2010 అక్టోబర్ 23న ఆహార భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ‘‘దాదాపుగా 80కోట్ల మంది ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థను సవరించి వచ్చే సంవత్సరం అనగా 2011-12 నుండి ఆహార భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చింది. దేశంలోని 75% ప్రజానీకానికి ఆహార భద్రత కల్పించడానికి జాతీయ సలహా కౌన్సిల్ రికమండేషన్ చేసినట్లు సోనియాగాంధీ వివరించింది. గతంలో ఇస్తున్న చౌకడిపో సరుకుల ధరను పునర్ వ్యవస్థీకరిస్తూ ప్రాధాన్యతగల కుటుంబాలకు 35కిలోల చొప్పున ఆహార ధాన్యాలు సరఫరా నిశ్చయించారు. ముతక ధాన్యాలు కిలో రూ.1, గోధుమలు కిలో - రూ.2, బియ్యం -కిలో రూ.3లు చొప్పున ప్రతి నెలా సబ్సిడీ ధరలకు సరఫరా చేస్తారు. జనరల్ కేటగిరి వారికి 20కిలోల ఆహార ధాన్యాలు 50% కనీస మద్దతు ధరపై సరఫరాచేస్తారు. పట్టణ ప్రాంతాల్లో 60%, గ్రామీణ ప్రాంతాల్లో 15% ప్రజలకు ఈ ఆహార భద్రత కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇది మొదటి దశగా పరిగణించి క్రమంగా 2014 నాటికి దేశానికంతటికీ ఈపథకాన్ని వర్తింపచేస్తారు. దీనికోరకు అదనంగా రూ. 15,137 కోట్లు సబ్సిడీగా వ్యయం అవుతుంది. చిట్టచివరిగా రూ. 23,231 కోట్లు అవసరమౌతాయి, ఆవిధంగా మొత్తం సబ్సిడీ ప్రతియేటా రూ. 56700 కోట్లు వ్యయం చేస్తారు. జాతీయ సలహా కౌన్సిల్ రికమండేషన్స్, కేంద్ర క్యాబినెట్ కమీటీ ఆమోదించిన తర్వాత పార్లమెంట్‌లో బిల్లులు పెడతారు. బాలబాలికలకు, గర్భవతులకు, పౌష్ఠికాహారం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందిస్తారు. ముఖ్యంగా రక్తహీనత వున్న బాలికలకు, పాఠశాల విద్యార్థులకు, విటమిన్-ఎ, అయోడిన్, ఐరన్ విటమిన్‌లను సరఫరా చేయడానికి దీనిని లక్ష్యంగా పెట్టుకున్నారు’’.
కేంద్ర భారత ఆహార సంస్థ వద్ద నేడు 5.50కోట్ల టన్నుల ఆహార నిల్వలు వున్నాయి. అందులో 60లక్షల టన్నులు వినియోగానికి ఉపయోగానికి రానివిధంగా చెడిపోతున్నాయి. వీటిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు మొదట ఉత్తర్వు చేసి, తర్వాత ఆదేశించింది. అయినప్పటికీ కేంద్ర వ్యవసాయ శాఖ మాత్యులు బియ్యం, గోధుమల పంపినీకి సుముఖంగా లేరు. వాస్తవానికి బఫర్ స్టాక్ పేరుతో 2.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు మాత్రమేనిల్వ పెట్టాలి. ఇవి రానున్న కాలానికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాలి. నిల్వలను విడుదల చేయకపోవడానికిమిల్లర్లు, వ్యాపారులు కేంద్ర ప్రభుత్వంపై తెస్తున్న వత్తిడే కారణం. ప్రస్తుత మార్కెట్‌లోకి ప్రభుత్వ బియ్యం విడుదల అయితే తాము ధరలు తగ్గి మార్కెట్లో నష్టపోవాల్సి వస్తుందని విడుదల కాకుండా అడ్డుపడుతున్నారు. వ్యాపారుల వత్తిడికి లంగుతున్న ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తుందా?
2010 అక్టోబర్ 28న కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులు శరత్‌పవార్‌గారు ఈ పథకానికి అభ్యంతరం తెలియచేస్తూ ప్రకటించారు. జాతీయ సలహా కౌన్సిల్ 50% సబ్సిడీ పథకాన్ని అమలు చేయడం ద్వారా దాదాపు 35% ప్రజానీకానికి వర్తించేయాలి. ప్రస్తుతం 6.5కోట్ల కుటుంబాలకు 50% సబ్సిడీపై ఆహారధాన్యాల సరఫరా జరుగుతుంది. ఈ కుటుంబాల సంఖ్య 18.6కోట్లకు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ కౌన్సిల్ చెప్పిన 58వేలకోట్ల సబ్సిడీ కాకుండా 88,750కోట్లకు చేరుకుంటుందని ఇంత భరించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. 4 సంవత్సరా లక్రితం ఆహార సబ్సిడీ కింద దేశంలో రూ. 25వేల కోట్లు వ్యయం చేశారు. 4.38 కోట్ల టన్నుల ఆహారధాన్యాలకు బదులు ఈపెరుగుదల వల్ల 6.21కోట్ల టన్నులు సరఫరా చేయాలి. అందువల్ల ఈ పథకాన్ని అమలు చేయడంలో గల ఆర్థిక ఇబ్బందులను తెలియపరుస్తూ అప్పుడే ఈ పథకంపై నీళ్ళు చల్లారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారు 7.70కోట్ల కుటుంబాలను 6.50 కోట్లకు తగ్గించారు.
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తెస్తున్నానంటూ బహుళ ప్రచారం గావించింది. కాని ఆదిలోనే హంసపాదులా ఈ పథకానికి వ్యవసాయ శాఖ మొదట్లోనే గండికొట్టింది. ఆహార భద్రత అమలు జరపడానికి ఆహారోత్పత్తులు పెంచాలి. ప్రస్తుతం మనదేశంలో ఖరీఫ్ , రబీ రెండుపంటలకు కలిపి 22 నుండి 23కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఉత్పత్తిని పెంచాలి. వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం చూపుతున్న కారణంగానూ ఈ రంగానికి నిధులు కోటా తగ్గించడం మూలంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఏమాత్రం పెరుగుదల లేదు. 1990-2007 మధ్యకాలం నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏటా 1.2శాతం పెరుగుదల చూపుతుండగా, జనాభా పెరుగుదల 1.9శాతంగా వుంది. పట్టణాలలోని మురికి వాడలే కాక, గ్రామీణ ప్రాంతంలోని పేదలు, ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాల్లోని పేద ప్రజలు తిండికి నోచుకోవడం లేదు. ఆహార భద్రత అనగా ఒక్క ఆహార ధాన్యాల సరఫరానే కాదు, పౌష్టికాహారానికి కావాల్సిన సరుకులతోపాటు నిత్యావసర సరుకులనుకూడా చౌక ధరలకు సరఫరా చేయాలి. 2005- 06 నుండి నేటి వరకు ఏటా పప్పుధాన్యాల ఉత్పత్తి 1.42 కోట్ల టన్నులు మాత్రమే వుంది. ముతక ధాన్యాల పరిస్థితి అంతంత మాత్రమే. పౌష్టికాహారానికి ఉపయోగపడే రాగులు, సజ్జ, కొర్ర, జన్న లాంటి పంటల ఉత్పత్తుల్లో పెరుగుదల లేదు. అలాంటప్పుడు దేశంలో ఆహార భద్రత ఎలా కొనసాగిస్తారు? దేశంలో దారిద్య్రం పెరుగుతూనే వుంది. పెరుగుతున్న దారిద్య్రాన్ని దాచలేము. 2005లో సేకరించిన గణాంకాల ప్రకారం దేశంలో 46శాతం బాల బాలికలు (3 సంవత్సరాలలోపు) బరువు తక్కువగా వున్నారు. 2015 నాటికి 26.8 శాతానికి తగ్గిస్తామంటూ లక్ష్యంగాపెట్టారు. దీనికి పరిష్కారంగా చౌకడిపోల ద్వారా 1.80కోట్ల కుటుంబాలకు ఆహారానికి అవసరమయ్యే అన్ని సరుకులను సబ్సిడీ ధరకు సరఫరా చేయాలి.
2008 బడ్జెట్‌లో 14 బిలియన్ డాలర్ల రుణం రైతులకు మాఫీచేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ రుణమాఫీకి ప్రధానంగా 2001 నుండి నేటి వరకు 90వేల మంది రైతులు ఆత్మహత్యలకు గురికావడమే కారణంగా ప్రభుత్వం పేర్కొంది. ఆహార ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలితాలివ్వడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆహారోత్పత్తులను మరియు పంపిణీ విధానాన్ని దెబ్బతీస్తున్నాయి.
ప్రపంచంలో 100కోట్ల మంది ప్రజలు ఆకలికి గురౌతున్నట్లు ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. 21వ శతాబ్దంలో వీరి సంఖ్య పెరుగుతూనే వుంది. ప్రధానంగా ఆర్థిక అస్థిరత్వం , వాతావరణ మార్పులు, ఆహారధాన్యాల వినియోగం, భూఆక్రమణలు (భూములు బీడులుగా పెట్టడం), ఆహార సబ్సిడీ, జన్యుమార్పిడి పంటలు కారణంగా ఆహార కొరత ఏర్పడుతున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఐక్యరాజ్య సమితి నినాదం ప్రకారం కనీసం ప్రతి వ్యక్తి 2000 క్యాలరీల శక్తిగల ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. వాస్తవానికి మంచి ఆరోగ్యవంతుడు 2400 క్యాలరీల శక్తిగల ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు 2100 క్యాలరీల శక్తిగల ఆహారాన్ని, పట్టణాల్లో పనిచేస్తున్నవారు 1800క్యాలరీల శక్తిగల ఆహారాన్ని తీసుకోవాలి. కాని ప్రస్తుతం సగటున 1200 నుండి 1300 క్యాలరీల శక్తిగల ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అందువల్ల ప్రజల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
ప్రపంచంలో 260కోట్ల మందికి అనగా 40శాతం ప్రజలకు టాయిలెట్స్ లేవు. ఏటా 35 లక్షల మంది చనిపోతున్నారు. ఒక్క డయేరియా వలన 14 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలోని పేదలు తమ ఆదాయంలో 60-100శాతం వరకు ఆహారం కొరకే ఖర్చుపెడుతున్నారు. 2008 నుండి పెరిగిన ధరలను పరిశీలిస్తే 25శాతం వరకు పెరిగింది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పేదరికం 4 రెట్లు తగ్గించాలని, అందుకు విదేశీ నిధులు కేటాయించాలని నిర్ణయించిన దానికి భిన్నంగా వ్యవసాయ రంగానికి 1979లో 18శాతం నిధులు కేటాయించగా 2008లో 4.5% నిధులు మాత్రమే కేటాయించారు. ఆవిధంగా వ్యవసాయ రంగం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైంది. 9 ఆఫ్రికన్ దేశాలు తమ బడ్జెట్‌లో 10శాతం కేటాయించగా భారతదేశం 2.5% మాత్రమే కేటాయిస్తుంది. ఆవిధంగా ఆహార ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిరది.
మరోవైపు భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. నయా వలస విధానం కొనసాగుతున్నది. లక్షలాది ఎకరాల భూములు పరిశ్రమల పేరుతో లేదా ఇతర వ్యవసాయేతర పనులకు కేటాయిస్తున్నారు. పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. దీనికి తోడు పంటల విధానంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. ఆహారపంటలకు బదులు ఆహారేతర పంటల విస్తీర్ణం పెరుగుతుంది. పారిశ్రామిక వంతంగా అభివృద్ది అయిన దేశాల్లో కూడా ఆహార భద్రతలేమితో బాధపడుతున్నవారు లక్షల్లో వున్నారు.
సరళీకృత విధానాల ఫలితంగా ఆహార ధాన్యాలను బయోడీజిల్‌కు వినియోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నపెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు ముతక ధాన్యాలను అనగా మొక్కజన్న, జన్న, పంచదార, గోధుమలు వగైరా ఆహార ధాన్యాలు డీజిల్ తయారీకి పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. అమెరికాలో 20% ఆహారాన్ని ఈ విధంగా వినియోగిస్తున్నారు. ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడటానికి ఇదోకారణం. బయోడీజిల్ ఉత్పత్తికి జట్రోపా అను మొక్కలను లక్షలాది ఎకరాల్లో సాగుచేస్తున్నారు. డీజిల్, పెట్రోల్‌పై ఆధారపడిన వ్యవసాయం వీటి ధరలు పెరగడంతో ఉత్పత్తి ఖర్చుల భారం కూడా పెరుగుతుంది. ఎరువులు, క్రిమిసంహారక మందులు రవాణా చార్జీల భారం వ్యవసాయరంగంపై పడుతున్నది. ఆహార కొరతకు పై విధానాలు కూడా తోడ్పడుతున్నాయి.
1974లో మొట్టమొదటిసారి ప్రపంచంలో జరిగిన ఆహార సమావేశంలో అమెరికా కార్యదర్శి హెన్రీ కిసింజర్ ప్రకటన చేస్తూ 1984 వరకు అందరికి ఆహార భద్రత కలుగుతుంది అని అన్నారు. 1990లో 8.24కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటుండగా ఈ సంఖ్య 2009 నాటికి 10.20 కోట్లకు చేరింది. ఆఫ్రికా లోని 15 దేశాల్లో 35% ప్రజలు ఆకలిబారిన పడ్డారు. దక్షిణాసియాలో 46 శాతం మంది చిన్న పిల్లలు బరువు తక్కువగా జన్మిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే 1950లో భారత ప్రజలు తీసుకున్న ఆహారం నేడు తీసుకోవడంలేదు.
2003-04 ఆహార నివేదికలో దేశంలో 27శాతం దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సంఖ్యను టెండూల్కర్ కమిటీ 37శాతంగా ప్రకటించింది. అనంతరం సక్సేనా కమిటీ 50శాతంగాను, చివరిగా అర్జున్‌సేన్ గుప్తా కమీషన్ 77శాతంగాను దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు నివేదిక లిచ్చారు. రోజుకు రూ.20 లకు మించిఖర్చుచేయనివారిని ఒక కమిటీ పరిగణనలోకి తీసుకుంటే మరో కమిటి రోజు ఒకకుటుంబం రూ. 100లమించి ఖర్చుచేయనివారిని దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు సూచించింది. ఏది ఏమైనా 113కోట్ల జనాభాలో 40కోట్ల మంది ఆహార కోరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారమే అందుబాటులో లేనప్పుడు పౌష్టికాహారం గురించి ఆలోచించగలమా? నేడు అనేక మంది యువతీ, యువకులు రక్తహీనతకుగురై రోగనిరోధక శక్తి కోల్పోయి జీవచ్చవాలుగా వుంటున్నారు. వీరికి ఆహార భద్రత చట్టం అత్యంత అవసరం. కాని బహుళ జాతి సంస్థల ప్రయోజనాలు కాంక్షిస్తున్న ప్రభుత్వం వీరికి ఆహార భద్రతను కల్పించగలదా? అయినా కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఆహార భద్రత గురించి, పార్లమెంట్‌లో చట్టం తేవడం గురించిపదే పదే ప్రచారం చేసుకుంటున్నది.
జాతీయ సలహా కౌన్సిల్ (జీన్‌డ్రెజ్జ్ ) సమావేశానంతరం మాట్లాడుతూదేశంలో 77% ప్రజలకు రోజుకు రూ. 20లకు మించి ఆదాయం లేదని, వీరందరినీ ఆహార భద్రత చట్టం క్రిందకు తీసుకురావాలని సలహా ఇచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్‌సింగ్ అహ్లు వాల్యా మాటల్లో చెప్పాలంటే ‘‘భారతదేశం ధనిక వర్గాలకు లక్షకోట్ల డాలర్లు రాయితీ ఇస్తుంది. ఇది దేశ జిడిపిలో 10శాతంగా వుంది. అదే సందర్భంలో ఆహార సబ్సిడీ జిడిపిలో 1%మాత్రమే ఇస్తున్నారు’’. భారత్‌లో పెరుగుతున్న పేదరికానికి ఐక్యరాజ్య సమితి నివేదిక అద్దంపట్టింది. దేశంలోని 8 రాష్ట్రాల్లో నెలకొన్నపేదరికం రేటు 26 పేద ఆఫ్రికాదేశాల్లోని పేదరికం రేటుతో పోలి వుంది. బంగ్లాదేశ్ 116వ స్థానంలో, పాకిస్తాన్ 112 వ స్థానంలో వుండగా భారత్ 122 స్థానంలోనే వుంటుంది. మానవాభివృద్ది సూచికలో భారత్ 119వ స్థానంలో వుంది. (169 దేశాల పరిశీలనలో ) పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో సగటు జీవిత కాలం 67 సంవత్సరాలు కాగా భారత్‌లో 64 సంవత్సరాలు మాత్రమే.
2009 ఆగష్టు 26న జరిగిన జాతీయ సెమినార్‌లో ‘‘ఆహార భద్రత మరియు ధరల పెరుగుదల’’ ఆహారభద్రత సమస్యపై ఢల్లీిలో సమీక్షించారు. ఆహార భద్రత చట్టం రావడం వలన గతంలో వున్న బిపిఎల్ కార్డులు తగ్గిపోయే ప్రమాదం వుంది. 6.52 కోట్ల నుండి 5.91కోట్లకు తగ్గుతాయని నేషనల్ శాంపిల్ సర్వే తెలిపింది. ప్రస్తుతం అంత్యోదయ క్రింద ఇస్తున్న 35కిలోలు 25కిలోలకు తగ్గుతాయి. దారిద్య్రరేఖకు ఎగువనున్న వారికి ఇచ్చే రాయితీ రద్దు అవుతుంది. ఆవిధంగా భారత ప్రభుత్వానిక 4వేల కోట్ల ఆహార సబ్సిడీ వ్యయం తగ్గుతుంది. ఆ సెమినార్‌లో యూనివర్సల్ ఆహార భద్రత (అందరికీ ఆహార భద్రత ) వుండాలని తీర్మానించారు. ఆలాగే ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తూ చౌకడిపోల ద్వారా ముతక ధాన్యాలను కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ సమావేశంలో ధరల తగ్గుదలకు సూచనలు చేశారు. నిత్యావసర సరుకులను ఫ్యూచర్ ట్రేడిరగ్‌నుండి నిషేధించాలి. ఎపిఎల్, బిపిఎల్ వారికి పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలి. అక్రమ నిల్వదారులపైన బ్లాక్‌మార్కెటీర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గించాలి. ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ని కుటుంబాలకు ఆహారాన్ని అందుబాటులో వుంచాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వారికి ఆదాయాలు కల్పిస్తూ ఆహారం కొనుగోలుకు రక్షణ వుండాలి. ఉపాధి హామీ పనులు పైగా 100 రోజుల సీలింగ్‌ను తొలగించాలి.
ఆహార భద్రతకు సంబంధించి జాతీయ సెమినార్‌లో ఈ దిగువ సూచనలు చేశారు.
1. ఆహార భద్రత సర్వజనీనకంగా వుండాలి. ప్రతి కుటుంబానికి 35కిలోల ఆహారధాన్యాల రూ. 2లకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాలి.
2. ఆహారధాన్యాలతోపాటు, పప్పులు , పంచదార, వంటనూనెలు, కిరోసిన్ సబ్సిడీ ధరలకు చట్టబద్దంగా అందించాలి.
3. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో పౌష్టికాహార పథకం క్రింద మధ్యాహ్న భోజనానికి చట్టబద్దత కల్పించాలి.
4. ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సహకారం కావాలి. ముఖ్యంగా పప్పులు, పంచదార, నూనెగింజల ఉత్పత్తిలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి.
5. చౌకడిపోలను తగినన్నిపెంచాలి.
6. మధ్యాహ్న భోజన పథకం అన్ని పాఠశాలల్లో అమలు జరపాలి. ఐసిడిసిఎస్ ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలికలకు, పౌష్టికాహారాన్ని అందించాలి. ఇతర నిత్యావసర సరుకులను చౌకడిపోల ద్వారా సరఫరా చేయాలి.
2010 జూలై 1న మార్క్సిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, రెవల్యూషనరీ సోషలిస్టు పార్లీ, మరియు ఫార్‌వర్డ్ బ్లాక్‌లు ఆహార భద్రతపై జాతీయసెమినార్ నిర్వహించాయి. ఆ సెమినార్‌లో కూడా పైకోర్కెలను పునరుద్ఘాటిస్తూ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కల్పించాలని కోరింది.
కాని భారత ప్రభుత్వం అందరికీ ఆహార భద్రత కల్పించడానికి సుముఖంగా లేదు. అందుకు ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న వి ధానాలే కారణం. ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని బహుళజాతి సంస్థల పరం చేసే విధానాలు కొనసాగుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించాలని, అవసరం మేరకు దిగుమతులు చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. సన్న, చిన్న కారు రైతులను 50శాతానికి తగ్గించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక వైపు వ్యవసాయ ఉపకరణాల ధరలు పెంచుతూ మరో వైపు ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుండగా ఆహార భద్రత ఎలా అమలౌతుంది? ధనిక దేశాల నుండి ఇప్పటికే వంటనూనెలు, పంచదార, గోధుమలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ దిగుమతుల ఫలితంగా పాలకవర్గాలకు ఆదాయ వనరులు కలుగుతున్నాయి. దేశీయ వ్యవసాయాన్ని దెబ్బతీసి ఇక్కడ కోట్లాది ఎకరాల భూములు బీడులుగా మారుస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రస్తుతం 1.10 కోట్ల ఎకరాల భూమి బీడుగా మారింది. మరో 50లక్షల ఎకరాల భూమిలో ఆహారేతర పంటలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇదేవిధంగా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు ఆహార భద్రతకు ప్రమాదం తెచ్చేవిగా వున్నాయి. ఈ విధానాల నిరోధానికి చర్యలు తీసుకోనంతకాలం ఎన్ని చట్టాలు తెచ్చినా ఆహార భద్రత కల్పించడం సాధ్యంకాదు.ఆహారోత్పత్తిని పెంచి దేశంలో స్వయం సమృద్ది అయి ప్రజాపంపిణీ వ్యవస్థ మెరుగుపడినప్పుడు అందరికీ ఆహారభద్రత కల్పించవచ్చు. అందుకు తగిన విదానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేయాలి.
తేది: 20.11.2010
-సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment