2010 నవంబర్ 6-9మధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన చేశారు. ఈ పర్యటన సందర్భంగా అమెరికా నుండి 2000 మంది వరకు వాణిజ్య వేత్తలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధులు, గూఢచారి శాఖ ప్రతినిధులు పాల్గన్నారు. ఒబామా భారత పర్యటనకు ముందే వీరు దేశానికి వచ్చి ఒప్పందాలను ఖరారు చేసి పెట్టారు. ఒబామా రాకతో ఆ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. గత పది సంవత్సరాల్లో ముగ్గురు అమెరికా అధ్యక్షులు (ఇద్దరు కాంగ్రెస్ పాలనలో, ఒకరు బిజెపి పాలనలో) భారత పర్యటనకు వచ్చారు. వీరందరి రాకలోని లక్ష్యం ఒక్కటే. వారి రాక భారత్‌కు అంతర్జాతీయ ప్రాధాన్యత కల్పించిందని అనుకుంటారు. రానున్న 10 సంవత్సరాల్లో భారత్ అగ్రరాజ్యంగా అవతరించ నున్నదని అమెరికా అధ్యక్షుడు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది సో్తతమే తప్ప వాస్తవమ కాదన్నది ఆర్థికవేత్తలకు తెలుసు. మానవాభివృద్ధి దేశాల్లో భారత్ 119వ స్థానంలో ఉంది. అగ్రరాజ్యమన్న పోగడ్తతో పాలకులను లోబర్చుకుంటున్నారు. వాస్తవానికి అమెరికా తన ఆర్థిక లోటు భారాలను భారత్ పై రుద్దడానికే వీరు వచ్చారు. ఒబామా రాకతో దేశం నుండి 15 బిలియన్ డాలర్ల వాణిజ్య తరలించుకుపోయారు. అమెరికాలో 72లక్షల ఉద్యోగులను కాపాడుకున్నారు. విదేశీ వాణిజ్యానికి అడ్డంకులు ఉండరాదని అన్ని దేశాలకు హితవులు పలికిన అమెరికా నేడు తమ దేశీయ మార్కెట్లోకి ఇతరులు రాకుండా అనేక అటంకాలు కల్పిస్తున్నది. ఈ అటంకాలు సుంకాల విధింపులోనే కాక సుంకమేతర ఆంక్షలు విధిస్తున్నది.
2005 డిసెంబర్‌లో భారత-అమెరికా ల మధ్య వ్యవసాయ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికన్ బహుళజాతి కంపెనీలైన మాన్‌శాంటో, అర్చర్, డేనియల్ మిడ్‌లాండ్, వాల్‌మార్ట్ లాంటి కంపెనీలకు భారత వ్యవసాయ రంగాన్ని నియంత్రించడానికి అవకాశాలు కల్పించారు. అమెరికా-భారత్ సంయుక్తంగా వేసిన కమిటీల్లో పై సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత-అమెరికాలు సమానమైన నిధులు వెచ్చించి వ్యవసాయ పరిశోధనలు చేయాలి. సమాన స్థాయిలో రెండు దేశాలు శాస్త్రవేత్తలను కేటాయించారు. ఈ శాస్త్రవేత్తలు రెండు దేశాలలో పర్యటించి సమాచారం సేకరించాలి. ఈ సందర్భంగా కనిపెట్టిన నూతన ఆవిష్కరణలపై అమెరికాకే హక్కు ఉంటుంది. భారత్ నూతన ఆవిష్కరణలను వినియోగించదలచినచో అమెరికా నుండి అనుమతి పొందాలి. భారతదేశం ‘‘జీన్’’ వ్యవస్థపై అమెరికాకు హక్కు ఏర్పడుతుంది. ఈ ఒప్పందం ఈ దిగువ అంశాలలో మార్పులు తీసుకోస్తుంది.
1.జన్యుమార్పిడి పంటలు/జీన్స్ నియంత్రణ
2.కాంట్రాక్ట్ సేద్యం
3.విత్తన నియంత్రణ
4.వ్యవసాయ మేదో సంపతి హక్కుల రంగంలో మార్పులు
1. ఇప్పటికే పంటల్లో జన్యుమార్పిడి విధానం వచ్చింది. పత్తిలో మొట్టమొదట మన్‌శాంటో కంపెనీ బిటి జన్యును ప్రవేశపెట్టి విత్తన ధరలను 8 నుండి 10 రెట్లు పెంచింది. ఇదే జన్యును వరి, మొక్కజన్న, కూరగాయలలో ప్రవేశపెట్టి ఆ విత్తనాలపై అమెరికా గుత్తాధిపత్యం సంపాదించింది. నేడు విత్తన రంగం పూర్తిగా బహుళ జాతి సంస్థల పరమైంది. విత్తన రంగంలోకి ఈ రోజు బహుళజాతి సంస్థలు పెద్దఎత్తున ప్రవేశానికి అనుమతి లభించింది. ప్రపంచంలో 10 విత్తన సంస్థలు అగ్రభాగాన ఉన్నాయి.
` సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు అఖిల భారత కిసాన్ సభ
1.మన్‌శాంటో (అమెరికా) 2.డూపాంట్ (అమెరికా) 3.సింజెంటా (సిట్జర్లాండ్) 4.లిమిగ్రేషన్ (ఫ్రాన్స్) 5.కె.డబ్ల్యుఎస.ఎ.జి (జర్మనీ) 6. లాండ్ ‘ఓ’ లాక్ (అమెరికా) 7.సాకేట (జపాన్) 8. బేయర్ గ్రూపు సైన్స్ (జర్మనీ) 9. లూయికి (జపాన్) 10. డిఎల్‌ఎఫ్-ట్రిబోలియమ్ (జర్మనీ) మొదటి మూడు కంపెనీలు భారత విత్తన రంగానికి శాసిస్తున్నాయి. ఫలితంగా జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ, రాష్ట్రాల విత్తనాభివృద్ధి సంస్థలు నిర్వీర్యమైపోయాయి.
బహుళ జాతి కంపెనీల ఒత్తిడికి లంగిన ప్రభుత్వం 2004విత్తన బిల్లును అమోదించకుండా సవరణలు చేసి 2010 బిల్లు పేరుతో నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లులోని అంశాలు రైతులకు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి.
1.విత్తనాలపై ఇక ముందు రాష్ట్రాలకు ఏ లాంటి హక్కు, బాధ్యత ఉండదు. కేంద్రమే సర్వం సహాధికారం కలిగి ఉంటుంది.
2.విత్తనాల ధరల నిర్ణయంలో రాష్ట్రాల బాధ్యతలేదు.
3.విత్తనాల నాణ్యత వలన నష్టపోయిన రైతులు కేంద్రం వద్దకు వెళ్లి కంపెనీలపై ఫిర్యాదు చేయాలి.
4.తమ విత్తనాలకు వారే ‘‘సర్టిఫికేషన్స్’’ ఇచ్చుకుంటారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విత్తన రంగం నుండి పూర్తిగా తప్పుకోవాలి. భారత వ్యవసాయ రంగాన్ని శాసించడానికి ‘‘ప్రపంచ వాణిజ్య సంస్థ’’ అమెరికాకు అనుకూలంగా పనిచేస్తున్నది.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందంలో వ్యవసాయ రంగానికి సంబంధించినవి
1.సభ్యదేశాలు వాగ్ధానం చేసిన దానికంటే మించి సబ్సిడీలు ఇవ్వరాదు.
2.వర్తమాన దేశాల్లో1995-2000 నాటికి రాయితీలు 13.3 శాతానికి తగ్గించాలి.
3.అభివృద్ధి కొరకు పెట్టే ఖర్చులు రాయితీల క్రిందకు రావు. (వ్యవసాయ బీమా పథకం, అభివృద్ధి)
4.ఎగుమతి సబ్సిడీల కొరకు కేటాయించిన బడ్జెట్ తగ్గించుకోవాలి.
5. మొక్కలు, పశుగణంపై పేటెంట్ హక్కులు 20 యేండ్లు కొనసాగాలి. (7 సంవత్సరాల నుండి) పేటెంట్ చట్టం 2005 నుండి అమలు కావాలి.
6.మన వ్యవసాయోత్పత్తిలో అవసరం లేకున్నా దిగుమతి చేసుకోవాలి.
7.ఎగుమతి సబ్సిడీలు అభివృద్ధి చెందిన దేశాలు 36 శాతం, వర్థమాన దేశాలు 26 శాతం తగ్గించుకోవాలి.
8.వర్థమాన దేశాలు తమ వ్యవసాయోత్పత్తుల్లో విలువలో 10 శాతం రాయితీ ఇవ్వవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు 20 శాతం తగ్గించుకోవాలి.
9.విత్తనంలో జీన్ ద్వారా ఏ కొద్ది మార్పుచేసినా దానిపై వారికే పేటెంట్ హక్కు ఉంటుంది. ఇతరులు దానిపై పరిశోధనలు చేయరాదు.
10.ప్రపంచీకరణ ద్వారా పెట్టుబడి రావడానికి-పోవడానికి అభ్యంతరాలు ఉండరాదు.
11.మార్కెట్ సౌలభ్యం (దిగుమతి సుంకాల పెంపు-ఆరోగ్యం-పర్యావరణ కారణాల పేరుతో దిగుమతులు నిషేధం-లైసెన్సింగ్ విధానం రద్దు) గురించి ఒప్పందంలో ఉంది.
12.భారీ యంత్రాల దిగుమతిని ఆపరాదు.
డబుల్యటీవో నిబంధనలలో ఉన్నదానికి భిన్నంగా భారత ప్రభుత్వం ముందే దిగుమతి ఆంక్షలను తొలగించింది. 2005 నాటికి ఆంక్షలు విధించాల్సిన అవకాశం ఉన్నప్పటికీ ఏఫ్రిల్ 1, 2007లో 714 సరుకులపైన మరియు ఏఫ్రిల్ 1,2001లో 715 సరుకులపైన పూర్తి దిగుమతి ఆంక్షలను తొలగిస్తున్నట్లు నాటి కేంద్ర వాణిజ్యశాఖామాత్యులు మురసోలి మారన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఆంక్షలు తొలగించే విధానం ఆత్మహత్యా సదృశ్యమైంది.
అమెరికా నిబంధనలు
డబ్ల్యుటీవోలో ఏ నిబంధనలు ఉన్నప్పటికీ అమెరికా చట్టాలకు లోబడి ఉండాల్సిందే. అమెరికా ‘‘సుంకరమేతర ఆంక్షలు’’ పేరుతో దిగుమతి దేశాలపై తన చట్టాల పేరుతో ఆంక్షలు విధిస్తున్నది.
1.స్పెషల్ 301 : నిబంధన ప్రకారం ఔషధ మొక్కలు, వ్యవసాయోత్పత్తిలతో ప్రాణహాని ఉంటుందని భావించినచో దిగుమతు నిషేధం.
2.సూపర్ 301 : తమ దేశ బహుళజాతి సంస్థలకు ఉన్నచో దిగుమతుల నిషేధం
3.హెల్మ్స్ బర్టన్ చట్టం : క్యూబాతో సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ఆంక్షలు విధించడం.
4.డీ అమాటో యాక్ట్ : లిబియా, ఇరాన్, తదితర ఉగ్రవాద దేశాలతో సంబంధాలు కొనసాగించినచో ఆంక్షలు
5.ప్రెస్లర్ యాక్ట్ : భారత్-పాకిస్తాన్ దేశాలు అణ్వయుధాలు తయారుచేసినో ఆ దేశాలపై ఆంక్షలు
6.న్యూక్లియర్ : అణు ఉత్పత్తులు సాగిస్తున్న భారత్-ఉత్తర కొరియాలపై ఆంక్షలు విధించడం
పై సుంకమేతర ఆంక్షల వల్ల తమ ఉత్పత్తులకు మరియు ఎగుమతులకు నష్టం రానివిధంగా రక్షణ చర్యలు తీసుకొంది. వాస్తవానికి డబ్ల్యుటీవో లోని సభ్యదేశాలన్నింటికీ సమాన హక్కుల ఉండాలని మొట్టమొదటగా నిర్థేశించారు. దానికి యిది విరు చర్య మాత్రమే. ఇవిగాకుండా అమెరికా తమ దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడానికి పెద్దఎత్తున సబ్సిడీలపను ఇవ్వడానికి నిర్ణయించింది. డబ్ల్యుటీవో నిబంధనలలోకి రాకుండా తప్పించుకోవడానికి ఈ దిగువ బాక్స్‌లను సృష్టించింది.
గ్రీన్ బాక్స్:
1.దేశంలో అంతర్గతంగా ఆహార సరఫరాలకు (సబ్సిడీ) ఆర్థిక సహకారం.
2.ఆహార పదార్థాల నిల్వకు ఆర్థిక సహకారం
3.పర్యావరణ అభివృద్ధి, ట్రైనింగు, ప్రాథమిక సౌకర్యాలు, పరిశీలనాంశాలు, సాధారణ పరిశోధనలు తదిర సేవలకు ఆర్థిక సహాయం.
4.ప్రభుత్వం ద్వారా ఇతర సేవలు
5.అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పేదలకు వ్యవసాయోపకరణల (ఇన్‌పుట్) సబ్సిడీ, ఎగుమతి సబ్సిడీ
బ్లూబాక్స్: పంటలు-పశుసంపద ఉత్పత్తిపై పరిమితి విధించినందుకుగాను పరిహారం నేరుగా రైతులకు చెల్లించడం (భూములు బీడుగా (పడావు)పెట్టినందుకు పరిహారం చెల్లింపుమున్నగువని) ఈ సహాయం పంటకు సమానంగా ఉండేట్లుగా చూస్తారు.
అంబర్‌బాక్స్: ఉత్పత్తిదారులకు కనీస మద్దతు ధర చెల్లింపు దీనిని కూడా నేరుగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటి ద్వారా ఇస్తున్న ఆర్థిక సహాయం డబ్ల్యుటీవో నిబంధనలలోకి రాదు. అదే సందర్భంలో ఇతర దేశాలలో వ్యవసాయ రంగానికిఎలాంటి రాయితీలు ఇవ్వరాదని ఆంక్షలు విధిస్తున్నది.
యూరప్ దేశాలు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఏటా అమెరికా మరియు యూరప్ దేశాలు బిలియన్‌ల కొలది డాలర్లు వివిధ బాక్స్‌ల పేరుతో వ్యవసాయ రంగానికి రాయితీలు ఇస్తున్నాయి. (బిలియన్ డాలర్లతో)
ధనిక దేశాలు యేటా 30వేల కోట్ల డాలర్లు రాయితీల క్రింద ఇస్తున్నాయి. ఒక్క అమెరికాయే పత్తి రైతులకు 300 కోట్ల డాలర్లుయిస్తున్నది. జపాన్ ప్రభుత్వం వరి పెట్టుబడిపై 7 రెట్లు నగదుగా రైతులకు ఇస్తున్నది. ఈ రాయితీలేవీ డబ్ల్యుటీవో నిబంధనల క్రిందకు రావని ఆదేశాలు చెబుతున్నాయి.
రెండవ హరిత విప్లవం:-మొదటి హరిత విప్లవం ‘‘రైతు’’ కేంద్రంగా కొనసాగింది. ఫలితాలు వచ్చాయి. ఉత్పత్తి 5 రెట్లు పెరిగింది. 1991 నుండి నూతన వ్యవసాయ విధానాలు, 1995 నుండి డబ్ల్యుటీవో విధానాలు కొనసాగుతున్నాయి. నేడు అమెరికా సూచనలతో దేశంలో రెండవ హరిత విప్లవం ‘‘కార్పోరేటీకరణ’’ కేంద్రంగా కొనసాగుతున్నది. ప్రపంచబ్యాంకు ఐ.ఎం.ఎఫ్, ఎ.డి.బి వంటి సంస్థలు వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి. ఈ సంస్థలు మన దేశంలో వ్యవసాయ ఎగుమతుల, దిగుమతుల విధానాలను, పంటల మార్పిడిలోను సంస్కరణలను ప్రవేశపెట్టాయి. ఈ సంస్కరణల ఫలితంగా మన దేశంలో అదనపు ఉత్పత్తిగా ఉన్న ధాన్యం, చెరకు, పొగాకు, నూనెగింజలు, పత్తి, పంటలు పండిరచే రైతులు ప్రమాదం పడ్డారు. మిగులు ఉత్పత్తులు జరుగుతున్న పంటలను తగ్గించడానికి దిగుమతులపై ఆధారపడే విధంగా సుంకాలను తొలగించారు.
పంటల మార్పిడి విధానంతో ఆహార పంటలకు బదులు ఆహారేతర పంటలు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. ప్రస్తుతం రెండవ తరం సంస్కరణలు అమలు చేస్తున్నారు.
రెండవ తరం సంస్కరణలు:-
1.వ్యవసాయ రుణాలు తగ్గింపు 2. కాంట్రాక్టు వ్యవసాయం (కుప్పంతో సహా సుబాబుల్ పంట
3. యంత్రాల ప్రవేశం 4. ఎగుమతి కొరకు ఉత్పత్తి 5. ముతక ధాన్యాల తగ్గింపు (పంటల మార్పిడి)
6. సాంప్రదాయ ఎరువులు-విత్తనాల వాడకంకు స్వస్తి (మన్‌శాంటో-డూపాంట్ వారి విత్తనాలు, క్రిమిసంహారక మందులు)
7. బ్యాంకుల ప్రైవేటీకరణ (వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రుణాలు తగ్గింపు) 8. రైతులు సంఖ్య తగ్గింపు
9. ప్రపంచ మార్కెట్‌తో పోటీ 10. కార్పొరేట్ వ్యవసాయం.
మొదటి తరం సంస్కరణలు :
1. సంఘాల ఏర్పాటు 2. సంస్థాగత మార్పులు (చట్టలు) 3. ప్రణాళికేతర వ్యయం పెంపు 4. ధరలు పెంపుదల 5. వ్యవసాయ విస్తరణ ఉద్యోగుల తగ్గింపు 6. ప్రైవేట్ విత్తనాలు
7. దిగుమతుల సరళీకరణలను అమలు జరపాలి.
పార్వర్డ్ ట్రేడిరగ్:- వ్యవసాయ ఉత్పత్తులను పార్వర్డ్ ట్రేడిరగ్‌లో తెచ్చి రైతులకు నష్టం కలిగే విధానాన్ని కొనసాగిస్తున్నది. వ్యవసాయోత్పత్తులతో మధ్య దళారీలు, వ్యాపారులు విపరీతమైన లాభాలను సంపాదిస్తున్నారు. మరోకవైపున రైతుల పంటలకు కనీస మద్దతు ధర రాకుండా చేస్తున్నారు. ఈ వ్యాపారం రైతులకు లాభదాయకమని మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.
సాగునీటి సంస్కరణలు:- జీవో 37 ద్వారా నీటి సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తున్నది. నీటిని వ్యాపారంగా మార్చే ప్రక్రియ చేపట్టింది. సాగునీటి మీటర్లు పెడుతున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పార్మర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ యాక్ట్’’ను తెచ్చారు. బోరు, బావులు వేయకుండా ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్టు యాక్ట్‌ను 2002లో తెచ్చారు. ‘‘2007 జూన్‌లో జివో 95 ద్వారా’’ నీటి యాజమాన్య కమిటీ ద్వారా’’ నీటి యాజమాన్య కమిటీ’’ ఏర్పాటు చేశారు. రాష్ట్ర నీటి విధానాన్ని 2008లో రూపొందించింది. 2009 నవంబరు 21న 108 కోట్ల వ్యయంతో సాగునీటి మీటర్లు బిగించడానికి టెండర్లు పిలిచారు. నీటిని వ్యాపార సరుకుగా మార్చారు.
కంపెనీ సేద్యం-కార్పొరేటీకరణ:- తకొన్నాళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వం ‘సహకార క్షేత్రాల ఏర్పాటు’ కోసం ముసాయిదాను విడుదల చేసింది. అది సహకార సేద్యం పేరుతో కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టేదిగా ఉంది. ఆ ముసాయిదాలో ‘‘సహకార క్షేత్రాల ఏర్పాటు నిర్వహణను సొసైటీ/ కంపెనీ చేస్తుంది. రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక సహకార క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి.
కాంట్రాక్ట్ సేద్యం:- అమెరికా కాంట్రాక్ట్ సేద్య అనుభవాలను భారత సేద్య రంగంలో ప్రవేశపెట్టాలని భారత అమెరికా వ్యవసాయ ఒప్పందం నిర్దేశిస్తుంది. ఈ మార్పును కేవలం సాంకేతిక అంశాలకే పరిమితం కాకుండా ఆహార సరఫరా నియంత్రణ మొత్తం వలయానికి విస్తరించింది. ముఖ్యంగా, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించిన ఇప్పుడున్న నియమాలనుక మార్చాల్సివుంటుంది. కాంట్రాక్ట్ సేద్యంలో వినియోగదారులు చెల్లించే ధరలో ఉత్పత్తి దారులకు గిట్టేవాటా దారుణంగా పడిపోతుందని ఇతర అధ్యయనాలలో గమనించడాన్ని ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి.
ప్రభుత్వ పథకాలు:- ప్రభుత్వం రైతుల ప్రయోజనం కొరకు ప్రవేశపెట్టిన పథకాలన్ని బ్యాంకు ఆదేశితాలే. ఈ పథకాలు ప్రచారానికే తప్ప ఆచరణలో రైతులకు లాభం కలిగింది శూన్యం.
ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుదల:- వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెంచాలన్న అమెరికా కోర్కెకు మన ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పెట్టుబడులు 80శాతం తగ్గాయి. మిగిలిన 20శాతం కూడా తగ్గించాలని ప్రభుత్వాలపై అమెరికా ఒత్తిడి చేస్తున్నది.
2009-10లో ప్రైవేట్ పెట్టుబడులు వ్యవసాయంలోని అన్ని రంగాల్లో విస్తరించాయి. చివరకు వ్యవసాయశాఖను రద్దు పరిచే దిశగా కేంద్రం చర్యలు తీసుకొంటున్నది. దీని తోడు బడ్జెట్ కేటాయింపులను తగ్గించారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన్‌శాంటో అదేశాలను అమలు పరుస్తున్నాయి.
ఈ సంస్కరణల ఫలితమే-ఆత్మహత్యలు:- 1997లో సంస్కరణలు ప్రారంభిచబడ్డాయి. 97 డిసెంబరులో ఆత్మహత్యలు ప్రారంభమైనవి. నేటికి ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తన వ్యవసాయ విధానాల్లో మార్పులు చేసి ఈ రంగంలోకి కార్పొరేట్ సంస్థలను ప్రవేశపెడుతున్నది. లాభాలు ఆశించిన కార్పొరేట్ సంస్థలు సన్న, చిన్నకారు రైతులు భూముల నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరి ప్రయత్నాలకు ప్రభుత్వం అండగా ఉంటున్నది. ఒకప్పుడు సస్యశామలంగా ఉండి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధంగా ఉన్న సోమాలియా, మెక్సికో దేశాల్లో ప్రపంచబ్యాంకు అడుగుపెట్టగానే అక్కడ ఆకలిచావులు మొదలైయాయి.
పై ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా మన దేశ ప్రభుత్వంపై ఒత్తితడి తెచ్చి ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలలో వ్యవసాయ రంగాన్ని సరళీకరించకుండా చూడాలి. అప్పుడే రైతులు బహుళజాతి సంస్థలు, సామ్రాజ్యవాద శక్తుల కబంధ హస్తాల నుండి బయటపడతారు.
భారతదేశం, అమెరికాకు జూనియర్ భాగస్వామికాకుండా జాగ్రత్తపడాలి. మన వ్యవసాయాన్ని రక్షించుకోవాలి. అమెరికాతో చేసుకొన్న వ్యవసాయ ఒప్పందాలను, దిగుమతి ఒప్పందాలను పున్ణసమీక్షించాలి. భారత వ్యవసాయ రంగం ‘‘రైతు’’ కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్దం కావాలి.

No comments:
Post a Comment