదనడానికి పై సంఘటనలే నిదర్శనం. సహకార సేద్యం పేరుచెప్పి భూముల సేకరణకు ప్రభుత్వం రైతాంగంపై వత్తిడి తెస్తున్నది.
ప్రభుత్వం చెప్పిన సంయుక్త సేద్యం విధానం
సంయుక్త వ్యవసాయ క్షేత్రానికి భూమిని అన్ని హక్కులతో అప్పగించాలి. భూమి విలువను నిర్ణయించి ఆ రైతుకు వాటాలు నిర్ణయిస్తారు. ఆ తర్వాత అతనికి ఆ భూమిపై ఎలాంటి హక్కులు వుండవు. ‘‘గ్రామంలో వున్న రైతులంతా సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న సంస్థకు తమ భూముల్ని నిర్థిష్ట ధరకు అమ్మేందుకు సిద్దపడాలి. ఆ ధర మార్కెట్ ధర లేదా ఏకాభిప్రాయంతో నిర్ణయించిన ధర అయి వుంటుంది’’. ఈ ప్రకారం రైతు భూమి విలువ అందులో వున్న ఇతరత్రా సదుపాయాలను పరిగణనలోనికి తీసుకొని అందుకు తగ్గట్టుగా రైతులకు వాటాలు అందచేస్తారు. భూమి ఇతర సదుపాయాలను బట్టి ఏ రైతుకు ఎన్నెన్ని వాటాలు ఇవ్వాలన్నది సభ్యులుగా వుండే జనరల్ బాడీ నిర్ణయిస్తుంది. భూమి లేని రైతులకు ఒక్కో వాటా కేటాయిస్తారు. వారికి లభించిన వాటాల ఆధారంగా ఓటు విలువ నిర్ణయిస్తారు.
29.06.2009న ప్రభుత్వం ముసాయిదాలో ఏమి చెప్పింది?
సహకార క్షేత్రాల ఏర్పాటుకు విడుదల చేసిన ముసాయిదాలో ‘‘ సహకార క్షేత్రాల ఏర్పాటు నిర్వహణను సొసైటీ/ కంపెనీ చేస్తుంది. రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక సహకార క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ గ్రామాలలోని రైతులు తమ భూములను ఆ సొసైటీ / కంపెనీకి అన్ని అధికారాలతో దఖలు పర్చాలి. అట్టి భూములకు ధర నిర్ణయించబడుతుంది. ఆ ధరను వాటాలుగా పరిగణిస్తారు. సహకార క్షేత్రం నుండి వెళ్ళిపోదల్చుకొన్న రైతు తన వాటాలను మరొకరికి అమ్ముకోవాలి. సభ్యులలో ఎవరూ కొనుగోలు చేయనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సొసైటీ / కంపెనీ వ్యవసాయోత్పత్తులను నూతన టెక్నాలజీ ద్వారా యంత్రాలను వినియోగించి ఉత్పత్తిచేస్తారు. అధునాతన టెక్నాలజీని వినియోగిస్తారు. నాణ్యతగల విత్తనాలు, మార్కెట్ సౌకర్యం మరియు గోదాం నిల్వ సౌకర్యాలు కల్పిస్తారు. ప్రభుత్వం కొన్ని సొసైటీలకు మొదట మార్జిన్ మనీ యిస్తుంది’’ అని తెలిపారు. ఈ పథకం మంచి ఫలితాలు యిస్తే కొనసాగుతుందని లేనిచో మూసివేస్తామని కూడా ముసాయిదాలో చెప్పారు.
సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర గవర్నర్ 2009 జూన్ 8న ఉభయ సభల సమావేశాలలో ‘‘ ప్రభుత్వ, వాణిజ్య బ్యాంకుల క్రియాశీల మద్దతుతో స్వచ్ఛంద సహకార ప్రాతిపదికన సేద్యం చేయడానికి ఒక సమీకృత విధానం కోసం ప్రతి జిల్లాకు ఒకటి లేదా రెండు గ్రామాలను ప్రయోగాత్మక ప్రాతిపదికన ఎంపిక చేయాలని ప్రతిపాదించడమైంది. ఇందులో పాల్గనాల్సిందిగా ఏ గ్రామానికీ నిర్బంధం వుండదు. ప్రభుత్వం అట్టి సహకార సేద్యం ద్వారా పొందగల్గే ప్రయోజనాలను అధ్యయనం చేయాలని ఆశిస్తున్నది. ఇందులో పశుగణ సంపద, మత్స్య సంపద కూడా చేరివున్నాయి’’ అని ప్రసంగిస్తూ తెలిపారు. వ్యవసాయోత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలన్న లక్ష్యంతో సహకార వ్యవసాయ క్షేత్రాల ప్రయోగాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ముసాయిదా ప్రకారం రైతులు తమ భూములను కంపెనీకి అప్పగించాలి. కంపెనీకి లాభాలు వస్తేనే వాటాల ప్రకారం రైతులకు డివిడెండ్‌యిస్తారు. నష్టాల్లోకి వెళితే తమ వాటాలు కోల్పోవాల్సి వస్తుంది. అనగా, భూములు కంపెనీకి అప్పగించి తప్పుకోవాలి. పరోక్షంగా రైతుల భూములను కంపెనీలకు అప్పగించడానికి యీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో విత్తనరంగం పూర్తిగా బహుళజాతి సంస్థలపరమైంది. ఉపకరణాలు, మార్కెటింగ్ రంగాలపై బహుళజాతి సంస్థల ఆధిపత్యం కొనసాగుతున్నది. మరోవైపున వ్యవసాయ విస్తరణ రైతులకు అందుబాటులో లేకుండా చేశారు. ఆదర్శ రైతులంటూ అనుభవంలేని వారితో వ్యవసాయశాఖను నింపారు. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వ్యవసాయరంగం నుండి సన్న, చిన్నకారు రైతులను తప్పించడానికి ప్రభుత్వం యీ ప్రయోగాలు చేపడుతున్నట్లు విధితమవుతున్నది.
ములకనూరు, అంకాపూర్ సహకార సంఘాల అభివృద్ధిని ముసాయిదాలో ఉదాహరణగా చూపారు. ఈ సంఘాలు సేవా సహకార సంఘాలుగా మాత్రమే పనిచేస్తున్నాయి. గతంలో ‘‘రైతు కేంద్రంగా’’ ఏర్పాటు చేసిన ‘‘సహకార వ్యవసాయ క్షేత్రాలు’’కు బదులుగా నేడు ఏర్పాటుచేయబోయే వ్యవసాయ సహకార క్షేత్రాలు ‘‘కంపెనీ కేంద్రంగా’’ వున్నాయి. ఈ విధానంలో పేదల భూములను కంపెనీల పరం చేయడానికి చట్ట పరంగా హక్కులు ఏర్పడతాయి. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చట్టాల ద్వారా పేదల భూములను పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి నిరంతర ప్రయత్నాలు సాగిస్తూనే వుంది. ‘‘ప్రత్యేక ఆర్థిక మండలాల’’ పేరుతో భూసేకరణకు ఏర్పడిన ఆటంకాలను తొలగించుకోవడానికి కొత్తరూపాలను ఎంచుకున్నది. ఆరూపాల్లోని భాగంగానే కంపెనీవ్యవసాయాన్ని ముందుకు తెచ్చింది.చివరకు మిగులుభూములను కూడా కంపెనీలకు అప్పచెప్పడానికి చట్టాన్నిమార్పు చేసింది.
గతంలో సమిష్టి వ్యవసాయ క్షేత్రాల పని ఈ విధంగా ఉంది
1964 సహకార చట్టం ప్రకారం 22 జిల్లాల్లో 2295 సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1.93 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నారు. 2.72 లక్షల ఎకరాలను యిందుకు కేటాయించారు. ఈ క్షేత్రాలలో సభ్యులుగా దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలేగాక ఆర్థికంగా వెనకబడినవారికి కూడా సభ్యత్వాలు యిచ్చారు. ప్రభుత్వం భూములలో యీ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ సహకార జాయింట్ ఫార్మింగ్ సొసైటీల ఫెడరేషన్ 30శాతం (రుణంగా) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ 50శాతం సబ్సిడీ, జిల్లా దళిత, గిరిజన కార్పొరేషన్‌లు 20శాతం (మార్జిన్‌మనీ) యిచ్చి క్షేత్రాలనేర్పాటు చేశాయి. దీని బాధ్యత నిర్వహణ తాలూక సహకార శాఖాధికారికి కేటాయించారు. పెట్టుబడిపోగా మిగిలిన ఆదాయాన్ని వాటాలుగా అందులోని సభ్యులందరికీ పంపిణీ చేశారు. రైతు జీవనాదాయాన్ని కేంద్రంగా చేసుకొని గతంలో సహకార క్షేత్రాలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంది. ‘‘రైతు కేంద్రంగా’’ సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలి. ఈ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించింది.
కేంద్రం ఆమోదించిన పథకం
ఈ సహకార జాయింట్ ఫార్మింగ్ సంఘాలకు విస్తృత ప్రాతిపదికన కేంద్రం ఈదిగువ అభివృద్ధి చర్యలకు ఆర్థిక సహకారం అందించింది.
1. బోరుబావుల త్రవ్వకం
2. ఫిల్టర్ పాయింట్స్ ఏర్పాటు
3. విద్యుత్ పంపుసెట్లు / ఆయిల్ ఇంజన్ల కొనుగోలు
4. బావిలో బోర్లు వేయడం
5. డ్రిప్ ఇరిగేషన్
6. చెక్‌డ్యాంల నిర్మాణం
7. బోరుబావులకు సబ్‌మెర్సిబుల్ పంపుసెట్ల కొనుగోలు
8. పైపు లైన్ల ఏర్పాటు
9. హార్టీకల్చర్ శాఖ ద్వారా సహకారం
10. భూమి అభివృద్ధి
11. స్ప్రింక్లర్స్ కొనుగోలు మరియు స్వయం సహాయక గ్రూపులకు రివాల్వింగ్ ఫండ్స్ సమకూర్చడం వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించింది. స్వయం సహాయక బృందాలకు ఇచ్చిన రివాల్వింగ్ ఫండ్ మినహా మిగిలిన అన్ని పై పథకాలకు 50శాతం సబ్సిడీ ఇచ్చింది. మిగిలిన 50శాతంలో 40శాతం ఫెడరేషన్ రుణంగాను, మిగిలినది లాభోక్త భరించాలి. ఈ రుణానికి 12.5% వడ్డీ రేటు వుంటుంది. ఈ పథకం ప్రారంభించబడినప్పటి నుండి అఫెక్స్ బాడీ ద్వారా 6కోట్ల రూపాయలను జిల్లాకార్యక్రమాలకు కేటాయించారు.
ఈ పథకం ఆచరణలో కొంతకాలం పాటుసాగి విఫలం అయింది.
వైఫల్యానికి కారణాలు
మితిమీరిన ప్రభుత్వ జోక్యంతోపాటు, సొసైటీ మహాజన సభలను సక్రమంగా నిర్వర్తించకపోవడం, అవినీతి పెచ్చుపెరిగి వచ్చిన ఫలసాయాన్ని కొద్దిమంది కాజేయడం ప్రారంభించారు. కొన్ని చోట్ల సొసైటీ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకున్నారు. బాధ్యత గల సహకార శాఖ నిర్లిప్తంగ వుంది. అవినీతి పరులకు ప్రభుత్వ ప్రోత్సాహం మెండుగా వుంది. ఈ విధానాల ఫలితంగా నాడు వైఫల్యం చెందగా వాటిని మూసివేశారు. అనంతరం ఆ భూములను అందులో సభ్యులుగా వున్నవారికి అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఆ సంఘాలను ఎత్తివేశారు. ఇది నాటి కథ. ఇక నేడు కొనసాగుతున్న కుప్పం పద్దతి కూడా ఇలాంటి పథకాల్లో ఒకటి దానిని పరిశీలిస్తే మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
ప్రభుత్వ భూములను కంపెనీలకు అప్పగించడం
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కొనేరు రంగారావు కమిటీ అనేక సూచనలు చేసింది. ఆ సూచనల్లో ముఖ్యంగా ప్రభుత్వ భూములను వెంటనే పేదలకు పంచాలని సూచించింది. ప్రభుత్వ భూములపై సాగు యాజమాన్యం కలిగిన వారికి పట్టాలు ఇచ్చి వారికి రక్షణ కల్పించాలని కోరింది. చివరకు కౌలు చేసుకుంటున్న రైతులకు వారు కౌలు చేస్తున్నట్లు గుర్తింపు కార్డులను ఇవ్వాలని చెప్పింది. నేటికీ రాష్ట్రంలో వున్న లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను వెంటనే పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కమీషన్ నివేదికను శాసనసభలోనే ఆమోదించింది. అయినా నేటికీ అమలు జరగడంలేదు. కోనేరు రంగారావు కమీషన్ సిఫార్సులను అమలు చేయడం అంటే పేదలకు భూములపై హక్కులు కల్పించడమే. కాని ప్రభుత్వ విధానం అందుకు భిన్నంగా వుంది. పేదల భూములను ఏవిధంగానైనా లాక్కోని కంపెనీలకు కట్టబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. నేడున్న ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే అధికారం పొందవచ్చు. ప్రభుత్వ భూములపై పేదలకున్న హక్కులు తొలగించబడతాయి.
ప్రైవేటీకరణలో భాగంగానే భూములను సేకరించి కంపెనీలకు అప్పజెప్పడం ప్రభుత్వ విధానంగా కొనసాగుతున్నది. ప్రజల నుండి, రైతుల నుండి నిరసనలు ఎంత తీవ్రంగా వచ్చినప్పటికి వాటిని అణగదొక్కడానికి లేదా వక్రీకరించడానికి ప్రభుత్వం తన శక్తి యుక్తులన్నీ ఉపయోగిస్తున్నది.
ఇజ్రాయిల్‌లో రెండు తరహాల విధానం కొనసాగుతున్నది. అవి 1. కింబుట్స్ 2. మోషవ్ పద్ధతులు.
1. కింబుట్స్ పద్ధతి : మన రాష్ట్రంలో కుప్పం తరహా విధానాన్ని పోలివుంటుంది. రైతుల భూములను ఏకఖండంగా చేసి కంపెనీ వ్యవసాయం చేస్తుంది. రైతులకు కౌలు చెల్లిస్తారు. ఇది గిట్టుబాటు కాకపోవడంతో ఈ విధానాన్ని నిలిపివేశారు.
2. మోషవ్ పద్ధతి : ఈ పద్దతిలో ఎవరి భూములు వారికే వుంటాయి. ఉపకరణాల సరఫరా మరియు మార్కెటింగ్ మాత్రమే సహకార పద్ధతిలో కొనసాగుతాయి. ఈ విధానం గతంలో మన సహకార సంఘాలను పోలినవే.
చిన్న కమతాల వల్ల ఎక్కువ ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని జపాన్ అనుభవం తెలియజేస్తున్నది. చైనా కూడా చిన్నకమతాల వల్లనే ప్రపంచంలోనే ఉత్పాదకతలో మొదటిస్థానంలో వుంది. అలాంటిది యిక్కడ ఏకీకృత భారీ కమతాలు లాభిస్తాయని చెప్పడమంటే భారీ యంత్రాలతో వ్యవసాయం సాగించాలి. భారీ యంత్రాలను కంపెనీలు మాత్రమే వినియోగిస్తాయి. కానీ, చిన్న కమతాల సేద్యానికి కూడా వరికోత, దున్నకం, వేరుశనగ, మొక్కజన్న, నూర్పిడ్లకు మరియు మందులు స్ప్రే చేయడానికి చిన్న యంత్రాలు వచ్చాయి. ఆ యంత్రాలను వినియోగించి రెండుమూడు ఎకరాలు కల్గిన కమతాలలో అధికోత్పత్తి రాబట్టడానికి అవకాశాలు వున్నాయి.
ప్రభుత్వ లక్ష్యం ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం కాదు. ప్రపంచంలో నేడు వస్తున్న మార్పులకనుగుణంగా బడా కంపెనీలకు భూములను అప్పగించడమే లక్ష్యంగా వుంది. ఇంతకుముందు ఎస్.ఇ.జడ్‌ల పేరుతో భూసేకరణ కొనసాగించారు. అనేకచోట్ల యీ సేకరణకు వ్యతిరేకంగా రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీని నుండి తప్పుకోవడానికి ‘‘సహకార సేద్యం’’ అంటూ కంపెనీలను రంగంలోకి తెస్తున్నది. వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుతో ఒక్కో కంపెనీకి వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టడానికే యీ సహకార సేద్య విధానం. మరో ముఖ్యమైన అంశమేమిటంటే నేటికీ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 40 లక్షల ఎకరాలకు పైగా వున్నాయి. ఈ భూములను సహకార క్షేత్రాల పేరుతో కంపెనీలకు అప్పజెప్పడం ఖాయంగా కన్పిస్తున్నది. ఏదేమైనా బహుళజాతి సంస్థలకు లాభం కల్గేవిధంగా వ్యవసాయరంగంలో మార్పులు తేవాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా వుంది. విత్తనరంగం చూస్తుండగానే బహుళజాతి సంస్థల పరమైన తర్వాత నాణ్యతలేని, కల్తీవిత్తనాలతో యేటా రైతులు రాష్ట్రంలో 4,5 లక్షల ఎకరాలలో పంటలు నష్టపోతున్నారు.వీరికి రక్షణ కల్పించడానికి విత్తన చట్టంలేదు. విత్తన చట్టం -2004 నేటికీ కేంద్రం వద్ద పెండిరగ్‌లో వుంది.
రాజ్యాంగం ప్రకారం వ్యవసాయరంగం రాష్ట్ర జాబితాలో వున్నప్పటికీ విత్తన, మార్కెటింగ్ చట్టాలను కేంద్రం ఆదేశాల మేరకు చేశారు. ఇవి రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. రానున్న కాలంలో కనీస మద్దతు ధరల విధానాన్ని కూడా తొలగించే ప్రయత్నం కొనసాగుతున్నది. మద్దతు ధరలు ప్రకటించినా యిప్పటికే అవి అమలు జరగడంలేదు.
ప్రభుత్వ ముసాయిదాలోనే సహకార వ్యవస్థలో ఏర్పాటుచేసిన సహకార వ్యవసాయ క్షేత్రాల నిర్వహణ విఫలమైందని ముసాయిదా (పేజీ 13)లో అంగీకరించారు. ఒకవైపు విఫలమైందంటూనే మరోవైపు సహకారం అన్న పదాన్ని వినియోగించడం ఎవరిని మభ్యపుచ్చడానికి? సహకార పదం బదులు నేరుగా కంపెనీ పదమే వాడటం న్యాయంగా వుంటుంది.
గతంలో సహకారరంగంలో అనేక మార్పులు, విధానాలు రూపొందించారు. ప్రభుత్వాలు ఏ ఒక్కదానినీ చివరికంటా కొనసాగించలేదు.
1. ప్రాథమిక సేవా సహకార సంఘాలు
2. రైతు సేవా సహకార సంఘాలు
3. జాయింట్ ఫార్మింగ్ సొసైటీలు (ప్రభుత్వ భూములలో),
4. కౌలుదార్ల వ్యవసాయ సహకార సంఘాలు
5. బహుళార్థ సహకార సంఘాలు ఏర్పాటుచేశారు.
ఒక్కోమంత్రి ఒక్కో ప్రయోగాన్ని చేస్తూవచ్చారు. అయినప్పటికీ సహకార రంగం బాగా విస్తరించింది. ఈ రంగంలో చెరకు ఫ్యాక్టరీలు, ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీలు, పాల సొసైటీలు, వృత్తిసంఘాల సొసైటీలు లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలు వృద్ధి చెందాయి. పాలకవర్గాల అక్రమజోక్యం, అవినీతి వలన యీ సంఘాలన్నీ పనిచేయని స్థితికి చేరుకున్నాయి. 1995 సహకార చట్టంప్రకారం పాల సొసైటీలను మార్చారు. చెరకు ఫ్యాక్టరీలను ప్రయివేటుపరం చేశారు. ఒకవిధంగా మొత్తం సహకార రంగాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. ఈ స్థితిలో సహకార వ్యవసాయమంటూ ఈ ప్రభుత్వం కొత్త నినాదాన్ని రూపొందించింది. ఈ విధానంలో కంపెనీలకే పూర్తి బాధ్యత, హక్కు కల్పించబడుతుందని ముసాయిదాలో చెప్పబడిరది. అనేక సందర్భాలలో ప్రస్తుతం వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి సంఖ్యని సగానిక సగం తగ్గించాలని ముఖ్యమంత్రి పదేపదే చెప్పారు. ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడిన వారికి చదువు లేదు. అందుకనుగుణంగానే యీ విధానం రూపొందించబడిరది. కంపెనీకి భూములిచ్చినవారికి వ్యవసాయానుబంధ వృత్తులలో పని కల్పిస్తామంటూ మరో ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయానుబంధ వృత్తులైన గొర్రెల, మేకల పెంపకం, ఆక్వా, ఇతర చేతివృత్తులు ఆదరణ లేక దివాళా తీశాయి. వారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌లేదు. అలాంటి వృత్తులనే తిరిగి భూములు కోల్పోయిన వారికి కల్పిస్తామనడం హాస్యాస్పదంగా వుంటుంది.
రాష్ట్రంలో 120.44 లక్షల కమతాలు వుండగా, అందులో 83.5 శాతం ఐదెకరాల లోపు కల్గిన సన్న,చిన్నకారు రైతులు వున్నారు. వీరివద్ద 70.17 లక్షల హెక్టార్ల భూమి వుంది. మొత్తం సాగుభూమిలో 40% సాగుచేస్తున్న వీరు మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో 60% ఉత్పత్తి చేస్తున్నారు. చిన్నకమతాలే ఉత్పత్తి ఎక్కువ చేస్తాయనేది దీని ద్వారా స్పష్టమవుతుంది. వ్యవసాయంలో వీరు బాగా నష్టపోతున్నారని, తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తి పెంచి లాభించే విధంగా యీ విధానం ఉపయోగపడుతుందన్నారు.
జాతీయ రైతుల కమీషన్ ఏమి చెప్పింది?
డా॥ ఎం.ఎస్. స్వామినాధన్ చైర్మన్‌గా ఏర్పడిన కమీషన్ రైతుల భవిష్యత్‌కు సంబంధించిన సంఘాల ఏర్పాటు గురించి ఈ దిగువ విధంగా చెప్పింది. చిన్నరైతుల అభివృద్ధితోపాటు మహిళారైతులను స్వయం సహాయక గ్రూపుల్లో పెట్టి వారికి వ్యవసాయ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ దిగువ సంఘాలు ఏర్పాటుచేయాలి రికమండ్ చేసింది.
1. సహకార రైతుల మరియు సేవా సహకార సంఘాలు : గత పంచవర్ష ప్రణాళిక కాలంలో వీటికి ప్రాధాన్యత వుంది. వాటి ఎదుగుదలకు వున్న ఆటంకాలను తొలగించి చిన్న రైతుల కుటుంబాలకు లాభం కలిగే విధంగా సహకార వ్యవస్థను అభివృద్ధి చేయాలి. డైరీ (పాడి) పరిశ్రమలో సేవా సహకారసంఘాలు చాలా వరకుజయప్రదం అయ్యాయి. స్వయం ప్రయోజనంతో మార్కెటింగ్ సహకార సంఘాలు, సేవా సహకార సంఘాలు కలగలసి పనిచేశాయి. గ్రామాల్లో బోరుబావులను, లిప్టుపథకాలను సహకార సంస్థల ద్వారా నిర్వహించాలి. ఈ విధమైన చర్యద్వారా వ్యవసాయ పెట్టుబడి తగ్గడమే కాక, ఉత్పత్తి పెరిగింది. రైతుల ఆదాయం పెరిగింది.
2. స్వయం సహాయక సహకార సంఘాలు : ముఖ్యంగా మహిళలతో మైక్రో క్రెడిట్‌పై పనిచేస్తున్నది. వీరు కొంత భూమిని కౌలుకు తీసుకొని ఉత్పత్తిని చేయాలి. హరితవిప్లవానికి ఇది ఉపయోగపడుతుంది. సాంకేతికపరిజ్ఞానం, రుణంతో ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ చేస్తారు. (ఐకెపి ద్వారా ప్రస్తుతం ఆ పని సాగుతున్నది)
3. చిన్న రైతుల ఎస్టేట్స్ : పత్తి, ఆర్టికల్చర్, ఔషధ మొక్కలు, కోళ్ళపరిశ్రమ, ఆక్వా లాంటి ఉత్పత్తులకు చిన్న రైతుల ఎస్టేట్స్ నెలకొల్పాలి. వీరు ఉత్పత్తిని పెంచడమే కాక, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం మరియు మార్కెటింగ్ సంబంధాలు టెక్స్‌టైల్స్ మిల్లులు, ఆహార ప్రాసెసింగ్‌కంపెనీ, ఔసధకంపెనీ,చేపల మార్కెటింగ్ ఏజన్సీలతో సంబంధాలు కలిగి వుంటారు. దీనివల్ల కొంతమందికి ఉపాధి పెరుగుతుంది.
4. కాంట్రాక్ట్ ఫార్మింగ్ : భారత ఆహార సంస్థ జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ వీరు కనీస మద్దతు ధరలను ప్రకటించి అమలు చేయాలి. ఆ మద్దతు ధరల హామీపై కాంట్రాక్టు సేద్యం చేయబడుతుంది. ఈ సేద్యం క్రింద కూరగాయాలు, పండ్లు, పూలు, ఔషధమొక్కలు, నార పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చెరకు, ముతక ధాన్యాలు మరియు పత్తి లాంటి పంటలు అందించడానికి కాంట్రాక్టు వ్యవసాయం ఉపయోగపడుతుంది. ఏపరిస్థితిలోను రైతును భూమినుండి తొలగించకూడదు.
5. రైతుల కంపెనీలు : కంపెనీ (సవరణ) చట్టం 2002 ప్రకారం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను రిజిస్టర్ చేయాలి. దీనికింద విత్తనోత్పత్తి బయో ఫెర్టిలైజర్స్, బయో ఫెస్టిసైడ్స్. బయోసాఫ్ట్‌వేర్‌తో సుస్థిర వ్యవసాయం సాగాలి. ఈ కంపెనీలకు చిన్న రైతులు మరియు స్వయం సహాయక గ్రూపుల ద్వారా సంబంధం కలిగి వుండాలి. ఏపరిస్థితుల్లోనూ వీరిని వాటాదారులుగా చేయరాదు.
6. స్టేట్ ఫార్మ్ : 1950లో ప్రభుత్వం పెద్ద పెద్ద ఫార్మ్స్‌ను సోవియట్ యూనియన్‌లో లాగా ఏర్పాటుచేసింది. ఆహారేతర పంటలను ఇందులో పండిస్తారు. ఈ ఫార్మ్స్‌కు స్వయం సహాయక మహిళా గ్రూపులతో అధికోత్పత్తి విత్తనాలను, పశుగ్రాసం మొక్కలను కూరగాయలు, పండ్లు, పూలను ఉత్పత్తి చేస్తారు. అదేవిధంగా ఈ ఫార్మ్‌లలో పశువులు, గొర్రెలు మరియు కోళ్ళలో సంకరజాతిని అభివృద్ధి చేయాలి.
డా॥ స్వామినాధన్‌గారు ఎక్కడా రైతుల భూములను అన్ని హక్కులతో తీసుకొని వాటాలుగా నిర్ణయించాలని సూచించలేదు. చిన్నరైతుల రక్షణకు అనేక సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వారి సూచనలకు భిన్నంగా వుంది.
ఇప్పటికే వ్యవసాయరంగంలోని అన్ని విభాగాలను ప్రయివేటీకరిస్తున్నారు. సాగునీటిని వ్యాపార సరుకుగా మార్చడానికి జి.ఓ. 37 తెచ్చారు. వాటర్ రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటుచేశారు. ఈ కమీషన్ ద్వారా నీటి తీరువాను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిని నిర్వహణను మొదటి నీటి సంఘాలకు తర్వాత కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విత్తన రంగం పూర్తిగా ప్రైవేటీకరించబడిరది. బహుళ సంస్థలు విత్తన రంగంలోకి వచ్చాక నాణ్యతలేని విత్తనాలను అత్యధిక ధరలకు అమ్మి రైతులను దివాళా తీయిస్తున్నారు. పంటలు లేక రైతులు నష్టపోతున్నారు. ఇవన్నీ కార్పోరేటీకరణలో భాగం. చివరకు భూమిని కూడా ఏకీకృతం చేసి కంపెనీలకు అప్పగించడానికి ప్రభుత్వం వివిధ రకాల విధానాలను ముందుకు తెస్తున్నది. అనేక ఉద్యమాలు సాగించి భూసంస్కరణల చట్టాన్ని సాధించారు. ఈచట్టం ద్వారా భూములు లేని పేదలు, పేద రైతులుగా అభివృద్ధి చెందారు. అలాంటి వారు తమ ఉపాధిని తామే సంపాదించుకుంటున్నారు. నేడు వీరిని భూముల నుండి తొలగించి తిరిగి పాత పద్దతిలో భూస్వాములకు బదులు పెట్టుబడిదారులకకంపెనీలకు భూములు అప్పగించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
అభివృద్ధి చెందిన చైనా, జపాన్ లాంటి దేశాల్లో చిన్న కమతాల ద్వారా అధికోత్పత్తి చేస్తున్నాయి. చిన్న కమతాలకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ యంత్ర పరికరాలను రూపొందించారు. మానవ శ్రమను తగ్గించి 8% ఉత్పత్తిని ఏటా పెంచుతున్నారు. విఫలమైన భారీ కమతాల వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దశలో చేపట్ట పూనుకోవడం వలన రైతుల ఉపాధికి హాని కలిగిస్తుంది. రైతులే కాక వారిపై ఆధారపడిన అనేక గ్రామీణ కుటుంబాలు ఉపాధి కోల్పోతారు.
బహుళజాతి సంస్థలకు లాభాలు కట్టబెట్టే యీ విధానాన్ని నిరాకరించాలి. స్వంత ఉపాధి కల్పించుకున్న రైతులను ఉపాధికి దూరంచేసే విధానం సరిjైుందికాదు. ఏ కోణం నుండి చూసినా ప్రభుత్వ ప్రకటిత సంయుక్త సేద్యం (కంపెనీ సేద్యం) రైతాంగానికి నష్టం కల్గించేదే తప్ప లాభించేది కాదు. ఇది రైతులను భూమికి దూరం చేస్తాయి. రైతులు ఉపాధి కోల్పోతారు. వలసలు కొనసాగుతాయి. ఇన్ని అనర్థాలకు కారణమైన కంపెనీల వ్యవసాయం విరమించుకోవాలి. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసి రైతులను నిర్వాసితులను చేసే విధానాన్ని విడనాడాలి.
కుప్పం సహకార విధానం
1997లో రామకుప్పం మండలంలోని చెల్దిగాని పల్లి వద్ద ‘‘డెమో ప్రాజెక్టు’’ ప్రారంభించారు. దీనిని 200 ఎకరాలలో 151 మంది రైతులతో సొసైటీ ఏర్పాటుచేశారు. దానినే రెండు బ్లాకులుగా విభజన చేశారు. ఈ సొసైటీ నిర్వహణ బి.హెచ్.సి. (బ్రైట్ అసిటీ కంపెనీ) ఇజ్రాయిల్ ద్వారా డెమో ప్రాజెక్టును నిర్వహించారు. పొలాల గట్లు అన్నీ తొలగించేసి రైతులకు కౌలు ఇస్తామని నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2 సంవత్సరాల వరకు ఏమీ ఇవ్వలేదు. రైతులు నిలదీస్తే మెట్ట రైతుకు రూ. 1500లు, బోరుబావి వున్న రైతులకు రూ. 2000/-లు కౌలుగా ఇచ్చారు. 4వ సంవత్సరం మెట్టరైతుకు రూ. 3000లు, ఇతర రైతులకు రూ. 5000/-లు ఇచ్చారు. బి.హెచ్.సి. కంపెనీ తీసుకున్న తర్వాత గట్లను తొలగించారు. సర్వే రాళ్ళను తీసివేశారు. ఏక ఖండంగా చేశారు. భారీ యంత్రాలతో వ్యవసాయం చేశారు. తమ భూములు తమకివ్వమని గొడవ చేస్తే 2002సం.లో ప్రాజెక్టులను ఎత్తివేసి 2003సం.లో సర్వే నెంబర్లు ఏర్పాటుచేసి నిర్మించి రైతులకు ఇచ్చారు. ఈ డెమో ప్రాజెక్టులో బేబికార్న్, కర్బూజా, దోస, గెర్కిన్స్, క్యాప్సికమ్, టమాటా, బంగాళాదుంప, బీన్స్ లాంటి పంటలు వేశారు. విచ్చల విడిగా క్రిమసంహార మందులు, రసాయనిక ఎరువులు వాడారు. విత్తనం వేసే దగ్గర నుండి కోసే వరకు యంత్రాలనే వాడారు. పండిన పంటలు బెంగుళూరు, హైదరాబాద్, మద్రాసు, ఢల్లీి, కోలకత్తా నగరాలకు ఎగుమతి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కూడా ఈ పంటలపై రాలేదు. ఈ సహకార సేద్యం విఫలమైంది.
ఇదే ప్రాంతంలో మరో తరహా రెండవ ప్రాజెక్టును 1600ఎకరాలలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు జపాన్ బృందం రూ. 9కోట్లు విలువ చేసే డ్రిప్ పథకాలను ఉచితంగా ఇస్తే వాటిని రైతులకు అందచేశారు. ఎవరి భూముల్లో వారు ఆ డ్రిప్ పథకాలతో సేద్యం చేశారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు అయింది. ఇది కొంత మేరకు రైతులకు ఫలితాన్ని ఇచ్చింది.
మరో 9వేల ఎకరాలలో 50% సబ్సిడీతో రైతులకు 3లక్షల నుండి 6 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇచ్చారు. వీటితో నాణ్యతలేని మైక్రో ఇరిగేషన్ పథకాలను కొనుగోలు చేశారు. రైతులు నష్టపోయారు. పంటలు పండలేదు. రైతులు సహకార బ్యాంకులకు లక్షల్లో అప్పు పడ్డారు. ఇక్కడి రైతులకు రుణమాఫీ పథకం వర్తించలేదు. ప్రస్తుతం వీరు భారీ మొత్తంలో రుణగ్రస్తులై సంక్షోభంలో కూరుకుపోయారు.
మొదటి డెమో ప్రాజెక్టు ఏకఖండంగా ఏర్పాటు చేసి విఫలం కావడంతో తిరిగి ఎవరి భూములు వారికి ఇచ్చిన తర్వాతనే ప్రస్తుతం పంటలు లాభదాయకంగా పండిరచుకుంటున్నారు. రెండవ ప్రాజెక్టుకు సబ్సిడీ ఇచ్చి నీటి సౌకర్యం కల్పించడంతో వారుకూడా కొంత ఆదాయాన్ని పొందుతున్నారు. 3వ ప్రాజెక్టులో నాణ్యతలేని పరికరాలు నాసిరకం విత్తనాలు సరఫరా చేయడం వల్ల రైతులు నష్టపోయారు. పై మూడు ప్రాజెక్టుల అనుభవాలను పరిశీలిస్తే సన్న, చిన్నకారు రైతులుగా వుండి స్వంతంగా ప్రభుత్వ సబ్సిడీ సహకారంతో సాగించిన వ్యవసాయాలు కొంతమేరకు రైతులకు ఆదాయాన్ని అందించాయి. ఏక ఖండంగా యంత్రాలతో సాగించిన వ్యవసాయం పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం ఇజ్రాయిల్ తరహా సహకార సంఘాలను ఉదాహరణగా చెప్పింది.
మిగులు భూముల చట్టంలో సవరణలు
2009 జూలై 16న రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా మిగులు భూముల పంపిణీ చట్టానికి సవరణలు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973లో సెక్షన్ 14లోని సబ్ సెక్షన్ 6లోని క్లాజ్ 3కుసవరణ చేసింది. సవరణ ప్రకారం ‘‘వినియోగం/ప్రాథమిక వనరుల కల్పనకు అమ్మకం/పరిశ్రమాభివృద్ధికి లేదా ఏదైనా ప్రజోపయోగ పనులకు పంపిణీ చేయవచ్చు’’.
1973 చట్టం సెక్షన్ 14లో మిగులు భూములను వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ వృత్తిదారులకు, సాగుకు లేదా ఇండ్ల స్థలాలకులేదా వ్యవసాయ అనుబంధ అవసరాలకు మాత్రమే పంపిణీచేయాలని వుంది. ఈ ఆర్డినెన్స్‌ను 30.9.09 న శాసనసభలో చట్టంగా ఆమోదించారు.
మిగులు భూములన్నీ పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టే ప్రమాదం వుంది. గతంలో రద్దుచేయబడిన జమిందార్లు, నేడు పారిశ్రామికాధిపతులుగా కొత్త అవతారమెత్తి ఆ భూములను చేజిక్కించుకుంటారు. కోర్టు లిటిగేషన్‌లో వున్న సుమారు 2లక్షల ఎకరాల మిగులు భూములు ఈ సవరణ ద్వారా తిరిగి పెట్టుబడిదారుల చేతికి వెళ్తాయి. విచిత్రమేమంటే ఈ సవరణను 2004 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది. అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి 6 మాసాలు ముందు ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా పెట్టుబడిదారులుగా మారిన భూస్వాములు తమ భూములను లాక్కోవడం, లేదా ప్రభుత్వం బలవంతంగా సేకరించి వారికి అప్పజెప్పడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 5లక్షల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్దపడిరది. నేడు అవన్నీచట్ట ప్రకారం క్రమబద్దీకరించబడ్తాయి. పేదల భూములను ఈ పేరుతో బడా సంస్థలకు అప్పజెప్పడానికి వీలుగా వుంటుంది. భూసంస్కరణల చట్టాన్ని రివర్స్ (తిరోగమనం)లో అమలు జరుపుతున్నది.
ఆ లక్ష్యంలో భాగంగానే మిగులు భూముల పంపిణీ సవరణ చట్టం, సహకార/ కంపెనీ సేద్యం లాంటి పథకాలను చట్టపరంగా ముందుకు తెచ్చింది. చట్టాలను చేయడమే కాక జిల్లాయంత్రాంగాన్ని ఉసిగొల్పి తక్షణమే సేకరణ చర్యలు కూడా కొస‘సాగిస్తున్నది. ఇందుకు ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను నిర్ణయిస్తున్నది. ప్రభుత్వం యొక్క ఆతృత వేగవంతంగా తీసుకునే ఈ చర్యలను గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై భూ సేకరణకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ఎంత వత్తిడి తెస్తున్నదో అర్థమవుతుంది.
సారంపల్లి మల్లారెడ్డి
28.01.2012

No comments:
Post a Comment