Monday, 11 August 2014

ఆదర్శవంతమైన పశ్చిమ బెంగాల్‌ వ్యవసాయ రంగం

   
దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అనతి కాలంలోనే పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో కెల్లా మొదటి ర్యాంకుకు చేరుకుంది. 1975లో రాష్ట్రంలో 75 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2009`10లో 175లక్షల టన్నులకు చేరుకుంది. ఆహార ధాన్యాల కొరత ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్‌ నుండి బియ్యం దిగుమతులు జరిగేవి. అలాంటి రాష్ట్రం నేడు దాని అవసరాలు తీర్చుకోగా, 50,60 లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నది. ఆలుగడ్డల  ఉత్పత్తి 50.52 లక్షల టన్నులకు చేరుకుంది. జ్యూట్‌ 85.27 లక్షల టన్నులకు, పంచదార 12.67 లక్షల టన్నులకు, తేయాకు 2361 లక్షల టన్నులు ఉత్పత్తులు చేస్తున్నది. ఆహార పంటలలో 1981`82లో వంద సూచిక కాగా 2006`07లో 241.8 శాతానికి పెరిగింది.  రాష్ట్ర జనాభా (2001) 801.76 లక్షలు కాగా, చదరపు మైలుకు 903 మంది జన సాంద్రత ఉంది. భారత దేశంలోనే అత్యధిక జనసాంద్రత ఉంది. అక్షరాస్యతలో 68.64 శాతం నమోదయింది.. దళితులలో 59.04 శాతం, గిరిజనులలో 43.40 శాతం నమోదైంది. భారతదేశ నమోదు కన్న ఇది ఎక్కువ. దీన్ని సాదించడానికి ప్రజల కొనుగొలు శక్తి పెరగడం ప్రధాన కారణం. ఆ కొనుగోలు శక్తి పెరగడానికి  భూ సంస్కరణలు కీలకం. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటీ? పశ్చిమ బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం వ్యవసాయ విధానాలు రూపొందించింది.
1. వ్యవసాయ ఉత్పాత్తి, ఉత్పదకత ఏక కాలంలో పెంచడానికి తగిన సంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి.
2. అధిక ఉత్పత్తి వంగడాలను, హైబ్రిడ్‌ వంగడాలను విస్తృతంగా ఉపయోగిస్తూ కొత్త రకాలను అభివృద్ది పర్చాలి. విత్తన సర్టిఫికేషన్‌, మరియు విత్తన పరీక్షలు నిరంతరం జరపాలి. సకాలంలో సర్టిఫై విత్తనాలను అందించాలి. అదికోత్పత్తి విత్తనాలను పదవ ప్రణాళిక కాలం నాటికే 95 శాతం సాగు భూమికి సరఫరా చేయాలి. రైతుల ఉత్పత్తులను తీసుకొని విత్తన మార్పిడి చేయాలి. ముతక ధాన్యాలు 20 శాతం నుండి 33 శాతం, పప్పు ధాన్యాలు 7 నుండి 25 శాతం, విత్తనాలు 20 నుండి 50 శాతం, జ్యూట్‌ 78 శాతం, ఆలుగడ్డలు 12 శాతం, కూరగాయాలు 12 శాతం, (విత్తన మార్పిడి) పెంచాలి.
3. ఎరువుల వినియోగాన్ని, భూసార పరీక్షలలో నాణ్యతను మెరుగుపర్చాలి. ఎరువుల వినియోగంలో హైక్టారుకు 134 కిలోల నుండి 235 కిలోలకు వినియోగాన్ని పెంచాలి. ఎన్‌.పి.కె నిష్పాత్తి 3:21:13: వినియోగంలోకి తేవాలి.
4. పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో సాంప్రదాయేతర సాగు భూమికాకుండా ఇతర భూములలో సంవత్సరం పొడుగున ఉత్పత్తి చేయడానికి తగు టెక్నాలజీని రూపొందించాలి.
5. దళితులకు, గిరిజనులకు పూర్తి సబ్సిడీ ధరలపై వ్యవసాయ ఉపకరణాలను అందించి ఉత్పత్తి పెంపుదలకు దోహదం చేయాలి.డెమోన్‌ స్ట్రేషన్‌ కేంద్రాలను ఈ రైతుల పొలాలలో ఏర్పాటు చేయాలి.
6. తక్కువ ఉత్పత్తి వస్తున్న ప్రాంతాలలో (చౌడు భూములు) ఎక్కువ ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి.
7. రైతులు యంత్రీకరణ ద్వారా వ్యవసాయ పనులకు ప్రోత్సహించాలి.
8. భూ సార పరిరక్షణ, బయోపెర్టిలైజర్స్‌ ` పచ్చి రొట్ట ఏరువులు, పశువుల ఎరువులు వినియోగించడం ఉపరితల నీటి వినియోగంలో యాజమాన్య పద్దతి మెరుగుపర్చడం చేయాలి.
9. భూ సార పరీక్ష కేంద్రాలు జిల్లా స్థాయిలో ఎర్పాటు చేసి ఎరువుల వినియోగాన్ని నియంత్రించాలి.
10. వ్యవసాయ శాఖ ద్వారా ట్రైనింగ్‌, పర్యాటనలు మరియు పరిశోదనలకు కార్యక్రమాలు నిర్ణయించాలి.    
11. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అదనపు బడ్జెట్‌ కేటాయించాలి. ప్రాంతీయ అసమానతలు రాకుండా రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాడానికి పని దినాలు కల్పించాలి.
12. భూ గర్భ జలాలను, ఉపరితల జలాలలను సద్వినియోగం చేయాలి.
13. పంటల కోతలు కాగానే సాంకేతిక పరంగా వ్యవసాయ పనులు చేయాలి. మార్కెట్‌ సౌకర్యాలు మెరుగుపర్చాలి.
14. ముతక ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి. భూ సార పరిరక్షణ చర్యలు చేపట్టాలి.
15. పంటల మార్పిడి చేయాలి.
16. పర్యావరణానికి నష్టం కలగని విధంగా ఉత్పత్తులను పెంచాలి.
17. బీడు భూములను, పడావ భూములను సాగులోకి తేవాలి.
18. వ్యవసాయ రంగంలో నిధుల వినియోగం పెంచాలి.
పై విధానాన్ని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్నది. ఫలితంగా పంటల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు వచ్చాయి.
పశ్చిమ బెంగాల్‌ భౌగోళిక విస్తీరణం 5.68 లక్షల ఎకరాలు కాగా అందులో నికర సాగు విస్తీర్ణం 214.58 లక్షల ఎకరాలు మాత్రమే. సాగు నీటి వనరులు 80.58 శాతం కల్పించటం మూలంగా 2వ పంట 134.17 లక్షల ఎకరాలలో పండుతున్నది. అ విధంగా సాగు విస్తీర్ణం ఎదిగింది. ఆంధ్రప్రదేశ్‌ విస్తీర్ణం 679 లక్షల ఎకరాలు కాగా సాగుకు యోగ్యం అయినది 355 లక్షల ఎకరాలుకాగా వాస్తవంగా సాగు అవుతున్నది. 275 లక్షల ఎకరాలు మాత్రమే. బీడు భూములు పశ్చిమ బెంగాల్లో 8.7 లక్షల ఎకరాలు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 101.6 లక్షల ఎకరాలు. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌ ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాధకత పెరగలేదు. ఉత్పత్తి 120 ` 140 లక్షల టన్నుల మధ్య ఊగిసలాడుతున్నది.
ఉత్పత్తి పెరగడానికి బెంగాల్‌ ప్రభుత్వం అనుసరించిన భూ సంస్కరణల విదానం అత్యంత ప్రశస్థమైనది.  30.11.2007 నాటికి 29.6 లక్షల మందికి 11.20 ఎకరాలను పంపిణీ చేశారు. అలాగే 15.34 లక్షల మంది కౌలు దారులకు 11.23 లక్షల ఎకరాలపై సాగు హక్కులు కల్పించారు. ప్రత్యేకించి ‘‘ఆపరేషన్‌ బర్గా’’ అమలు చేశారు. రాష్ట్రంలోని 18 జిల్లాలో ప్రతి సెంటు, గుంట సాగులోకి తెచ్చారు. ఫలితంగా 4.62 లక్షల ఎకరాలలో పండ్ల తోటలు వేయగ 26.40 లక్షల టన్నులు, కూరగాయాల విస్తీర్ణం 22.24 లక్షల ఎకరాలు కాగా ఉత్పత్తి 120.88 లక్షల టన్నులు, అలాగే పూల ఉత్పత్తి చేశారు. రాష్ట్రంలో సముద్ర మరియు మంచినీటి చేపలు 14 లక్షల టన్ను ఉత్పత్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో 27, 137 సహకార సంఘాలు ఉండగా అందులో 91,36,900 మంది సభ్యులు ఉన్నారు. ఇది కాక రుణేెతర సహకార సంఘాలు 70 వేల వరకు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా ప్రభుత్వ రాయితీలు, ఆర్థిక సహయం చేస్తున్నారు.
రైతుల పంటలకు కనీస మద్దతు ధరలు, మరియు న్యాయమైన ధర రావడానికి రాష్ట్రంలో 43 ప్రధాన మార్కెట్ల్‌, 641 సబ్‌` మార్కెట్లు పని చేస్తున్నాయి. రాష్ట్ర వెర్‌ హౌసింగ్‌ సంస్థ 2.17 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాం లను నిర్మించింది. (ఆంధ్రప్రదేశ్‌లో 1.35 లక్షల టన్నుల గోదాంలు మాత్రమే). పాల ఉత్పత్తులు 39.84 లక్షల టన్నులు, 5 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నది. అటవీ ఆదాయం 130 కోట్లు వస్తున్నది.
చౌక దుకాణలలో బిపిఎల్‌ వారికి కార్డుకు 30 కిలోల బియ్యం మరియు ఇతర సరుకులు చౌకదరలకు ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధర కిలో రు.15కు అమ్మిస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌ : 2010`11కు 76,432.07 కోట్లు కాగా, 2009`10 బడ్జెట్‌ 72,701.54 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ రంగానికి పంటల రక్షణకు 538.26 కోట్లు, భూసార పరిరక్షణ 23.31 కోట్లు, పశుసంక్షేమనికి 282.63 కోట్లు, పాల ఉత్పత్తికి 148.13 కోట్లు, మత్స్య శాఖకు 97.39 కోట్లు, అటవీ శాఖకు 298 కోట్లు, ఆహార నిల్వలకు 148.58 కోట్లు, వ్యవసాయ పరిశోధనకు 117.16 కోట్లు, సహకార శాఖకు 226.47 కోట్లు, ఇతర వ్యవసాయ కార్యక్రమాలకు 73.79 కోట్లు కేటాయించారు. మొత్తం 2013.78 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ లక్ష 13 వేల కోట్లు కాగా వ్యవసాయ రంగంలోని పై పద్దులకు కాేయించింది 1400 కోట్లు మాత్రమే. అది కూడా విడుదలకు నోచుకోదు. గత సంవత్సరం ప్రకటించిన బడ్జెట్‌లో 20వేల కోట్లు  (20 శాతం) లోటు ఉంది. కాని పశ్చిమ బెంగాల్‌ బడ్జెట్‌లో అలాంటి తగ్గింపులు కనబడవు.
స్థానిక సంస్థలు : 73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 5సం॥లకు విధిగా ఎన్నికలు జరగుతున్నాయి. (గ్రామీణ, పట్టణ) మహిళాలకు, బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, ప్రధాన్యత ఇవ్వబడిరది. ప్రతి పంచాయితీలలో ఫైనాన్స్‌, విద్యా, ఆరోగ్యం, భూమి, వ్యవసాయం, చేపలు, పంటలు, వగైరా శాఖలకు స్టాండిరగ్‌ కమిటీలు వేసి వాటి ద్వారా వారి సమస్యలు పరిష్కారిస్తారు. ప్రతి వార్డులో (గ్రామంలో) ఎన్నికైన అభ్యర్థి అభివృద్ది కమిటీ చైర్మన్‌గాను, అతనితో పోటి చేసి ఒడిపోయిన వ్యక్తి ఉప చైర్మన్‌గా ఉంటాడు, మరో 18మంది ని కమిటీలోకి తీసుకుంటారు. దీని వలన గ్రామంలో జరుగు పనులలో అవకతవకలకు అస్కారం లేదు. లిఫ్ట్‌ పథకాలను పంచాయితీ నిర్వహిస్తుంది. ఒక వరి పంటకు ఎకరాకు రు.240, మెట్ట పంటకు రు.90 రూపాయలు వసూలు చేస్తారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి పంచాయితీ దాటి వెళ్ల వలసిన అవసరం లేదు.
ప్రపంచ బ్యాంకు నిబంధనలు లేవు. విద్య, ఆరోగ్యం : ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. ప్రాథమిక విద్యా పూర్తిగా ప్రభుత్వం ఉచితంగానే భోదిస్తున్నది.
ప్రజాస్వామ్య విధానాల అమలు : 1. ప్రజాఉద్యమాలపై, పోలీస్‌ల నిర్భందం నిషేదం, 2. రాజకీయ పార్టీలపై నిషేదం పెట్టే విధానం లేదు. 3. రాష్ట్ర ఉద్యోగుల కార్మికులకు సమ్మె హక్కును చట్టబద్దత కల్పించారు. 4.కార్మిక రంగంలో ప్రజాతంత్ర యుతంగా ఎన్నికలు జరిపి గెలిచిన సంఘానికే యూనియన్‌ గుర్తింపు ఉంటుంది.  5. అసంఘటిత కార్మికులు (సర్పంచ్‌/ వార్డు మెంబర్‌ద్వారా/ ఇతర అధికారుల ద్వారా/ రికమైండ్‌ చేయబడితే) వారికి పి.ఎఫ్‌. అంగీకరించ బడుతుంది. కంపెనీ మూత పడితే సంవత్సరం పాటు నెలకు 750 కార్మికునికి చెల్లిస్తారు. 6. సమస్యల పరిష్కారం మంత్రులు వెంటనే చేస్తారు. చిన్నతరహా పరిశ్రమల సంఖ్య పెరిగింది. కనీస వేతనాలు తప్పని సరిగా అమలు చేస్తారు. ప్రభుత్వ సంస్థల పరిరక్షణ, నష్టాలపాలైన వాటి పున:రుద్దరణ  చేపడతారు.
రైనా గ్రామ పంచాయితీ నిర్వహణ తీరు: పశ్చిమ బెంగాల్‌లోని  బర్ధమాన్‌ (భరద్వాన్‌) జిల్లాలోని రైనా పంచాయితీ సమితిలోని రైనా గ్రామ పంచాయితీని విశ్లేషించినప్పుడు దాని నిర్వహణ ప్రజలకు సన్నిహితంగా వుండి, వారి ప్రయోజనాలను రక్షిస్తున్నట్లు కనబడుతుంది. ఈ గ్రామ పంచాయితీలో 16వేల జనాభా వుంది. 11వేల మంది ఓటర్లు వున్నారు. 13 గ్రామాలు కలిపి గ్రామ పంచాయితీగా ఏర్పడిరది. ఈ గ్రామ పంచాయితీని 12 వార్డులుగా విభజించారు. అందులో మూడు వార్డులు మహిళలకు, నాల్గు వార్డులు దళితులకు, ఒక వార్డు గిరిజనులకు కేటాయించగా, మిగిలిన నాలుగు వార్డులు జనరల్‌ స్థానాలుగా వున్నాయి. గ్రామ పంచాయితీలో సాగు భూమి 2079 హెక్టార్లు వుంది. ఈ మొత్తం ఖరీప్‌ వరి పంట వస్తుంది. రెండో పంటగా 500 ఎకరాలు వరి, మరో 500 ఎకరాలు బంగాళా దుంపలు (నవంబర్‌ నుండి మార్చి) పండిస్తారు. బంగాళా దుంపలు ఎకరాకు 100 క్వింటాళ్ళ వరకు పండుతాయి.
పంచాయితీలో 2500 సన్న, చిన్నకారు రైతు కుటుంబాలు వున్నాయి. 500 కుటుంబాలకు భూమిలేదు. ఇందులో 250 కుటుంబాలు కౌలుదార్లుగా వున్నారు. గ్రామంలో పెద్ద రైతు అనగా ఎనిమిది ఎకరాలు కల్గిన ఒకే ఒకరు వున్నారు. గ్రామ పంచాయితీలో రెవిన్యూ అధికారి మరియు అటెండర్‌ వుంటారు. ఎనిమిది స్వయం సహాయక సంఘాలు వున్నాయి. ఇందులో నాలుగు అటవీ అభివృద్ధిలో పనిచేస్తున్నాయి. మరో రెండు విత్తనోత్పత్తి రంగంలో వున్నాయి. మిగిలిన రెండు చెపల పెంపకం, కుటీర పరిశ్రమలలో వున్నాయి. అన్ని స్వయం సహాయక గ్రూపులకు ఆదాయ వనరులు కల్పించబడినాయి.
గ్రామ పంచాయితీ ఓటర్లు ముగ్గురు సమితి సభ్యులను ఎన్నుకొంటారు. వీరు పంచాయితీ సమితిలో తమ గ్రామ పంచాయితీ సమితికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకొంటారు. సర్పంచ్‌ పంచాయితీ సమితిలో ఎక్స్‌ అఫిషియోగా వుంటారు. చట్టబద్దంగా సంవత్సరానికి రెండు సార్లు మే, నవంబర్‌ నెలల్లో గ్రామ సభలు జరుగుతాయి. చట్టంలో లేకున్నా సాధారణంగా ఈ గ్రామ పంచాయితీ నెలకొకసారి గ్రామ సభలు జరుపుతుంది. సర్పంచ్‌కు అలవెన్సు నెలకు రు.2వేలు, ప్రయాణపు ఖర్చుల క్రింది నెలకు రు.500లు యిస్తారు. ఉప సర్పంచ్‌కు రు.1500 అలవెన్సు, రు.200 ప్రయాణపు ఖర్చుల క్రింద యిస్తారు. సమావేశమైనప్పుడు ప్రతి సభ్యునికి రు.200లు ఇస్తారు.
పంచాయితీలో నాలుగు స్టాండిరగ్‌ కమిటీల వున్నాయి. 1. ప్రణాళిక, ఫైనాన్స్‌, 2. విద్య ` ఆరోగ్యం, 3.అడవులు భూమి, 4.వ్యవసాయం, పశు సంవర్థక శాఖ, చేపలు వగైరా. ఈ నాలుగు స్టాండిరగ్‌ కమిటీలకు ఛైర్మన్‌లు ఎన్నుకోబడాతారు. ఛైర్మన్‌కు సమావేశ సిట్టింగ్‌ ఛార్జి రు.200 చెల్లిస్తారు. సంచాలకులకు రు.400 అలవెన్సు యిస్తారు. ప్రతిపక్షం వారు ఫైనాన్స్‌, ప్రణాళిక స్టాండిరగ్‌ కమిటీలో వుంటారు. స్టాండిరగ్‌ కమిటీల తీర్మానాలను గ్రామ పంచాయితీ ఆమోదానికి పెట్టాలి. దాదాపుగా స్టాండిరగ్‌ కమిటీ తీర్మాణాలను గ్రామపంచాయితీ ఆమోదిస్తుంది.
భూ సంస్కరణల ఫలితంగానూ, ప్రభుత్వ వ్యవసాయ విధానాలలో కల్పిస్తున్న రాయితీల మూలంగానూ పశ్చిమ బెంగాల్‌ వ్యవసాయ రంగం భారతదేశంలో మొదటిస్థానంలోకి చేరుకుంది. 170 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానం ఆక్రమించింది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి వ్యవసాయాదారిత పరిశ్రమలతో పాటు, ఇతర పరిశ్రమలను స్థాపించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

    సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment