Tuesday, 12 August 2014

ఎరువుల రంగం - ప్రస్తుత పరిస్థితి

     ఉత్పత్తి ధర(2008`09) నాఫ్త ద్వారా ఉత్పత్తి బస్తా యూరియా రూ.1750.80Ñ గ్యాస్‌ ద్వారా రూ.500.80
29.08.2008 బత్తు సైదులు(35) నెహ్రూ నగర్‌, ఇల్లందు(ఖమ్మం) ఎరువులకొరకు ఆత్మహత్య, 2 ఎకరాలు కౌలు.
ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో అక్రమ ఎరువుల పట్టివేత` కేసులు లేవు.
రాష్ట్రంలో 15 మిక్సింగ్‌ ప్లాంట్‌లకు సబ్సిడీ ఎరువులను(2010`11లో) అక్రమసరఫరా ` నాణ్యతలేని ఎరువుల అమ్మకం
 రాష్ట్ర అవసరాలు :  యూరియా 14Ñ డిఎపి 5Ñ కాంప్లెక్స్‌ 14Ñ సూపర్‌ పాస్పేట్‌ 1.50Ñ పొటాష్‌ 3.50  R  38
 (లక్షల టన్నులలో)


        బ్యాంకు డిపాజిట్లలో డిపాజిట్ల ప్రకారం రుణపంపిణీ ఏనాడూ 12 శాతానికి మించలేదు. అర్హత గల వారికి కౌలుదార్లకు, వాస్తవ సాగదార్లకు స్కేల్‌ ఆప్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణ పంపిణీ జూన్‌లోనే చేయాలి. రైతులు వ్యవసాయ ఉపకరణాలు కొనుగోలు చేయడానికి వీలుగా రుణాలివ్వాలి. బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించకుండా అఖిలపక్ష సమావేశాలు జరిపి సమీక్షలు ప్రతినెలా చేయాలి.
ఎరువులు` పంపిణీ విధానం
రాష్ట్రంలో ఖరీఫ్‌లో 39.55 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిలువ ఉన్నట్లు మంత్రి ప్రణాళికలో చెప్పారు గత అనుభవాలు పరిశీలిస్తే రాష్ట్రంలో 15 మిక్సింగ్‌ ప్లాంట్‌లకు రైతుల సబ్సిడీ ఎరువులను మళ్ళించి, రైతులకు ఎరువులు దొరకకుండా చేశారు. ఖరీఫ్‌ రబ్బిలో కలిసి 70 లక్షల టన్నుల ఎరువులు అవసరం. కేంద్రప్రభుత్వం ఎరువుల సబ్సిడీ విధానాన్ని మార్చింది. ఇంతకు ముందు ఎరువుల బస్తాకు ధర నిర్ణయించే వారు. ఇపుడు కేంద్రం చెల్లించే సబ్సిడీని నిర్ణయించారు. స్థానికంగా ఎరువుల ప్యాక్టరీల మూసివేతతో కాంప్లెక్స్‌ ఎరువులతో సహా అన్ని రకాల ఎరువులను దిగమతి చేసుకోవల్సి వస్తున్నది. దిగుమతులు సకాలంలో రానితీరుకు పంటలకు నష్టపోతున్నారు. గత ఆరు మాసాలలో ఎరువుల ధరలు 25 శాతం పెంచారు. అయినా కనీస చిల్లర ధర నిర్ణయించిన దానికి భిన్నంగా అదనంగా ధర నిర్ణయిస్తున్నారు. పైగా ఉపయోగం లేని ఎరువుల బస్తాను పోటీపెట్టి రైతుకు అంటగడుతున్నారు.ఖరీఫ్‌లో యూరియా`14 , డిఎపి`5,పొటాష్‌`3.50, కాంప్లెక్స్‌`11.50, సూపర్‌`1.50 మొత్తం 35 లక్షల టన్నులు అవసరం.దాదాపు రబ్బీకి అంతే మొత్తంలో అవసరం.
ఎరువులకోరకు జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు రైతులు మరణించారు. అనేక మంది రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. డబ్బులు పెట్టి కొందామన్నా ఎరువులు గతినన్ని మండల స్ధాయిలో లేవు. క్రిమిసంహారక మందుపై ధరల నిర్ణయం ప్రభుత్వం చేతిలో లేదు.రు. 300/`లకు అమ్మిన మందు ఒత్తిడి పెరగడంతో రు.2000 /`లకు అమ్మిన ఘటనలున్నాయి. నాణ్యతలేని క్రిమిసంహారక మందులు రైతులకు అంటగడుతున్నారు. వ్యవసాయశాఖ అజమాయిషీ లోపం భరించరానిదిగా మారింది. తగినన్ని ఎరువులు క్రిమిసంహారక మందులు రైతులకు అందుబాటులో ఉంచాలి. ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. నాణ్యతలేని సరకులు అమ్మిన వ్యాపారులపై చర్యలు చేపట్టడమే కాక రైతులకు పంటదిగబడి స్థాయిలో పరిహారం ఇప్పించాలి.
హార్టీకల్చర్‌ పంటలు
రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలలో హార్టీకల్చర్‌ పంటలు వేస్తున్నారు. 2 కోట్ల టన్నుల దిగుబడి వస్తున్నది. ప్రత్యేక శాఖ ద్వారా రైతులకు ప్రోత్సాహాలు కల్పించడానికి బడ్జెట్‌లు కేటాయిస్తున్నారు. ఉచిత మొక్కల సరఫరా, బిందుసేద్యం, తుంపరసేద్యం పరికరాల సబ్సిడీ, ఇరిగేషన్‌ వనరుల నిర్మాణానికి ఏటా దాదాపు రు.500 కోట్ల రాయితీలిస్తున్నారు. ఈ రాయితీలు పేదలకు కేటాయిచినా వారి పేర్లతో ధనికరైతులు కాజేస్తున్నారు. ముఖ్యంగా దళిత, గిరిజనులకు కేటాయించిన స్కీములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లుతున్నాయి. ఈ శాఖ ద్వారా సరఫరా అవుతున్న ఎరువులు తదితర ఉపకరణాలలో నాణ్యతలేనివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పట్టించుకునే వారేలేరు. పెద్దపెద్ద ఫాం హౌజ్‌లకు పెద్దమొత్తాలు సబ్సిడీలు తరలిపోతున్నాయి.
వాస్తవంగా సన్న`చిన్నకారు రైతులను గుర్తించి వారికి మాత్రమే రాయితీలను అందించడంతోపాటు వారి పంటల అభివృద్ధికి నిరంతర సలహాలు అందించాలి.వారికి మార్కెట్టు వనరుల కల్పన బాధ్యత రాష్ట్రప్రభుత్వం తీసుకోవాలి. హార్టీకల్చర్‌ పంటలు వేసినవారు ధరలు తగ్గడంతో తోటలు తీసివేస్తున్నారు. దీన్ని నివారించాలి.
వ్యవసాయ ప్రణాళికలో అమలు జరపాల్సిన మరికొన్ని అంశాలు
భూసార పరీక్షలు జరిపి ఏఏ ఎరువులు ఏ మోతాదుల్లో వేయాలో రైతులకు తెలియజేయాలి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల శాంపిల్స్‌ను సేకరించి కల్తీని నిరోధించాలి(ప్రస్తుతం ప్రణాళికలో చూపినా అమలు కావడంలేదు. ఎన్‌జిరంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం ఆధీనంలోని పరిశోధనా కేంద్రాలలో కొత్తవిత్తనాల ఆవిష్కరణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. పంటల భీమా, వాతావరణభీమాలను ఒకటిగా చేసి ఒకే సమగ్రమైన భీమా చట్టాన్ని రూపొందించాలి. సన్న`చిన్నకారు రైతుల ప్రీమియం పూర్తిగా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు 50 శాతం చొప్పున భరించాలి. పత్తి,నూనేగింజలు, ముతక ధాన్యాల(మక్క,జొన్న, రాగులు, సజ్జలు) అభివృద్ధికి ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలి. వ్యవసాయ టెక్నాటజీ మిషన్‌(ఆత్మ) లో రైతులకు ప్రాధాన్యత ఇవ్యాలి.పై సమస్యలతో వ్యవసాయ ప్రణాళికను రూపొందించి అమలు జరపాలి.అపుడే ఉత్పాదకత`ఉత్పత్తి పెరుగుతుంది.
ఎరువుల రంగం` ప్రస్తుత పరిస్థితి
ప్రభుత్వం ప్రకటించిన 2011`12 వ్యవసాయ ప్రణాళికలోని ప్రధాన అంశాలు :
` ఆహారధాన్యాల ఉత్పత్తి 228.15 లక్షల టన్నులు సాధించాలి.
` 26.28 లక్షల క్వింటాళ్ళ విత్తనాల 30 శాతం సబ్సిడీ రు.400.10 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది.
` 2010`11లో 71.04 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వినియోగించగా ప్రస్తుతం 79.05 లక్షల మెట్రిక్‌   టన్నులు సరిఫరా చేస్తారు.
` 16,323 మెట్రిక్‌ టన్నులు జింక్‌ సల్ఫేట్‌ను 50 శాతం సబ్సిడీ పై 3.26 లక్షల హెక్టార్లకు, 1.75 లక్షల రైతులకు   27.75 కోట్ల రూపాయలు మంజూరి
` 30 వేల మెట్రిక్‌ టన్నుల జిప్సం 50 శాతం సబ్సిడీపై 6 వేల హెక్టార్లకు, 10వేల మంది రైతులకు, 3.60 కోట్లు   మంజూరి.
` 50 వర్మీ కంపోస్టు యూనిట్లకు 10 లక్షల సబ్సిడీ కేటాయింపు.
` పొలంబడి కార్యక్రమం కింద 12.12 కోట్లతో 5004 కార్యక్రమాల అమలు
` వ్యవసాయ యాంత్రీకరణ కింద 1,60, 688 యూనిట్లకు రు.81.50 కోట్ల కేటాయింపు.
` పంటరుణాల కింద 48 వేల కోట్ల పంపిణీ
` పావలా వడ్డీ కింద 75 కోట్ల కేటాయింపు
` వడ్డీ మాఫీ కింద 200 కోట్ల కేటాయింపు
` 200`250 రైతు కుటుంబాలకు ఒకరి చొప్పున 41,062 మంది ఆదర్శరైతులనియామకం దీనికి 50 లక్షల   గౌరవ వేతనం కేటాయింపు.
` లక్ష ‘‘ పాడిపంటల మాస పత్రిక’’ ను రు. 10 చొప్పున అమ్మకం.
` కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు మిలహా మిగిలిన అన్ని జిల్లాలలో  గ్రామం యూనిట్‌గా పంటల భీమా   పథకం అమలు
` వాతావరణ భీమా పథకం కింద రాయలసీమ జిల్లాలలో  వేరుశనగ పంటకు వర్తింపు
` ఆహార భద్రత పథకం కింద ధాన్యం 11 జిల్లాలలో, పప్పుధాన్యాలు అన్ని జిల్లాలలో రు.80.48 కోట్ల కేటాయింపు
` రాష్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద రు. 293.28 కోట్లు కేటాయింపు
` వ్యవసాయ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఎజెన్సీ పథకం 22 జిల్లాలలో అమలు కేటాయించిన రు.57.17 కోట్లలో   కేంద్రం, రాష్ట్రం 90:10 చొప్పున భరిస్తారు.

No comments:

Post a Comment