16వ లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత లోక్‌సభ మే 31న ముగుస్తుందని, 16వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మార్చి 15న ప్రారంభమవుతుందని, ఏడు దశల్లో దేశవ్యాపితంగా ఎన్నికలు జరుగుతాయని, 8 లక్షల పోలింగ్ బూత్‌లలో 12 లక్షల ఈవీఎంల ద్వారా 78 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొంటారని, పోలింగ్‌కు మూడు వారాల ముందు ఎన్నికల నోటిఫికేష్ జారీ చేస్తామని, పోలింగ్‌కు ఆరు వారాల ముందు ఎన్నికల తీదీలను ప్రకటిస్తామని, అప్పటి నుండి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని, జూన్ 1 కల్లా 16వ లోక్‌సభ ఏర్పాటవుతుందని భారత ఎన్నికల ప్రధాన కమిషన్ ప్రకటించింది.
2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని జనవరి 3న ఢల్లీిలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. గత పదేళ్ళల్లో ప్రధాని అధికారికంగా నిర్వహించిన మూడవ విలేకరుల సమావేశం ఇది. ‘‘వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్థిని కాదని, యుపిఏ`3లో కొత్త ప్రధాని బాధ్యతలు చేపడతారని, రాహుల్‌గాంధీ ప్రధాని పదవికి అర్హుడని, గ్రామీణ ఉపాధిహామీపథకం` లోక్‌పాల్‌బిల్లు` సమాచారహక్కు చట్టం కంటే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందమే తనకు అత్యంత ఆనందకరమైనదని, పాలనలో అక్రమాలు జరిగినమాట నిజమేనని, నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయలేకపోయామని, మిగిలిన ఐదు నెలల కాలంలో సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెల్తామని మన్మోహన్ ప్రకటించారు.
2014 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంటే రాహుల్‌ను ప్రధానిగా ముందుకు తెచ్చే విధంగా పార్టీ వ్యూహరచన చేసింది. ఎన్నికల అనంతరమే ప్రధానిని ప్రకటిస్తామని, రాహుల్‌కు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పజెప్పుతున్నట్లు జనవరి 16న జరిగిన సిడబ్ల్యుసీలో నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో నిరుద్యోగానికి, దారిద్య్ర పెరుగుదలకు 14.9.2012న ఎఫ్‌డిఐ రాకపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం చేసింది. ఎఫ్‌డిఐ ప్రవేశాన్ని రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి. కేంద్రంపై ఆందోళనలు రాకుండా ఈ పరిమితి పెట్టారు.
10 లక్షల జనాభా కలిగిన 51 పట్టణాలలోని చిల్లర దుకాణాలకే ఇది పరిమితం చేసారు. చిల్లర దుకాణాల్లోకి 30శాతం దేశీయ ఉత్పత్తుల సమీకరణ చేయాలి. మిగిలిన 70శాతం విదేశీ దిగుమతుల ద్వారా సేకరించాలి. అనగా విదేశీ దిగుమతులకు ప్రోత్సాహం కల్పించడానికి ఎఫ్‌డిఐ (ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్) ద్వారా దేశీయ చిల్లర దుకాణాలదారులను కోట్ల సంఖ్యలు నిరుద్యోగులు చేయతలపెట్టారు.
బహుళబ్రాండ్ల రిటేయిల్ వర్తకంలో 51శాతం, బ్రాడ్‌కాస్టింగ్‌లో 74శాతం, విమానయాన రంగంలో 49శాతం, ప్రభుత్వ కంపెనీల విక్రయం, విద్యుత్ పవర్ ట్రేడిరగ్ ఎక్స్చేంజీలలో 49శాతం పెంచారు. అంతకు ముందు సింగిల్ బ్రాండ్‌లో 51శాతం ఉండగా దానిని 100శాతానికి పెంచారు. 25 మహా, నవరత్న కంపెనీల నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి జమచేయాలని ప్రధాని ఆదేశం. దేశ బడ్జెట్‌కు లోటును పూడ్చుకోవడానికి లాభాల్లో ఉన్న ప్రభుత్వ కంపెనీలలోని నిల్వను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కేంద్రం కుట్రలు కొనసాగిస్తున్నది. పైగా ప్రభుత్వ కంపెనీల విక్రయాన్ని ‘‘వాటాల ఉపసంహరణ’’ పేరుతో నిధులు సేకరిస్తున్నారు.
నాలుగు ప్రభుత్వ కంపెనీల విక్రయం :
ప్రభుత్వ రంగంలోని నాలుగు సంస్థలను ఎఫ్‌డిఐల అనుమతి పేరుతో విక్రయం, ఆయిల్ ఇండియా 10శాతం అమ్మకంతో రు. 15000 కోట్లు, హందుస్థాన్ కాపర్‌లో 9.59శాతం, నాల్కోలో 12.15శాతం, ఎంఎంటిసిలో 9.33శాతం అమ్మకం చేయడానికి 2013`14లో రు.30వేల కోట్ల వాటాల విక్రయానికి నిర్ణయించారు. ఎన్టిపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్), నాల్కో (నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్) , ఎంఎన్టీసి (మహా నిగమ్ టెలీ కమ్యూనికేషన్), సెయిల్ ఇంజనీర్స్ ఇండియా (స్టీల్ అథారిటీ) కంపెనీలలో 2013 నాటికే వాటాలు ఉపసంహరించాలని, అలాగే రాష్ట్రీయ కెమికల్ రిఫైనరీస్ కూడా అమ్మకానికి పెట్టారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ నవరత్న కంపెనీల్లోని వాటాలను అమ్మి, బహుళజాతి సంస్థలకు లాభాలు చేకేర్చిపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
2014`15 కేంద్ర బడ్జెట్ :
2014`15కు రు. 17,63,214 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను 2014 ఫిబ్రవరి 20న ప్రవేశపెట్టింది. అందులో రు.5,55,322 కోట్లను ప్రణాళికా బడ్జెట్‌గా చూపింది. ఇందులో పన్నులు రు.11,67,131 కోట్లు కాగా, అప్పులపై చెల్లిస్తున్న వడ్డీలు 4,27,001 కోట్లుగా ఉన్నది. 2013`14లో రివైజ్డ్ అంచనాల ప్రకారం పన్నులు రు.10,29,252 కోట్లు కాగా, అప్పులపై చెల్లించడానికి కేటాయించిన వడ్డీలు 3,80,066 కోట్లుగా ఉన్నది. మన ఆదాయ వ్యయాల్లో ప్రజలపై భారాలు వేసి వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నది. అంతేకాక ప్రణాళికా బడ్జెట్ ప్రణాళికేతర బడ్జెట్లో సగానికి తగ్గింది. సంక్షేమ పథకాలకు కేటాయింపులే తప్పా, నిధుల విడుదల లేదు. ఆహార భద్రతా చట్టానికి అదనంగా 25వేల కోట్లు కావాలని కోరారు. ఆహార భద్రత క్రింద రు.1,15,948.99 కోట్లు కేటాయింపు చూపారు. ఇందులో పెద్దమొత్తం నిధుల దుర్వినియోగం కావడమే తప్ప, అర్హతగల ప్రజలకు అందడం లేదు. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడానికి భిన్నంగా దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి మాత్రమే ఆహార భద్రత కల్పిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రు.28, పట్టణ ప్రాంతాల్లో రు.36లు రోజువారీ ఆదాయం మించినవారిని దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నట్లు ప్రకటిస్తామన్నారు. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు సబ్సిడీ లేకుండా రు. 2,55,708 కోట్లు మాత్రమే కేటాయించారు. గత సంవత్సరంపై 208 కోట్లు మాత్రమే పెంచడం జరిగింది. శాస్త్ర`సాంకేతిక అభివృద్దికి 8,643,36 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ రోజు భారత ప్రభుత్వం రాష్ట్ర సాంకేతిక సలహాలను, నూతన ఆవిష్కరణలను ధనిక దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది.
విద్యారంగానికి కేటాయింపులు పరిశీలిస్తే ప్రాథమిక విద్యకు రు.54,485.10కోట్లు, ఉన్నత విద్యకు రు.26,956 కోట్లు మాత్రమే కేటాయించారు. 1947లో మొదటి ప్రభుత్వం రానున్న 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యతను నిర్మూలిస్తామని ప్రకటించింది. కానీ, ఆరు దశాబ్ధాలు పూర్తయినా నేటికీ భారతదేశ స్థాయిలో విద్య కేటాయింపులు తగ్గడంతో 74.04శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 67.66 శాతం మాత్రమే ఉన్నది. భారత సగటుకు 10శాతం తక్కువగా ఉన్నది.
1961`2011 గణాంకాల ప్రకారం అక్షరాస్యత శాతాలు ఈ విధంగా ఉన్నాయి.
సం॥రం భారత్ ఆంధ్రప్రదేశ్
1961 28.3 21.19
1971 34.45 24.57
1981 43.57 29.94
1991 52.21 44.09
2001 64.83 60.47
2011 74.04 67.066
విద్యాభివృద్దికి కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే నిధుల కొరతను సృష్టించి నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నారు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో నిరుద్యోగం అనివార్యం. ఆ అనివార్యతను కొనసాగించడానికే ఆరు దశబ్ధాలు గడిచినా దేశం పూర్తి అక్షరాస్యతను సాధించలేకపోతుంది. 5వ తరగతిలోనూ, 10వ తరగతిలోనూ డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నది. వివిధ దేశాల్లో విద్యారంగానికి కేటాయింపులు ఈ విధంగా ఉంటున్నాయి.
కెన్యా 21.90శాతం
ఘనా 20.10శాతం
శ్రీలంకా 13
మయన్మార్ 15
ఇటియోపియా 14.4
మలావి 15.8
భారత్ 2.3
పై కేటాయింపులు గమనిస్తే విద్యారంగంపై ప్రభుత్వానికి ఉన్న లక్ష్యశుద్ది కనపడుతుంది.
రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పరిస్థితి:
12 రాష్ట్రాలలో కాంగ్రెస్, 5 రాష్ట్రాలలో బిజెపి, మిగిలిన 11 రాష్ట్రాలలో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(మార్చి 1, 2014), ఢల్లీిలలో (ఫిబ్రవరి 2014) రాష్ట్రపతిపాలన కొనసాగుతున్నది. పుదుచ్చెరిలో ఎన్.ఆర్.కాంగ్రెస్ అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ నుండి రాహుల్‌గాంధీ, బిజెపి నుండి మోడి అప్పుడే ప్రచారం ప్రారంభించారు. వీటికి ప్రత్యామ్నాయంగా 11 పార్టీలతో సిపిఐ(ఎం) పార్టీ చొరవతో మూడవ ఫ్రంట్ ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడవ ఫ్రంటుపై బిజెపి తన దాడులు ఎక్కుపెట్టింది. మూడవ ఫ్రంటు రంగంలో ఉంటే తన గెలుపుకు ఆటంకమని భావిస్తున్నది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు
1) ఆంధ్రప్రదేశ్ : 2009లో ఎన్నికలు జరిగాయి.
2) అరుణాచల్ ప్రదేశ్ : 2009 నవంబర్` నంబంతుకీ
3) అసోం : 2011 ` తరుణ్‌గోగాయ్
4) హర్యానా : 2009 ` భూపేందర్‌సింగ్
5) హిమాచల్ ప్రదేశ్ : 2012 ` వీరభద్రాసింగ్
6) కేరళ : యుడిఎఫ్‌తో 2011` పోలాంచాందీ
7) మహారాష్ట్ర : ఎన్‌సిపితో ` పృద్వీరాజ్ఛవాన్
8) మణిపూర్ : 2012 ` వోక్రాం ఇబోబీసింగ్
9) మేఘాలయ :2013 ` ముకుల్‌సంగ్మా
10) మిజోరాం : 2008 ` హులతాన్ హవ్లా
11) ఉత్తరఖండ్ : 2012 ` విజయ్ బహుగుణ
12) కర్నాటక : 2013 ` సిద్ధిరామయ్య సిఎం
బిజెపి పాలిత రాష్ట్రాలు
1) చత్తీస్ఘడ్ : 2013 ` రమణిసింగ్
2) గోవా : 2012 ` మనోహర్ పారికార్
3) గుజరాత్ : 2012 ` నరేంద్రమోడి
4) మధ్యప్రదేశ్ : 2013 నవంబర్ ` శివరాజ్‌సింగ్ చౌహాన్
5) రాజస్థాన్ : 2013 నవంబర్ ` మహారాణి సిందియా
ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలు
1) త్రిపుర : సిపిఎం 2013 ` మానిక్‌సర్కార్
2) తమిళనాడు : ఎఐడిఎంకె 2011మే ` జయలలిత
3) నాగాలాండ్ : నాగాఫ్రంట్ 2013 ` నైపూర్రియో
4) బిహార్ : జెడి(యు) ` 2011 ` నితిష్
5) జమ్మూ Ê కాశ్మీర్ : జెకె నేషనల్ కాన్ఫరేన్స్ ` 2009 ` ఓమర్ అబ్దుల్లా
6) పంజాబ్ : అకాళీదల్, బాదల్ `2007 ` ప్రకాశ్‌సింగ్ బాదల్
7) యుపి : ఎస్.పి ` 2013 ` అఖిలేష్ యాదవ్
8) వెస్ట్ బెంగాల్ : టిఎంసి ` 2011 ` మమత
9) సిక్కిం : సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ` 2009 ` పవన్‌కుమార్ చామ్లిన్
10) ఒరిస్సా : బిజూ జనతాదళ్ ` 2000 ` నవీన్ పట్నాయక్
11) రaార్ఖండ్ : ఘార్ఖండ్ ముక్తిమోర్చా 2013` హేమంత్ సోరెన్
కేంద్రపాలిత ప్రాంతాలు
1) పుదుచ్చెరి : ఎన్.ఆర్.కాంగ్రెస్ 2011
2) చండిఘడ్
3) అండమాన్ నికోబార్
4) దాద్రా & నగర్ హవేలి
5) డామన్ & డయ్యూ
6) లక్షదీప్
7) డిల్లీ : 2013నవంబర్ `(ఆఫ్) కేజ్రీవాల్`2014 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన.
ఆంధ్రప్రదేశ్ విభజన చివరి అంకం కొనసాగుతున్నది. ఫిబ్రవరి 18 మరియు 21తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో రాష్ట్ర విభజన బిల్లు మూజివాణి వోటుతో ఆమోదించబడిరది. రాష్ట్రపతి ఆమోదముద్ర 1 మార్చి 2014న పడిరది. బిల్లును గెజెట్‌లో ప్రకటించారు. రాష్ట్రాల అవతరణకు ‘‘ఆపాయింటెడ్’’తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈ బిల్లుకు అదనంగా 1. ఉత్తర తెలంగాణ, రాయలసమీలకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా, పోలవరం ముంపు గ్రామాలను తూర్పుగోదావరిజిల్లాకు మార్చడానికి ఆర్డినెన్స్‌లు తెస్తానని కేంద్రం చెబుతున్నది. దీంతో విభజన చట్టబద్దత పొందింది. విభజనకు కేంద్ర ప్రభుత్వం ఉప సంఘాలను రాష్ట్ర స్థాయిలో నియమించింది. ఆస్తులు మరియు అప్పుల పంపిణీతోపాటు, సిబ్బంది పంపిణీకి ఉప సంఘాలు కృషి ప్రారంభించాయి. అపాయింటెడ్ తేదీతో విభజన ప్రక్రియ ముగిస్తుంది. కానీ ఒకటి రెండు సంవత్సరాలపాటు విభజన అంశాల పంపిణీ కొనసాగుతూనే ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర విభజన ముగిసింది. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వల్ల ఎలాంటి ప్రజా సమస్యలు పరిష్కారం కావిడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో రాష్ట్రంలో 1 మార్చి 2014 నుండి రాష్ట్రపతి పాలనను విధించింది.
ప్రస్తుతం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి కూటములు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నవి. వీటికి దీటుగా మూడవ ఫ్రంటును సిపిఐ(ఎం) పార్టీ 11 లౌకిక పార్టీలతో కలిసి ఏర్పాటు చేసింది. మరిన్ని లౌకిక పార్టీలు మూడవ ఫ్రంటులోకి వచ్చే అవకాశం ఉంది. మూడవ ఫ్రంటు ముందు కనీస కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.
ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రచార నినాదాలుగా రూపొందించి, కాంగ్రెస్`బిజేపీలను ఓడిరచడానికి కృషి సాగిస్తున్నది.
ప్రత్యామ్నాయ కార్యక్రమం:
1) భూ సంస్కరణల అమలు, మిగులు భూముల పంపిణీ. పేదలందరికీ నివాస స్థలాల ఏర్పాటు. బలవంతపు భూ సేకరణ రద్దు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులకు గిట్టుబాటు ధరలు, తక్కువ వడ్డీ రుణాలు.
2) ఉపాధి కల్పనే లక్ష్యంగా వస్తు తయారీ, మౌలిక వసతుల రంగాల్లో భారీగా ప్రభుత్వ పెట్టుబడులు. మైనింగ్, చమురు రంగాల జాతీయీకరణ.
3) పకడ్బంధీగా పన్నుల వసూలు, పన్ను ఎగవేత మార్గాల నివారణ. స్పెక్కులేటీవ్ ద్రవ్య పెట్టుబడుల నియంత్రణ. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల రద్దు.
4) ప్రతి కుటుంబానికి కిలో రెండు రూపాయల గరిష్ట ధరకు 35 కేజీల ఆహార ధాన్యాలను అందించేలా సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు. ఆ మేరకు ఆహార భద్రతా చట్టం రూపకల్పన.
5) రాజ్యాంగాన్ని, మతాన్ని విడివిడిగా ఉంచడమే లౌకికవాదం మౌలిక సూత్రంగా రాజ్యంగంలో మార్పులు, మతోన్మాద శక్తులను అరికట్టేందుకు కఠిన చర్యలు.
6) విద్య, ఆరోగ్య రంగాలకు భారీగా బడ్జెటరీ కేటాయింపులు. విద్య, ఆరోగ్య రంగాల ప్రయివేటీకరణ నిలుపుదల. విద్యా హక్కు చట్టం అమలును తప్పనిసరి చేస్తూ చర్యలు.
7) ఉన్నత స్థాయిల్లో అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు స్వతంత్య్ర దర్యాప్తు అధికారంలో లోక్‌పాల్ చట్టం.
8) అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు. పార్లమెంట్, చట్టసల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు దళిత హక్కుల రక్షణ. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, మైనార్టీలకు రిజర్వేషన్ల కల్పించేందుకు రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల అమలు. ఆదివాసీల ఐదు, ఆరో షెడ్యూల్ హక్కుల పరిరక్షణ.
9) కార్మిక హక్కుల పరిరక్షణ. కనీస వేతనాలు, సామాజిక భద్రతా చర్యల అమలు, కాంట్రాక్ట్`క్యాజువల్ కార్మిక విధానం రద్దు.
10) స్వాతంత్ర విదేశాంగ విధానం అమలు.
28.02.2014
సారంపల్లి మల్లారెడ్డి
Sarampally Mallareddy

nice
ReplyDeletewww.cinesarathi.in