Wednesday, 13 August 2014

రైతు నుండి విత్తన హక్కును హరించి వేస్తున్న ప్రభుత్వాల విధానాలు

    1997 సంవత్సరం నుండి సంస్కరణలు అమలు జరుపుతూ రైతులను విత్తన హక్కు నుండి దూరం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్‌లో 42 లక్షల క్వింటాళ్ళు, రబ్బీలో 20లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం. ఇందులో ఆహారధాన్యాల విత్తనాలు సిహభాగం ఉన్నాయి. 1965 నుండి 85 వరకు హరిత విప్లవం కాలంలో సంకర విత్తనాభివృద్ధి ఉత్పాదకతను 5 రెట్లు పెంచారు. సజాతి జీన్స్‌ సంకరణం జరపడం వల్ల ఈ ఫలితాలు సాధించారు.
    ప్రస్తుతం రాష్ట్రంలో మోన్‌శాంటో, డూపాయింట్‌, కార్గిల్‌, సింజెంటా కంపెనీలు 80 శాతం విత్తనాలపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. భారత దేశ విత్తన వినియోగంలో 60 శాతం విత్తనాలు రాష్ట్రంలోనే ఉత్పత్తికావడం గమనించాలి. క్రమంగా విత్తన టెక్నాలజీని పై కంపెనీలే తమ ఆధీనంలో ఉంచుకొని రాయల్టీ పేరుతో వందల కోట్లు సంపాదిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు
1) పెండిరగులోనున్న 2012 విత్తన చట్టాన్ని ఆమోదించడం
2) బయోటెక్నాలజీ రెగ్యులేటరీ చట్టాన్ని రైతులకనుకూలంగా సవరించి ఆమోదించుట
3) పెస్ట్‌ కంట్రోల్‌ యాక్టులో పర్యావరణ ప్రమాదమైన క్రిమిసంహారక మందుల నిషేద చట్టం వేయుట
4) బడ్జెట్‌లో పరిశోధనలకు కేటాయింపుల పెంచాలి.(ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిధిలో నున్న వేలాది ఎకరాల పరిశోధనా కేంద్రాలు మూతపడినాయి.)
5) జాతీయ విత్తనాభివృద్ధి సంస్థను అభివృద్ధి చేయుట
6) అన్ని వాతావరణ పరిస్థితుల ప్రాంతాలలో పరీక్షలు జరిపిన తరువాతనే విత్తనాన్ని వాణిజ్యపరంగా విడుదల చేయుట.
7) జి.ఇ.ఎ.సిని సంస్కరించాలి.
8) బహుళ జాతి సంస్థల ప్రవేశాన్ని నిషేధించుట
9) ప్రభుత్వమే పరిశోధనలను నిర్వహించాలి.
10) ఉత్పత్తిని, ఉత్పాదకతను నిరంతరం పెంచుతూ ` పర్యావరణానికి నష్టం రాని విత్తనాల ఉత్పత్తి చేయాలి.
    కేంద్ర ప్రభుత్వం పరిశోధన` విద్య కొరకు అతితక్కువ బడ్జెట్లు కేటాయిస్తున్నది.
            ప్రణాళిక        ప్రణాళికేతర    మొత్తం(కోట్లలో)
2010`11        2521.79        2864.04    5385.83
2011`12        2580.00        2157.60    5007.60
2012`13        3220.00        2172.00    5392.00
    ఈ కేటాయింపులతో విత్తన పరిశోధనలు మరియు వ్యవసాయ విద్యకు నిధులు సరిపోవు. అయినప్పటికీ వ్యవసాయాభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నది. 2012`13లో రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజనకు రు.9217 కోట్లు మాత్రమే కేటాయించారు. 1985 నుండి ఉత్పాదకత, ఉత్పత్తి పెరగడం లేదు.
    ఆహార ధానాలు     12.57    (31.06కోట్ల ఎకరాలు
    పప్పుధాన్యాలు     3.97    (9.80 కోట్ల ఎకరాలు)
    నూనె గింజలు     2.68    (6.62 కోట్ల ఎకరాలు)
    ప్రత్తి     1.11    (2.74 కోట్ల ఎకరాలు)
    దేశంలో 50 కోట్ల ఎకరాలు సాగుచేస్తుండగా వీటికి కావలసిన మొత్తం విత్తనాలను బహుళ జాతి సంస్థలు తమ ఆధీనంలోకి తెచ్చుకొని విత్తన రంగంలోనే వేల కోట్ల రూపాయల లాభాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
విత్తనాల ధరలను పది రెట్ల వరకు పెంపుదల చేస్తూ నాణ్యత లేని విత్తనాలను సరఫరా చేసి యేటా లక్షలాది ఎకరాలకు పంటలను నష్టం కలిగిస్తున్నారు. ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. ఫలితంగా ఆత్మహత్యలు సాగుతున్నాయి.
రాష్ట్ర పరిస్థితి
    2011`12లో రాష్ట్ర ప్రభుత్వం 36.28 లక్షల క్వింటాళ్ళకు 400.25 కోట్లు సబ్సిడీగా కేటాయించింది. 2012`13లో వేరుశనగ ధరను రు.4000 నుండి రు.6000లకు పెంచింది. అన్ని రకాల పప్పుధాన్యాలను సగటున రు.2800 నుండి రు.5800లకు పెంచింది. వేరుశనగలో 33శాతం, పప్పుధాన్యాలలో 50శాతం సబ్సిడీ ఇస్తున్నది. సోయా రు.2680 నుండి రు.4000లకు పెంచింది. ఇందులో 33 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. వరికి రు.500 లు సబ్సిడీ ఇస్తున్నారు. ఈ విధంగా సబ్సిడీలు ఏజెంట్లకే పోతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతలు
1) విత్తనం ఉత్పత్తి ` ధర నిర్ణయం ` సరఫరా
2) భూసార పరీక్షలు జరిపి ఏ విత్తనాలు ఎక్కడ అవసరమో గుర్తించడం
3) కల్తీ విత్తనాలపై చర్యలు
4) విత్తనాల పరిశోధనా కేంద్రాలు రైతులకు అందుబాటులో పెట్టుట
5) అవసరమైన విత్తనాలను అందుబాటులో పెట్టుట
6) ఏప్రిల్‌ లో ఖరీఫ్‌ ప్రణాళిక, సెప్టెంబర్‌లో రబ్బీ ప్రణాళిక
7) రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను అభివృద్ధి చేయుట
8) కేంద్రంనుండి వచ్చే నిధులతో నూనె గింజలు ` పప్పుధాన్యాలు ` మొక్కజొన్న ` ప్రత్తి ` కొబ్బరి ` హార్టీకల్చర్‌ ` జ్యూట్‌ టెక్నాలజీ ` ఆయిల్‌ ఫాం పంటల దిగుబడులను పెంచుతూ కొత్త విత్తనాలను కనిపెట్టడం
9) కూరగాయల పంటల ` విత్తనాల అభివృద్ధి
10) రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు పెంపుదల(ప్రణాళికేత 889.12, ప్రణాళిక 2820.45 కోట్లు మాత్రమే)
11) విత్తన చట్టం చేయడం ` కల్తీని నివారించుట
12) బహుళ పంటల విధానాన్ని అమలు చేయడం(మోనోక్రాప్‌ పంటలను నిషేధించుట)
13) రైతుకు విత్తనంపై హక్కు కల్పించడం
14) కాలం గతించిన విత్తనాల రాయల్టీని తగ్గింపు ` ఎత్తివేత

No comments:

Post a Comment