నూతన సంవత్సర కానుకగా ఈ నెల 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు హైదరాబాదులోని హెచ్‌ఐసిసిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్ర ప్రజలకు రానున్న కాలంలో ఉపాధి సౌకర్యాలతో స్వర్గం వారి ఇంటిముందుకు తెస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. 6.48 లక్షల కోట్ల పెట్టుబడితో 243 ఒప్పందాల ద్వారా 6.80 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటనకు కొద్దిరోజుల ముందే 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి వసతి కల్పిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ పథకాన్ని ప్రకటించాడు. అనగా రాష్ట్ర ప్రజలకు దాదాపు 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్న మాట. కానీ ఆశ్చర్యమేమిటంటే మొదటి ప్రకటన చేసిన తర్వాత వైద్య సౌకర్యానికి ఏర్పాటు చేసిన 104 సంస్థ ఉద్యోగుల నుండి 1200 మందిని తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. రెండు మాసాలుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు ప్రైవేటు పరం చేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి, 108 సంస్థ ఉద్యోగులను కుదించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పటికే వ్యవసాయశాఖలో 2,500 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. శాశ్వత ఉద్యోగులకు చెల్లుచీటీ ఇచ్చి కాంట్రాక్టు ఉద్యోగులను నియమించి వారికి కనీస వేతనాలు కూడా ప్రభుత్వం అమలు జరుపుట లేదు. మరోవైపున భారీ ఎత్తున భాగస్వామ్య సదస్సులు నిర్వహించి లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటున్నారు. ప్రకటనలను నమ్మాలా? వాస్తవాలను నమ్మాలా?
ఈ మధ్య జరిగిన భాగస్వామ్య సదస్సు దేశ స్థాయిలో 18వది కాగా, రాష్ట్రంలో ఇది నాలుగవది. ప్రస్తుత సదస్సులో 40దేశాల నుండి 1,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఒప్పందాలను కుదిరిన ప్రాజెక్టుల అమలుకు అనుమతులిప్పించడానికి ఎస్కార్టు అధికారులను నియమిస్తామన్నారు. గత సదస్సులలో కూడా ఇదే మాట చెప్పారు. గతంలో జి.వోలు విడుదల చేసినా ఎస్కార్టు అధికారుల నియామకం మాత్రం జరగలేదు. 2001,2002,2003లో రాష్ట్రంలో ఇలాంటి సదస్సులు జరిగాయి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రచారంతో నిర్వహించిన మూడు సదస్సుల్లో రు.60వేల కోట్ల పెట్టుబడితో 135 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి సౌకర్యం కలుగుతుందని నాటి పాలకులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ సదస్సులలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారికి రాష్ట్రంలో అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి ఎస్కార్టు ఆఫీసర్లను నియమిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందం కుదిరిన 135 ప్రాజెక్టులలో రు.3,750 కోట్లతో 28 ప్రాజెక్టులే అమలు అయ్యాయి. కాగా మరో 27 అవగాహనా ఒప్పందాలు దాదాపు రు.38 వేల కోట్లు పెట్టుబడులు రద్దయ్యాయి. నాడు అత్యధిక ధీమాతో బహుళ ప్రచారం గావించిన ఉపాధి కానరాకుండాపోయింది. భూసేకరణ సమస్యే పరిశ్రమల స్థాపనకు అడ్డంకిగా మారిందని నాటి ప్రభుత్వం తప్పుకుంది. నేడు కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు చట్టాన్ని తెస్తున్నది. ఆ చట్టప్రకారం భూసేకరణ పెద్ద సమస్యకాదు. ప్రస్తుతం నిర్వహించబడిన భాగస్వామ్య సదస్సు (2012 జనవరి,11`13) అమలుపై ప్రజలకు నమ్మకం కలగడం లేదు. గత డిసెంబరులో జరిగిన సదస్సులో 24 ప్రాజెక్టులకు రు.75 వేల కోట్లు వస్తాయని 46 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. 2011 ఫిబ్రవరిలో జరిగిన సదస్సులో 25 ప్రాజెక్టులకు రు.23 వేల కోట్లు పెట్టుబడులు రాగా 60 వేల మందికి ఉపాధి కలుగుతుందిని సెలవిచ్చారు. ఈ 49 ప్రాజెక్టులు, లక్షా ఆరువేల ఉద్యోగాలు ఏమయ్యాయి? ఇంత భారీ ఎత్తున ప్రజలను నమ్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ప్రచారం చేయడం దేనికి? రాబోతున్న ఎన్నికలలో ఓట్లు సాధించడానికే నన్నది గత అనుభవాన్ని బట్టి చూస్తే తృణీకరించగలమా ? పైగా 12 ప్రభుత్వ రంగ సంస్థలలో (4 విద్యుత్తు జనరేషన్ కేంద్రాలు) రు.1.26లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదిరాయని 74 ,350 ఉద్యోగాలు వస్తాయని ఒప్పందాలలో ఉంది. కాని ఇప్పటికే విద్యుత్తు రంగంలో ఇంజనీరింగు చేసిన వారు సంవత్సరా తరబడి ఉద్యోగ, ఉపాధి కొరకు జనరేషన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామంటూనే మరొవైపున ఈ ఒప్పందంలో నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతులు కలిగి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల రాష్ట్రం కావడం వలన అన్ని రకాల వ్యవసాయధారిత పరిశ్రమలు ఏర్పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో లభ్యమవుతున్న సిమెంటు, డోలమైట్,బక్సైట్, ఐరన్‌ఓర్ మొదలగు ముడి ఖనిజాలతో పర్యావరణానికి నష్టం రాకుండా ఉండే విధంగా ప్రాజెక్టులను నిర్మించవచ్చు. టెక్నాలజీతో పాటు నిధులు మరియు మానవ శ్రమ తగినంత ఉంది. అయినా ప్రభుత్వానికి వనరులను వినియోగించాలన్న లక్ష్యం ఏ ప్రభుత్వానికి లేదు. ఈ ఒప్పందాల పేరుతో పేదల నుండి భూములను లాక్కోవడం, ప్రభుత్వ భూములను ఉచితంగా స్వాధీనం చేసుకోవడం కొనసాగుతున్నది. సేకరించిన భూములను నిర్ణీత ప్రాజెక్టు కొరకు కాకుండా రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో అనేక రెట్ల ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలు గడిస్తున్న సంఘటనలు మన ముదున్నాయి. వీరిపై ఎలాంటి చర్యలు లేవు. రాష్ట్రంలో నోటిఫై చేసిన 75 సెజ్‌లకు 67,117 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థలలో కొన్ని పరిశ్రమలను ఇంతవరకు ప్రారంభించలేదు. 30సెజ్‌లు మాత్రమే కాస్తో కూస్తో పనిచేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా చేసుకున్న భాగస్వామ్య ఒప్పందాల ప్రకారం మరో 60 వేల ఎకరాలు భూమి సేకరించాలి. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వాన్‌పిక్ పేరిట 24 వేల ఎకరాలను కట్టబెట్టింది. ప్రైవేటు రంగంలో ఓడరేవుల నిర్మాణానికి, గంగవరం, కృష్ణపట్నం, నిజాంపట్నం మరియు కాకినాడ ఓడరేవులను అభవృద్ధి చేస్తున్నారు. ఇవి కాక నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం వెంట 18 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి భూసేకరణ చేశారు. పేద ప్రజల స్థిర, చరాస్తులను కాజేస్తున్న ఈ ప్రైవేటు సంస్థలు లక్షలాధి మందికి ఉద్యోగాలు కల్పిస్తాయా? 2001 సం॥ నుండి ప్రజల నుండి భూసేకరణ కొరకు బహుళజాతి సంస్థలేకాక దేశీయ పెట్టుబడిదారులు మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పేర లక్షలాధి ఎకరాల సాగుభూములను కాజేస్తున్నారు. దీనికి తోడు గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేయిస్తున్నారు. గ్రామాలపై ఆధాపడిన చేతివృత్తులవారు, సముద్రతీరం వెంట ఉన్న మత్స్యకారులు ఉన్న ఉపాధిని కోల్పోయారు. అనంతపురం జిల్లాలోని కదిరి డివిజన్‌లో 20 వేల ఎకరాల భూమిని సైన్స్ సిటీ కొరకు సేకరిస్తున్నామని , ప్రస్తుతానికి 8 వేల ఎకరాలు సేకరించారు. సైన్స్ సిటీ మాత్రం రద్దైంది. ఆ సేకరించిన భూమిని ఏం చేస్తారు?
ప్రస్తుత భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో 2017 నాటికి 54 వేల మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా ఏర్పాటయ్యే విద్యుత్తు ప్రాజెక్టులు (బొగ్గు, గ్యాసు, వాయువు, ఐడల్, సోలార్) ఏర్పాటు ఉంది. కాని ప్రస్తుతం పరిశ్రమలకు విద్యుత్తు కొరత లేదని, 2,000 మెగావాట్ల విద్యుత్తును బయటి నుండి కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి సెలవిచ్చారు. గత దశాబ్దకాలంగా విద్యుత్తు కొరత కొనసాగుతూనే ఉంది. డిమాండుకు తగిన విద్యుత్తును ఉత్పత్తిచేయాలన్న లక్ష్యం ప్రభుత్వానికి లేదు. నిర్మాణ సామర్థ్యమున్న రాష్ట్ర విద్యుత్తు జనరేషన్ సంస్థను నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేటు సంస్థలకు విద్యుత్తు ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సంస్థ ఒప్పందాలను పాటించడం లేదు. ప్రస్తుత ఒప్పందంలోనే కాక అంతకుముందు 23 వేల మెగావాట్ల ఉత్పత్తికి సముద్రతీరం వెంట ఉత్పత్తి కేంద్రాలు చేపట్టారు. వాటి పని ప్రారంభించకున్నా భూసేకరణ మాత్రం పూర్తయ్యింది. దీనిని బట్టి గమనిస్తే పరిశ్రమల పేరుతో భూసేకరణ అంతర్గతంగా ప్రత్యేక స్థానం కలిగి ఉంది.
ప్రభుత్వాల గత చరిత్ర ఘనం: గత చరిత్రను పరిశీలిస్తే తెలుగుదేశం పాలనా కాలంలో 14 ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేసి 22,000 మంది కార్మికులను వీధులపాలు చేసారు. అల్విన్ వాచ్ కంపెనీ, ఐడిపిఎల్, అంతర్గావ్ స్పిన్నింగ్‌మిల్లు, కాగజ్‌నగర్ స్పిన్నింగ్‌మిల్లు, సిరిసిల్ల స్పిన్నింగ్‌మిల్లు, రిపబ్లిక్ పోర్చు లాంటి మూడు వేలకు పైన కార్మికులు కలిగిన సంస్థలున్నాయి. కాంగ్రెస్ పాలనా కాలంలో 4 మిల్లులను మూసివేయగా 14,500 మంది ఉపాధికోల్పోయారు. ఆజాంజాహి మల్లు, గుంతకల్లు స్పిన్నింగుమిల్లు, డిబిఆర్‌మిల్స్ ఉన్నాయి. చివరికి వాటికి సంబంధించిన వందలాది ఎకరాల భూములను కూడా రియల్‌ఎస్టేట్‌కు వేలం వేసి అమ్ముకున్నారు. ప్రభుత్వాలను ఎన్నుకునేది ఆస్థుల సంపాదనతో పాటు ప్రజలకు ఉపాధి కల్పించడం, కాని ఈ ప్రభుత్వాలు ప్రజల ఆస్తిని ప్రైవేటు వారికి దారాదత్తం చేసి అందులో కుంభకోణాలకు తలుపులు తెరుస్తున్నారు. ఇదీ మన పారిశ్రామిక విధానం! ఒకవైపున లాభాలలో ఉండి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను మూసివేసి ఆకలికి గురిచేస్తూ, మరోవైపున భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల వలన లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానని చెప్పడాన్ని ప్రజలు ఎలా జీర్ణించుకుంటారు? భాగస్వామ్య సదస్సుల వ్యయం మాత్రం ప్రజలు భరిస్తున్నారు. ఈ సదస్సులన్నింటికి కేంద్ర పరిశ్రమల శాఖల మంత్రులు పాల్గొంటున్నారు. 2003లో జరిగిన సదస్సులో కేంద్ర మంత్రులతో పాటు ప్రపంచ బ్యాంకు చైర్మన్ ‘‘సుర్చపాయ్’’ కూడా ఉపన్యాసం చేశాడు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి 7.5 శాతంగా ఉన్నదిని చెబుతున్న ప్రభుత్వం 2011`12 సం॥లో పారిశ్రామికాభివృద్ధి రేటు వృద్ధి అటుంచి లోటు 5.5శాతంగా ఉన్నదని గణాంకాలే తెలుపుతున్నాయి. వ్యవసాయ రంగ వృద్ధి 2009`10 లోను 2011`12లోను 26 శాతంలోటు ఉత్పత్తి జరిగింది. కనీసం గత సం॥ ఉత్పత్తులను కూడా సాధించలేకపోతున్నాం. కరెంటుకొరత, ప్రకృతి వైపరీత్యాల వలన ఉత్పత్తి తగ్గిపోతుందని ప్రభుత్వం తప్పుకుంటున్నది. ఈ కొరతలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే అన్నది వాస్తవం. పాల ఉత్పత్తి, ఆహారం ప్రాసెసింగ్, పండ్లు మరియు కూరగాయలు, చేపలు తదితర రంగాలలోకి పెద్దఎత్తున విదేశీపెట్టుబడుల రాకతో అంతకు ముందు ఉపాధి పొందుతున్నవారు ఉపాధి కోల్పోతున్నారు. 116 సంవత్సరాల క్రితం స్థాపించబడిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో దేశీ, విదేశీ బహుళ జాతి సంస్థలతో సహా 90 వేల కంపెనీలు సభ్యులుగా ఉన్నారు. విదేశీగుత్త సంస్థల కనుసన్నలలో ఈ సంస్థ పనిచేస్తుంది. లాభాలు తరలించుకుపోయే అలాంటి సంస్థల నుండి దేశీయంగా ఉత్పత్తి పెరుగుదల మరియు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందగలమా?
దేశీయ వనరులను వినియోగించి, రాష్ట్రంలో లభ్యతలోనున్న మానవ వనరులను సమీకరించి పరిశ్రమలు మరియు వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి నిలకడగా పెరుగుతుంది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలి. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి నిపుణుల నుండి ఇతర ప్రముఖుల నుండి సలహాలను సేకరించి పారిశ్రామిక విధానం రూపొందించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది.14.01.2012

No comments:
Post a Comment