రాష్ట్రంలో యేటా వరదల వల్ల లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలను నష్టపోతున్నారు. వందలాది మంది చనిపోతున్నారు. ఒకవైపున కరువులకు గురై పంటలకు నష్టం జరుగుతుండగా, మరోవైపున వరదల వల్ల కూడా అదేనష్టం జరుగుతున్నది. వరదలను నివారించి కరువు ప్రాంతాలకు నీటిని అందించడానికి కావాల్సిన జల వనరుల నిర్మాణం చేస్తే రెండు లాభం జరుగుతుంది.
2000 సంవత్సరంలో విపత్తుల మేనేజ్‌మెంట్ పథకం క్రింద 11,700 కోట్లు కేటాయించారు. ఈ నిధులను 5 సం||లు ఖర్చు చేయాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 25% భరించాలి. 2006-07లో 445 కోట్లు మాత్రమే కేటాయింపు చేశారు. కాని విడుదల చేయలేదు. ప్రకృతి వైపరీత్యాల క్రింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం 25% కేటాయించినప్పుడే వ్యయం చేయడానికి వీలుంటుంది. గత మూడు థాబ్దాలుగా జరిగిన వరదనష్టాలు
1. 14-20 అక్టోబరు 2005 ఉత్తరకోస్తా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం వరంగల్, నల్గొండ జిల్లాల్లో 2769 కోట్ల నష్టం జరిగింది. 60 మంది మరణించారు. కేంద్ర బృందం తరఫున నవీన్‌శర్మ, గంగాధర్, ఆర్‌కెవర్మ మూడుగ్రూపులుగా పర్యటనలు చేశారు. రు. 397 కోట్ల సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా గతంలో హెక్టారుకు రు. 1000 ఇస్తున్న పరిహారాన్ని రు.1250/-లకు పెంచుతూ జి.ఓ. జారీచేశారు.
2. 17-20 సెప్టెంబరు 2007న వచ్చిన తుఫానుకు 74 సెం.మీ వర్షం పడింది. 37 మంది మరణించారు. 300 కోట్ల పంట నష్టం జరిగింది. 305 చెరువులకు గండ్లు పడినాయి. 29397 ఇండ్లకు నష్టం వాటిల్లింది. అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, వరంగల్, గుంటూరు, నెల్లూరు, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు నష్టం వాటిల్లింది.
3. 10-11 ఫిబ్రవరి 2008న ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, విజయనగరం 8 జిల్లాలకు పంటలు నష్టం జరిగింది. 8లక్షల ఎకరాలకు పంటలు నష్టం జరిగింది. శనగ, పొగాకు, మిరప, వరి పెసర, మామిడిపూత పంటలు దెబ్బతిన్నాయి. రు. 690 కోట్ల నష్టం జరిగింది. 14, ఫిబ్రవరిన ముఖ్యమంత్రి పర్యటన కూడా చేశారు.
4.. 4-10 ఆగస్టు 2008న కురిసిన అకాలవర్షాలకు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కర్నూలు, మెదక్, వరంగల్,కృష్ణా, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం జరిగింది. 60 మంది మరణించారు. రు. 300 కోట్ల నష్టం జరిగింది.
నష్టాలు జరిగినప్పుడు మంత్రులు, అధికార్లు పర్యటనలు చేయడం తప్ప పరిహారాలు చెల్లించడం లేదు. ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం కోరడం జరిగింది. కేంద్రం బృందాలను పంపించి పర్యటనలు చేయించడం, నివేదికలు తెప్పించుకోవడం, ప్రక్రియలు ప్రతిసారి జరుగుతున్నాయి.
వరదల నష్టానికి పరిహారం చెల్లిస్తున్నామని వ్యవసాయ శాఖ కమీషనర్ ప్రకటించారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి నష్టపోయినవారిలో అనేకమందిని మినహాయిస్తున్నారు. పరిహారాల చెల్లింపును హెక్టారుకు 4,500 రూపాయల వరకు పెంచారు. నష్ట పోయిన వారి గణాంకాలు సేకరించడంలో ఉద్ధేశ్యపూర్వక నిర్లక్ష్యం వహిస్తూ పరిహారం మొత్తాన్ని తగ్గించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నాయి. కొద్దిమందికి చెల్లించి దాన్ని అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్నారు.
గతంలో గుంటూరు జిల్లా రేపల్లెలో తమలపాకులు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే పేరుతో లక్షలాది రూపాయలు దుర్వినియోగం కాగా వాటిపై విచారణ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో రు. 20 లక్షలు పరిహారం చెల్లించకుండా దుర్వినియోగం చేశారు. వరదలు వచ్చినప్పుడు నష్టపోయినవారికే కాకుండా మద్యదళారీలు, రాజకీయ ప్రముఖులు ఆ నిధులను కాజేస్తున్నారు.
వడగళ్ళ నష్టం
వరదలకు తోడు ఆకస్మికంగావస్తున్న వడగళ్ల వలన లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన నష్టాలకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు.
1. 20-25, జనవరి 2004న వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, అనంతపురం, మెదక్ జిల్లాల్లో 85వేల ఎకరాలలో పంటలు నష్టపోయాయి. ఇద్దరు మరణించారు. 25 పాడి పశువులు మరణించాయి.
2. 19,20, ఫిబ్రవరి 2004న ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో వందలాది ఎకరాల పంటకు నష్టం జరిగింది.
3. 24, 25, ఏప్రిల్, 2004న ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన వడగళ్లకు 10 మంది మరణించారు. 82160 ఎకరాలలో పంటలకు నష్టం జరిగింది. 1352 పశువులు, గొర్రెలు, మేకలు మరణించాయి.
4. 8,9, మార్చి 2005న 8 జిల్లాల్లో అనగా నిజామాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, చిత్తూరు, వరంగల్ జిల్లాల్లో 7,500 ఎకరాలకు పంటలు నష్టం జరిగిందని రెవిన్యూమంత్రి ధర్మాన ప్రసాద్ మార్చి 16న ప్రకటించారు.
5. 9-14 ఏప్రిల్ 2007న 200 కోట్ల పంటలకు నష్టాలు జరిగాయి.
కరీంనగర్ - కాల్వ శ్రీరాంపూర్ (మ) తారుపల్లికి చెందిన కానుగంటి నారాయణ పంటలు నష్టంతో ఆత్మహత్యకు పాల్పడినారు. (23.9.2007న)
---

No comments:
Post a Comment