Tuesday, 12 August 2014

సాగునీటి నుండి రైతులను దూరం చేస్తున్న సంస్కరణలు

        ప్రపంచీకరణ అమలులో భాగంగా ప్రపంచబ్యాంకు ఆదేశాలకు లోబడి సాగునీటి రంగంలో సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తున్నాయి. జి.వో. 37 ద్వారా మైక్రో ఇరిగేషన్‌ అభివృద్ధి, వాటర్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టింది. వాటర్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటుకు శాసనసభలో చట్టం రూపొందించారు.  ఈ చట్టం ద్వారా ఏర్పడిన కమిషన్‌ నీటి వినియోగానికి సంబంధించి పూర్తి హక్కు కలిగి ఉంటుంది. ప్రభుత్వం, వినియోగదారులు మధ్య పరిష్కర్తగా ఉండి నీటి వినియోగాన్ని, నీటి ధరను ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ వలనే బహిరంగ విచారణ జరుపుతుంది. ఎక్కువ ధర చెల్లించే వారికి నీటిని వినియోగించే హక్కు కల్పిస్తారు. సాగునీటికి వినియోగించే ధర తక్కువగా ఉండడం వలన సాగునీటికి కాకుండా త్రాగునీటి వ్యాపారానికి, పరిశ్రమలకు మరియు ఈతకొలనులకు ఎక్కువ ధరలకు నీటిని అమ్ముతారు. ఈ విధానాన్ని సాగునీటి సంఘాల ద్వారా అమలు చేస్తారు. సాగునీటి సంఘాలు ఎక్కువ ధర చెల్లించిన పారిశ్రామిక వేత్తలకు, పట్టణ త్రాగునీటి వ్యాపారులకు నీటిని సరఫరా చేస్తారు. ఆ విధంగా రానున్న రోజుల్లో రైతులకు సాగునీటి లభ్యత తగ్గుతుంది. 2001 నుండి ప్రపంచబ్యాంకు ప్రోత్సాహంతో ప్రాజెక్టు ఆయకట్టుపరిధిలో సాగునీటి మీటర్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ సంస్కరణలను కొనసాగించింది.
జపాన్‌ ఇంటర్‌ నేషనల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు పథకం
    పై సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రు.12,927 కోట్ల వ్యయంతో కూడిన పథకాన్ని చేపట్టింది. 31 నీటి వనరులకు ఈ నీటి పథకాన్ని అమలు చేస్తారు. 62 లక్షల ఎకరాలకు మైక్రో సూక్ష్మ నీటి సౌకర్యం పథకం ద్వారా (డ్రిఫ్‌ స్పింక్లర్‌) వర్తింపచేస్తారు. ఒక టిఎంసి నీటిని 15వేల ఎకరాలకు వినియోగించాలి. ప్రతి పది ఎకరాలకు ఒక ‘‘సంప్‌’’ నిర్మాణం చేయాలి. దీనికి 1.35 లక్షల వ్యయం అవుతుంది.  దళిత గిరిజనులకు 100% సబ్సిడితోను, సన్న, చిన్నకారు రైతులకు 90% సబ్సిడితోను ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లో చెప్పారు.
(8745 కోట్లు జపాన్‌ నుండి రుణం,2640 కోట్లు     కేంద్రం గ్రాంటు, 1200 కోట్లు రాష్ట్రం, 540 కోట్లు రైతులు, మొత్తం 12927 కోట్లు.)
     పై పథకాన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. మొదటి దశలో 2010 ఖరీప్‌ నాటికి 5,40 లక్షల ఎకరాలకు రు. 1250 కోట్లతో పథకాన్ని అమలు చేయాలి.
    కర్నూలు -కడప కాలువ 2.40,000 ఎకరాలు
    పులివెందుల రిజర్వాయర్‌ 96.900 ఎకరాలు
    చిత్రావతి బ్యాలెన్స్‌ంగ్‌ రిజర్వాయర్‌ 59,400 ఎకరాలు
    గండికోట ఎత్తిపోతల పథకం 47,500 ఎకరాలు
    భీమా ఎత్తిపోతల పథకం 45,000 ఎకరాలు
    గోదావరి ఎత్తిపోతల పథకం 77,000 ఎకరాలు
    మొత్తం 5.40,000 ఎకరాలు
    మైక్రో ఇరిగేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పెట్టుబడిదారులకు లాభాలు కట్టబెట్టడమే తప్ప మరొకటి కాదు. ప్రపంచ బ్యాంకు రుణాలు అన్ని షరతులతో కూడుకున్నవే. ఈ షరతులు సన్న,చిన్నకారు రైతుల ఉనికికి అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.
    1995లో ‘‘రాష్ట్ర ఆర్థిక పున్ణనిర్మాణ కార్యక్రమం’’ అమలులో  భాగంగా సంస్కరణల పర్వం రాష్ట్రంలో ప్రారంభమైంది. రాష్ట్రంలోని నీటి వనరులపై ప్రపంచబాÊయంకు సాంకేతిక నివేదికలు రూపొందించింది. అందులో ప్రస్తుతమున్న ప్రాజెక్టులు మరియు ఇతరంగా వున్న నీటి వనరులు చర్చించింది. నూతన ప్రాజెక్టుల జోలికి వెళ్ళకుండా అందుబాటులో వున్న నీటి వనరుల నుండి లభ్యమయ్యే నీటిని ఎలా వినియోగించుకోవాలో వివరించింది. అందుకు ‘‘కాల నిర్ణయ’’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలు చేయాలి - అది అమలు జరిగితేనే ప్రపంచబ్యాంకు రుణం లభ్యమవుతుంది.
ప్రపంచబ్యాంకు ఈ దిగువ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించింది :
1.    రాష్ట్ర నీటి వనరులపై శ్వేతపత్రం - జూన్‌ 1996
2.    ప్రజలతో చర్చలు - ఫిబ్రవరి 1996 నుండి మార్చి 1997 వరకు
3.    నీటి తీరువా పన్ను మూడు రెట్లు పెంపుదల - ఏప్రిల్‌ 1997
4.    నీటి రంగంలో రైతుల యాజమాన్యానికి చట్టం - ఏప్రిల్‌ 1997
5.    10292 నీటి సంఘాల ఏర్పాటు - జూన్‌ 1997
        174 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఏర్పాటు - నవంబర్‌ 1997   
6.    నీటి ఛార్జీల సమీక్షా కమిటీ ఏర్పాటు - డిసెంబర్‌ 1997
7.    సాగునీటి రంగంలో నూతన విధానం - మార్చి-మే 1998
8.    కాల్వలలో మొదటి శ్రమదాన కార్యక్రమం - మే-జూలై 1998
9.    మొదటి నీటి సంఘాల అధ్యక్షుల సమావేశం - ఏప్రిల్‌ 1998
10.    రెండవ శ్రమ దాన కార్యక్రమం - మే-జూలై 1998
11.    నీటి వనరుల రిపేర్లలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గింపు
12.    సాగునీటి మీటర్ల ఏర్పాటు 2003
    1996 జూన్‌లో శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ పత్రంలో సాగునీటి రంగంలో సిబ్బంది ఎక్కువగా ఉన్నారని, నిర్వహణ సామర్ధ్యం బాగా లేదని, దీన్ని మార్చటడానికి సంస్కరణలు ప్రవేశపెట్టాలని నాటి ప్రభుత్వం సూచించింది. శాసనసభలో ఈ పత్రంపై జరిగిన చర్చలో ఇది ఆ వాస్తవాలతో కూడుకున్న పత్రమని రుజువైంది. అయినప్పటికీ ఆ పత్రం ఆధారంగానే విధానాలు రూపొందించబడినాయి.
ప్రపంచబ్యాంకు ఆదేశించిన విధానాలు :
    సాగునీటి రంగంలో సంస్కరణలు అమలు జరపాలి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన సాగునీరు - విద్యుత్‌ రంగాలలో సంస్కరణలపై ప్రపంచబ్యాంకు దృష్టి పెట్టింది. వ్యవసాయరంగంలో తాము కోరుకునే సమూల మార్పులకు ఈ రంగాలలో సంస్కరణలు అత్యంత కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత విత్తన రంగాన్ని, మార్కెట్‌ రంగాన్ని చివరగా రుణ లభ్యత రంగాన్ని సంస్కరణలలోకి ఈడ్చింది -
    కొత్తగా ఎలాంటి నీటి వనరుల నిర్మాణాలు చేపట్టకుండా ఆంక్షలు పెట్టింది. ప్రజల, రైతుల దృక్పథాన్ని సాగునీటి నుండి మరల్చడానికి ‘‘భూగర్భ జలాల పెంపు’’ ప్రచారం చేపట్టింది. భూగర్భ జలాలు ఇంకిపోవడం వలన పర్యావరణం దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాదన ముందుకు వచ్చింది. ఈ వాదనకు బలం చేకూర్చుతూ నీరు-మీరు, వాటర్‌షెడ్‌, ఇంకుడు గుంటలు, బిందు సేద్యం, తుంపర సేద్యం లాంటి పథకాలను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. ప్రకృతి ప్రసాదించిన నీటిని ‘‘వ్యాసార సరకు’’గా మార్చడానికి పథకాలు రేపింది. రాష్ట్రంలోని బహుళ జాతి సంస్థలకు అవకాశం కల్పించి, వీటిపై వారికి హక్కులుండే విధంగా చట్టాలలో మార్పులు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ చెట్టు భూమి-నీరు సంరక్షణా చట్టం’’ (ఇబిజిశిబి) ప్రభుత్వంతో చేయించింది. బోరుబావులపైన నియంత్రణ ఏర్పరచింది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించే విధంగా పంపుసెట్లకు సరఫరా చేసే విద్యుత్‌ సరఫరా కాలాన్ని అధికారికంగా నీటి సౌకర్యం కలిగిన విస్తీర్ణం తగ్గింది.
    బోరు బావుల కింద 4 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరగగా, ప్రాజెక్టులు, చెరువులు, ఇతర బావుల కింద, ఇతర వనరుల కింద విస్తీర్ణం ఎలా తగ్గిందో గమనించవచ్చు. ప్రపంచ విధానాల ఫలితంగా సాగునీటి వనరుల నుండి క్రమంగా ప్రభుత్వం దూరం కావడం ప్రారంభించింది. ఆహార పంటల విస్తీర్ణం తగ్గించాలంటూ షరతులు విధిస్తున్నది. నీటి వ్యాపారం రాష్ట్రంలో నేడు వేల కోట్లలో సాగుతున్నది. గ్రామీణ ప్రాంతంలో కూడా తాగునీరు కొనుగోలు చేస్తున్నారు. సాగునీటికి మీటర్లు పెట్టాలన్న షరతు కూడా ఆమలు చేస్తున్నాము.
చంద్రబాబు పాలనా కాలంలో నీటి సంస్కరణల అమలు :
    చంద్రబాబు ప్రభుత్వం జి.ఓ. నెం. 225/1997 జారీ చేసింది. అందులో ‘‘వాటర్‌ ఛార్జెస్‌ రివ్యూ కమిటీ’’ (నీటి ఛార్జీల మదింపు కమిటీ) ఏర్పాటుకు నీటి శాఖను ఆదేశించింది. అందులోనే ‘‘నీటి పరిమాణాత్మక కొలత పరికరాలను అమర్చాలని ఆదేశించింది - స్వయంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు ప్రపంచబ్యాంకు అధ్యక్షులు ఉల్ఫెన్‌నన్‌కు 15-5-98న రాసిన లేఖలో సాగునీటి మీటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
    1997 ఏప్రిల్‌లో సాగునీటి సంఘాల చట్టం చేశాడు. రాష్ట్రంలో 10292 సాగునీటి సంఘాలను, 174 ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ సంఘాలను ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలు నిర్వహించారు. రైతులు శ్రమదానం చేసి కాలువలు రిపేర్లు చేసుకోవాల్సిందిగా కోరారు. 1998లో రైతులు శ్రమదానం ద్వారా 22,887 పనులను నిర్వహించి రూ. 118.1 కోట్ల విలువ గల రిపేర్లు చేశారని ప్రపంచబ్యాంకు ప్రశంసించింది. ఇకముందు ప్రభుత్వం రిపేర్లు చేయదని భావించిన రైతులు తామే కాలువల బాగుసేతకు పూనుకన్నారు.
ప్రత్యామ్నాయ వనరులు - వాటి వ్యయం
    కొత్త నీటి వనరుల నిర్మాణాలను చేపట్టకుండా చేయడమే కాక గతంలో చేపట్టిన నిర్మాణాలను కూడా మధ్యలోనే ఆపివేశారు. ప్రభుత్వ విధానం గమనించిన రైతులు బోరుబావుల త్రవ్వకాలు ముమ్మరం చేశారు. 1997లో 15 లక్షలుగా యున్న బోరు బావులు 2003 నాటికి 23 లక్షలకు పెరిగాయి. అనుమతి లేనివి మరో 3.5 లక్షల బావులు తవ్వారు. ప్రభుత్వం నీరు - మీరు కార్యక్రమం విస్తృత ప్రచారంతో చేపట్టింది. ప్రస్తుత వర్షపు నీరు 9 శాతం మాత్రమే భూగర్భ జలాలుగా మారుతున్నదని, దీనిని 13.5 శాతానికి పెంచాలని, నీరు - మీరు కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించింది. పది ప్రభుత్వ శాఖల నుండి వాటికి కేటాయించిన బడ్జెట్‌ను నీరు - మీరుకు మళ్ళించింది.
    (1) అటవీ శాఖ   (2)  గ్రామీణాభివృద్ధి శాఖ   (3) మైనర్‌ ఇరిగేషన్‌                     (4) మైనర్‌ ఇరిగేషన్‌ (ఐ.బి)    (5) భారీ - మధ్యతరహా నీటి పారుదల శాఖ                         (6) ఖజు మరియు ఙఈ శాఖలు   (7) దేవాదాయ శాఖ   (8) గ్రామీణ నీటి సరఫరా శాఖ (9) మార్కెటింగ్‌ శాఖ   (10) ప్రణాళికా శాఖ.
    1-4-2000 నుండి 31-12-2003 నాటికి ఏడు విడతలుగా నీరు`మీరు కార్యక్రమం చేపట్టింది.
``````````````````````````````````````
దశ                   కాలం    వ్యయం (రూ. కోట్లు)
``````````````````````````````````````
1.    1-4-2000 నుండి 30-10-2000    190.17
2.    1-11-2000 నుండి 30-4-2001    168.55
3.    1-5-2001 నుండి 30-9-2001    295.50
4.    1-10-2001 నుండి 31-5-2002    548.4
5.    1-6-2002 నుండి 31-12-2002    312.70
6.    1-1-2003 నుండి  31-6-2003    565.00
7.    1-7-2003 నుండి 31-12-2003    200.00
``````````````````````````````````````
    మొత్తం    2280.38
``````````````````````````````````````
    ఈ నిధుల వ్యయంతో  925 క్యూబిక్‌ మీటర్ల మట్టి తొలగింపు, 48,410 చెక్‌డ్యాంల నిర్మాణం 5,17,814 రాతి కట్టడాలు, 58379 ఇంకుడు గుంతలు తీసినట్లు ప్రభుత్వం వివరించింది.
    అక్టోబర్‌ 2002 నాటికి 9326 వాటర్‌ షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ. 970 కోట్లు అదనంగా వ్యయం చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. 1998 నుండి 2003 వరకు సాగిన చంద్రబాబు సాగునీటి సంస్కరణల కాలంగా రాస్త్రం అనావృష్టికి, అతివృష్టికి గురైంది. కరువుల వలన ఏటా రూ. 4000 కోట్ల పంటలు నష్టం కాగా, వరదల వలన ఏటా 2500 కోట్ల విలువ గల పంటలు సగటున నష్టం జరిగింది. కరువుల - వరదల పరిశీలనకు కేంద్ర బృందాలు రావడం, వెళ్ళడం ఆనవాయితీ  అయింది. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంది.
    2004 మే 14న డా॥ రాజశేఖర్‌రెడ్డి అధికారానికి వస్తూనే ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు. దాంతో రైతులు రానున్న కాలంలో సాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆశలు పెంచుకున్నారు. పెద్ద ఎత్తున ‘‘జలయజ్ఞం’’ ప్రచారం సాగింది. 46వేల కోట్లతో 26 ప్రాజెక్టులు ఆ మూడు సంవత్సరాలలో పూర్తి చేసి 56 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పిస్తానన్నారు. మొదటి రెండు సంవత్సరాలలో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నారు. జూన్‌ 2006 నాటికి 7.5 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం అదనంగా కల్పిస్తానని వాగ్దానం చేశారు. బడ్జెట్‌లో 10వేల కోట్లు కేటాయింపు చూపారు.
    నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల లైనింగ్‌, మోడరైజేషన్‌కు రూ. 2,250 కోట్లు రుణమిస్తానని ప్రపంచబ్యాంకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చింది. అయితే మొత్తం ప్రాజెక్టు నీటి వినియోగం లెక్కించడానికి నీటి మీటర్లు పెట్టాలని షరతు విధించింది. ఆ షరతుకు తలగ్గి సాగునీటి మీటర్ల ఏర్పాట్లు ముమ్మరంగా పెడుతున్నారు. అదేవిధంగా మైనర్‌ ఇరిగేషన్‌ రిపేర్లకు రూ. 1200 కోట్లు ప్రపంచబ్యాంకు రుణమిస్తోంది. ఈ రుణం పొందినందుకు మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల క్రింద ఆహార ధాన్యాలు పండిరచకూడదన్న షరతును బ్యాంకు విధించింది. అంతేకాదు పంపుసెట్ల సాగయ్యే ఆయకట్టుగా ఆహార పంటలు ముఖ్యంగా వరి పంట వేయరాదని, మూడు పంపుసెట్లకు ఎక్కువ ఉన్నవారిని, ఐఎస్‌ఐ పుంపు సెట్లు పెట్టని వారిని, బావుల కింద వరి వేసేవారిని ‘‘ఉచిత విద్యుత్‌ నుండి మినహాయిస్తానని’’ చట్టం చేశారు.
సంస్కరణల ప్రభావం
ప్రాజెక్టుల నివారణ జాప్యం వలన ఏర్పడు ప్రమాదకర ఫలితాలు
1.    రాష్ట్రాల మధ్యన, రాష్ట్రంలోని ప్రాంతాల మధ్యన అసమానతలు పెరుగుతాయి.
2.    వ్యవసాయ పంటల ఉత్పత్తి వేటు తగ్గి ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.
3.    తలసరి ఆహార వాడకం తగ్గి పోతుంది.
4.    వ్యవసాయాధారిత పరిశ్రమలకు కావలసిన ముడిసరుకుల కొరత ఏర్పడుతుంది.
5.    వ్యవసాయంలో విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది.
6.    ఆహార పంటలు తగ్గిపోతాయి.
7.    తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. భూగర్భ జలాలు పడిపోతాయి.
8.    గ్రామీణ నిరుద్యోగం పెరిగి, వలసలు కొనసాగుతాయి.
9.    పనులు లేక అశాంతి పెరుగుతుంది.
10.    వెనకబాటుతనం వలన జనాభా పెరుగుటయే కాక, నాగరికత అభివృద్ధి కాదు.
11.    ఆత్మహత్యలు - ఆస్తుల అమ్మకాలు పెరుగుతాయి.
12.    నీరు వ్యాపార సరుకుగా మారుతుంది.

    ప్రస్తుతం అమలవుతున్న నీటి సంస్కరణలు ఇన్ని ప్రమాదాలను మన ముందుంచుతాయి. ప్రపంచీకరణ విధానాల వలన, ప్రపంచ బ్యాంకు షరతుల వలన లబ్ది పొందేది బహుళజాతి కంపెనీలకు ఏ పెట్టుబడి లేకుండా లభ్యమయ్యే నీటిని కూడా వ్యాపార సరుకుగా మార్చి లాభాలార్జించడానికి ఈ సంస్కరణలు వారికి దోహద పడతాయి. చివరకు తాగడానికి నీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
సంస్కరణలు అభివృద్ధి దిశగా ఉండాలి
    సంస్కరణలు అభివృద్ధి దిశగా ఉండాలి. లభ్యత నీటి వినియోగానికి ప్రణాళికాబద్ధమైన విధానాలు అమలు చేయాలి. ప్రజలకు నష్టం లేని రీతిలో అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణాలు సత్వరం చేపట్టాలి. ‘‘జలవిధానం’’ ద్వారా ఏయే ప్రాంతాలకు ఎంత నీరు ఇవ్వాలో నిర్ణయించాలి. భౌగోళిక స్థితిని బట్టి నీటి కేటాయింపు ఉండాలి. నీటి యాజమాన్యాన్ని మెరుగుపరిచి వృధా నీటిని వీలైనంత వరకు వినియోగంలోకి తేవాలి. నీటిని వ్యాపార సరుకుగా మార్చి ప్రతిచర్యను ప్రభుత్వం అడ్డుకోవాలి. అందరికి తాగునీరు, ఒక పంటకు సాగు లభ్యమగునట్లు చూడాలి. నీటి యాజమాన్య నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం, ప్రజలు సమన్వయంగా చూసే విధంగా సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి రక్షణలు కల్పించాలి. నీటి వినియోగానికి అన్ని అవకాశాలను పరిశీలించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది.19.11.11

No comments:

Post a Comment